రాజకీయాలు

Chennamaneni Ramesh: చెన్నమనేని రమేశ్‌ జర్మనీ పౌరుడే, తేల్చి చెప్పిన తెలంగాణ హైకోర్టు, విధించిన రూ.30లక్షల జరిమానా నెలలోపు చెల్లించాలని స్పష్టం

Hazarath Reddy

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ (Chennamaneni Ramesh)కు తెలంగాణ హైకోర్టు (TS High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. పౌరసత్వం కేసులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. చెన్నమనేని రమేశ్‌ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చిచెప్పింది.

Telangana Assembly Session 2024: ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు, అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. తొలి రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. తెలంగాణ తల్లిని ఈ రోజు సచివాలయంలో ఆవిష్కరిస్తున్నాం.

BRS MLAs Arrest: రాహుల్ గాంధీ ఆదాని టీషర్ట్ ధరించి పార్లమెంట్ కు వెళ్లాడు, మేము ధరించి అసెంబ్లీకి వస్తే తప్పేంటి ? అరెస్టులపై మండిపడిన బీఆర్ఎస్ నేతలు

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ శాసనసభ్యులు సోమవారం ఉదయం నిరసనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది . సెషన్ ప్రారంభానికి నిమిషాల ముందు ఈ నిరసన చెలరేగింది.

Tension at Assembly Gate: అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు.. కారణం ఇదే..! (వీడియో)

Rudra

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది అసెంబ్లీ గేటు దగ్గర అడ్డుకున్నారు.

Advertisement

TG Assembly Session Today: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 5 బిల్లులు, 2 నివేదికలు ప్రవేశపెట్టే అవకాశం.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా ఇవాళే..!

Rudra

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశాలు మొదలు కానున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకొని ప్రజా పాలన విజయోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి.

Farmers protest: రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన హర్యానా పోలీసులు, శంభు సరిహద్దు వద్ద కాంక్రీట్ దిమ్మలు, ఇనుప బారికేడ్లు ఏర్పాటు..వీడియో ఇదిగో

Arun Charagonda

పంజాబ్ రైతుల ఢిల్లీ మార్చ్ ను మరోసారి అడ్డుకున్నారు పోలీసులు. రైతుల పై టియర్ గ్యాస్ ప్రయోగించారు హర్యానా పోలీసులు. 101 మంది రైతులు ఢిల్లీ వెళ్ళేందుకు అభ్యంతరం లేదు..ఢిల్లీ వెళ్లే రైతులు కాకుండా గ్రూపుగా ఎక్కువమంది ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి అడ్డుకున్నాం అని పోలీసులు తెలిపారు. శంభు సరిహద్దు వద్ద కాంక్రీట్ దిమ్మలు,ఇనుప బారిగేట్లు ఏర్పాటు చేశారు. అంబాల జిల్లాలో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 విధించారు.

RJD leader Tejashwi Yadav: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై స్పందించిన ఆర్జేడీ తేజస్వి యాదవ్, సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాం అని తెలిపిన ఆర్జేడీ నేత

Arun Charagonda

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..ఇండియా కూటమికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. మమతా చేసిన ప్రకటనపై కూటమిలో అంతా కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకుంటామన్నారు తేజస్వి. కూటమికి ఎవరూ నాయకత్వం వహిస్తారనేది అంతా కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకుంటామని... కూటమిలోని సీనియర్ నాయకులు ఎవరైనా నాయకత్వం వహిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.

KCR BRSLP Meeting: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేడు బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ.. అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై చర్చ

Rudra

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ జరుగనుంది.

Advertisement

PM Modi: ప్రధాని మోదీ హత్యకు కుట్ర ..ముంబై పోలీసులకు బెదిరింపు మెస్సేజ్..నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

Arun Charagonda

ప్రధాని మోదీని హతమారుస్తానని ముంబై ట్రాఫిక్ పోలీసులకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. వాట్సాప్ మెసేజ్‌తో అప్రమత్తమై విచారణ చేపట్టారు పోలీసులు. బెదిరింపు మెసేజ్ పంపిన వ్యక్తి రాజస్థాన్ వాసికి మతి భ్రమించినట్లుగా గుర్తించగా భారత న్యాయసంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Ponnam Meets KCR: నేడు కేసీఆర్ ను కలవనున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ఎందుకంటే??

Rudra

తెలంగాణలో నేడు రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతుంది. మాజీ సీఎం కేసీఆర్‌ ను మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో కలవనున్నారు.

