Politics
Telangana Elections 2023: సజ్జల అయినా జగన్ అయినా ఒకటే సమాధానం, కౌంటర్ విసిరిన వైఎస్ షర్మిల, కాంగ్రెస్‌కు మద్దతిస్తుంటే ఎందుకు మాట్లాడుతున్నారని మండిపాటు
Hazarath Reddyనేను ప్రజలకు అంకితం కావాలనే ఉద్దేశంతో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఎవరైనా సరే.. నాకు కిరీటాలు పెట్టాలని కోరుకోవడం లేదని మండిపడ్డారు.
Telangana Elections 2023: మూడు గంటల కరెంట్‌ కావాలా 24 గంటల కరెంట్‌ కావాలో తేల్చుకోండి, ఆర్మూర్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
Hazarath Reddyదేశాన్ని, రాష్ట్రాన్ని 50 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్‌ ప్రజలకు ఏం మేలు చేసిందని BRS అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశ్నించారు. అర్మూరులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని, రైతులకు 24 గంటల కరెంట్‌ అవసరం లేదని చెబుతున్నారని మండిపడ్డారు.
Telangana Assembly Election 2023: హైదరాబాద్‌లోని 9 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీ, ఏడుగురు సిట్టింగ్‌లతో పాటు మరో రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన పార్టీ చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎంఐఎం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్‌లోని 9 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ శుక్రవారం వెల్లడించారు. ఏడుగురు సిట్టింగ్‌లతో పాటు మరో రెండు స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయనున్నట్లు తెలిపారు.
Telangana Assembly Election 2023: వీడియో ఇదిగో, గులాబీ తీర్థం పుచ్చుకున్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్న మాజీ టీడీపీ నేత
Hazarath Reddyతెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఈ రోజు అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ వైఎస్ షర్మిల సంచలన ప్రకటన, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేసిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు
Hazarath Reddyవైఎస్ఆర్టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని ఆమె ప్రకటించారు. ఎన్నికల్లో పోటీకి తాము దూరంగా ఉంటున్నామని చెప్పారు.ఈ మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు.
Telangana Assembly Elections 2023: నేటి నుంచి తెలంగాణ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం, మొత్తం 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎన్నుకోవాలంటూ ఈసీ నోటిఫికేషన్
Hazarath Reddyతెలంగాణ శాసనసభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫారం-1 నోటీసులను అధికారులు జారీ చేస్తారు. ఆ తర్వాతి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.
Telangana Assembly Elections 2023: ఇవేం బూతులు బాబోయ్, మంత్రి మల్లారెడ్డి,హరీష్ రావులను మైనంపల్లి హన్మంతరావు ఎలా తిడుతున్నాడో వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ కేటాయించలేదని బీఆర్ఎస్‌ పార్టీకి మైనంపల్లి హన్మంతరావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి మల్కాజిగిరి, కుమారుడు రోహిత్ మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
Telangana Elections: సీఎం కేసీఆర్‌ పై 100 మంది పౌల్ట్రీ రైతుల పోటీ.. కాయితీ లంబాడీలు 1,016 నామినేషన్లు.. కామారెడ్డిలో ఆసక్తికర రాజకీయం
Rudraకామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై పోటీకి 100 నామినేషన్లు వేస్తామని పౌల్ట్రీ రైతులు గురువారం వెల్లడించారు.
Sajjala Ramakrishna Reddy: వీడియో ఇదిగో, తెలంగాణ సరిహద్దు గ్రామాల ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లో కలుస్తామంటున్నారు, సంచలన వ్యాఖ్యలు చేసిన సజ్జల
Hazarath Reddyఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బార్డర్‌లో ఉన్న ప్రజలు ఆంధ్ర ప్రదేశ్‌లో కలుస్తామంటున్నారని సజ్జల రామకృష్ణ రెడ్డి తెలిపారు. ఎన్నికల సర్వేలో పోలవరం ముంపు మండలాలతో పాటుగా సరిహద్దులో ఉన్న గ్రామాల ప్రజలు మేము మళ్లీ ఏపీకి వస్తామని తెలిపినట్లు సజ్జల తెలిపారు.
Telangana Assembly Election 2023: ఆందోల్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా బాబూ మోహన్ పోటీ, 35 మంది అభ్యర్థులతో భారతీయ జనతా పార్టీ మూడో జాబితా ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ 35 మంది అభ్యర్థులతో మూడో జాబితా విడుదల చేసింది. అంతకుముందు రెండు జాబితాల్లో 53 మందిని బీజేపీ ప్రకటించింది. ముగ్గురు ఎంపీలు కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.
