Politics
Telangana: వీడియో, వైఎస్ షర్మిల కారులో ఉండగానే క్రేన్ సహాయంతో పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు, కారు అద్దాలు మూసివేసి లోపలే కూర్చున్న షర్మిల
Hazarath Reddyరాజ్‌భవన్‌ రోడ్డులో వైఎస్‌ షర్మిలను అడ్డుకుని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కారు అద్దాలు మూసివేసి వైఎస్‌ షర్మిల లోపలే కూర్చున్నారు. డోర్‌ లాక్‌ చేసి కారు దిగేందుకు నిరాకరించారు. దీంతో షర్మిల కారును క్రేన్‌ ద్వారా లిఫ్ట్‌ చేసి ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
Telangana: వైఎస్ షర్మిలపై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు, పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తిన వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు, వైఎస్‌ విజయమ్మను అడ్డుకున్న పోలీసులు
Hazarath Reddyవైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై కేసు నమోదైంది. వీఐపీ రాహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనే ఆరోపణలతో పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో (Punjagutta police station) కేసు నమోదైంది. 333, 353,337 సెక్షన్ల కింద షర్మిలపై (YSRTP leader YS Sharmila) పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
Gujarat Election: నేను ఏం తప్పుచేశానని రాళ్లతో దాడి చేస్తున్నారు, గుజరాత్ రోడ్ షోలో మండిపడిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, 92 స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి వస్తామని ధీమా
Hazarath Reddyగుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ‍ప్రచారంలో భాగంగా సూరత్‌లో రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పైకి ఓ వ్యక్తి రాయి విసిరాడు.అయితే కేజ్రీవాల్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ విషయంపై కేజ్రీవాల్ స్పందించారు.
Telangana: వైఎస్ షర్మిల అరెస్ట్, వరంగల్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం, వైస్సార్‌టీపీ అధినేత్రి కేరవాన్‌కు నిప్పంటించిన టీఆర్‌ఎస్‌ ‍శ్రేణులు, కొన్ని వాహనాల అద్దాలు ధ్వంసం
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం (Trigger Tension in Warangal) చోటుచేసుకుంది.వైస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కేరవాన్‌కు టీఆర్‌ఎస్‌ ‍శ్రేణులు నిప్పంటించడం (Attack on Her Convoy) కలకలం సృష్టించింది.
Shashidhar Reddy Joins BJP: బీజేపీ తీర్ధం పుచ్చుకున్న మర్రి శశిధర్‌రెడ్డి, తెలంగాణలో కాంగ్రెస్‌ పని అయిపోయింది, టీఆర్‌ఎస్‌ను గద్దె దించేందుకు పోరాటం చేస్తానని వెల్లడి
Hazarath Reddyతెలంగాణ సీనియర్‌ నేత‌ మర్రి శశిధర్‌రెడ్డి అధికారికంగా బీజేపీలో చేరిపోయారు. ఢిల్లీలో శుక్రవారం బీజేపీ కీలక నేతల నడము ఆయన కాషాయం కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రులు సర్బానంద్‌ సోనావాలా, కిషన్‌రెడ్డితో పాటు మరికొందరు కీలక నేతలు ఈ చేరిక కార్యక్రమంలో పాల్గొన్నారు.
Telangana Early Elections Row: తెలంగాణలో త్వరలో ముందస్తు ఎన్నికలు, సంచలన వ్యాఖ్యలు చేసిన బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్
Hazarath Reddyతెలంగాణలో త్వరలో ముందస్తు ఎన్నికలు రానున్నాయని రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 6 నెలల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారని తెలంగాణ బీఎస్‌పీ అధ్యక్షుడు తెలిపారు.
Kejriwal Comments On BJP: సీబీఐ, ఈడీలను నాకు ఒక్కరోజు అప్పగిస్తే బీజేపీలో సగం మంది జైల్లో ఉంటారు.. ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు.. దర్యాప్తు సంస్థలన్నీ బీజేపీ చేతుల్లో ఉన్నాయని మండిపాటు
Rudraఈడీ, ఐటీ, సీబీఐ దాడులు ఇటీవల కాలంలో పెరిగిపోవడం పట్ల ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలను 24 గంటల పాటు తనకు అప్పగిస్తే బీజేపీలోని సగం మంది నేతలు జైల్లో ఉంటారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Telangana: డిసెంబర్ నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు, వారం రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly, winter session) డిసెంబర్‌లో నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించారు. దాదాపు వారం రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని సంకల్పించారు.
New Pakistan Army Chief: పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ అసిమ్‌ మునీర్‌, ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న ఖమర్‌ జావెద్‌ బజ్వా ఈ నెల చివరిలో పదవీ విరమణ
Hazarath Reddyపాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ అసిమ్‌ మునీర్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆ దేశ ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ గురువారం ప్రకటించారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న ఖమర్‌ జావెద్‌ బజ్వా ఈ నెల చివరిలో పదవీ విరమణ పొందనున్నారు. అనంతరం తదుపరి ఆర్మీ చీఫ్‌గా అసిమ్‌ మునీర్‌ బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఆ దేశ సమాచార శాఖ మంత్రి వెల్లడించారు.
