Politics

Telangana: అన్యాయం జరిగితే ప్రజలు చూస్తూ ఊరుకోరు, వికారాబాద్ కలెక్టరేట్ ముందు తనతో కలిసి జనాలు పోరాటానికి పోటెత్తిన దృశ్యం ఇదంటూ వీడియో షేర్ చేసిన రేవంత్ రెడ్డి

Hazarath Reddy

అన్యాయం జరిగితే వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ధరణి యాప్ చేస్తున్న అరాచకాలకు విసిగి వేసారిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుతో కదం తొక్కారని... అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు రణ నినాదం చేశారని అన్నారు.

Vijayasai Reddy: రాజ్యసభ వైస్‌ చైర్మన్‌గా విజయసాయి రెడ్డి, ఉత్తర్వులు జారీ చేసిన ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్‌, విజయసాయిరెడ్డితో పాటు మరో ఏడుగురికి వైస్‌ చైర్మన్‌ ప్యానల్‌లో అవకాశం

Hazarath Reddy

రాజ్యసభ వైస్‌ చైర్మన్‌గా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డిని ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్‌ నియమించారు. విజయసాయిరెడ్డితో పాటు మరో ఏడుగురికి వైస్‌ చైర్మన్‌ ప్యానల్‌లో అవకాశం కల్పించారు.ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. తనకు వైస్‌ చైర్మన్‌గా అవకాశమిచ్చిన ఉప రాష్ట్రపతికి విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు

Bharat Jodo Yatra: వైరల్ వీడియో, బీజేపీ కార్యకర్తలపై ముద్దుల వర్షం కురిపించిన రాహుల్ గాంధీ, రాజస్థాన్ రాష్ట్రంలో ఆసక్తికర ఘటన

Hazarath Reddy

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఝలావార్‌లో యాత్ర ప్రారంభించిన రాహుల్‌ గాంధీ.. బీజేపీ కార్యాలయం దాటుతుండగా ఆ భవనంపై ఉన్న కాషాయ కార్యకర్తలకు ఫ్లైయింగ్‌ కిస్సెస్‌(ముద్దులు) వర్షం కురిపించారు.

Rayalaseema Garjana: కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాల్సిందే, రాయలసీమ గర్జనలో దిక్కులు పిక్కటిల్లేలా గర్జించిన సీమ నేతలు, భారీగా తరలివచ్చిన సీమ వాసులు

Hazarath Reddy

Advertisement

Exit Poll Results 2022: గుజరాత్‌ సీఎం పీఠం మళ్లీ బీజేపీదే, 28 నుండి 148 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందంటున్న News18 ఎగ్జిట్ పోల్, కనిపించని ఆమ్ ఆద్మీ ప్రభావం

Hazarath Reddy

2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై News18 ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం, భారతీయ జనతా పార్టీ (BJP) 128 నుండి 148 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ 30 నుండి 42 స్థానాలను కైవసం చేసుకోవచ్చని అంచనా వేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ 2 నుంచి 10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఈరోజు ముగిసింది, సాయంత్రం 5 గంటల వరకు 58 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. దాదాపు 27 ఏళ్లుగా రాష్ట్రాన్ని బీజేపీ పాలించింది.

Exit Poll Results 2022: 131 స్థానాలతో గుజరాత్‌‌లో అతిపెద్ద పార్టీగా బీజేపీ, NDTVఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడి, 41 సీట్లతో కాంగ్రెస్ రెండవ స్థానంలోకి వస్తుందంటున్న సర్వేలు

Hazarath Reddy

NDTV యొక్క పోల్ ఆఫ్ పోల్స్ ప్రకారం, 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది. ఈ పోలింగ్ సీజన్‌లో, 182 సభ్యుల అసెంబ్లీలో కుంకుమ పార్టీ 131 స్థానాలను కైవసం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ 41 విజయాలతో రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో, గుజరాతీ రాష్ట్రంలో ఆప్ 7 సీట్లు గెలుచుకోవచ్చు

Exit Poll Results 2022: హిమాచల ప్రదేశ్‌లో టఫ్ ఫైట్, సీఎం కుర్చీ బీజేపీదే అంటున్న ఎగ్జిట్ పోల్స్, బీజేపీ 47 శాతం ఓట్ బ్యాంక్ సాధిస్తుందని చెబుతున్న సర్వేలు