Arvind Kejriwal ED Summon: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో మలుపు, రాజకీయ కక్షతోనే ఈ నోటీసులు, వెంటనే వాపసు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈడీ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరు
Hazarath Reddyఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi excise policy scam case)సమన్లు అందిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి (Arvind Kejriwal) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకావడం లేదు. కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీకి వెళ్లనున్నారు, అక్కడ వారు ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తారు, రోడ్ షో చేస్తారు.
Telangana Assembly Elections 2023: సన్నాసి అంటూ డీకే శివకుమార్‌పై సీఎం కేసీఆర్ ఫైర్, ఇల్లందు బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyబీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోస‌మే పుట్టిన పార్టీ.. తెలంగాణ ప్ర‌జ‌ల హ‌క్కుల కోస‌మే పోరాడే పార్టీ అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ఇల్లందు నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.
Telangana Assembly Elections 2023: దళిత బంధు తెచ్చిన మొగోడు ఎవరైనా ఉన్నారా? సత్తుపల్లి బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ ఫైర్
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ దూకుడును పెంచాయి. స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయని ,ప్రతీసారీ దళితులు మోసానికి గురయ్యారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శించారు
Telangana Elections 2023: వీడియో ఇదిగో, ఆంధ్రప్రదేశ్ రోడ్లపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, డబల్ రోడ్ వస్తే తెలంగాణ.. సింగల్ రోడ్ వస్తే ఆంధ్రప్రదేశ్ అంటూ సెటైర్
Hazarath Reddyడబుల్ రోడ్ వస్తే తెలంగాణ.. సింగల్ రోడ్ వస్తే ఆంధ్రప్రదేశ్ అంటూ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రోడ్లపై సెటైర్ వేశారు. కిరణ్ కుమార్ రెడ్డి కట్టె పట్టుకొని తెలంగాణ విడిపోతే కటిక చీకటి అవుద్ది అన్నాడు. ఇప్పుడు మన దగ్గర వెలుగు జిలుగులు ఉన్నాయి.. మనల్ని శపించినోళ్లు చీకట్లో ఉన్నారు అంటూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telangana Elections 2023: వీడియో ఇదిగో, తెలంగాణ ప్రభుత్వంపై హీరో నాగార్జున ప్రశంసలు, హైదరాబాద్ నగరాన్ని కొనియాడిన హీరో..
Hazarath Reddyతెలంగాణ ప్రభుత్వాన్ని, మంత్రి కేటిఆర్‌ను హీరో నాగార్జున మెచ్చుకున్నారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుగా హైదరాబాద్‌ నగరాన్నే ఎంచుకుంటున్నాయని దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వమే అని నాగార్జున కొనియాడారు.
Janta Ka Mood Survey: 75 సీట్లతో మళ్లీ అధికారంలోకి కేసీఆర్‌, తెలంగాణ ఎన్నికలపై జనతా కా మూడ్ సర్వే విడుదల, ఎవరెవరికి ఎన్ని సీట్లంటే..
Hazarath Reddyప్రముఖ భారతీయ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ జనతా కా మూడ్ (జేకేఎం) తన 'తెలంగాణ 2023 ఎన్నికల సర్వే'ని బుధవారం ఢిల్లీలో విడుదల చేసింది. ఈ సర్వేలో తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ దే అధికారం అని తేల్చింది.
Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి నెలా 200 యూనిట్లు ఉచిత విద్యుత్, కొల్లాపూర్ భేరీ సభలో రాహుల్ గాంధీ
Hazarath Reddyకాంగ్రెస్ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ కేవలం రూ.500 లకే అందిస్తామన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం చేస్తామన్నారు. గృహ జ్యోతి స్కీమ్ కింద ప్రతి నెలా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.
Telangana Assembly Elections 2023: బీజేపీకి ఎంపీ వివేక్‌ రాజీనామా, వెంటనే కొడుకు వంశీతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పెద్దపల్లి మాజీ ఎంపీ
Hazarath Reddyపెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్‌వెంకటస్వామి బీజేపీకి రాజీనామా చేశారు.తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపించారు. వెంటనే తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆయన తనయుడు వంశీతో కలిసి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.
YSRCP MLAs vs Chandrababu: ఇన్ని రోగాలున్న చంద్రబాబు ఏపీకి అవసరమా? కంటి చికిత్స తరువాత మళ్ళీ జైలుకు వెళ్లాల్సిందే,న్యాయం గెలిచిందనే టీడీపీ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కౌంటర్ ఎటాక్
Hazarath Reddyటీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) రాజమహేంద్రవరం జైలు నుంచి మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు
Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన నాగం జనార్ధన్‌ రెడ్డి, విష్ణువర్ధన్‌ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉన్న సీనియర్‌ నేత నాగం జనార్ధన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి మంగళవారం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేశారు. హైదరాబాద్‌లో తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు