రాజకీయాలు
Goa CM Swearing-In Ceremony: రెండోసారి గోవా సీఎంగా ప్రమోద్‌ సావంత్‌ ప్రమాణ స్వీకారం, హాజరయిన ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా తదితరులు
Hazarath Reddyగోవా సీఎంగా ప్రమోద్‌ సావంత్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డాలు హాజరయ్యారు. గోవా సీఎంగా ప్రమోద్‌ సావంత్‌ బాధ్యతలు స్వీకరించడం ఇది రెండోసారి.
Congress's New Campaign: ఈ నెల 31న బెల్స్‌, డ్రమ్స్‌ మోగించండి, గ్యాస్ సిలిండర్లకు దండలు వేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపు, పెట్రో ధరల పెంపుకు నిరసనగా ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 7 వరకు పోరాటం
Hazarath Reddyఈ మేరకు ఈ నెల 31న ఉదయం పదకొండు గంటలకు ప్రజలు, కాంగ్రెస్ నేతలు తమ ఇళ్ల వద్ద, పబ్లిక్ ప్లేసులలో గ్యాస్ సిలిండర్లకు దండలు వేయడంతో పాటు, డ్రమ్స్, బెల్స్ వంటివి మోగించాలని (Ring Bells, Drums At 11 am This Thursday) సూచించింది.
Uttar Pradesh: ఉచిత రేషన్ బియ్యం పంపిణీ మరో మూడు నెలలు పెంపు, కేబినెట్ సమావేశంలో తొలి నిర్ణయం యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్
Hazarath Reddyఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండో సారి బాధ్యతలను స్వీకరించారు. ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం నిన్న అట్టహాసంగా జరిగింది. రెండో సారి సీఎం అయిన యోగి.. ఈరోజు తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు.
Kejriwal on Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ మూవీని య్యూట్యూబ్‌లో పెట్టండి! బీజేపీ నేతలు పోస్టర్ బాయ్స్‌గా మారారు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు, కశ్మీరీ పండిట్ల పేరుమీద కొందరు కోట్లు సంపాదించుకుంటున్నారు
Naresh. VNSశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కశ్మీర్ ఫైల్స్(The Kashmir Files) మూవీకి వినోదపన్ను రాయితీ ఇవ్వాలన్న డిమాండ్ పై భిన్నంగా స్పందించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal). కొందరు ఈ సినిమా పేరుతో కోట్లు సంపాదిస్తుంటే, బీజేపీ నేతలు (BJP Leaders) మాత్రం పోస్టర్లు అంటించేవారిగా మారిపోయారంటూ విమర్శించారు.
AP Budget Sessions 2022: పదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్, ఫైబర్‌ గ్రిడ్‌ స్కాం మీద కొనసాగుతున్న చర్చ
Hazarath Reddyపదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Budget Sessions 2022) ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఫైబర్ గ్రిడ్ అవినీతిపై ( fibre grid scam) వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రశ్నించారు. మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి (Balineni Srinivasa Reddy) సమాధానమిచ్చారు.
Azad Meets Sonia: సోనియాతో ఆజాద్ కీలక భేటీ, గంటపాటూ చర్చించిన ఇరువురు నేతలు, వచ్చే సార్వత్రిక ఎన్నికలపై చర్చించామన్న ఆజాద్, రెబల్ నేతల డిమాండ్లు వినిపించారని గుసగుస
Naresh. VNSకాంగ్రెస్ (Congress) పార్టీని బలోపేతం చేయడంతో పాటూ, రానున్న రాజ్యసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సోనియాను కలిసినట్లు ఆజాద్ తెలిపారు. పార్టీలో అటు జాతీయస్థాయిలోనూ ఇటు ప్రాంతీయ స్థాయిలోను సంస్థాగత మార్పులు చేస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఎలా సన్నద్ధం అవ్వాలనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది.
MLA Ambati Rambabu: ఏపీలో పెగాసస్‌ స్పైవేర్‌ ప్రకంపనలు, చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలు బయటకు వస్తున్నాయని వెల్లడి
Hazarath Reddyదేశంలోనే టెక్నాలజీకి ఆద్యుడ్ని అని ప్రచారం చేసుకునే చంద్రబాబు దేశ సార్వభౌమత్వానికే ముప్పు తెచ్చారని ఆరోపించారు. పెగసెస్ చంద్రబాబు (Chandrababu Naidu) వాడినట్లు మమత బెనర్జీ చెప్పారు.. ఆమె మా రాజకీయ మిత్రురాలు కాదని అన్నారు.
