Politics

Buragadda Vedavyas: చంద్రబాబు నమ్మక ద్రోహం చేశారు, పెడనలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి నేనేంటో చూపిస్తానంటూ బూరగడ్డ వేదవ్యాస్ సవాల్

Hazarath Reddy

చంద్రబాబు నమ్మించి మోసం చేస్తాడనుకోలేదంటూ వేదవ్యాస్‌ మండిపడ్డారు. నాకు టీడీపీ, జనసేన కార్యకర్తల మద్దతు నాకే ఉంది. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా.. గెలిచే సత్తా నాకుంది’’ అని వేదవ్యాస్ పేర్కొన్నారు.ఇక పెడన సీటు జనసేనకు కేటాయించకపోవడంపై..మాకు అన్యాయం జరిగిన చోట మేం ఉండలేం అంటూ కృత్తివెన్ను,గూడూరు,పెడన, బంటుమిల్లి మండల పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీకి రాజీనామా చేశారు.

TDP-Janasena's First List: రాజకీయాలు మన కళ్లముందే మారిపోయాయి, టీడీపీ-జనసేన తొలి జాబితాపై ఆగ్రహం వ్యక్తం చేసిన మండలి బుద్ధ ప్రసాద్

Hazarath Reddy

టీడీపీ-జనసేన ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాలో తన పేరు లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పేరు ప్రకటించనందుకు నేను మహదానందంగా ఉన్నానని.. పంజరంలోంచి బయటకు వచ్చిన పక్షిలాగా స్వేచ్ఛాస్వాతంత్య్రాలు పొందినట్లుగా ఉందంటూ వ్యాఖ్యానించారు

Etela Rajender: కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కేంద్రంలో రాష్ట్రంలో సుపరిపాలన కావాలంటే నరేంద్ర మోడీ నాయకత్వానికి మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరిస్తే రాజకీయాల నుండి తప్పకుంటానని ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు.

CBI-Arvind Kejriwal: కేజ్రీవాల్‌ను త్వరలో అరెస్టు చేసేందుకు సీబీఐ రెడీ అవుతోంది, ఈ సాయంత్రం నోటీసులు ఇస్తుందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మరికొద్ది రోజుల్లో అరెస్టు చేసేందుకు సీబీఐ యోచిస్తోందని, సాయంత్రంలోగా ఆయనకు నోటీసులు అందజేస్తుందని ఆప్ శుక్రవారం పేర్కొంది.

Advertisement

Rahul Gandhi Defamation Case: రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టులో ఎదురుదెబ్బ, ప‌రువున‌ష్టం కేసును కొట్టివేయాల‌నే అభ్యర్థనను తిరస్కరించిన ధర్మాసనం

Hazarath Reddy

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి జార్ఖండ్ హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. త‌న‌పై న‌మోదు అయిన నేరాభియోగ ప‌రువున‌ష్టం కేసును కొట్టివేయాల‌ని రాహుల్ గాంధీ పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను జార్ఖండ్ హైకోర్టు తిర‌స్క‌రించింది. కేంద్ర మంత్రి అమిత్ షా ఓ హ‌త్య కేసులో నిందితుడ‌ని గ‌తంలో రాహుల్ గాంధీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆరోపించిన సంగతి విదితమే.

Balineni Srinivasa Reddy: వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో క్లీన్ స్వీప్ చేసి జగన్‌కు కానుకగా ఇస్తాం, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో గెలిచి సీఎంకు కానుకగా అందిస్తామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజ‌రైన‌ సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఒంగోలులో పేదలకు సొంత ఇంటి కల సాకారం చేసిన జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Manohar Joshi Passes away: మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్‌ జోషి కన్నుమూత.. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో లోక్‌సభ స్పీకర్‌గానూ సేవలు

Rudra

మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్‌ జోషి (86) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురైన ఆయన ముంబయిలోని పీడీ హిందుజా హాస్పిటల్ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

Congress Chalo Secretariat Protest: షర్మిల అరెస్ట్, వెంటనే విడుదల, ఒక్కహామీని నెరవేర్చని జగన్ వైఎస్‌ఆర్‌ వారసుడినని ఎలా ప్రకటించుకుంటారని మండిపాటు

Hazarath Reddy

మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ఏపీ కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది

Advertisement

Survey- PM Modi Most Popular Leader of World: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడుగా ప్రధాని మోదీ, మార్నింగ్ కన్సల్ట్ సర్వేలో వెల్లడి

Hazarath Reddy

Congress Chalo Secretariat Protest: 23 వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి 6 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారు, మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేశారంటూ షర్మిల నిరసన

Hazarath Reddy

మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమానికి ఏపీ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సహా నేతలను పోలీసులు పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లోనే హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ షర్మిల సహా పలువురు నేతలు కార్యాలయం వెలుపల బైఠాయించి నిరసన తెలిపారు.

Lok Sabha Elections 2024: యూపీలో స‌మాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య కుదిరిన పొత్తు, 17 సీట్లలో కాంగ్రెస్ పోటీ, మిగతా 63 సీట్లలో కూటమి అభ్యర్థులు పోటీ

Hazarath Reddy

రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఉత్తర ప్రదేశ్ లో స‌మాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ల మ‌ధ్య పొత్తు ఖ‌రారైంది. ఇండియా విప‌క్ష కూట‌మిలో భాగంగా ఇరు పార్టీలు ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీచేస్తాయ‌ని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ ప్ర‌క‌టించారు. పొత్తులో భాగంగా యూపీలో 17 ఎంపీ సీట్ల‌ను కాంగ్రెస్‌కు కేటాయించేందుకు అఖిలేష్ సంసిద్ధ‌త వ్య‌క్తం చేశారు.

