Ahmadabad, DEC 01: గుజరాత్ లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Gujarat Election) కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించగా.. తొలివిడతలో (Phase-1) 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దక్షిణ గుజరాత్లోని 19 జిల్లాలు, కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లోని 89 స్థానాల్లో పోలింగ్ (polling) కొనసాగుతుండగా.. 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందుకోసం మొత్తం 14,382 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 23,976,670 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రెండవ దశ ఎన్నిక 93 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5న జరుగుతుంది. ఈ ఎన్నికల ఫలితాలను హిమాచల్ ప్రదేశ్ (Himachal pardesh) రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలతో కలిపి డిసెంబర్ 8న వెల్లడిస్తారు.
Voting for the first phase of #GujaratAssemblyPolls underway today. Visuals from VM Mehta College in Jamnagar as voters queue up to cast their votes. pic.twitter.com/a3rZvWz4F6
— ANI (@ANI) December 1, 2022
ఈ ఎన్నికల్లో ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు ప్రధాని మోదీ (PM Modi). తొలిసారి ఓటు హక్కు వచ్చిన యువత...ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయాలని సూచించారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah) కూడా గుజరాత్ లో డెవలప్ మెంట్ కోసం ఓటు వేయాలంటూ ప్రజల్ని కోరుతూ ట్వీట్ చేశారు. మరోవైపు గుజరాత్ లో మార్పుకోసం ప్రజలు ఓటు వేయాలంటూ ఓటర్లను కోరారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal).
Today is the first phase of the Gujarat elections. I call upon all those voting today, particularly first time voters to exercise their franchise in record numbers.
— Narendra Modi (@narendramodi) December 1, 2022
गुजरात चुनाव के पहले चरण में आज 89 सीटों पर मतदान हो रहा है। गुजरात में आज जिन-जिन विधानसभा क्षेत्रों में वोटिंग है वहाँ के सभी मतदाताओं से मेरी अपील- “आपके पास सुनहरा मौक़ा आया है, गुजरात और अपने बच्चों के बेहतर भविष्य के लिए वोट ज़रूर देकर आइए, इस बार कुछ बड़ा करके आइए।”
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 1, 2022
ఇదిలాఉంటే.. మొదటి విడత పోలింగ్ జరిగే అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ అభ్యర్థులు, పార్టీల అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. అయితే, 1995 నుంచి గుజరాత్ లో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు పట్టుదలతో ఉంది. కానీ, 2002 నుంచి ఆ పార్టీకి అసెంబ్లీ స్థానాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2018 ఎన్నికల్లో 137 అసెంబ్లీ స్థానాల నుంచి 99 స్థానాలకు బీజేపీ పడిపోయింది. ఈ దఫా ఎన్నికల్లో రాష్ట్రంలో 182 అసెంబ్లీ సీట్లలో 140 సీట్లను లక్ష్యంగా చేసుకొని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్రనేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు.
మరోవైపు కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఈసారి అధికారంలోకి వస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. 2017 ఎన్నికల సమయంలో ఈ 89 స్థానాల్లో బీజేపీ 49.3% ఓట్లతో 48 అసెంబ్లీ సీట్లను, కాంగ్రెస్ 41.7% ఓట్లతో 38 సీట్లను గెలుచుకుంది. ఇక్కడ 2012 నుండి కాంగ్రెస్‌కు 16 స్థానాలను నికరంగా కైవసం చేసుకుంది.ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు కూడా బరిలో నిలిచారు.