వైరల్

Jagan on Subbarayudu Murder Case: ఎస్ఐ సమక్షంలోనే సుబ్బారాయుడిని హత్య చేశారు, రాజకీయ కుట్ర లేకపోతే హత్య జరిగిన తర్వాత అడిషనల్‌ ఫోర్స్ ఎందుకు రాలేదని ప్రశ్నించిన వైఎస్ జగన్

Hazarath Reddy

వైఎస్‌ జగన్‌ నంద్యాలలో సీతారామపురంలో టీడీపీ గూండాల దాడితో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ఈ క్రమంలో వారి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం, వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల సమక్షంలోనే పెద్దసుబ్బారాయుడిని చంపేశారు.

Love Marriage: థియేటర్‌లో ప్రేమ పెళ్లి, మురారి సినిమా రీ రిలీజ్ సందర్భంగా పెళ్లి చేసుకున్న ప్రేమ జంట, వీడియో వైరల్

Arun Charagonda

ప్రిన్స్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఇవాళ మురారి మూవీ రిలీజ్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో థియేటర్ల ముందు యువతుల డ్యాన్స్ వైరల్‌గా మారింది. ఇక ఓ థియేటర్‌లో ప్రేమ జంట పెళ్లి చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Shahjahanpur Horror: దారుణం, ఇటుకతో భర్త తలను పగలగొట్టి చంపిన భార్య, అయినా కోపం చల్లారక మృతదేహం పైన కూర్చుని.., వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో దారుణమైన ఘటనలో గాయత్రీ దేవి అనే మహిళ ఆగస్టు 8న హథోడా బుజుర్గ్ గ్రామంలో తన భర్త సత్యపాల్‌ను ఇటుకతో తలను పగులగొట్టి దారుణంగా హత్య చేసింది. వాగ్వాదం సమయంలో హింస చెలరేగింది, అది శారీరక వాగ్వాదానికి దారితీసింది.

Viral Video: అదృష్టవంతుడు అంటే ఇతడే, రైలు మీద నుంచి పోయినా క్షేమంగా బయటపడ్డాడు, పుల్లుగా తాగి రైలు పట్టాల మధ్యలో నిద్రపోయిన మందుబాబు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో గురువారం రైలు ట్రాక్‌పై నిద్రిస్తున్న మద్యం మత్తులో ఒక వ్యక్తి అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. నివేదికల ప్రకారం, తెల్లవారుజామున 3:30 గంటలకు, బిజ్నోర్ నగరంలోని అడంపూర్ రైల్వే క్రాసింగ్ వద్ద ఒక వ్యక్తి రైలును ఢీకొట్టి ఉండవచ్చని రైలు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement

Uttar Pradesh: వీడియో ఇదిగో, అటెండెన్స్ కావాలంటే అక్కడ ముద్దుపెట్టాలని డిమాండ్ చేసిన శాడిస్ట్ టీచర్, మహిళా ఉపాధ్యాయురాలు ఏమన్నదంటే..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లో డిజిటల్ హాజరు వ్యవస్థ ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆందోళన కలిగించే ప్రధాన సమస్యగా ఉంది. ఉన్నావ్‌కు చెందిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన హాజరు గుర్తుగా ఒక మహిళా టీచర్‌ను 'ముద్దు' అడుగుతున్నట్లు చూపిస్తుంది

Delhi Horror: అందరికీ న్యాయం చెప్పే.. న్యాయస్థానం ప్రాంగణంలోనే మహిళపై లైంగిక దాడి.. ఘాతుకానికి పాల్పడ్డ న్యాయవాదిపై కేసు

Rudra

అందరికీ న్యాయం చెప్పే న్యాయస్థానం ప్రాంగణంలోనే ఓ మహిళపై లైంగిక దాడి జరిగింది. న్యాయం కోసం పోరాడే ఓ న్యాయవాదే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

Karnataka Horror: కాళ్ల పారాణి ఆరకముందే.. పెళ్లైన రోజే విగతజీవులైన నవ దంపతులు.. ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ.. భార్యను కొడవలితో నరికిన భర్త.. అనంతరం తనూ ఆత్మహత్య.. కర్ణాటకలో దారుణం

Rudra

‘కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు హత్య’ అంటూ పోకిరి సినిమాలో షాయాజీ షిండే ఓ సీన్ లో డైలాగ్ చెప్తాడు. సినిమాలో ఏమో గానీ.. కర్ణాటక రాష్ట్రం కోలార్ గోల్డ్ ఫీల్డ్‌ లోని చంబరసనహళ్లి గ్రామంలో బుధవారం ఇలాంటి ఘటనే జరిగింది.

