Politics

Vijaysai Reddy Meet Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ

Hazarath Reddy

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయ్ సాయి రెడ్డి భేటి అయ్యారు. ఇది మర్యాదపూర్వకమైన భేటీ అంటూ విజయసాయిరెడ్డి తన ఎక్స్ వేదికగా తెలిపారు. రాష్ట్ర ప్రాజెక్టులు మీద ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.

Andhra Pradesh: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భేటీలో కీలక అంశాలు చర్చకు, కాకినాడ పోర్ట్‌లో రేషన్ బియ్యం కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అమరావతిలో భేటీ అయ్యారు.ఉండవల్లిలోని సీఎం నివాసంలోదాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు

Telangana: కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు ఉద్యోగాలు ఊడితేనే యువతకు ఉద్యోగాలు వచ్చాయి, గ్రూప్ -1 ఉద్యోగుల పాపం మీదేనని బీఆర్ఎస్ మీద మండిపడిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

త్వరలోనే గ్రూప్‌-1 ఉద్యోగాల నియామకపత్రాలు అందజేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 563 మంది గ్రూప్‌- 1 అధికారులను తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములను చేయబోతున్నాం. చిన్న ఆరోపణ లేకుండా టీజీపీఎస్సీ పని చేస్తోంది.

Minister Sridhar babu: ట్యాంక్ బండ్ పై కారు భీభత్సం.. భారీగా ట్రాఫిక్ జామ్.. స్వయంగా చక్కదిద్దిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ మీద ఓ కారు భీభత్సం సృష్టించింది. ట్యాంక్ బండ్ వైపు నుంచి వస్తున్న ఓ కారు అంబేద్కర్ కూడలి వద్ద అదుపు తప్పి ఫుట్ పాత్ పైకి దూసుకురావడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

Advertisement

Maharastra CM Swearing-In Ceremony: డిసెంబర్ 5న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణం.. సీఎం రేసులో ముందంజలో ఫడ్నవీస్‌.. శివసేన, ఎన్సీపీలకు డిప్యూటీ సీఎం పోస్టులు

Rudra

మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి పదవుల పంపకం ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఎన్‌సీపీ చీఫ్‌ అజిత్‌ పవార్‌ వ్యాఖ్యల ప్రకారం బీజేపీకి ముఖ్యమంత్రి పదవి అని, ఎన్‌సీపీ, శివసేనలకు ఉప ముఖ్యమంత్రి పదవులు అని స్పష్టమవుతున్నది.

Gautam Adani Indictment: అమెరికా నుంచి ఎలాంటి సమన్లు మాకు రాలేదు, గౌతం అదానీ లంచం ఆరోపణల్లో యూఎస్ సమన్లపై క్లారిటీ ఇచ్చిన విదేశాంగ శాఖ

Hazarath Reddy

లంచం ఆరోపణలో కేసులో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani)తో పాటు, ఇతరులకు అమెరికా ప్రాసిక్యూటర్లు సమన్లు జారీ చేశారంటూ వస్తున్న వార్తలను విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) శుక్రవారంనాడు తోసిపుచ్చింది.

Jagan Districts Tour: ఇకపై రెండు రోజుల పాటు కార్యకర్తలతోనే, వైఎస్ జగన్ కీలక నిర్ణయం, సంక్రాంతి తర్వాత జిలాల పర్యటనకు శ్రీకారం

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలో ఉమ్మడి కృష్ణా నేతలతో ఇవాళ వైఎస్‌ జగన్‌ సమావేశం అయ్యారు. ఈ భేటీలోనే ఆయన జిల్లాల పర్యటనపై ఒక స్పష్టమైన ప్రకటన చేశారు.

Jagan Districts Tour: 16 నెలలు బెయిల్ కూడా ఇవ్వకుండా నన్ను జైల్లో పెట్టారు, మనలో పోరాటం ఆగకూడదు, వైసీపీ నేతలతో జగన్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

నేను మీ అందరికీ కోరేది ఒక్కటే. మనలో పోరాట పటిమ సన్నగిల్లగూడదు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్టాలుంటాయి, నష్టాలుంటాయి. కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష. కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకొండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. బెయిల్‌ కూడా ఇవ్వలేదు. అయినా ప్రజల అండతో ముఖ్యమంత్రి అయ్యాను.

Advertisement

Jagan Meeting With Party Leaders: కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకొండి, ఇకపై కార్యకర్తలతోనే ఉంటానని స్పష్టం చేసిన వైఎస్ జగన్

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలో ఉమ్మడి కృష్ణా నేతలతో ఇవాళ వైఎస్‌ జగన్‌ సమావేశం అయ్యారు. ఈ భేటీలోనే ఆయన జిల్లాల పర్యటనపై ఒక స్పష్టమైన ప్రకటన చేశారు

Smuggling Ration Rice in Kakinada: బియ్యం దేశం దాటి వెళ్తుంటే ఏం చేస్తున్నారు ? కాకినాడ పోర్టులో టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుపై సీరియస్ అయిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు కాకినాడ పోర్టును తనిఖీ చేశారు. రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసిన పవన్ కల్యాణ్ అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న భారీ నౌకను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Balineni Slams YS Jagan: జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన బాలినేని, జగన్ హయాంలో ప్రజలు భయాందోళనలకు గురయ్యారంటూ..

