రాజకీయాలు

AP CM Polavaram Tour: సీఎం హోదాలో 2వ సారి పోలవరానికి వైయస్ జగన్, ప్రాజెక్టు ప్రాంతంలో ఏరియల్‌ సర్వే, పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలనే లక్ష్యంగా ముందుకు..

Hazarath Reddy

ఏపీ (Andhra Pradesh) సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరానికి చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో జగన్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ముఖ్యమంత్రి (Chief Minister YS Jagan Mohan Reddy) హోదాలో ఆయన రెండోసారి పోలవరం ప్రాజెక్ట్‌ను (Polavaram Project) ఏరియల్‌ సర్వే ద్వారా సందర్శించి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Praja Chaitanya Yatra: బాబుకు కోడిగుడ్లతో స్వాగతం పలికిన వైజాగ్, ప్రజా చైతన్య యాత్రకు అడుగడుగునా నిరసన సెగలు, ఇరుపార్టీల మధ్య వేడెక్కిన వార్, వైజాగ్‌లో చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న వైసీపీ శ్రేణులు

Hazarath Reddy

ప్రజా చైతన్య యాత్రలో భాగంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Vizag Tour) ఈ రోజు ఉత్తరాంధ్రలో పర్యటి'స్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో చంద్రబాబు (Chandra babu) పర్యటనను అడ్డుకోవడానికి వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ప్రజా చైతన్య యాత్ర (TDP Praja Chaitanya Yatra) చేపడుతున్న బాబుకు వైజాగ్‌లో (Vizag) రాజధాని సెగ తగిలింది.

Prashant Kishor: ప్రశాంత్‌ కిషోర్‌పై చీటింగ్‌ కేసు నమోదు, ‘బాత్ బిహార్ కి’ కాపీ కొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన శశ్వత్ గౌతమ్, కంటెంట్ దొంగతనం ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్న పాట్నా పోలీసులు

Hazarath Reddy

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్‌ పార్టీ(జేడీయూ) మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌పై (Prashant Kishor) చీటింగ్‌ కేసు నమోదైంది. ప్రశాంత్ కిషోర్ పై పాట్నా పోలీసులు ఛీటింగ్ కేసు (Cheating Case) నమోదు చేసిన ఘటన ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. ప్రశాంత్ కిషోర్ తన కంటెంట్‌ను దొంగిలించి ‘బీహార్ కి బాత్’ ప్రచారానికి వాడుకున్నారని శశ్వత్ గౌతమ్ పట్నా నగరంలోని పాటలీపుత్ర పోలీసుస్టేషనులో (Patna Police Station) ఫిర్యాదు చేశారు.

AP CM Review Meeting: మరిన్ని ఉద్యోగాలు, విద్యుత్ రంగంలో పెట్టుబడులే లక్ష్యం, విద్యుత్‌రంగంపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం, ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

ఏపీ సర్కారు (AP Govt) పరిపాలనలో ముందుకు దూసుకువెళుతోంది. ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. కాగా విద్యుత్‌రంగంపై (Power Sector) బుధవారం సీఎం జగన్‌ సమీక్ష (AP CM Jagan Review Meeting) నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు, మరిన్ని ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) అన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి, ఆ విద్యుత్‌ను బయట అమ్మకోవాలనుకునే కంపెనీలకు, సంస్థలకు అనుకూలంగా పాలసీ తీసుకువస్తున్నామని ఆయన తెలిపారు.

Advertisement

Bihar Resolves Not To Implement NRC: ఎన్నార్సీపై కేంద్రానికి నితీష్ కుమార్ షాక్, బీహార్‌లో ఎన్‌ఆర్‌సీ అమలు చేయబోమని అసెంబ్లీ తీర్మానం, 2010లో ఉన్న ఫార్మాట్‌నే అమలు చేస్తామని తెలిపిన బీహార్ సీఎం

Hazarath Reddy

ఎన్డీఏకు మిత్రపక్షంగా ఉన్న బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ( CM Nitish Kumar) షాక్ కేంద్రానికి షాక్ ఇచ్చారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఎన్ఆర్సీకి (National Register Of Citizens) వ్యతిరేకంగా బీహార్ అసెంబ్లీ (Bihar Assembly) తీర్మానం చేసింది. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు (NPR, NRC) వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటిన క్రమంలో బీహార్‌లో (Bihar) ఎన్‌ఆర్‌సీ అమలు చేయబోమని నిర్ణయిస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది.

