Politics
BRS MLC Kavitha Arrest: మద్యం కేసులో ఈడీ విచారణకు సహకరిస్తా, అరెస్టపై స్పందించిన కవిత, ఇలాంటి అణచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామని ధీమా
Hazarath Reddyశుక్రవారం అరెస్ట్ అనంతరం ఆమె మాట్లాడుతూ... మద్యం కేసులో ఈడీ విచారణకు సహకరిస్తానని తెలిపారు. ఇలాంటి అణచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామన్నారు. పార్టీ శ్రేణులు ఇలాంటి వాటిని మనోధైర్యంతో ఎదుర్కోవాలన్నారు.
BRS MLC Kavitha Arrest: మనీలాండరింగ్ హవాలా చట్టం కింద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, కవిత భర్త అనిల్ కుమార్ కు సమాచారం ఇచ్చామని తెలిపిన ఈడీ
Hazarath Reddyబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మనీలాండరింగ్ హవాలా చట్టం కింద అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు తెలిపారు. ఢిల్లీ మద్యం కేసులో ఈ రోజు మధ్యాహ్నం నుంచి దాదాపు ఐదు గంటల పాటు ఆమెను విచారించిన ఈడీ అధికారులు సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.
Lakshmi Narayana on Kavitha Arrest: కవిత అరెస్ట్‌పై స్పందించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, సీఆర్పీసీ చట్టం ఈడీకి వర్తించకపోవచ్చని వ్యాఖ్యలు
Hazarath Reddyఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ పరిణామాలపై సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ (Lakshmi Narayana on Kavitha Arrest) స్పందించారు.
Vanteru Venugopal Reddy Resigns YSRCP: వైసీపీకి రాజీనామా చేసిన కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని వెల్లడి
Hazarath Reddyనెల్లూరు జిల్లాలోని కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. పదేళ్లుగా వైసీపీలో ఉంటే సరైన గుర్తింపు లేదని, హీనంగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు
PM Modi Road Show in Malkajgiri: మల్కాజిగిరిలో ప్రధాని మోదీ రోడ్‌షో, భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. మల్కాజిగిరి రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. మల్కాజిగిరి, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన రోడ్‌షోకి భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ప్రధాని మోదీ రోడ్‌ షో మీర్జాలగూడ చౌరస్తా నుంచి ప్రారంభమైంది
Telangana Elections 2024: తెలంగాణకు కాంగ్రెస్ కరవును తెచ్చింది, సీఎం రేవంత్ రెడ్డి 10 రోజులకు ఒకసారి ఢిల్లీ వెళ్లడమే 100 రోజుల పాలన అంటూ హరీష్ రావు విమర్శలు
Hazarath Reddyకాంగ్రెస్‌ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తామని మోసం చేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట BRS ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఉపాధ్యాయుల డీఏలు చెల్లించలేదని తెలిపారు.
Yediyurappa Sex Assault Case: లైంగిక వేధింపుల కేసుపై స్పందించిన యడ్యూరప్ప, మా ఇంట్లో ఆ మహిళ నాకు వ్యతిరేకంగా మాట్లాడిందని, అందుకే కేసు పెట్టిందని వెల్లడి
Hazarath Reddyతన కూతురిపై యడ్యూరప్ప లైంగికదాడి చేశారని ఓ 17 ఏళ్ల బాలిక తల్లి బెంగళూరులోని సదాశివనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత బీఎస్‌ యడ్యూరప్పపై లైంగికదాడి కేసు పెట్టిన సంగతి విదితమే. దీంతో పోక్సో చట్టం కింద యడ్యూరప్పపై పోలీసులు కేసు నమోదు చేశారు
Lok Sabha Elections 2024 Dates: రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన, ప్రస్తుత లోక్‌సభకు జూన్‌ 16వ తేదీతో ముగియనున్న గడువు
Hazarath Reddyసార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా స్పందించింది. రేపు.. శనివారం(16 మార్చి) మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని.. ఈ మేరకు ప్రెస్‌మీట్‌ ఉంటుందని ఈసీఐ ప్రతినిధి ట్వీట్‌ ద్వారా తెలియజేశారు.
CAA: పౌరసత్వ సవరణ చట్టంపై స్టే విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్, మార్చి 19న విచారణ చేపడతామని తెలిపిన అత్యున్నత ధర్మాసనం
Hazarath Reddyపౌరసత్వ సవరణ చట్టం 2024 (సీఏఏ)పై స్టే విధించాలని దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మార్చి 19న విచారణ జరగనుంది. సిఎఎపై రాజ్యాంగ ధర్మాసనం ముందు విచారణ సందర్భంగా, కపిల్ సిబల్ మాట్లాడుతూ, అది ఇంకా అమలు కావడం లేదని ప్రభుత్వం చెప్పినందున కోర్టు దానిని వినలేదని అన్నారు.
New Election Commissioners: ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టిన సుఖ్‌బీర్‌, జ్ఞానేశ్‌కుమార్
Hazarath Reddyకేంద్ర ఎన్నికల కమిషనర్లు (Election Commissioners)గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ (Dr Sukhbir Singh Sandhu), జ్ఞానేశ్‌ కుమార్‌ (Gyanesh Kumar) నేడు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘానికి రాజీవ్‌ కుమార్‌ చీఫ్‌ కమిషనర్‌గా ఉన్నారు.
