West Semarang, July 19: ఇండోనేషియాలో ఓ ప్యాసింజర్ ట్రైన్ (Brantas collided with a trailer truck) ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక ప్యాసింజర్ గాయపడ్డాడు. వెస్ట్ సిమరాంగ్ లోని (West Semarang) జలన్ మదుకొరోలో (Jalan Madukoro) రైల్వే ట్రాక్ దాటుతున్న ట్రక్కును ప్యాసింజర్ ట్రైన్ ఢీకొట్టింది. బ్రంతాస్ పేరుగల ట్రైన్....ఆ ట్రక్కును దాదాపు 50 మీటర్లు లాక్కెల్లింది. ట్రైన్ ముందుభాగం...ట్రక్కును ఢీకొట్టిన వెంటనే మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదంలో ట్రైన్ లోకో పైలెట్ కు గానీ, ట్రక్కు డ్రైవర్ కు గానీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు.
Miraculous!!!! 🙏
A passenger train named #Brantas collided with a trailer truck on Jalan Madukoro in West #Semarang, Central #Java, #Indonesia.
The collision caused an explosion as the train's locomotive hit the truck's head. The truck was empty and dragged about 50 meters… pic.twitter.com/78Z2mvdrZK
— Volcaholic 🇰🇪 🇬🇧 🌋 (@volcaholic1) July 18, 2023
ట్రైన్ లో ఉన్న ఓ ప్రయాణికుడు మాత్రం భయంతో బ్రిడ్జి మీద నంచి కిందకు దూకడంతో గాయపడ్డాడు. ట్రైన్ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.