Credits: Social Media

Kolkata, Jan 17: గంగాసాగర్‌లో (Gangasagar) పుణ్యస్నానానికి వెళ్లిన 600 మంది భక్తులు బంగాళాఖాతంలో (Bay of Bengal) చిక్కుకుపోయారు. పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) 24 పరగణాల జిల్లాలో జరిగిందీ ఘటన. హుగ్లీ నది బంగాళాఖాతంలో కలిసే చోటును గంగాసాగర్‌గా పిలుస్తుంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున లక్షలాదిమంది పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఈసారి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

తగ్గనున్న ఔషధాల ధరలు.. 128 రకాల ఔషధాల ధరలను సవరించిన ఎన్‌పీపీఏ.. సవరించిన ఔషధాల్లో యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు కూడా

గంగాసాగర్‌లో పుణ్యస్నానాల కోసం 600 మందికిపైగా యాత్రికులతో బయలుదేరిన రెండు నౌకలు.. ఎంవీ లచ్చమతి, ఎంవీ అగరమతి కాక్ ద్వీపం వద్ద చిక్కుకుపోయాయి. ద్వీపానికి సమీపంలో దట్టమైన పొంగమంచు, అలలు తక్కువగా ఉండడంతో నౌకలు కదల్లేకపోయాయి. దీంతో ఆదివారం రాత్రంతా యాత్రికులు అక్కడే ఉండిపోయారు. సమాచారం అందుకున్న కోస్టుగార్డు సిబ్బంది పడవలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఆత్మహత్యల కలకలం.. 24 గంటల వ్యవధిలో ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బంది సూసైడ్