ఎక్కిళ్లు (Hiccups or hiccoughs) కూడా ఒక రకమైన దగ్గులాంటిదే. శరీరంలో ఛాతి భాగం మరియు కడుపు భాగం వేరుచేసే కండరం దగ్గర రాపిడి లేదా దురద కలిగినపుడు స్వరపేటిక దగ్గర ఇబ్బంది ఏర్పడి శబ్దాన్ని కలుగజేస్తుంది. వీటినే ఎక్కిళ్లు అంటారు, ఈ ఎక్కిళ్లు లయబద్ధంగా వస్తాయి.
ఎక్కిళ్లు చాలా మందిలో సర్వసాధారణమే అయినప్పటికి, అవి వచ్చినప్పుడు మనల్ని కుదురుగా ఉండనివ్వవు.
Hiccups Casues- ఈ ఎక్కిళ్లు రావటానికి ముఖ్య కారణాలు ఏంటంటే..
త్వరత్వరగా తినటం లేదా తాగటం.
ఎక్కువగా తినటం లేదా ఎక్కువగా తాగటం. ముఖ్యంగా స్పైసీ ఫుడ్ తినడం, సోడా లాంటి కార్బోనేటెడ్ పానీయాలు తాగటం, ఆల్కాహాల్ సేవించండం, పొగాకు త్రాగడం, చ్యూయింగ్ గమ్ నమలడం లాంటి అలవాటు ఉన్నప్పుడు.
గొంతు కండరాన్ని నియంత్రించే నాడీ వ్యవస్థలో సమస్యలు ఉండటం.
గుండెపోటు సమస్య ఉన్నవారికి.
బ్రెయిన్ ట్యూమర్ సమస్యలు ఉండటం.
కాలుష్యమైన గాలి లేదా వాయువులు పీల్చటం ద్వారా.
ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక మార్పు.
భయం లేదా ఉత్సాహం ఎక్కువైనపుడు.
జీర్ణవ్యవస్థకు సమస్యలకు సంబంధించి మెడిసిన్ తీసుకునేవారికి సైడ్ ఎఫెక్ట్ లుగా ఈ ఎక్కిళ్లు వస్తాయి. అయితే ఈ ఎక్కిళ్ల కొరకు ఇప్పటివరకు ఎలాంటి చికిత్స అందుబాటులో లేదు. కాకపోతే కొన్ని సులభమైన పద్ధతుల ద్వారా ఎవరికే వారే ఈ ఎక్కిళ్లు తగ్గించుకోవచ్చు. కింద చెప్పినట్లుగా చేసి చూడండి, ఎక్కిళ్లను అదుపులో ఉంచటానికి ఈ చిట్కాలు మంచి ఫలితాలను ఇచ్చాయి.
Hiccup Remedies & treatment:
పేపర్ బ్యాగులో తలదూర్చి శ్వాసించడం.
కొద్దిసేపు ఊపిరిని బిగపట్టడం ద్వారా.
చల్లటి నీటిని తాగుతూ ఉండటం ద్వారా.
చల్లటి నీటితో గొంతును గరగరళాడించడం ద్వారా.
ఒక గ్లాస్ నీటిని వెంటనే తాగేయటం.
నాలుకను కొద్దిసేపు బయటకు లాగి ఉంచడం.
ఒక అంచునుంచే నీటిని త్రాగటం లేదా శరీరాన్ని ముందుకు వంచి నీటిని త్రాగటం ద్వారా.
లవణాలను వాసన చూడటం.
తెలియకుండా ఎవరైనా భయాన్ని కలుగజేస్తే.
నిమ్మకాయని కొరకడం ద్వారా.
ఒకటిన్నర టీస్పూన్ చక్కెరను నోటిలో వేసుకొని దానిని మింగేయకుండా అలాగే నాలుక అంచున్న కొద్దిసేపు ఉంచడం.
అయితే కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కిళ్లు తగ్గవు. ఇలా ఎక్కిళ్లు ఎంతకీ తగ్గకపోవడం శరీరంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలను సూచిస్తుంది. కొన్నిసార్లు అది ప్రాణాంతకం కూడా కావొచ్చు. దీర్ఘకాలిక అలసట, బరువు కోల్పోవడం, కుంగుబాటు (డిప్రెషన్), గుండె లయలో తేడాలు, ఈసోఫాగల్ రిఫ్లక్స్ (ఆహరం మింగటంలో ఇబ్బందులు, జీర్ణ సమస్య, కడుపులో ఆయాసంగా అనిపించడం) లాంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు తీవ్రమైన ఎక్కిళ్లు వస్తే అది ప్రాణానికే ప్రమాదం. అలాంటి వారు శక్తినిచ్చే మంచి ప్రోటీన్, ఫైబర్ విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా పరిస్థితిని అదుపులోకి తీసుకురావచ్చు.
ఎక్కిళ్లు కొద్ది సమయం వరకు మాత్రమే ఉంటాయి. అయితే అదే పనిగా 3 గంటలకు పైబడి ఎక్కిళ్లు వస్తూ ఉంటే డాక్టర్ ను సంప్రదించడం మంచిది. అలాంటి అరుదైన సందర్భాల్లో తోరాజైన్ {Chlorpromazine (Thorazine)}, హాల్డాల్ {haloperidol (Haldol)}, రేగ్లాన్ {metoclopramide (Reglan)} లాంటి మందులను తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచిస్తారు.