Newdelhi, Jan 3: పబ్ జీ (PUBG On Railway Track) ఆట మీద ఉన్న పిచ్చి ఆ ముగ్గురు టీనేజర్ల ప్రాణాలను బలిగొంది. బీహార్ (Bihar) లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. జిల్లాకు చెందిన ముగ్గురు కుర్రాళ్లు.. మాన్సా తోలా ప్రాంతంలో రైలుపట్టాలపై పబ్ జీ ఆడుతున్నారు. చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఉండటంలో రైలు వస్తున్న సంగతిని వారు గుర్తించలేదు. దీంతో వేగంగా వచ్చిన ట్రైన్ వారిపైనుంచి వెళ్లిపోయింది. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను గుమ్టి నివాసి ఫుర్కాన్ ఆలం, మన్షా తోలాకు చెందిన సమీర్ ఆలం, బారి తోలా నివాసి హబీబుల్లా అన్సారీగా గుర్తించారు.
సిరియా మాజీ అధ్యక్షుడిపై విషప్రయోగం, రష్యా పర్యటనలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిన నేత
వాళ్ళని చూస్కోండి
పిల్లల గేమింగ్ అలవాట్లపై, వారి ప్రవర్తనపై పేరెంట్స్ పర్యవేక్షించాలని పోలీసులు బాధితుల తల్లిదండ్రులను కోరారు. భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలను జరగకుండా బహిరంగ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.