Shraddha Murder Case: శ్రద్ధా వాకర్ హత్య కేసు లవ్ జిహాద్ కాదు, బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తోంది, దీన్ని ఖండిచాలని పిలుపునిచ్చిన ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ
Hazarath Reddyదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసును (Shraddha murder case ) బీజేపీ రాజకీయం చేస్తోందని, ఇది లవ్ జిహాద్ కాదంటూ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) గురువారం ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Gidugu Rudraraju: ఏపీ కాంగ్రెస్ పార్టీ కొత్త బాస్‌గా గిడుగు రుద్రరాజు, 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటు చేసిన అధిష్టానం, సోషల్ మీడియా కమిటీ చైర్మన్‌గా తులసిరెడ్డి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కొత్త చీఫ్ వచ్చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గే పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టారు. అందులో భాగంగా ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్‌ను తప్పించి ఆయన స్థానంలో గిడుగు రుద్రరాజును నియమించారు.
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసు, ఈడీ ముందుకు కాంగ్రెస్‌ నేత అంజన్‌ కుమార్‌ యాదవ్‌, యంగ్‌ ఇండియాకు ఇచ్చిన విరాళాలపై ఈడీ అధికారులు ప్రశ్నలు
Hazarath Reddyదేశవ్యాప్తంగా సంచలనం రేపిన నేషనల్ హెరాల్డ్‌ కేసు (National Herald case)మరోసారి తెర మీదికి వచ్చింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత అంజన్‌ కుమార్‌ యాదవ్‌ ఈడీ ప్రధాన కార్యాలయానికి హాజరయ్యారు. యంగ్‌ ఇండియాకు ఇచ్చిన విరాళాలపై అంజన్‌ కుమరా్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
Shashidhar Reddy Quits Congress: రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ దిగజారిపోతోంది, కాంగ్రెస్ పార్టీకి మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా, లేఖలో ఘాటు వ్యాఖ్యలు
Hazarath Reddyకాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఎంతో బాధతో పార్టీని వీడుతున్నానని ఆయన (Former Minister Marri Shashidhar Reddy) చెప్పారు. అన్ని వివరాలతో సోనియాగాంధీకి లేఖ రాశానని తెలిపారు. రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ దిగజారిపోతోందని అన్నారు.
Andhra Pradesh: టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఫైట్, యనమలకుదురులో ఉద్రిక్త పరిస్థితులు, ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమంలో బాహాబాహీకి దిగిన ఇరువర్గాలు
Hazarath Reddyకృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ పాలన వైఫల్యాలను ఎండగట్టేందుకు తెలుగుదేశం పార్టీ 'ఇదేమి ఖర్మ రాష్ట్రానికి' అనే కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.
MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఊహించని ట్విస్ట్, బీజేపీ నేత సంతోష్‌తో పాటు జగ్గు స్వామికి లుకౌట్‌ నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు
Hazarath Reddyతెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLAs Purchase Case)లో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న జగ్గుస్వామికి లుకౌట్‌ నోటీసులు జారీ చేసింది సిట్ నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులకు జగ్గుస్వామి అందుబాటులోకి లేకుండా పోయారు.
Kejriwal In Gujarat: కేజ్రీవాల్ గుజరాత్ రోడ్ షో లో ‘మోదీ, మోదీ’ అంటూ నినాదాలు.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆప్ కార్యకర్తలు.. వద్దన్న కేజ్రీవాల్.. భవిష్యత్తులో ఒకరోజు మీ మనసులు కూడా గెల్చుకుంటామని ధీమా
Rudraగుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కు వింత అనుభవం ఎదురైంది. ఓవైపు కేజ్రీవాల్ మాట్లాడుతుంటే కొంతమంది జనం ‘మోదీ, మోదీ’ అంటూ నినాదాలు చేశారు.
Andhra Pradesh: చంద్రబాబుకు కర్నూలులో నిరసన సెగ, కోపంతో రౌడీలు, గుండాలు అంటూ రెచ్చిపోయిన టీడీపీ అధినేత, కర్నూలు న్యాయరాజధానిపై చంద్రబాబు వైఖరి చెప్పాలంటూ డిమాండ్ చేసిన నిరసనకారులు
Hazarath Reddyరాయలసీమ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. చంద్రబాబు (Chandrababu) గో బ్యాక్ అంటూ లాయర్లు, వైసీపీ (YCP) కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. పోటీగా టీడీపీ (TDP) శ్రేణులు కూడా నిరసన చేపట్టారు. దీంతో ఇరు వర్గాలను పోలీసులు అడ్డుకున్నారు.
Telangana: తెలంగాణలో మళ్లీ వేడెక్కిన పొలిటికల్‌ వార్‌, నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అరవింద్‌ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి, ప్రతిగా తెలంగాణ భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలు
Hazarath Reddyతెలంగాణ పొలిటికల్‌ వార్‌ మరోసారి వేడెక్కింది. నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అరవింద్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు హంగామా చేశారు.ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ (defamatory remarks against MLC Kavitha) హైదరాబాద్‌లోని అరవింద్‌ ఇంటిని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు (TRS activists storm) ముట్టడించారు.
Bomb Threat To Rahul Gandhi: రాహుల్ గాంధీని చంపేస్తామని బెదిరింపు లేఖ, ఇండోర్‌కు రాగానే బాంబులు వేసి లేపేస్తామని అజ్ఞాత బెదిరింపు
Hazarath Reddyభారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌కు చేరుకోకముందే ఇండోర్‌లో రాహుల్ గాంధీకి అజ్ఞాత బెదిరింపు రావడంతో కలకలం రేగింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు రాగానే బాంబు పేలుస్తామని కాంగ్రెస్‌ నేతను బెదిరించారు. రాహుల్ గాంధీని చంపేస్తానని లేఖలో బెదిరించారు. ఈ విషయంపై పోలీసులు ఇప్పుడు విచారణ ప్రారంభించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు