Formula-E Race case.. ACB notices to KTR(X)

Hyderabad, Jan 6: ఫార్ములా-ఈ కారు రేసు (Formula-E Car Race) కేసులో బీఆర్ఎస్ (BRS) కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విచారణ కోసం ఏసీబీ ఆఫీసుకు చేరుకున్నారు. ఉదయం పది గంటలకు ఆయన అధికారుల ఎదుటకు వచ్చారు.  అయితే, తనతో పాటు న్యాయవాదిని లోపలి అనుమతించట్లేదని కేటీఆర్ నిరసన వ్యక్తం చేస్తారు. కాగా..  కేటీఆర్ ను అధికారులు దాదాపు 40 ప్రశ్నలు వేయనున్నట్టు సమాచారం.  ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి ‌సహా 100 మంది బీఆర్‌ఎస్‌ నేతలను ముందస్తు హౌస్ అరెస్ట్‌ చేశారు.  కాగా, తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్‌ పై తీర్పును కోర్టు రిజర్వు చేసింది. అయితే, తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్‌ ను అరెస్ట్ చేయవద్దని, కాకపోతే విచారణను మాత్రం కొనసాగించవచ్చని కోర్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో 6న ఉదయం 10 గంటలకు విచారణకు రావాల్సిందిగా కేటీఆర్‌ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది.

‘ఫార్ములా-ఈ’ కేసులో నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్.. రేపు ఈడీ విచారణ కూడా..

LIVE Video Here:

ఈడీ ముందు కూడా

ఇదే ఫార్ములా-ఈ కారు రేసు కేసులో రేపు (7న) తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేటీఆర్‌ కు సమన్లు జారీచేసింది. మరి ఆయన రేపు ఈడీ ముందు హాజరు అవుతారా? లేదా? అని తెలియాల్సి ఉంది.

కొండపైకి కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్.. ఇద్దరు మృతి.. తిరుమలలో ఘటన