Health & Wellness

Covaxin Fact Sheet: ఈ సమస్యలు ఉంటే వ్యాక్సిన్ తీసుకోవద్దు, ఫ్యాక్ట్ షీట్‌ను రిలీజ్ చేసిన భార‌త్‌ బ‌యోటెక్, టీకా తీసుకున్న ప్రాంతంలో నొప్పి, వాపు, దుర‌ద వ‌చ్చే అవ‌కాశాలు

Hazarath Reddy

కోవాగ్జిన్ టీకాపై విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో భార‌త్‌ బ‌యోటెక్ ఫార్మా సంస్థ ఫ్యాక్ట్ (Covaxin Fact Sheet) రిలీజ్ చేసింది. తాజాగా రిలీజ్ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల్లో.. ఎవ‌రు టీకా తీసుకోవాలి, ఎవ‌రు తీసుకోవ‌ద్దు అనే అంశంపై క్లారిటీ (Covaxin Advisory) ఇచ్చింది. బ‌ల‌హీన‌మైన ఇమ్యూనిటీ ఉన్న వారు, రోగ‌నిరోధ‌క శ‌క్తి వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం చూపే మందులు వాడేవారు, అల‌ర్జీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు .. కోవాగ్జిన్ టీకాను తీసుకోరాదు అని భార‌త్ బ‌యోటెక్ సంస్థ త‌న ఫ్యాక్ట్ షీట్‌లో వార్నింగ్ ఇచ్చింది.

Covid Scare: గాలిలో తిష్ట వేసిన కరోనావైరస్, కోవిడ్‌ వార్డుల్లోని గాలిలో వైరస్‌ ఆనవాళ్లను కనుగొన్న సీసీఎంబీ, వైరస్‌ కొంత కాలమైనా గాల్లో ఉండగలదని తెలిపిన సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా

Hazarath Reddy

కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా కల్లోలం రేపిన నేపథ్యంలో కొత్త కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి. తాజాగా కోవిడ్ వైరస్‌ గాలిలో ప్రయాణించగలదని ( airborne transmission) హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) (CSIR-CCMB study) ప్రకటించింది.

'Dawai Bhi, Kadaai Bhi': '2021లో మన మంత్రం దవాయి భీ, కడాయి భీ' అవ్వాలి.. కరోనా విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు, వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నట్లు వెల్లడి

Team Latestly

ఇదిలా ఉంటే ప్రధాని వ్యాక్సిన్ పంపిణీ తుది దశకు చేరుకున్నట్లు వెల్లడించిన కొద్దిసేపటి తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీపై తాజాగా సమాచారం వెళ్లింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు యూటీలు సమర్థవంతంగా టీకా పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని సర్క్యులర్ జారీ అయింది.....

New Covid Strain Symptoms: కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ లక్షణాలు ఏంటి? ఎలా గుర్తించాలి ? యూకేను వణికిస్తున్న కొత్త కోవిడ్ స్ట్రెయిన్, ఆ దేశానికి రాకపోకలు అన్నీ బంద్

Hazarath Reddy

కొత్త కరోనావైరస్ ని ఎలా గుర్తించాలినే దానికి బ్రిటన్ అత్యున్నత వైద్య సంస్థ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్ హెచ్ఎస్) కొన్ని లక్షణాలను (New Coronavirus variation symptoms) వెల్లడించింది.

Advertisement

Mucormycosis: దేశంలో కరోనా కన్నా ప్రమాదకరమైన వ్యాధి బయటకు, ముకోర్మైకోసిస్ వ్యాధితో 9 మంది మృతి, 44 మంది ఆస్పత్రిలో.. అహ్మదాబాద్‌ని వణికిస్తున్న మ్యూకర్‌మైకోసిస్‌ ఫంగస్

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ (Covid-19 pandemic) కల్లోలం రేపుతున్న నేపథ్యంలో మరో కొత్త వైరస్ గుజరాత్ ప్రధాన నగరం అహ్మదాబాద్‌ను వణికిస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్ పై ఆశలు చిగురిస్తున్న తరుణంలో మరో అంతుచిక్కని వ్యాధి కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. మ్యూకర్‌మైకోసిస్‌ (Mucormycosis) అనే ఫంగస్‌ బారీన పడి అహ్మదాబాద్‌లో (Another Disease Hits Ahmedabad) 9 మంది మృతి చెందగా, 44 మంది ఆస్పత్రి పాలయ్యారు.

COVID Vaccination: భారత్‌లో త్వరలోనే అందుబాటులోకి రానున్న కొవిడ్ వ్యాక్సిన్, టీకా పంపిణీపై మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం, తొలి దశలో ఆరోగ్య సిబ్బందికి ప్రాధాన్యం

Team Latestly

భారతదేశంలో కొవిడ్19కు వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానునట్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఇందుకు తగినట్లుగా టీకా పంపిణీపై కేంద్రం ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తుంది. తాజాగా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం వివరణాత్మక మార్గదర్శకాలు విడుదల చేసింది.....

PM Modi on Vaccine: మరికొన్ని వారాల్లోనే కొవిడ్19కు వ్యాక్సిన్ వచ్చేస్తుంది, అఖిలపక్షంతో సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన, మొదటి దశలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు, వృద్ధులకు ప్రాధాన్యం

Team Latestly

వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయని మోదీ అన్నారు. వ్యాక్సిన్ ధరపై రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన తర్వాతే కేంద్రం ఒక నిర్ణయానికి వస్తుందని మోదీ తెలిపారు. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ నిర్ణయాలు తీసుకుంటామని మోదీ అన్నారు...

Moderna COVID-19 Vaccine: వ్యాక్సిన్‌పై చిగురిస్తున్న కొత్త ఆశలు, మోడెర్నా వ్యాక్సిన్ 94.5 శాతం సమర్థత ప్రదర్శించినట్లు తెలిపిన మోడెర్నా ఇంక్‌, ఫైజర్ వ్యాక్సిన్ సక్సెస్ రేటు 90 శాతం

Hazarath Reddy

కరోనా వ్యాధి రాకుండా నిరోధించటంలో తమ టీకా 94.5 శాతం సమర్థత ప్రదర్శించినట్లు అమెరికా బయోటెక్నాలజీ సంస్థ మోడెర్నా ఇంక్‌ (Moderna ink) వెల్లడించింది. ఇటీవలే అమెరికా ఫార్మ ఫైజర్-జర్మన్ సంస్థ బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకా 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Dhanteras 2020: ధనత్రయోదశి అంటే బంగారం కొనుగోలు చేయడమే కాదు, దాని అసలు విశిష్టత మరొకటి ఉంది, కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ ధనత్రయోదశికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోండి

Team Latestly

ఇక్కడ మనం ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, నేటి సమాజం పూర్తిగా మరిచిపోయిన విషయం ఏమిటంటే.. ధన్వంతరి తన చేతిలో రాగి కలశంతో ఉద్భవించిన మూలానా, ఈరోజున రాగి వస్తువులను సంపాదించుకోవడం నుంచి అది క్రమక్రమంగా బంగారు, వెండి వస్తువులు కొనుగోలు చేసేవరకు వచ్చింది....

VEXAS: మగవారిని మాత్రమే చంపేస్తోన్న కొత్త వ్యాధి, అంతుచిక్కని వ్యాధికి వెక్సాస్ సిండ్రోమ్‌గా నామకరణం చేసిన సైంటిస్టులు, అమెరికాలో పలువురు మృత్యువాత

Hazarath Reddy

ప్రపంచం కోవిడ్ తో అల్లాడుతుంటే మరో కొత్త వ్యాధి కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. మగవారిని మాత్రమే ప్రభావితం చేస్తున్న కొత్త ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ను సైంటిస్టులు కనుగొన్నారు. దీనికి ‘వెక్సాస్ సిండ్రోమ్’గా (VEXAS syndrome) నామకరణం చేశారు. జన్యుపరమైన ఈ వ్యాధితో అమెరికాలో చాలా మంది మగవారు మృతి చెందారు. అయితే దానికి సంబంధించిన కారణాలు ఇప్పటి వరకు తెలియలేదు.

PM Modi Speech: 'లాక్ డౌన్ ముగిసిపోవచ్చు, కానీ కరోనావైరస్ ఇంకా అలాగే ఉంది.. తస్మాత్ జాగ్రత్త' ; పండగలు ముందున్న వేళ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కొవిడ్‌పై హెచ్చరించిన ప్రధాని మోదీ

Team Latestly

ఇప్పుడు చాలా మంది అసలు కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవడమే మానేశారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ముసుగు లేకుండా బయట తిరగడం ద్వారా, మిమ్మల్ని మీరే కాకుండా మీ కుటుంబం, మీ పిల్లలు, వృద్ధులు మరియు సమాజాన్ని చాలా ప్రమాదంలో పడేస్తున్నారు....

Netherlands New Law: వ్యాధి నయం కాని పిల్లల్ని చంపేయండి, కొత్త చట్టాన్ని రూపొందించిన డచ్‌ ప్రభుత్వం, వైద్యరంగంలో తీవ్రమైన చర్చకు దారి తీసిన నెదర్లాండ్స్‌ ప్రభుత్వ నిర్ణయం

Hazarath Reddy

నెదర్లాండ్స్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో ఏ దేశం సాహపం చేయని విధంగా ఈ నిర్ణయం ఉంది. డచ్‌ ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త చట్టం (Netherlands New Law) ప్రకారం తీవ్రమైన జబ్బుకు గురై కోలుకునేందుకు అవకాశం లేని ఒకటి నుంచి 12 ఏండ్ల వయసులోని చిన్నారులను (Terminally Ill Children) నిర్దాక్షిణ్యంగా చంపేయాలని చెబుతోంది. నయం చేయలేని లేదా తీవ్రంగా అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల జీవితాలను అంతం చేయడానికి (Doctors to Help End Lives) నెదర్లాండ్స్ యొక్క డచ్ ప్రభుత్వం ఈ చట్టం సాయంతో వైద్యులకు అనుమతి ఇచ్చింది.

Advertisement

‘Beware Unmarried Men’: పెళ్లి కాని మగవారికి కరోనా మరణం రిస్క్ ఎక్కువట, సంచలన విషయాలు వెల్లడించిన స్వీడెన్‌లోని స్టాక్‌హోమ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, నేచర్ కమ్యూనికేషన్స్ పత్రికలో వ్యాసం ప్రచురణ

Hazarath Reddy

వివాహం ఆరోగ్యకరమైన జీవితాన్ని కలిగిస్తుంది, అయితే ఈ మహమ్మారి సమయంలో పెళ్లి కాని వారిపై (Unmarried Men) దిమ్మ తిరిగే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఒక కొత్త అధ్యయనం ప్రకారం, అవివాహితుడిగా ఉండటం వల్ల COVID-19 తో చనిపోయే ప్రమాదం ఉందట (Unmarried Men At Higher Risk Of Corona Death). దీనితో పాటు, తక్కువ ఆదాయం, తక్కువ స్థాయి విద్య మరియు తక్కువ లేదా మధ్య-ఆదాయ దేశాలలో జన్మించిన వ్యక్తి ఈ వ్యాధికి గురయ్యే ఇతర ప్రమాద కారకాలు అని స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు (Stockholm University in Sweden Study) హెచ్చరించారు.

Corona Rapid Test Update: కేవలం 10 నిమిషాల్లోనే కరోనా ఫలితం, కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసిన కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కరోనా లక్షణాలను గుర్తించడం ఎలాగో తెలుసుకోండి

Hazarath Reddy

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కల్లోలాన్ని రేపుతోంది. ఇంకా వ్యాక్సిన్ (Coronavirus Vaccine) అందుబాటులోకి రాకపోవడంతో ఇది ప్రజలను మరింతగా భయానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో అందరూ రెండు రోజులకొకసారి కరోనా టెస్ట్ చేయించుకుంటున్నారు. అయితే టెస్టులు చేయించుకున్న తరువాత రిపోర్ట్ రావడానికి చాలా సమయం తీసుకుంటుండంతో కొంచెం ఆందోళనగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పది నిమిషాల్లోనే గుర్తించే ఓ వినూత్న పరికరాన్ని (Corona Rapid Test Update) అభివృద్ధి చేయడంలో అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (California Institute of Technology) విజయం సాధించింది.