Andhra Pradesh Elections 2024: వైఎస్సార్‌సీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం, సీఎం జగన్‌ పాలనతోనే అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరుగుతుందని వెల్లడి
Hazarath Reddyసీనియర్‌ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్‌సీపీలో చేరారు. ముద్రగడతో పాటు ఆయన తనయుడు గిరి కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా.. వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉందని ముద్రగడ తెలిపారు.
Case Against BS Yediyurappa: నా కుమార్తెపై యడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.. బాలిక తల్లి ఫిర్యాదుతో కర్ణాటక మాజీ సీఎంపై పోక్సో కేసు నమోదు
Rudraకర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు బీఎస్‌ యడియూరప్పపై లైంగిక వేధింపుల కేసు నమోదయింది. ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి.
Petrol Diesel Price Down: వాహనదారులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్..లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధర రూ.2 తగ్గింపు
sajayaలోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని లీటరుకు రూ.2 తగ్గించి ప్రజలకు కొంత ఊరటనిచ్చింది. ఈ తగ్గింపు మార్చి 15, 2024 ఉదయం 6 గంటల నుండి వర్తిస్తుంది. ఈ తగ్గింపు తర్వాత దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.2 తగ్గనున్నాయి.
Mamata Banerjee Hospitalised: మమతా బెనర్జీ తలకు బలమైన గాయం, కోల్‌కతాలోని ప్రభుత్వ ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలొ చేరిన టీఎంసీ అధినేత్రి
Hazarath Reddyతృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerje)కి తీవ్ర గాయమైంది. ఆమె నుదుటిపై గాయానికి సంబంధించిన ఫొటోలను టీఎంసీ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. దీదీ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించాలని విజ్ఞప్తి చేసింది.
Telangana Elections 2024: మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి, అదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సక్కు, అధికారికంగా ప్రకటించిన బీఆర్ఎస్
Hazarath Reddyమరో రెండు లోక్‌సభ స్థానాలు మల్కాజ్‌గిరి, ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థులను బీఆర్‌ఎస్‌ పార్టీ తమ అభ్యర్ధులను ప్రకటించింది. ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సక్కును ప్రకటించగా.. మల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఫైనల్‌ చేసింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వీరిద్దరి పేర్లను అధికారికంగా నేడు వెల్లడించింది
Andhra Pradesh Elections 2024: టీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌, బీసీలకు జగన్ అన్యాయం చేశాడని మండిపాటు
Hazarath Reddyకర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌ టీడీపీలో చేరారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి సాదరంగా ఆయన్ను ఆహ్వానించారు. వైసీపీలో బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ కొద్దిరోజుల క్రితం ఆ పార్టీకి సంజీవ్‌కుమార్‌ రాజీనామా చేశారు. టీడీపీలో చేరిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.
Andhra Pradesh Elections 2024: పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్‌పై పోటీ చేస్తున్నానని తెలిపిన దర్శకుడు వర్మ, ట్విట్టర్ వేదికగా వెల్లడి
Hazarath Reddyదర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ పిఠాపురం నుంచి పోటీ చేస్టున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ హ్యాండిల్‌లో తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికి ఆర్జీవీ కూడా పిఠాపురం నుంచి పోటీకి దిగుతున్నట్లు వెల్లడించడం గమనార్హం. ‘ఇది ఆకస్మిక నిర్ణయం. నేను పిఠాపురం నుంచి పోటీకి దిగుతున్నా.
Andhra Pradesh Elections 2024: వైఎస్సార్‌సీపీలో చేరిన తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్
Hazarath Reddyపశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని(వెంకట మధుసూదనరావు) వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈలి నానికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్‌.2009లో తాడేపల్లిగూడెం నుంచి ప్రజారాజ్యం(పీఆర్పీ) తరఫున పోటీ చేసి గెలుపొందిన ఈలి నాని.. ఆపై టీడీపీలో చేరిపోయారు. తాడేపల్లిగూడెం టీడీపీ ఇంచార్జ్‌గా కూడా ఈలి నాని పని చేశారు.
Andhra Pradesh Elections 2024: ఈ సారి 121 సీట్లతో మళ్లీ వైసీపీ అధికారంలోకి, స్పష్టం చేసిన పొలిటికల్‌ క్రిటిక్‌ సర్వే, టీడీపీ- జనసేన-బీజేపీకి 54 స్థానాలు వస్తాయని వెల్లడి
Hazarath Reddyరానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే హవా అని మరో సర్వే స్పష్టం చేసింది. పొలిటికల్‌ క్రిటిక్‌ సర్వేలో మొత్తం 175 సీట్లలో 121 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. అలాగే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 54 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తేల్చి చెప్పింది.
Andhra Pradesh Elections 2024: పిఠాపురంలో టీడీపీ జెండాలను తగలబెట్టిన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ ప్రకటనతో భగ్గుమన్న తెలుగు తముళ్ళు వీడియోలు ఇవిగో.
Hazarath Reddyకాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ ప్రకటనతో టీడీపీలో అసమ్మతి సెగ రేగింది. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను ఎన్‌వీ‌ఎస్‌ఎన్ వర్మ అనుచరులు దహనం చేశారు. వర్మను పార్టీ మోసం చేసిందంటూ నినాదాలు చేశారు. వర్మ ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని అనుచరులు ఆందోళన చేపట్టారు