Polavaram Project: వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి, ప్రణాళికలు రూపొందించిన ప్రభుత్వం, మేఘా సంస్థ, ఈ నెల 27న ప్రాజెక్ట్ ప్రాంతాన్ని సందర్శించనున్న ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Andhra Pradesh Govt) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) ఊపందుకుంది. గోదావరి నదిపై (Godavari River) కడుతున్న ఈ జాతీయ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి నిర్ధేశించిన లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతోంది. దేశంలోనే పెద్దదైన ఈ బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ పోలవరంను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేసే లక్ష్యంగా ప్రభుత్వం, మేఘా సంస్థలు (Megha Engineering) ప్రణాళికలు రూపొందించాయి. ఆరు దశాబ్దాల క్రితం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిన విషయం విదితమే.

Delhi Burning: ఈశాన్య దిల్లీలో 'కనిపిస్తే కాల్చివేత' ఆదేశాలు, పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తం, అల్లర్లతో 13కు చేరిన మృతుల సంఖ్య, పాఠశాలలకు సెలవులు, పరీక్షలు వాయిదా, మీడియా ప్రసారాలపై ఆంక్షలు

Vikas Manda

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండు రోజుల భారత పర్యటన ముగించుకొని షెడ్యూల్ ప్రకారం మంగళవారం రాత్రి 10 గంటలకు దిల్లీ నుంచి అమెరికా బయలుదేరే వరకు పోలీసులు సహనంతో ఉంటారు, అప్పటికీ ఆందోళనలు తగ్గకపోతే కఠినంగా వ్యవహరిస్తారని పలు నివేదికలు వెల్లడించాయి.....

Trump Concluded India Visit: రెండు రోజుల భారత పర్యటన ముగించుకొని స్వదేశానికి పయనమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ

Vikas Manda

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తమ తొలి రెండు రోజుల భారత పర్యటనను ముగించుకొని మంగళవారం రాత్రి అమెరికాకు బయలుదేరిపోయారు. రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం ముగియగానే, ట్రంప్ ఫ్యామిలీ నేరుగా దిల్లీ విమానాశ్రయం చేరుకుని వారి ప్రత్యేక విమానంలో తిరిగి తమ స్వదేశానికి పయనమయ్యారు......

Advertisement

India- USA Deals: 'ఈ పర్యటన మాకెంతో ప్రత్యేకం, మీ ఆతిథ్యాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం' హైదరాబాద్ హౌజ్‌లో ట్రంప్ కీలక ప్రకటన, ఇండియా-యూఎస్ మధ్య కుదిరిన 3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం

Vikas Manda

భారతదేశం నుంచి ఘనమైన స్వాగతం లభించింది. భారత ప్రజలు చూపిన ప్రేమ, ఆప్యాయతలు అమోఘం. దీనిని మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటామ అని ట్రంప్ అన్నారు. ఈ పర్యటన ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇరు దేశాలు భాగస్వామ్య విలువలు పాటిస్తాయి కాబట్టి ఇండియా- యూఎస్ఎ ఎప్పటికీ మిత్రదేశాలని పేర్కొన్నారు....

Delhi Violence: దిల్లీ హింసాకాండంపై కేంద్ర హోంమత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం, సీఎం అర్వింద్ కేజ్రీవాల్ హాజరు, ఘర్షణల్లో 07కు పెరిగిన మృతుల సంఖ్య

Vikas Manda

దిల్లీ హింసాకాండ తాజా పరిణామాలపై సమీక్షించేందుకు మంగళవారం అమిత్ షా అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, సీఎం అర్వింద్ కేజ్రీవాల్ , నగర పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్, కాంగ్రెస్ నేత సుభాష్ చోప్రా, బిజెపి నాయకులు మనోజ్ తివారీ, రాంబిర్ సింగ్ బిధురి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు....

