Politics

Sajjala Ramakrishna Reddy: టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిన రోజు నేను అక్కడ లేను, మంగళగిరి పీఎస్‌లో విచారణకు హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి

Hazarath Reddy

టీడీపీ కూటమి కక్ష సాధింపు చర్యలకు దిగిందని వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని.. ఇష్టానుసారం సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారంటూ ఆ పార్టీ సీనియర్‌ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

YS Jagan Slams CM Chandrababu: 4 నెలల్లోనే ఈ ప్రభుత్వం వద్దు బాబు అంటున్నారు, దేశంలోకెల్లా నంబర్‌ వన్‌ పార్టీగా మనం ఎదుగుతామంటూ వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

జగన్‌ మాట్లాడుతూ.. అధికారం ఈరోజు ఉండొచ్చు.. లేకపోవచ్చు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలన్నారు అధికారం కోసం చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితులు లేవన్నారు.

Nayab Singh Saini Sworn In: హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్‌ సింగ్‌ సైనీ ప్రమాణ స్వీకారం, ప్రధాని మోదీతో సహా ఎన్డీయే కూటమి నేతలు హాజరు..

Hazarath Reddy

హర్యానాలో (Haryana)లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నాయబ్‌ సింగ్‌ సైనీ (Nayab Singh Saini) ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆయనతో ప్రమాణం చేయించారు. దీనికి ముందు ఆయన వాల్మీకి ఆలయంలో పూజలు చేశారు.

Andhra Pradesh: ప్రత్తిపాడులో చంద్రబాబుకు షాక్, వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత ముదునూరి మురళీకృష్ణంరాజు

Hazarath Reddy

Advertisement

Omar Abdullah Takes Oath as J&K CM: జ‌మ్మూకశ్మీర్ ముఖ్య‌మంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం, కేంద్రపాలిత ప్రాంతానికి తొలి సీఎంగా ఒమర్

Hazarath Reddy

జ‌మ్మూక‌శ్మీర్ సీఎంగా నేషనల్‌ కాన్ఫరెన్స్ పార్టీ అగ్ర‌నేత ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. శ్రీనగర్‌లోని షేర్-ఇ- కశ్మీర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో ఒమర్ అబ్దుల్లాతో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో కేంద్రపాలిత ప్రాంతం జ‌మ్మూకశ్మీర్ కు తొలి ముఖ్య‌మంత్రిగా ఒమర్ అబ్దుల్లా చ‌రిత్ర‌కెక్కారు.

BJP MLA Rakesh Reddy: వీడియో ఇదిగో, హిందువుకు మగతనం లేదు, హైదరాబాద్‌లో ఉండేవాళ్లంతా చీము, నెత్తురు లేనోళ్లే, బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Vikas M

బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హిందువులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సిగ్గు శరం లేని హిందువులు హైదరాబాద్‌లోనే ఉన్నారని, హిందువులు చీము, నెత్తురు లేని నా కొడుకులంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఇటీవల జరిగిన దుర్గమ్మ, ముత్యాలమ్మ విగ్రహాల ధ్వంసం ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు.

Bye-Elections 2024: 48 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ సీట్లకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల, రాహుల్ గాంధీ వదిలిన వయనాడ్ ఎంపీ స్థానానికి నవంబర్ 13న పోలింగ్

Hazarath Reddy

దేశంలో 48 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటరీ స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. ఈ ఉప ఎన్నికలు రెండు విడతల్లో జరుపుతున్నట్టు ప్రకటించింది. తొలివిడతలో భాగంగా నవంబర్ 13న 47 అసెంబ్లీ స్థానాలు, కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది.

Assembly Elections 2024: మళ్లీ మోగిన ఎన్నికల నగారా, మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ, పూర్తి షెడ్యూల్ ఇదిగో..

Hazarath Reddy

మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ప్రకటించింది. మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌ను చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు.

Advertisement

Jharkhand Assembly Elections 2024: జార్ఖండ్‌‌లో 81 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు, నవంబర్‌ 23న ఫలితాలు

Hazarath Reddy

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు (Jharkhand Assembly Elections) కూడా ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. 81 అసెంబ్లీ స్థానాలకు గానూ రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో 43 స్థానాలకు నవంబర్‌ 13న ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిని 38 స్థానాలకు నవంబర్‌ 20న ఎన్నికలు ఉంటాయి

Maharashtra Assembly Elections 2024: మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు, నవంబర్‌ 20న ఎన్నికలు, 23న ఫలితాలు

Hazarath Reddy

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది.మహారాష్ట్ర (Maharashtra)లో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందుకోసం అక్టోబర్‌ 22న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

Can EVMs Be Hacked or Tampered With? ఈవీఎంల ట్యాంపరింగ్‌ ఆరోపణలపై సీఈసీ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు, ట్యాంపరింగ్‌కు ఎలాంటి అవకాశం లేదని తోసిపుచ్చిన ఈసీ

Hazarath Reddy

ఈవీఎంలు లేదా వాటి చిప్ లను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మంగళవారం మరోసారి తోసిపుచ్చారు. వక్రీకరణ అంచనాలను నివారించడానికి ఎగ్జిట్ పోల్ ఏజెన్సీలు ఎంచుకున్న నమూనా అంశాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

SC on Freebies Plea: ఎన్నికల వేళ ఉచితాలు..దీని సంగతేంటో చెప్పండి, కేంద్రానికి, ఈసీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, ఉచిత హామీల‌ను లంచాలుగా ప‌రిగ‌ణించాలంటూ పిటిషన్

Hazarath Reddy

ఎన్నిక‌ల స‌మ‌యంలో చిన్న‌ పెద్ద అనే తేడా లేకుండా పార్టీల‌న్నీ వ‌రుస‌గా ఉచిత హామీలు గుప్పించ‌డం స‌ర్వ‌సాధార‌ణం అయిపోయింది. రాజకీయ పార్టీల ఉచిత హామీలపై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.

Advertisement

Sajjala Ramakrishna Reddy: సజ్జల రామకృష్ణారెడ్డిపై లుక్ అవుట్ నోటీసుపై స్పందించిన ఏపీ డీజీపీ, అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని వెల్లడి

Hazarath Reddy

బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీపై వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై లుక్ అవుట్ నోటీసు జారీ అయింది. దీంతో ఆయనను ఢిల్లీ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.

Maharashtra, Jharkhand Assembly Elections 2024 Schedule: మరోసారి ఎన్నికల సందడి.. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు నేడే మోగనున్న నగారా

Rudra

దేశంలో మరోసారి ఎన్నికల శంఖారావం మోగనున్నది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ వెలువరించనున్నది. ఈ మేరకు మధ్యాహ్నం 3.30 గంటలకు మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు.

Draw For Liquor Shops In AP Today: ఆ కిక్కే వేరప్పా..! ఏపీ మద్యం దుకాణాల టెండర్ల లాటరీ నేడే.. మద్యం దుకాణాలు దక్కేది ఎవరికో??

Rudra

ఆంధ్రప్రదేశ్ లో మందుబాబులకు కిక్కు ఇచ్చే వార్త ఇది. రాష్ట్రంలో మద్యం దుకాణాలు నేడు ఖరారు కానున్నాయి.

Alai Balai: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో నేడు దత్తన్న ‘అలయ్ బలయ్’.. హాజరుకానున్న ప్రముఖులు

Rudra

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో నేడు అలయ్ బలయ్ కార్యక్రమం జరగనుంది.

Advertisement

Atishi Luggage Thrown Out: ఢిల్లీ సీఎం అతిషికి అవ‌మానం, అధికారిక నివాసం నుంచి సామాన్లు తొల‌గింపు, బీజేపీ నేతకు ఇచ్చేందుకే బ‌ల‌వంతంగా ఖాళీ చేయించార‌ని ఆప్ ఆరోప‌ణ‌

VNS

దేశ రాజధానిలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) నాయకురాలు, ఢిల్లీ సీఎం అతిషి సామగ్రిని ఆమె అధికార నివాసం నుంచి తొలగించారు. (Atishi’s luggage thrown out) పలు వాహనాల్లో ఆ ఇంటి నుంచి పంపివేశారు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (VK Saxena) ఆదేశం మేరకు అధికారులు ఈ చర్యకు పాల్పడినట్లు సీఎంవో (CMO) కార్యాలయం, ఆప్‌ నేతలు ఆరోపించారు.

CM Revanth Reddy Slams KCR: కేసీఆర్‌ని కొరివి దెయ్యంతో పోల్చిన సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలని వ్యాఖ్యలు, డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలను అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి కొరివి దెయ్యంగా అభివర్ణించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆ కొరివి దెయ్యాన్ని రెండు సార్లు ముఖ్యమంత్రిని చేశారని అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను ఆ కొరివి దెయ్యం పట్టించుకోలేదని మండిపడ్డారు.

HYDRA Demolition Row: అది అబద్దమని నిరూపిస్తే సూసైడ్ చేసుకుని చనిపోతా, రేవంత్ రెడ్డి సర్కారుకి బీజేపీ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డి సవాల్

Hazarath Reddy

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేలాదిమంది ప్రజలు ఇళ్లను నిర్మించుకోవడానికి వివిధ బ్యాంకులు లోన్లు ఇచ్చాయని, అవి అవాస్తవమని నిరూపిస్తే తాను సూసైడ్ చేసుకొని చనిపోవడానికి సిద్ధమని కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ చేశారు

Andhra Pradesh Politics: వీడియో ఇదిగో, టీడీపీలో చేరిన మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు

Hazarath Reddy

రాజ్యసభ మాజీ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ, మాజీ ఎమ్మెల్సీ బీదా మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరారు.

Advertisement
Advertisement