astrology

మనం జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైన పండుగలో మకర సంక్రాంతి ఉంటుంది. ఈ రోజున సూర్యభగవాన్ని పూజిస్తారు.సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు దాన్ని మకర సంక్రాంతి అని అంటారు. మంగళవారం జనవరి 14న సూర్యుడు ఉదయం 9 గంటలకు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి- మేషరాశి వారికి సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల అన్ని సానుకూల ఫలితాలు ఉంటాయి. 2020 సంవత్సరంలో వీరికి అన్ని మంచి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ ల భిస్తుంది. జీతం రెట్టింపు అవుతుంది విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార ప్రయత్నాలు తగిన ఫలితాలను అందిస్తాయి. విదేశాల్లో వ్యాపారాన్ని విస్తరించి మీరు చేయాలనుకున్న కల నెరవేరుతుంది. మకర సంక్రాంతి రోజున సూర్యభగవాని అనుగ్రహంతో మీరు అన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...

కుంభరాశి- కుంభ రాశి వారికి మకర సంక్రాంతి నుంచి అన్ని సానుకూల ఫలితాలు ఉంటాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి వ్యాపారంలో ఆర్థిక లాభాలు పెరుగుతాయి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం ఉత్సాహం పెరుగుతుంది ప్రేమ వివాహాలకు అనుకూలం వివాహం కాని వారికే వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు మీ స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటే ఆకల నెరవేరుతుంది నూతన గృహాన్ని కొనుగోలు చేయాలనుకున్న కదా నెరవేరుతుంది.

వృశ్చిక రాశి- వృశ్చిక రాశి వారికి మకర సంక్రాంతి నుంచి అన్ని శుభ ఫలితాలు ఉంటాయి. సూర్య భగవానుని దయతో మీకు అన్ని కోరికలు నెరవేరుతాయి. జీవిత భాగస్వామితో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. తమకు నచ్చిన సంస్థలో పనిచేసే అవకాశం లభిస్తుంది. వ్యాపారవేత్తలకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు మంచి కళాశాలలో ప్రవేశం పొందే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. అన్నదమ్ముల మధ్య సచ్చట ఏర్పడుతుంది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే వివాహం కాని వారికి వివాహమయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లాలనుకునే కదా నెరవేరుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.