Rajya Sabha Polls: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల కమీషన్, త్వరలో ఖాళీ అవుతున్న 55 స్థానాలకు మార్చి 26న పోలింగ్

Vikas Manda

17 రాష్ట్రాల నుంచి మొత్తం 55 రాజ్యసభ స్థానాలు ఈ ఏప్రిల్ నెలలో ఖాళీ అవుతున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి 2 మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏమాత్రం ఆలస్యం లేకుండా ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ప్రకటించేసింది.....

Delhi Violence: దిల్లీలో సిఎఎ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్ణణ, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మృతి, డీసీపీకి గాయాలు, శాంతిభద్రతలను కాపాడాలని కేంద్రానికి సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి

Vikas Manda

ఈశాన్య దిల్లీలోని జాఫ్రాబాద్, గోకుల్‌పురి, మౌజ్ పూర్, భజన్ పుర తదితర ప్రాంతాలు సిఎఎ అనుకూల, వ్యతిరేక వర్గాల ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. ఇరు వర్గాల మధ్య సవాళ్లు - ప్రతిసవాళ్లతో వారి ఆందోళనలు ఘర్షణలకు దారితీశాయి. సోమవారం ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. పలు ఇండ్లు, దుకాణాలు, వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు......

Advertisement

Namaste Trump: అమెరికాలో భారత్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం. కీలక ఒప్పందాలు, సినిమా- క్రికెట్ విశేషాలు, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం, పేదరిక నిర్మూలన; ఆల్ రౌండ్ స్పీచ్‌తో అదరగొట్టిన డొనాల్డ్ ట్రంప్

Vikas Manda

తన హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఉన్నత స్థితిని చూసిందని తెలిపిన ట్రంప్, రాబోయే రోజుల్లో ఇండియా ఎకానమీ కూడా బలపడుతుందని, వచ్చే పదేళ్లలో ఇండియాలో పేదరికం పూర్తిగా నిర్మూలించబడి, మిడిల్ క్లాస్ జనాలు అతిపెద్ద సంఖ్యలో ఉండే దేశంగా మారుతుందని ట్రంప్ జోస్యం చెప్పారు....

Namaste Trump: ఒకరు స్టాచూ ఆఫ్ లిబర్టీ- ఇంకొకరు స్టాచూ ఆఫ్ యునిటీ..యూఎస్- భారత్ మధ్య ఉన్నది భాగస్వామ్యం కాదు, దగ్గరి సంబంధం, ఈ బంధం కలకాలం కొనసాగనీ: నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ప్రధాని మోదీ స్పీచ్

Vikas Manda

భారతదేశం-యుఎస్ సంబంధాలు ఇకపై మరొక భాగస్వామ్యం కాదు. ఇది చాలా గొప్ప మరియు దగ్గరి సంబంధం. ఒకటి 'స్వేచ్ఛా భూమి', మరొకటి ప్రపంచం ఒక కుటుంబం అని నమ్ముతుంది. ఒకరు 'స్టాచూ ఆఫ్ లిబర్టీ' గురించి గర్వంగా భావిస్తారు, మరొకరు భావిస్తారు 'స్టాచూ ఆఫ్ యూనిటీ' గురించి గర్వంగా చెప్పుకుంటారు. భారత్ - అమెరికా మైత్రి కలకాలం వర్ధిల్లాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.....

Anti-CAA Protests: ఢిల్లీలో హింసాత్మకంగా ‘సీఏఏ’ ఘర్షణలు, రాళ్ల దాడి చేసుకున్న సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాలు, ఉద్రిక్తతల నేపథ్యంలో మౌజ్‌పూర్ మెట్రోస్టేషన్ మూసివేత

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం(CAA) వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈశాన్య ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు (Anti-CAA Protests) జరుగుతున్న జఫ్రాబాద్ (Jaffrabad) ఏరియాకు సమీపంలోనే మౌజ్‌పూర్ ఉంది.

Vidya Rani Joins BJP: బీజేపీ తీర్థం పుచ్చుకున్న వీరప్పన్ కూతురు, పార్టీలోకి ఆహ్వానించిన తమిళనాడు బీజేపీ నేతలు, మోదీ పథకాలను పేదల వద్దకు తీసుకెళ్లడమే లక్ష్యమన్న విద్యారాణి

Hazarath Reddy

గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ (Sandalwood Smuggler Veerappan) కూతురు విద్యారాణి ఎట్టకేలకు ప్రజాసేవలోకి వచ్చారు. కాషాయపు కండువాను కప్పుకున్నారు. శనివారం తమిళనాడులోని కృష్ణగిరి ప్రాంతంలో జరిగిన సదస్సులో ఆమె (Vidya Rani) బీజేపీలోకి జాయిన్ అయ్యారు.

Advertisement

International Judicial Conference 2020: సుప్రీం తీర్పులకు 130 కోట్ల మంది మద్ధతు, గాంధీ చూపిన మార్గమే న్యాయవ్యవస్థకు పునాది, అంతర్జాతీయ న్యాయమూర్తుల సదస్సులో ప్రధాని మోదీ

Hazarath Reddy

సుప్రీంకోర్టు (Supreme Court) వివిధాంశాలపై ఇస్తున్న తీర్పులను 130 కోట్ల మంది ప్రజానీకం సహర్షంగా స్వాగతిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అత్యున్నత న్యాయస్థానం ఇటీవల వెలువరించిన పలు క్లిష్టమైన తీర్పులను (Critical judicial judgments) వెల్లడించిందని వీటిని భారతీయులు మనస్ఫూర్తిగా స్వాగతించారని ప్రధాని తెలిపారు.‘

Shatrughan Sinha: ఉద్రిక్తతల వేళ పాక్‌ పర్యటనలో కాంగ్రెస్ నేత, లాహోర్‌లో పాక్ అధ్యక్షుడు ఆరిప్ అల్వితో భేటీ, ఇది పూర్తిగా వ్యక్తిగత టూర్ అంటున్న బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా

Hazarath Reddy

భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు, కాంగ్రెస్ నేత శతృఘ్న సిన్హా (Shatrughan Sinha) పాకిస్థాన్‌లో (Pakistan) పర్యటించడంపై వివాదంరేగుతోంది. మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి షాట్ గన్ గా పిలుచుకొనే సినీ నటుడు శతృఘ్న సిన్హా వ్యాపారవేత్త, ఫిల్మ్ మేకర్ అయిన అసద్ అహ్ సాన్ ఆహ్వానంపై దాయాది దేశానికి వెళ్లారు. ఇంతకుముందు వివాహంలో పాల్గొనాలని అసద్ ఆహ్వానించారు.

Kanakadurga Flyover: విజయవాడ వాసుల కష్టాలు తీరినట్లే, తుది దశలో కనక దుర్గ ఫ్లైఓవర్ పనులు, ఏప్రిల్ మొదటి వారంలో ట్రయల్ రన్, ఆ తరువాత వాహనాలకు అనుమతి

Hazarath Reddy

బెజవాడ వాసుల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు రూపుదిద్దుకుంటున్న కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణం (Kanaka Durga Flyover) తుదిదశకు చేరుకుంది. ఈ ఫ్లైఓవర్‌ పనులు సంపూర్ణంగా పూర్తిచేసేందుకు అధికార యంత్రాంగం శరవేగంగా కృషిచేస్తోంది. మరో నెలరోజుల్లో.. అంటే మార్చి నెలాఖరు-ఏప్రిల్ మొదటివారంలోగా తుది దశ పనులు పూర్తయ్యేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Sujana and Rayapati: వేలానికి సుజనా చౌదరి, రాయపాటి ఆస్తులు, రాయపాటి ఆస్తులను వేలం వేయనున్న ఆంధ్రా బ్యాంక్, సుజనా చౌదరి ఆస్తుల వేలానికి నోటీసులు పంపిన బ్యాంక్ ఆఫ్ ఇండియా

Hazarath Reddy

తెలుగు దేశం పార్టీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన ఎంపీ సుజనాచౌదరి (Yalamanchili Satyanarayana Chowdary), అలాగే టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావులకు (Rayapati Sambasiva Rao) భారీ షాక్ తగిలింది. వారికి సంబంధించిన ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకులు రెడీ అవుతున్నాయి.

Advertisement
Advertisement