Pegasus Spyware: దేశంలో మళ్లీ పెగాసస్ ప్రకంపనలు, చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేసిందని సంచలన వ్యాఖ్యలు చేసిన దీదీ, ఖండించిన తెలుగుదేశం పార్టీ
Hazarath Reddyదేశంలో తాజాగా పెగసస్‌ స్పైవేర్‌ ప్రకంపనలు మొదలయ్యాయి. వివాదాస్పద పెగసస్‌ స్పైవేర్‌ను (Pegasus Spyware) నాలుగైదేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) వెల్లడించారు.
Akhilesh Yadav on Kashmir Files: లఖీంపూర్ ఫైల్స్ కూడా తీయండి! ఎస్పీ చీఫ్ అఖిలేష్ కీలక కామెంట్లు, బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు, ఉత్తరప్రదేశ్ లో జరిగిన మారణహోమాన్ని కూడా సినిమా తీయాలని డిమాండ్
Naresh. VNSదేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కశ్మీర్ ఫైల్స్ (Kashmir Files) మూవీపై కీలక కామెంట్లు చేశారు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్‌ యాదవ్ (Akhilesh Yadav). ఈ మూవీని బీజేపీ సపోర్ట్ చేస్తున్నందుకు ఆయన ఫైర్ అయ్యారు. కశ్మీర్ లోయలో జరిగిన హింసాత్మక ఘటనల పట్ల సినిమా తీయగలిగితే లఖీంపూర్ ఖేరీ ప్రాంతంలో జరిగిన అల్లర్లపై కూడా లఖీంపూర్ ఫైల్స్ (Lakhimpur Files) సినిమా తీయాలని అన్నారు.
Navjot Singh Sidhu Resigns: పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామా, పార్టీ అధ్య‌క్షురాలు సోనియా ఆశించిన‌ట్లే తాను రాజీనామా చేస్తున్న‌ట్లు వెల్లడి
Hazarath Reddyపంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామా చేశారు. త‌న రాజీనామా లేఖ‌ను పార్టీ అధినేత్రి సోనియాకు పంపారు. ఇటీవ‌ల జ‌రిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓట‌మి పాలైంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర అధ్య‌క్షులు త‌ప్పుకోవాల‌ని సోనియా ఆదేశాలు ఇచ్చిన విష‌యం తెలిసిందే.
Punjab CM Swearing-in: పంజాబ్‌ ముఖ్యమంత్రిగా భగవంత్‌ మాన్‌ ప్రమాణ స్వీకారం, భగత్‌ సింగ్‌ స్వస్థలం ఖతర్‌ కలన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం
Hazarath Reddyపంజాబ్‌ ముఖ్యమంత్రిగా భగవంత్‌ మాన్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. భగత్‌ సింగ్‌ స్వస్థలం ఖతర్‌ కలన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ హాజరయ్యారు. మాన్‌ ప్రమాణ స్వీకారానికి ప్రజలు భారీగా తరలి రావడంతో భగత్‌ సింగ్‌ పూర్వీకుల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
Minister Kodali Nani: ఆ 420 బ్యాచ్ సీఎంపై బురద చల్లాలని చూస్తోంది, ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడిన మంత్రి కొడాలి నాని
Hazarath Reddyఏపీ మంత్రి కొడాలి నాని విప‌క్షాల‌పై మండి పడ్డారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ సీట్ల‌లో సొంత అభ్య‌ర్థుల‌తో పోటీ చేసే స‌త్తా ఒక్క వైసీపీకి మిన‌హా మ‌రే ఇత‌ర పార్టీకి లేద‌ని ఆయ‌న (Minister Kodali Nani) తేల్చేశారు. మొత్తం సీట్లు 175 అయితే అందులో 160 సీట్ల‌కు కూడా సొంతంగా పోటీ చేసే స‌త్తా ఏ పార్టీకి (Opposition Parties) కూడా లేద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు.
Andhra Pradesh: జగన్ సింగిల్‌గానే పోరాడతారు, పవన్ కళ్యాణ్ ఓ ఊసరవెల్లి, ఎప్పుడు ఏ గుర్తుకు ఓటేయమంటారో తెలియదని వ్యంగ్యం విసిరిన మంత్రి పేర్ని నాని, జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ వైసీపీపై తీవ్ర విమర్శలు
Hazarath Reddyఏపీ మంత్రి పేర్ని నాని జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు (Pawan Kalyan's Remarks) కౌంటర్ ఇచ్చారు. రాజకీయ జీవితం ఇచ్చిన చిరంజీవికి నమస్కారం పెట్టకపోవడం పవన్ సంస్కారం అని వ్యంగ్యం ప్రదర్శించారు. చిరంజీవి లేకుండా పవన్ కల్యాణ్ ఉన్నారా? అని ప్రశ్నించారు.