Vemireddy Prabhakar Reddy Resigns YSRCP: వైసీపీతో పాటు ఎంపీ పదవికి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా, వ్యక్తిగత కారణాల వల్లే వైసీపీని వీడుతున్నట్లు ప్రకటన

Hazarath Reddy

నెల్లూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా (Vemireddy Prabhakar Reddy Resigns YSRCP) చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

CM Jagan Hugs RK Video: వీడియో ఇదిగో, ఆర్కేని ఆత్మీయంగా కౌగిలించుకున్న సీఎం జగన్, మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ గెలుపునకు పనిచేస్తానని హామీ

Hazarath Reddy

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో మళ్లీ వైసీపీలో చేరారు. ఆర్కేకు కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆత్మీయంగా కౌగిలించుకున్నారు

Chandigarh Mayoral Election Results 2024: చండీగఢ్ మేయర్‌ ఎన్నిక వివాదంలో బీజేపీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు, ఆప్ అభ్యర్థే మేయర్ అని స్పష్టం చేసిన అత్యున్నత ధర్మాసనం

Hazarath Reddy

చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో (Chandigarh Mayoral Election Results 2024) ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుల్దీప్‌ కుమారే చట్టబద్ధమైన విజేత ( AAP Councillor Kuldeep Kumar Winner of Mayoral Poll) అని నిర్ధారించింది. రిటర్నింగ్‌ అధికారి అనిల్‌ మాషి కొట్టివేసి చెల్లనివిగా ప్రకటించిన 8 ఓట్లు ఆప్‌ అభ్యర్థికే పడినట్లు గుర్తించింది.

PM Modi Jammu Visit: కొత్తగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన 1500 మందికి అపాయింట్‌మెంట్ ఆర్డర్‌లను పంపిణీ చేసిన ప్రధాని మోదీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జమ్మూ కాశ్మీర్‌లో కొత్త ప్రభుత్వ నియామకాలకు ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ ఆర్డర్‌లను పంపిణీ చేశారు. ప్ర‌ధాన మంత్రి ఈరోజు దాదాపు 1500 మంది కొత్త గ‌వ‌ర్న‌మెంట్ రిక్రూట్‌మెంట్స్‌కి అపాయింట్‌మెంట్ ఆర్డర్‌లను పంపిణీ చేసారు.

PM Modi Jammu Visit: జమ్ముకశ్మీర్‌ రాజవంశాల వల్ల నష్టపోయింది, వారు ప్రజల గురించి ఆలోచించడం మానేసారని తెలిపిన ప్రధాని మోదీ

Hazarath Reddy

జమ్మూ కశ్మీర్‌లో ఈ రోజు ప్రధాని మోదీ పర్యటించారు. అక్కడ 32 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రారంభించారు. కొన్నేళ్లుగా జమ్ము కశ్మీర్‌ను ఎవరూ పట్టించుకోలేదని.. ఇవాళ ఇక్కడి నుంచి అభివృద్ధి పనుల్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Advertisement

PM Modi on Article 370: జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు,అభివృద్ధికి అడ్డుగా ఉన్న గోడను బద్దలు కొట్టామని తెలిపిన ప్రధాని

Hazarath Reddy

జమ్మూ కశ్మీర్‌లో ఈ రోజు ప్రధాని మోదీ పర్యటించారు. అక్కడ 32 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రారంభించారు.ఆర్టికల్ 370ని ప్రధాని మోదీ గోడతో పోల్చారు. ఆ గోడను బీజేపీ(BJP) ప్రభుత్వం తొలగించిందని చెప్పారు

PM Modi Jammu Visit: జమ్మూ కశ్మీర్‌లో రూ. 32 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేసిన ప్రధాని మోదీ, బీజేపీ 370 సీట్లు గెలవడంలో పాత్రులు కావాలని ప్రజలకు పిలుపు

Hazarath Reddy

జమ్మూ కశ్మీర్‌లో ఈ రోజు ప్రధాని మోదీ పర్యటించారు. అక్కడ 32 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. కొన్నేళ్లుగా జమ్ము కశ్మీర్‌ను ఎవరూ పట్టించుకోలేదని.. ఇవాళ ఇక్కడి నుంచి అభివృద్ధి పనుల్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Alla Ramakrishna Reddy Joins YSRCP: ఇంకో 30 ఏళ్ల పాటు సీఎంగా జగన్ ఉండాలి, వైసీపీలో చేరిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు, ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తానని వెల్లడి

Hazarath Reddy

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో మళ్లీ వైసీపీలో చేరారు. ఆర్కేకు కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. తన సోదరుడు, ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఆర్కే వెళ్లారు.

Andhra Pradesh Elections 2024: వైఎస్సార్‌సీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి, కండువా కప్పి ఆర్కేను పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి

Hazarath Reddy

గత ఏడాది రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్సార్‌సీపీ గూటికి చేరారు. మంగళవారం మధ్యాహ్నం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. సీఎం జగన్‌ కండువా కప్పి ఆర్కేను పార్టీకి ఆహ్వానించారు.

Advertisement
Advertisement