Husband Built Temple For Deceased Wife: మరణించిన భార్యకు గుడి కట్టించిన భర్త.. మహబూబాబాద్ జిల్లాలో ఘటన (వీడియో)

Rudra

వివాహం అనేది పవిత్రమైన బంధం. పెళ్లి అనే ఒక్క కారణంతో కన్నవాళ్ళను సైతం వదిలిపెట్టి భర్తే సర్వస్వం అని భావించి, తనతో జీవితాంతం బతుకడానికి ప్రతీ భార్య మెట్టింటికి వస్తుంది.

Advertisement

PM Modi’s DP National Flag: ‘హర్ ఘర్ తిరంగా’లో భాగం కండి.. మీ ప్రొఫైల్ పిక్‌ గా జాతీయ జెండాను పెట్టుకోండి.. జాతి జనులకు ప్ర‌ధాని మోదీ పిలుపు

Rudra

స్వాతంత్ర్య దినోత్స‌వం సమీపిస్తున్న నేపథ్యంలో హ‌ర్‌ ఘ‌ర్‌ తిరంగా ను గుర్తిండిపోయే ఈవెంట్‌ గా మార్చుకుందామంటూ ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ జాతి జనులకు పిలుపునిచ్చారు.

Telangana New Ration Cards: తెలంగాణవాసులకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డుల జారీపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్‌

Rudra

కొత్త రేషన్ కార్డుల కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్న తెలంగాణవాసులకు గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను వేర్వేరుగా జారీ చేయడానికి, అర్హులు ఎంపికకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Nag Panchami 2024: నేడు నాగ పంచమి.. ఈ పర్వదినంనాడు మీ బంధువులకు, స్నేహితులకు, లేటెస్ట్ లీ అందించే ఈ స్పెషల్ కార్డ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి

Rudra

నేడు నాగ పంచమి. శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున ఈ పండుగను జరుపుకుంటారు. విష్ణువు అవతారమైన శ్రీ కృష్ణుడు తన బాల్యంలో కాళీయనాగుని ఓడించి యమునా నది నుండి సురక్షితంగా బయటపడ్డాడని నమ్ముతారు.

Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్‌ లో మెరిసిన నీరజ్ చోప్రా.. రజతాన్ని ముద్దాడిన బల్లెం వీరుడు.. వరుసగా రెండవ ఒలింపిక్స్‌ లోనూ పతకాన్ని సాధించిన ధీరుడు.. ప్రధాని మోదీ ప్రశంసలు

Rudra

భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా రికార్డు సృష్టించారు. వరుసగా రెండవ ఒలింపిక్స్‌ లోనూ పతకాన్ని సాధించి చరిత్ర తిరగరాశారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల జావెలిన్‌ త్రో ఈవెంట్‌ లో నీరజ్ రజతాన్ని సాధించారు.

Advertisement

Google Doodle 2024: ‘బ్రేక్’ థీమ్ తో వినూత్నంగా నేటి గూగుల్ డూడుల్.. దీని అర్థం తెలుసా?

Rudra

సందర్భానికి అనువుగా తమ డిస్‌ ప్లే లో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ ని, చిత్రాలను ప్రదర్శించే గూగుల్.. శుక్రవారం కూడా వినూత్నంగా గూగుల్ డూడుల్ ప్రదర్శించింది.

Kancheepuram: ఇదేం చోద్యం, దేవాలయం హోర్డింగ్‌లో పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఫొటో, తమిళనాడులో మండిపడుతున్న భక్తులు

Hazarath Reddy

తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఒక పండగ కోసం ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లో పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఫొటో కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆలయాల్లో పార్వతి దేవతను పూజించే 'ఆడి' పండుగ జరుగుతుంది. ఈ క్రమంలో వేడుకల్లో హోర్డింగ్‌లను కూడా ఏర్పాటుచేశారు.

Vinesh Phogat: పతకంపై ఆశలు, గుడ్ న్యూస్ చెప్పిన సీఏఎస్‌ కోర్టు, పతకం పొందేందుకు అర్హురాలని కామెంట్

Arun Charagonda

పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరి వినేశ్ ఫోగాట్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని ఒలింపిక్స్‌ నుండి వైదొలగగా ప్రతి ఒక్కరిని ఈ నిర్ణయం నిరాశ పర్చింది.

Zika Virus in Pune: పూణేలో జికా వైరస్ కలవరం, ఒక్కరోజే కొత్తగా 7 కేసులు నమోదు, 73కు పెరిగిన మొత్తం జికా వైరస్ కేసులు, అలర్ట్ అయిన వైద్యశాఖ అధికారులు

Hazarath Reddy

మహారాష్ట్రలోనిని పూణేలో జికా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా మరో ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో పుణేలో కేసుల సంఖ్య 73కు చేరుకున్నాయి. నివేదికల ప్రకారం... ఇప్పటి వరకు నలుగురు మరణించారు.

Advertisement

Rohit Sharma: విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ రికార్డును సమం చేసిన రోహిత్‌ శర్మ, ఇంతకీ ఏ రికార్డో తెలుసా ?

Vikas M

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ... క్రిస్‌ గేల్‌ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యధిక​ సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో గేల్‌, రోహిత్‌ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వన్డేల్లో ఈ ఇద్దరు చెరో 331 సిక్సర్లు బాదారు. ఈ జాబితాలో పాక్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది (351) టాప్‌లో ఉన్నాడు. రోహిత్‌ తర్వాతి స్థానంలో జోస్‌ బట్లర్‌ ఉన్నాడు

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, విద్యార్థినులతో ఇంగ్లీష్ టీచర్ అసభ్యకర ప్రవర్తన, చెప్పులతో చితకబాదిన తల్లితండ్రులు

Hazarath Reddy

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మోడల్ స్కూల్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠాలు చెప్పాల్సిన మాస్టర్ అడ్డదారి తొక్కాడు. స్కూలులో పనిచేసే ఇంగ్లీష్ టీచర్ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మండిపడిన తల్లిదండ్రులు అతగాడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. చెప్పులతో ఎడాపెడా వాయించి పడేశారు.

Bihar Shocker: వీడియో ఇదిగో, యూట్యూబ్‌లో చూసి బాంబులు తయారు చేసిన పిల్లలు, ఒక్కసారిగా అవి పేలడంతో గాయాలపాలై ఆస్పత్రిపాలు..

Hazarath Reddy

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని గైఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నీ బాంగ్రా కళ్యాణ్ గ్రామంలో యూట్యూబ్ వీడియోను చూసి బాంబు తయారీకి ప్రయత్నించిన ఐదుగురు చిన్నారులు గాయపడిన దారుణ ఘటన చోటుచేసుకుంది

Ola: క్విక్‌ కామర్స్‌ వ్యాపారంలోకి మళ్లీ ఓలా రీ ఎంట్రీ, డార్క్‌స్టోర్స్‌ ఏర్పాట్లు చేసుకునే పనిలో పడిన రైడ్ దిగ్గజం, ఈ సంస్థలకు గట్టి పోటీనిచ్చే అవకాశం

Vikas M

గతంలో క్విక్‌ కామర్స్‌ (quick commerce) విభాగంలో అడుగపెట్టి అర్ధంతరంగా వైదొలగిన ఓలా తాజాగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. మరోసారి రీఎంట్రీ ఇచ్చేందుకు సమాయత్తం అవుతోంది. ఇందుకోసం సొంతంగా డార్క్‌ స్టోర్లను (చిన్నపాటి గోదాములు) ఏర్పాటు చేయాలని ఓలా మాతృ సంస్థ ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌ భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement