Politics

PM Modi Speech in Lok Sabha: కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన ప్రధాని మోదీ, తాగి నన్ను తిట్టడమే పనిగా పెట్టుకుని వారు ఇంకా కిందకు పోతున్నారంటూ విమర్శలు

Hazarath Reddy

PM Narendra Modi in LS: నిరాశా నిస్పృహల్లో మునిగిన కొంతమందికి దేశ ప్రజల విజయాలు కనిపించడం లేదు, వారు దేశ ప్రగతిని అంగీకరించలేకపోతున్నారు, పార్లమెంట్ లో ప్రధాని మోదీ

Hazarath Reddy

నిరాశా నిస్పృహల్లో మునిగిన కొద్ది మంది దేశ ప్రగతిని అంగీకరించలేకపోతున్నారు. వారికి దేశ ప్రజల విజయాలు కనిపించడం లేదు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజల కృషి ఫలితంగానే భారతదేశానికి పేరు వస్తోంది. వారికి ఆ విజయాలు కనిపించడం లేదని ప్రధాని మోదీ అన్నారు.

Adani Row: పార్లమెంట్‌లో అదాని వివాదం ప్రకంపనలు, వెంటనే JPC విచారణ చేపట్టాలని డిమాండ్, గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టిన ప్రతిపక్షాలు

Hazarath Reddy

AAP, BRS, శివసేన (ఉద్ధవ్ థాకరే) ఎంపీలు అదానీ వివాదంపై JPC విచారణకు డిమాండ్ చేస్తూ గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు.ఈ అంశంపై ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. దీనికి సంబంధించిన జెపిసి విచారణకు మా డిమాండ్ అలాగే ఉంటుంది. దీనిపై చర్చలో (పార్లమెంట్‌లో) పాల్గొనడం అంటే అదానీ షేర్ల విలువను పెంచడమేనని అదానీ వివాదంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.

MLAs Poaching Case: సీబీఐ చేతికే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థనను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు, సీబీఐ విచారణకు సహకరిస్తామని తెలిపిన ఎమ్మెల్యే బాలరాజు

Hazarath Reddy

తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో (MLAs poaching case) హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఉన్నత న్యాయస్థానంలో తెలంగాణ సర్కార్‌కు మళ్లీ చుక్కెదురైంది. ఈ కేసును సీబీఐ విచారణకే మొగ్గు చూపిస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ తీర్పు (Telangana High court ) వెలువరించింది.

Advertisement

Adani Row: తెలుగు రాష్ట్రాల్లో అదాని ప్రకంపనలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు నిరసనకు దిగన తెలంగాణ కాంగ్రెస్ నేతలు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు ధర్నాకు దిగారు.ఆదానికి వేల కోట్ల రూపాయలు ఎలా ఇచ్చారంటూ డిమాండ్ చేస్తూ వారు SBI ముందు నిరసనలు చేపట్టారు.

Pervez Musharraf Dies: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ మృతి, సుదీర్ఘ అనారోగ్యంతో దుబాయ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

Hazarath Reddy

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ (రిటైర్డ్) ఆదివారం కన్నుమూశారు. నివేదికల ప్రకారం, పర్వేజ్ ముషారఫ్ సుదీర్ఘ అనారోగ్యంతో దుబాయ్‌లోని ఒక ఆసుపత్రిలో మరణించినట్లు పాకిస్తాన్ జియో న్యూస్ నివేదిక తెలిపింది. ముషారఫ్‌ వయసు 79. పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు దుబాయ్‌లోని అమెరికన్‌ హాస్పిటల్‌లో గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు.

AP High Court Fires: హబ్బా! రోజూ మీ ముఖాల్ని చూడాలంటే చికాకు పుడుతోంది.. ప్రభుత్వ కార్యదర్శులపై ఏపీ హైకోర్టు అసహనం.. వీడియోతో

Rudra

పంచాయతీరాజ్‌శాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయశాఖ ప్రస్తుత ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్‌లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసుల్లో పదేపదే న్యాయస్థానానికి వస్తున్న మిమ్మల్ని చూడాలంటేనే చికాగ్గా ఉందని వ్యాఖ్యానించింది.

BBC Documentary Row: బీబీసీ డాక్యుమెంటరీ కేసు, కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, విచారణను ఏప్రిల్ కు వాయిదా వేసిన అత్యున్నత న్యాయస్థానం

Hazarath Reddy

ప్రముఖ జర్నలిస్టు ఎన్ రామ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, కార్యకర్త న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వంతో పాటు ఇతరులకు నోటీసులు జారీ చేసింది

Advertisement

Kakani vs Kotamreddy: టీడీపీ అభ్యర్థిగా ఖరారైన తర్వాతే ఆరోపణలు చేస్తున్నావ్‌, కోటంరెడ్డిపై మండిపడిన మంత్రి కాకాణి, సీఎం జగన్‌ 1 అయితే.. ఆ ముందు ఉండే సున్నాలం మనం అని వెల్లడి

Hazarath Reddy

వైసీపీపై తిరుగుబాటు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (kotam reddy sridhar reddy ) ఈ రోజు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి పార్టీపై విమర్శలు చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి (Kakani vs Kotamreddy) స్పందించారు.

Kotamreddy Sridhar Reddy: జగన్‌ను ప్రాణం కన్నా ఎక్కువగా ఆరాధించాను, నన్ను అనుమానించడం వల్లే పార్టీకి దూరమవుతున్నా, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

వైసీపీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం తాను శ్రమించానని, అయితే అనుమానించిన చోట ఉండొద్దనే ఇప్పుడు దూరం జరుగుతున్నానని పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.