Hazarath Reddy

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీరుపై జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫంక్షన్ కు వెళ్లారనే అక్కసుతో మాగుంట శ్రీనివాస్ రెడ్డితో పాటు దాదాపు 17 మందికి జగన్ ఎంపీ టికెట్లు ఇవ్వలేదని మండిపడ్డారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, న్యాయం చేయాలంటూ రోడ్డెక్కిన పిఠాపురం వాసులు, వివరాలను అడిగి తెలుసుకుని న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం

Hazarath Reddy

రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తూ, పిఠాపురంలో ధర్నా చేస్తున్న వారిని చూసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగారు..సచివాలయం టౌన్ ప్లానింగ్ సెక్రెటరీ ఫాతిమా పై బాధితులు పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేశారు .అగ్రహారానికి చెందిన ప్రభుత్వ పట్టా భూముల్లో నివాసం ఉంటున్న వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తుంది అంటూ ఫాతిమాకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు

Advertisement

AP Secretariat Employees: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అరెస్ట్.. ఎందుకంటే? (వీడియో)

Rudra

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టయ్యారు. వెంకట్రామి రెడ్డి, పలువురు ఉద్యోగులు అనుమతి లేకుండా మద్యం సరఫరా చేశారన్న సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వెంకట్రామిరెడ్డి ని అర్థరాత్రి అరెస్టు చేశారు.

BRS Deeksha Diwas: నేడు తెలంగాణవ్యాప్తంగా బీఆర్ఎస్ ‘దీక్షా దివస్‌’.. కరీంనగర్ లో పాల్గొననున్న కేటీఆర్

Rudra

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం దీక్షా దివస్‌ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధమైంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లుచేసింది.

Telangana: సిరిసిల్ల కలెక్టర్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు, క్షమాపణ చెప్పాలని ఐఏఎస్‌ అధికారుల సంఘం డిమాండ్, ఇలాంటి ఆరోపణలతో వ్యవస్థలపై చెడు ప్రభావం పడుతుందని ఆందోళన

Hazarath Reddy

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సిరిసిల్ల కలెక్టర్ పై చేసిన వ్యాఖ్యల పట్ల ఐఏఎస్‌ అధికారుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సిరిసిల్ల కలెక్టర్‌పై కేటీఆర్‌ ఆరోపణలు సరికాదంటూ ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ ఖండించింది.

Hemant Soren Sworn in As Jharkhand CM: జార్ఖండ్‌ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరేన్‌ ప్రమాణ స్వీకారం, నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేసిన జేఎంఎం చీఫ్‌

Hazarath Reddy

జార్ఖండ్‌ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. జార్ఖండ్‌ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా (Jharkhand CM) జేఎంఎం చీఫ్‌ హేమంత్‌ సోరేన్‌ (Hemant Soren) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్‌ సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ ప్రమాణం చేయించారు

Advertisement

Jagan on Power Agreements: విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంతో లక్ష కోట్లు ప్రజల మీద భారం పడకుండా చేశాం, నేను హిస్టరీ క్రియాట్ చేసినందుకు నాపై బురద చల్లుతారా..

Hazarath Reddy

విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో తమ ప్రభుత్వ హయాంలో తప్పు జరిగిందనే విధంగా చూపించేందుకు కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం.. ఒప్పందం జరిగింది కేంద్ర ప్రభుత్వం(సెకి), రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమేనని స్పష్టం చేశారు.

Jagan Slams Chandrababu Govt: విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం, బురద జల్లుతూ రాతలు రాయడంపై మండిపడిన జగన్, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

ఈ రోజు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం మాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబు పాలనలో బాధాకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. హామీల అమలు లేకపోగా.. స్కాంల పాలన నడుస్తోందని అన్నారు.

Priyanka Gandhi: ప్రియాంక గాంధీ అనే నేను... చేతిలో రాజ్యాంగం.. ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన ప్రియాంక

Arun Charagonda

వయనాడ్ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు ప్రియాంక గాంధీ. తన చేతిలో చిన్న రాజ్యాంగం ప్రతిని పట్టుకొని.. రాజ్యాంగంపై ప్రమాణం చేస్తూ.. తనకు అప్పగించిన బాధ్యతల్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని అన్నారు. ఆ తర్వాత సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. దాంతో సభ అంతటా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీని తలపించేలా.. అదే లుక్‌లో కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది.

Hemant Soren Oath: జార్ఖండ్ 14వ సీఎంగా హేమంత్ సోరేన్, సాయంత్రం ప్రమాణస్వీకార కార్యక్రమం..హాజరుకానున్న ఇండియా కూటమి నేతలు

Arun Charagonda

జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు జేఎంఎం నేత హేమంత్ సొరేన్. సాయంత్రం 4 గంటలకు సీఎంగా ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండనుండగా రాంచీ లోని మొరబడి గ్రౌండ్ లో హేమంత్ సొరేన్ తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్.

Advertisement
Advertisement