Telangana: వీడియో ఇదిగో, పోలీస్ స్టేషన్లకు వచ్చి ఎవరైనా హడావుడి చేస్తే బొక్కలో వేయండి, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ఫ్రెండ్లీ పోలీస్ ప్రజల కోసమేనని నేరగాళ్లకు కాదని అన్నారు. పోలీసులంటే నేరగాళ్లు భయపడాల్సిందేనని తెలిపారు. అత్యధికంగా కష్టపడేది పోలీసులే.. విమర్శలు ఎదుర్కొనేది పోలీసులే అని సీఎం అన్నారు. ప్రజా పాలనలో పోలీసులకు స్వేచ్ఛ ఉంటుందని రాజకీయ ఒత్తిళ్లు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Telangana Thalli: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఇదిగో, ఈనెల 9వ తేదీన సెక్రటేరియట్‌లో విగ్రహావిష్కరణ కార్యక్రమం

Hazarath Reddy

ఆకుపచ్చ రంగు చీరలో తెలంగాణ తల్లి రూపం, చేతిలో మొక్కజొన్న, వరి కంకులు, మెడలో 3 ఆభరణాలు, కాళ్లకు మెట్టెలు, పట్టీలు పెట్టిన ఈ కొత్త విగ్రహం ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట వద్ద సచివాలయ అధికారులు విగ్రహాన్ని తయారు చేయించారు.

Advertisement

Ambati Rambabu Slams Nara Lokesh: ఫేక్ పోస్టులు పెట్టినవారిపై కేసులు పెట్టినా ఇంత వరకు పోలీసులు చర్యలు తీసుకోలేదు, కూటమి ప్రభుత్వంపై మండిపడిన అంబటి రాంబాబు

Hazarath Reddy

టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలపై మాజీ మంత్రి,వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మండిపడ్డారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో సోషల్‌‌మీడియాలో వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.

Rajya Sabha: రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ సీటు వద్ద రూ.500 నోట్ల కట్ట కలకలం, ఘటనపై స్పందించిన అభిషేక్‌ సింఘ్వీ, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో జరుగుతున్న వేళ ఎగువ సభ (Rajya Sabha)లో భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపింది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్‌ సింఘ్వీ (Abhishek Singhvi) సీటు వద్ద నోట్ల కట్ట లభ్యమైనట్లు రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్ ధన్‌ఖర్ (Jagdeep Dhankhar) వెల్లడించారు.

Opposition MPs Protest: పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన, అదానీ వ్యవహారంపై ఈడీ, సీబీఐ లతో విచారణ జరిపించాలని డిమాండ్

Arun Charagonda

పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన కొనసాగుతోంది. మోదీ అదానీ భాయ్ భాయ్ అంటూ మాస్కులు ధరించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, విపక్ష ఎంపీలు. అదానీ వ్యవహారంపై ఈడీ, సీబీఐ లతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Kakinada Shares Case: చంద్రబాబుకు ఈ కేవీ రావు ఒక చెంచా, అలాంటి వాడిపై మేము బెదిరింపులకు దిగడమేంటి ? మీడియా వేదికగా మండిపడిన విజయసాయి రెడ్డి

Hazarath Reddy

కాకినాడ పోర్టు అంశంలో టీడీపీ నేతలు తన పేరును కూడా తీసుకువస్తుండడం, తనకు లుకౌట్ నోటీసులు జారీ చేయడం పట్ల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా వేదికగా మండిపడ్డారు.

Advertisement

TGSRTC Renamed As TGTD: టీజీఎస్ఆర్టీసీని టీజీటీడిగా మార్చిన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రవాణా శాఖ కొత్త లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ప్రజాపాలన విజయోత్సవాలు వేడుకల్లో భాగంగా తెలంగాణ రవాణా శాఖ ఆధ్వర్యంలో హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖ నూతన లోగోను ఆవిష్కరించారు.తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థలో కొత్త అధ్యాయాన్ని గుర్తు చేస్తూ, ప్రభుత్వం TGSRTCని తెలంగాణ రవాణా శాఖ (TGTD) గా రీబ్రాండింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది .

Indiramma Illu Mobile App: ఇందిరమ్మ ఇళ్లు మొబైల్ యాప్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, తొలి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు

Hazarath Reddy

తెలంగాణలో అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ఇళ్లు ఇస్తామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. సొంత ఇళ్లు ఉంటే పేదలు ఆత్మగౌరవంతో, ఉన్నతంగా బతుకుతారని అన్నారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి పేదలకు ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు

Kakinada Shares Case: కాకినాడ షేర్ల కేసు, విజయసాయిరెడ్డితో పాటు మరో ఇద్దరికీ లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ, రూ. 3600 కోట్ల విలువైన వాటాల‌ను బెదిరించి లాక్కున్నారని ఆరోపించిన క‌ర్నాటి వెంకటేశ్వ‌ర‌రావు

Hazarath Reddy

రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఆయన అల్లుడు శరత్‌చంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వైవీ విక్రాంత్‌రెడ్డిలపై లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ అయింది.

YS Jagan Slams Chandrababu: చంద్రబాబులాగా బాదుడు భారతదేశ చరిత్రలోనే ఎవ్వరూ చేసి ఉండరు, కూటమి ప్రభుత్వంపై మండిపడిన జగన్

Hazarath Reddy

టీడీపీ జనసేన బీజేమీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement