Politics

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్, క్యూలైన్ల‌లో ఉన్న‌వారికి ఓటేసేందుకు అవకాశం ఇస్తున్న అధికారులు

Hazarath Reddy

ఏపీలో మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాలైన రంప‌చోడ‌వ‌రం, అర‌కు, పాడేరులో అధికారులు సాయంత్రం నాలుగు గంట‌ల‌కే పోలింగ్ ముగించారు. అలాగే తెలంగాణ‌లోని మంచిర్యాల‌, మంథ‌ని, భూపాల‌ప‌ల్లి, ఇల్లందు, పిన‌పాక‌, సిర్పూర్, చెన్నూర్, ఆసిఫాబాద్‌, బెల్లంప‌ల్లి, భ‌ద్రాచ‌లం, కొత్తగూడెం, అశ్వ‌రావుపేట‌, ములుగులో క‌డా 4 గంట‌ల‌కే పోలింగ్ పూర్త‌యింది.

Telangana Elections 2024: మాధవీలతపై కేసు నమోదు, హిజాబ్ తొలగించాలని చెప్పి వారి ఐడీలను చెక్ చేసిన హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతపై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదయింది. మాధవీలత పోలింగ్ బూత్‌లోకి వచ్చి బుర్ఖా వేసుకున్న మహిళల ఐడీ ప్రూఫ్ చెక్ చేశారు. హిజాబ్ తొలగించాలని చెప్పి వారి ఐడీలను ఆమె చెక్ చేశారు. దీంతో ఆమె అనుచితంగా ప్రవర్తించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

Telangana Elections 2024:  వీడియో ఇదిగో..జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న రామ్‌చరణ్‌, ఆయన భార్య ఉపాసన

Hazarath Reddy

తెలంగాణ: తెలంగాణలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు స్వచ్చంధంగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తాజాగా జూబ్లీహిల్స్‌లోని పోలింగ్‌ బూత్‌లో నటుడు రామ్‌చరణ్‌, ఆయన భార్య ఉపాసన కామినేని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Blue Shirt Mania: బ్లూ షర్టుతో ఓటేయడానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, సోషల్ మీడియాలో ఖుషీ అవుతున్న వైసీపీ ఫ్యాన్స్, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న వేళ టాలీవుడ్ హారోలు జూనియర్ ఎన్టీఆర్‌, మహేష్ బాబు బ్లూ షర్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇద్దరు హీరోలు బ్లూ షర్ట్స్ ధరించి పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. దీంతో ఎన్టీఆర్‌, మహేష్ బాబు పరోక్షంగా వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చారంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

Advertisement

Rahul Gandhi on His Marriage: పెళ్లి చేసుకోక తప్పేలా లేదంటున్న రాహుల్ గాంధీ, పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే విషయంపై సరదాగా స్పందించిన కాంగ్రెస్ నేత

Hazarath Reddy

సోమవారం ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీలో నిర్వహించిన లోక్ సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ సభలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే విషయంపై సరదాగా స్పందించారు. జనం దీనిని ప్రస్తావించగా.. ఇక పెళ్లి చేసుకోక తప్పేలా లేదని పేర్కొన్నారు.

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, గన్నవరంలో చెప్పులు, రాళ్లతో దాడి చేసుకున్న వల్లభనేని వంశీ, యార్లగడ్డ వర్గీయులు

Hazarath Reddy

ఏపీలో పోలింగ్ సందర్భంగా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.తాజాగా గన్నవరం నియోజకవర్గంలోని ముస్తాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ, టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట జరిగింది.

Andhra Pradesh Elections 2024: ఎర్రకండువాతో ఓటేయడానికి వచ్చిన ఓటరు, తీవ్ర అభ్యంతరం తెలిపిన వంగా గీత, నాగబాబు దీనిపై ఏమన్నారంటే..

Hazarath Reddy

ఏపీలో నేడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. అందరి దృష్టి కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానంపై కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ జనసేన నుంచి పవన్ కల్యాణ్, వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. ఓ పోలింగ్ కేంద్రం వద్ద పరిశీలనకు వచ్చిన వంగా గీత ఓ వ్యక్తిపై మండిపడ్డారు.

Andhra Pradesh Elections 2024: చీరాలలో రక్తమొచ్చేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ వర్గీయులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బాపట్ల - చీరాల మండలం గవినివారి పాలెంలో చీరాల కూటమి అభ్యర్థి ఎం ఎం కొండయ్య గవినివారిపాలెం పోలింగ్ బూత్లను సందర్శించడానికి వచ్చిన సమయంలో ఇరువర్గాల మధ్యన ఘర్షణ చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిన పోలీసులు

Advertisement

Telangana Elections 2024: హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు, ఓటు వేయమని ఇంటింటికి వెళ్ళి చెబుతున్న స్థానికులు, వీడియోఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదవడంతో, ప్రజలు బయటకు వచ్చి ఓటు వేయడానికి నివాసితులు గేట్లు, తలుపులు తట్టడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Telangana Elections 2024: ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, ఇతర ప్రముఖ నేతలు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. సినీ, రాజకీయ ప్రముఖులు కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Telangana Elections 2024: పోలీసు సిబ్బంది చాలా డల్‌గా ఉన్నారు, హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్ లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత మాట్లాడుతూ, "...పోలీసు సిబ్బంది చాలా డల్‌గా ఉన్నారు, వారు చురుకుగా లేరు.. వారు ఏమీ తనిఖీ చేయరు. సీనియర్ సిటిజన్ ఓటర్లు ఇక్కడకు వస్తున్నారు కానీ వారి పేర్లు జాబితా నుండి తొలగించబడ్డాయి.

Lok Sabha Elections 2024: తొలి రెండు గంటల్లో పిఠాపురంలో 10.02 శాతం పోలింగ్ నమోదు, ఉదయం 9 గంటలకు ఏపీలో 9.05శాతం, తెలంగాణలో 9.51 శాతం పోలింగ్‌ నమోదైందని తెలిపిన అధికారులు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ జరుగుతోంది.

Advertisement

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల ఎన్నికలపై పీఎం మోదీ, అమిత్ షా స్పెషల్ ట్వీట్స్, రికార్డు స్థాయిలో ప్ర‌జ‌లు పోలింగ్‌లో పాల్గొనాల‌ని పిలుపు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై ప్ర‌ధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్ర‌త్యేకంగా ట్వీట్స్ చేశారు. అసెంబ్లీ స‌హా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు రికార్డు స్థాయిలో పోలింగ్‌లో పాల్గొనాల‌ని మోదీ పిలుపునిచ్చారు. మ‌రోవైపు తెలుగు సంస్కృతిని, గౌర‌వాన్ని కాపాడే ప్ర‌భుత్వాన్ని ఎన్నుకోండి అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.

Telangana Elections 2024: వీడియోలు ఇవిగో, అమృత విద్యాలయంలో ఓటేసిన హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత, కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న ఒవైసీ

Hazarath Reddy

హైదరాబాద్‌లోని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత హైదరాబాద్‌లోని అమృత విద్యాలయం మహీంద్రా హిల్స్‌లో ఓటు వేశారు. దేశ వ్యాప్తంగా నాలుగోదశ ఎన్నికల పోలింగ్ మొదలైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా 10 రాష్ట్రాలు/యూటీల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతున్నది.

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, మంగళగిరిలో ఓటేసిన పవన్ కళ్యాణ్, ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్

Hazarath Reddy

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు వేసేందుకు మంగళగిరిలోని పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు నాల్గవ దశలో ఈరోజు ఏకకాలంలో ఓటింగ్ జరుగుతోంది.

Andhra Pradesh Elections 2024: పిఠాపురంలో పోటెత్తిన ఓటర్లు, ఉదయం 7 గంటల నుంచి భారీ క్యూలు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న పిఠాపురంలో ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటల నుంచి క్యూలైన్లో నిలుచున్నారు. ఉప్పాడలో ఓటర్లు భారీగా ఓటు వేయడానికి కదలి వచ్చారు.

Advertisement

Andhra Pradesh Elections 2024: పుంగనూరులో టీడీపీ ఏజెంట్లు కిడ్నాప్, వైసీపీ నేతలే కిడ్నాప్ చేశారంటూ టీడీపీ విమర్శలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. పలువురు ప్రముఖలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో (Chittoor) టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ కలకలం రేపింది.

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో పులివెందుల భాకరాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి

Hazarath Reddy

కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల భాకరాపురం 138 పోలింగ్‌ బూత్‌లో సీఎం జగన్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ సమయంలో క్యూ నిల్చున్న ఓటర్లకు ఆయన అభివాదం చేశారు.

Jail for Non Voters: ఓటు హక్కు ఉన్నప్పటికీ ఓటు వేయట్లేదా? అయితే, మీకు రేషన్ కట్, జైలుకు వెళ్లాల్సిందే, జరిమానా కూడా చెల్లించాల్సిందే! ఎక్కడంటే?

Rudra

ఓటు హక్కు ఉన్నప్పటికీ ఓటేయకుంటే మన దేశంలో పెద్దగా శిక్షలు అమలు చెయ్యట్లేదు. అయితే, బయటి దేశాల్లో అలా కాదు. ఓటు వేయకపోతే, రేషన్ కట్ చేస్తారు. జైలులో వేస్తారు. భారీ జరిమానా కూడా విధిస్తారు.

Lok Sabha Elections 2024 Phase 4: ప్రారంభమైన నాలుగో దశ పోలింగ్, ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్

Hazarath Reddy

సార్వత్రిక ఎన్నికల నాలోగుదశ ఎన్నికల పోలింగ్‌ ఉదయగం 7 గంటల నుంచి ప్రారంభమైంది.సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగనుంది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా 10 రాష్ట్రాలు/యూటీల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతున్నది.

Advertisement
Advertisement