Suman on YS Jagan Govt: పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ చిత్తుచిత్తుగా ఓడింది, ఏపీకి మరో రెండు సార్లు జగన్‌ సీఎంగా కొనసాగాలి, అప్పుడే రాష్ట్రం స్వర్ణాంధ్ర అవుతుందని తెలిపిన సినీ నటుడు సుమన్
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి జగన్ పరిపాలన చాలా బాగుందని సినీ నటుడు సుమన్ (Suman on YS Jagan Govt) కితాబునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు పేదల్లో చిరునవ్వులు నింపాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే జగన్ మరో రెండు సార్లు ముఖ్యమంత్రి (Actor Suman Comments about CM YS Jagan) కావాలని చెప్పారు.
Gutha Sukender Reddy: శాస‌న‌మండ‌లి చైర్మ‌న్‌గా గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, రెండో సారి పదవీ బాధ్యతలు స్వీకరించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ
Hazarath Reddyతెలంగాణ శాస‌న‌మండ‌లి చైర్మ‌న్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి (Gutha Sukender Reddy) రెండోసారి ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. మండ‌లి చైర్మ‌న్‌గా సుఖేంద‌ర్ రెడ్డి ఏక‌గ్రీవంగా ( legislative council chairman ) ఎన్నిక‌య్యారు. ఈ ఎన్నిక‌కు ఒకే ఒక్క నామినేష‌న్ రావ‌డంతో.. గుత్తా ఏక‌గ్రీవంగా ఎన్నికైనట్లు మండ‌లి అధికారులు ప్ర‌క‌టించారు.
CWC Meet:సోనియమ్మ ఎలా చెబితే అలా! కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియానే ఉండాలి, సుధీర్ఘంగా సాగిన సీడబ్లూసీ సమావేశం, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చ
Naresh. VNSకాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (Congress Working Committe) సమావేశం ముగిసింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటూ, పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది సీడబ్లూసీ (CWC). ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే సోనియా గాంధీపై (Sonia Gandhi)తమకు నమ్మకం ఉందని.. ఆమేనే తమకు నాయకత్వం అందిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేతలు వెల్లడించారు.
Punjab: పంజాబ్ కాబోయే సీఎం సంచలన నిర్ణయం, సిద్దూ సహా 122 మంది మాజీ ఎమ్మెల్యేల భద్రత తొలగింపు, మాజీల కంటే ప్రజల భద్రతమే మాకు ముఖ్యమన్న భగవంత్ మాన్
Naresh. VNSపంజాబ్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న భగవంత్ మాన్ (Bhagwant Mann) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాజ్ భవన్ లో కాకుండా భగత్ సింగ్ (Bhagat Singh) గ్రామమైన ఖట్కర్ కలన్ లో సీఎంగా ప్రమాణం చేస్తానని ప్రకటించి అందరి దృష్టిని మరోసారి ఆకర్షించారు. అంతేగాకుండా కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫొటోలు ఉండవని, షహీద్ భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటోలు ఉంటాయని వెల్లడించారు.
AP Cabinet Reshuffle: ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై క్లారిటీ! పాత మంత్రులు జిల్లాల బాధ్యతలు, సీఎం జగన్ సంచలన నిర్ణయం, జిల్లాల వారీగా ఆశావాహులు వీళ్లే!
Naresh. VNSమూడేళ్ల తర్వాత ఏపీ కేబినెట్ విస్తరణకు (Cabinet reshuffle) రంగం సిద్ధమయింది. ఏపీ కేబినెట్ త్వరలో కొత్త మంత్రులతో కొలువుదీరనుంది. ప్రస్తుత కేబినెట్ (Cabinet) ఏర్పడి మూడేళ్లు అవుతోంది. దీంతో సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించి.. కొత్త వారిని మంత్రులుగా నియమించేందుకు సీఎం జగన్‌ (CM Jagan) డిసైడ్‌ అయ్యారు.
Kamal Haasan: నా మిత్రుడు అరవింద్ కేజ్రీవాల్‌కు అభినందనలు, ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయంపై ట్వీట్ చేసిన మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్
Hazarath Reddyపంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) గురువారం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయంపై హర్షం వ్యక్తం చేశారు