Coronavirus Spread: పొగ లాగా ఉండే తుంపర్లతో కరోనా, పాటలు పాడటం, అరవడం ద్వారా కరోనా వ్యాప్తి, వర్జీనియా టెక్‌ వర్సిటీ పరిశీలనలో వెల్లడి, భౌతిక దూరం ఆరడుగులకంటే ఎక్కువ ఉండాలని సూచన

Hazarath Reddy

కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో పరిశోధనలు కొత్త కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి. తాజాగా గాలి లేదా బయటి వాతావరణంలో ఉండిపోయే చిన్న తుంపర్లతోనూ కరోనా వైరస్‌ (Coronavirus) వ్యాప్తికి అవకాశాలున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. సిగరెట్‌ పొగ మాదిరిగా వ్యాప్తి చెందే సూక్ష్మస్థాయిలో ఉండే తుంపర్లు ఒకసారి వెలువడ్డాక అవి గాలిలోనే ఉండిపోతాయని వారు తెలిపారు. కరోనా సోకిన వారు దగ్గు, తుమ్ము, ముక్కు చీదడం, పాటలు పాడటం, అరవడం, మాట్లాడడం, (Singing or shouting) గాలి పీల్చుకోవడం, వదలడం వంటి చర్యల ద్వారా వివిధ సైజుల్లో వారి నుంచి వెలువడే తుంపర్లు కరోనాను మరింతగా వ్యాప్తి చేస్తాయని తెలిపారు.

Coronavirus Vaccines: ఆశలు రేపుతున్న 10 వ్యాక్సిన్లు ఇవే, నవంబర్ కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీలపై ఒత్తిడి తెస్తున్న అమెరికా, రేసులో ముందు వరసలో రష్యా వ్యాక్సిన్

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా 150 కి పైగా కరోనావైరస్ వ్యాక్సిన్లు (Coronavirus Vaccines) అభివృద్ధి చెందుతున్నాయి. కరోనా వ్యాప్తిని తగ్గించడానికి త్వరగా ఒకదాన్ని మార్కెట్లోకి తీసుకురావాలనే ఆశలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉన్నాయి. US ప్రభుత్వ ఆపరేషన్ వార్ప్ స్పీడ్ చొరవతో సహా, 10 బిలియన్ డాలర్ల ఖర్చుతో, జనవరి 2021 నాటికి 300 మిలియన్ మోతాదుల సురక్షితమైన, సమర్థవంతమైన కరోనావైరస్ వ్యాక్సిన్‌ను ( Dozens of Coronavirus vaccines) అభివృద్ధి చేసి పంపిణీ చేయడమే లక్ష్యంగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Advertisement

Snoring Increases COVID-19 Threat?: కొత్త షాకింగ్ న్యూస్..గురకపెట్టే కరోనా రోగుల ప్రాణాలకు మూడు రెట్లు ముప్పు ఎక్కువ, కరోనా వైరస్‌తో నిద్రకున్న సంబంధంపై పరిశోధనలు చేసిన వార్‌విక్‌ యూనివర్శిటీ శాస్ర్తవేత్తలు

Hazarath Reddy

కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ చుక్కలు చూపిస్తోంది. వ్యాక్సిన్ ఇంకా రాకపోవడంతో ఇది కల్లోలాన్ని రేపుతోంది. దీనిమీద పరిశోధనలు చేస్తున్న పరిశోధకులకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. తాజాగా మరో కొత్త న్యూస్ బయటకు వచ్చింది. కోవిడ్ (Covid) బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల్లో గురక పెట్టి పడుకునే వాళ్లు ఉన్నట్లయితే వారి ప్రాణాలకు మూడు రెట్లు ముప్పు ఎక్కువని (Snoring increases risk of Covid-19) పరిశోధకులు తేల్చారు.

Snoring Treatment: గురక పోవాలా..అయితే ఈ చిట్కా ఓ సారి ప్రయత్నించాల్సిందే, గురకను పోగొట్టడానికి లవర్ ముఖాన్ని నాకేసిన బాయ్‌ఫ్రెండ్, షాకయిన గర్ల్ ఫ్రెండ్

Hazarath Reddy

ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య గురక. నిదరలో తెలియకుండానే గురకలు పెడుతూ నిదరపోతుంటారు. అయితే వారికి అది తెలియకపోయినా పక్కవారు మాత్రం గురకతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇక భార్యా భర్తలయితే గురక దెబ్బకు ఫైటింగ్ చేసుకున్న వార్తలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఈ స్టోరీలో ఫైటింగ్ కాకుండా కొత్తగా ఆలోచించాడు లవర్ బాయ్ ఫ్రెండ్..

Brucellosis Disease: చైనాలో మళ్లీ వేల మందికి కొత్త వైరస్, జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, అవయవాల వాపు, సంతాన సాఫల్యతలకు కారణమవుతున్న బ్రూసిల్లోసిస్‌ బ్యాక్టీరియా, జంతువుల ద్వారా వ్యాప్తి

Hazarath Reddy

చైనాలో కొత్త బ్యాక్టీరియా వ్యాధి వెలుగు చూసింది. జంతువుల ద్వారా బ్రూసిల్లోసిస్‌ బ్యాక్టీరియా (Brucellosis outbreak in China) లాంజౌ నగరంలో తాజాగా బయటకు వచ్చింది. గత సంవత్సరం జంతువుల వ్యాక్సిన్లను తయారుచేసే ప్రభుత్వ యాజమాన్యంలోని బయోఫార్మాస్యూటికల్ ప్లాంట్ (Lanzhou Veterinary Research Institute) నుండి ఈ వైరస్ లీక్ అయింది. దీని ప్రభావంతో వాయువ్య చైనాలో వేలాది మంది బ్రూసిల్లోసిస్‌ బ్యాక్టీరియా వ్యాధిన (Brucellosis Disease) పడ్డారు. 3,245 మందికి బ్రూసెలోసిస్ బారిన పడ్డారని, ఇది తరచుగా సోకిన జంతువులతో లేదా జ్వరాలు, కీళ్ల నొప్పులు మరియు తలనొప్పిని కలిగించే జంతు ఉత్పత్తులతో సన్నిహితంగా ఉండటం వల్ల వస్తుందని లాన్జౌ నగరంలోని ఆరోగ్య అధికారులు తెలిపారు.

Russia's Covid Vaccine: రష్యా టీకా తీసుకున్నవారికి జ్వరం, కండరాల నొప్పులు, 21 రోజుల తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి రెండో డోసు టీకా , వెల్లడించిన రష్యా ఆరోగ్య శాఖ

Hazarath Reddy

కరోనా కల్లోలం నేపథ్యంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న రష్యా కరోనా టీకా (Russia's coronavirus vaccine) స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ భద్రతపై ఇప్పుడు అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఈ టీకా డోసులు (Sputnik V COVID-19 vaccine) తీసుకున్న ప్రతీ ఏడుగురు వాలంటీర్లలో ఒకరికి సైడ్‌ ఎఫెక్ట్‌లు వచ్చినట్టుగా రష్యా ఆరోగ్య శాఖ (Russia Health Ministry) వెల్లడించింది. మూడో దశ ప్రయోగాల్లో భాగంగా 40 వేల మందికి టీకా డోసులు ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. వారిలో ఇప్పటివరకు 300 మందికి వ్యాక్సిన్‌ ఇస్తే వారిలో 14 శాతం మందిలో ఇతర లక్షణాలు కనిపించాయి.

Advertisement
Advertisement