Hazarath Reddy

Zee News-BARC ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2022 ప్రకారం, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2022లో BJPకి కొన్ని మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. Zee News-BARC ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం, BJPకి 47 శాతం ఓట్ల షేర్ వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్‌, ఆప్‌లకు వరుసగా 41 శాతం, 2 శాతం ఓట్ల శాతం వచ్చే అవకాశం ఉంది

Exit Poll Results 2022: గుజరాత్ మళ్లీ బీజేపీ ఖాతాలోకే అంటున్న Republic-PMARQ Exit Polls, రెండవ స్థానంలోకి కాంగ్రెస్ పార్టీ, మూడవ స్థానంలో ఆమ్ ఆద్మీ

Hazarath Reddy

గుజరాత్‌లో బీజేపీ 128 నుంచి 148 స్థానాల్లో విజయం సాధిస్తుందని Republic-PMARQ Exit Polls చెబుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఆప్‌లు చాలా వెనుకబడి ఉన్నాయి. కాంగ్రెస్‌కు 30 నుంచి 42 సీట్లు రావచ్చు, కొత్తగా చేరిన ఆప్ 2 నుంచి 10 సీట్లతో చాలా వెనుకబడి ఉందని పోల్స్ చెబుతున్నాయి.

Advertisement

Exit Poll Results 2022: గుజరాత్ సీఎం కుర్చీ మళ్లీ బీజేపీదే అంటున్న సర్వేలు, రెండవ స్థానంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ ప్రభావం అంతగా ఉండదంటున్న ఎగ్జిట్ పోల్స్

Hazarath Reddy

TV9 గుజరాతీ ప్రకారం AAP, కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీల కంటే భారతీయ జనతా పార్టీ (BJP) ఈ సారి గుజరాత్ లో అధికారంలోకి వస్తుందని తెలుస్తోంది.2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో, బీజేపీ 125-130 వార్డులతో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది, కాంగ్రెస్ 40-50 సీట్లతో రెండవ స్థానంలో ఉంది. ఆప్ 3 నుంచి 5 సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉంది.

Exit Poll Results 2022: కాంగ్రెస్-బీజేపీ మధ్యనే హిమాచల్ ప్రదేశ్ సీఎం సీటు కోసం టఫ్ ఫైట్, ఆమ్ ఆద్మీ ప్రభావం ఉండదని చెబుతున్న రిపబ్లిక్-PMARQ ఎగ్జిట్ పోల్

Hazarath Reddy

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 2022లో అధికార భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుంది. రిపబ్లిక్-PMARQ ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం, BJP 34-39 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది, అలాగే కాంగ్రెస్ 28-33 సీట్లు కైవసం చేసుకోవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదని రిపబ్లిక్-PMARQ ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలిపాయి.

Exit Poll Results 2022: మళ్లీ ఊడ్చేసిన చీపురు, ఎంసీడీ అరవింద్ కేజ్రీవాల్‌దే, బీజేపీకి షాకిస్తున్న ఎగ్జిట్ పోల్స్, కాంగ్రెస్‌కు ఘోర పరాభవమేనంటున్న పలు ఎగ్జిట్ పోల్స్

Hazarath Reddy

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి సత్తా చాటనుందని పలు ఎగ్జిట్ పోల్స్ ( Exit Poll Results 2022) చెబుతున్నాయి.250 వార్డులకు గాను ఆప్ 149 నుంచి 171 వార్డులు గెలుచుకునే అవకాశం (AAP Likely to Emerge As Single Largest Party) ఉందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది.

Exit Poll Results 2022: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీదే హవా, 149 నుంచి 171 సీట్లు సాధించే అవకాశం, రెండవ స్థానంలో బీజేపీ, కనిపించని కాంగ్రెస్, ఆజ్ తక్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడి

Hazarath Reddy

ఆజ్ తక్ ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 149 నుంచి 171 సీట్లతో MCD ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఢిల్లీలో 69 నుంచి 91 సీట్ల మధ్య గెలుపొందడం ద్వారా రెండవ స్థానంలోకి రావచ్చని తెలుస్తోంది. MCD ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రెండంకెల స్థానాలను తాకే అవకాశం లేదని ఆజ్ తక్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలిపాయి.