Telangana Budget Session: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. వాడీవేడి చర్చకు అధికార, విపక్షాలు సిద్ధం

Rudra

తెలంగాణలో నేటినుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఆరంభం కానున్నాయి. ఈ మధ్యాహ్నం 12.10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Nellore Politics: నువ్వు అన్నం పెట్టిన చేతినే కాటేసే రకం, ఆనంపై విరుచుకుపడిన నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, వయసు పైబడటంతో ఆనం బుద్ది మందగించిందని సెటైర్స్

Hazarath Reddy

రాజ్యాంగం గురించి ఆనం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ కౌంటర్‌ ఇచ్చారు. కాగా, నేదురుమల్లి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘వెంకటగిరి నియోజకవర్గంలో మేము పనిచేస్తే గెలిచావు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దయతలచి సీటు ఇచ్చారని నేదురుమల్లి మండిపడ్డారు.

Advertisement

Adala Prabhakar Reddy: నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, రూరల్‌ ఇంఛార్జ్‌గా నియమించడం సంతోషంగా ఉందని తెలిపిన ఆదాల

Hazarath Reddy

గత కొంత కాలంగా ఉత్కంఠ రేపుతూ వచ్చిన నెల్లూరు రూరల్ రాజకీయనికి తెరపడింది. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి నియమితులయ్యారు.

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కీలక మలుపు, ఈడీ చార్జ్‌షీట్‌లో ఉన్న 17 మంది నిందితులు వీళ్లే, మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ పేరు, ఆయన ఏమన్నారంటే..

Hazarath Reddy

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో (Delhi liquor Scam case) కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. లిక్కర్‌ కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఢిల్లీ కోర్టులో రెండో చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. దేశ రాజధానిలోని రోజ్‌ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో 17 మంది నిందితులపై అభియోగాలు మోపింది.

Mekathoti Sucharita: జగనన్నతోనే నా రాజకీయ ప్రయాణం, పార్టీ మార్పు రూమర్స్‌కు చెక్ పెట్టిన మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత, వైసీపీలోనే ఉంటానని వెల్లడి

Hazarath Reddy

వైసీపీ ప్రభుత్వంలో దళితులకు అన్నీ రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత (Mekathoti Sucharita) తెలిపారు. గురువారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె (former Home Minister) మాట్లాడారు.

Budget 2023 Highlights: రూపాయి రాక, రూపాయి పోక వివరాలు ఇవిగో, రూ.45.03 లక్షల కోట్లతో 2023 కేంద్ర బడ్జెట్, శాఖల వారీగా కేటాయింపులు, కేంద్ర బడ్జెట్‌ కీ పాయింట్స్ ఇవే..

Hazarath Reddy

ఏడు ప్రాధాన్య అంశాలతో బడ్జెట్ రూపొందించారు. అవి వరుసగా సమ్మిళిత అభివృద్ధి, చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు, భారీగా పెట్టుబడులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, దేశ ప్రజల సామర్థ్యానికి పెద్ద పీట, పర్యావరణ అనుకూల అభివృద్ధి, యువ శక్తి, పటిష్టమైన ఆర్థిక రంగం.

Advertisement

Anam Vijay vs Kotamreddy: నెల జీతాలిచ్చి రౌడీషీటర్లను పెట్టుకొని దందాలు చేసిన వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీతో కుమ్మక్కై వైసీపీని విమర్శిస్తున్నారని మండిపడని ఆనం విజయ్ కుమార్ రెడ్డి

Hazarath Reddy

నెల్లూరు రూరల్ ఎ‍మ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆనం విజయ్‌కుమార్ రెడ్డి (Anam Vijay Kumar Reddy) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు . నెల్లూరు జిల్లాలో అనవసరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

Kotamreddy Sridhar Reddy: వైసీపీకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బై చెప్పినట్లే, వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలని లేదని స్పష్టం, ఆడియో టేప్‌పై స్పందించిన సజ్జల

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తోందన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆయన ఈ రోజు ప్రెస్ మీట్ లో బయట పెట్టారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్న విషయాన్ని తనపై అభిమానం ఉన్న ఓ ఐపీఎస్ అధికారి చెప్పారని వెల్లడించారు.

Union Budget 2023: ఎన్నికల మాయ, కేంద్ర బడ్జెట్‌లో కర్ణాటకకు పెద్ద పీట, నీటి పారుద‌ల శాఖ ప్రాజెక్టుల కోసం రూ.5,300 కోట్ల కేటాయింపులు

Hazarath Reddy

కేంద్ర బడ్జెట్‌లో దక్షిణాది రాష్ట్రం కర్ణాటకకు పెద్ద పీట వేసింది.బడ్జెట్‌-2023లో (Union Budget 2023) వరాలు జల్లు కురిపించింది.అన్నిరాష్ట్రాల‌ను స‌మ‌దృష్టితో చూడాల్సిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్.. త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న క‌ర్ణాట‌క‌పై (poll-bound Karnataka) క‌రుణ చూపారు.

Union Budget 2023: రాయలసీమలో వెనుబడిన జిల్లాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తుందా, కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ప్రభుత్వం గంపెడాశలు, జగన్ ప్రభుత్వం ఆశలు ఇవే..

Hazarath Reddy

ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్‌పై (Union Budget 2023) ఏపీ ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంది. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన రెవిన్యూ లోటు ఇంకా అలానే ఉంది. మరో వైపు కోవిడ్‌తో రాష్ట్రం (Andhra Pradesh) భారీగా ఆదాయం కోల్పోయింది.

Advertisement
Advertisement