Advertisement

Modi Casts Vote In Ahmedabad: అహ్మదాబాద్ లో ఓటు వేసిన ప్రధాని మోదీ.. ప్రజలు ప్రజాస్వామ్యం పండుగను గొప్పగా జరుపుకుంటున్నారని హర్షం

Rudra

గుజరాత్ రెండో దశ ఎన్నికల పోలింగ్ లో ప్రధాని నరేంద్ర మోదీ నేడు అహ్మదాబాద్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తున్నందుకు ఎన్నికల కమిషన్ ను ప్రధాని అభినందించారు.

Sharmila Fires On KCR: నా పాదయాత్రను చూసి కేసీఆర్ కు భయం పట్టుకుంది.. ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉంది.. వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు

Rudra

తన పాదయాత్రను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు భయం పట్టుకుందని వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. అందుకే తన పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసుల ద్వారా ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు.

Sankalpa Siddhi Cheating Case: సంకల్ప సిద్ధి ఛీటింగ్ కేసు, టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపాటు

Hazarath Reddy

సంకల్ప సిద్ధి ఈ కార్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ స్కాంలో (Sankalpa Siddhi cheating case) నా ప్రమేయం ఉందంటూ టీడీపీ నాయకులు, టీడీపీ మీడియా ప్రతినిధులు అసత్య ప్రచారం చేస్తున్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ (Gannavaram MLA Vallabhaneni Vamsi) డీజీపీని కోరారు.

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రతో చచ్చిపోతున్నాం, మాజీ కాంగ్రెస్ సీఎం కమల్‌నాథ్‌ సంచలన వ్యాఖ్యలు, వీడియో వైరల్‌ కావటంతో విమర్శలు ఎక్కుపెట్టిన బీజేపీ

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ భారత్ జోడో యాత్రపై అసహనం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రకారం.. ప్రదీప్‌ మిశ్రా అనే పండింతుడితో కమల్‌నాథ్‌ మాట్లాడుతున్నారు. ‘గత ఏడు రోజులుగా మేం చచ్చిపోతున్నాం.

Advertisement

Jayaho BC Mahasabha: డిసెంబర్ 7న జయహో బీసీ మహాసభ, రాష్ట్రవ్యాప్తంగా 84000 మంది కీలక బీసీ నాయకులకు ఆహ్వానం, ముఖ్య అతిధిగా సీఎం జగన్

Hazarath Reddy

డిసెంబర్ 8వ తేదీన చేపట్టాలనుకున్న బీసీల ఆత్మీయ సదస్సు ఒక రోజు ముందే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని ఎంపీ విజయ్ సాయి రెడ్డి తెలిపారు. గురువారం విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంని పర్యవేక్షించి, జయహో బీసీ మహాసభ పోస్టర్ ని (Jayaho BC Mahasabha Poster) బీసీ నాయకులు రిలీజ్ చేసారు.

MLAs Poaching Case: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం, ముగ్గురు నిందితులకు బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు, ప్రతి సోమవారం సిట్‌ ముందు హాజరు కావాలని ఆదేశాలు

Hazarath Reddy

తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజిలకు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది

Sharmila vs Kavitha: వైఎస్ షర్మిల వర్సెస్ కల్వకుంట్ల కవిత, తెలంగాణలో ముదిరిన ట్వీట్ వార్, వీరికి తోడైన బీజేపీ నేతలు

Hazarath Reddy

తెలంగాణలో రాజకీయ నేతల ట్వీట్లు తీవ్ర చర్చనీయాంశమైనాయి. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YSR Telangana Rashtra Samithi) నిరసన, నిర్భంధం, విడుదలకు సంబంధించిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారగా ట్విట్టర్‌లో టీఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌టీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు

Telangana: ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు బయలుదేరిన షర్మిల భర్త అనిల్ కుమార్, పాదయాత్ర చేయడం తప్పా?,నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని వెల్లడి

Hazarath Reddy

రాజ్‌భవన్‌ రోడ్డులో వైఎస్‌ షర్మిలను అడ్డుకుని పోలీసులు అరెస్ట్‌ చేశారు.షర్మిలను అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో ఆమె భర్త అనిల్‌ ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ.. ‘ పాదయాత్ర చేయడం తప్పా?, నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది’ అని తెలిపారు.

Advertisement
Advertisement