Viral
Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు భారీగా వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్.. వీడియోతో
Rudraతెలంగాణ రాష్ట్రంలో శని, ఆది వారాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నిన్న పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి.
Shubman Gill: శుబ్‌మాన్‌ గిల్ మరో రికార్డు, వన్డేల్లో బ్రియాన్ లారా, హషీమ్ ఆమ్లాల పాత రికార్డును సమం చేసిన భారత ఓపెనర్
Hazarath Reddyఈ ఏడాదిలో శుభ్‌మన్ గిల్ వన్డే ఇంటర్నేషనల్స్‌లో తిరుగులేని ఆటగాడు. మొహాలీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఈ కుడిచేతి వాటం బ్యాటింగ్‌కు దిగాడు.గిల్ ఆహ్లాదకరమైన స్ట్రోక్స్‌తో అద్భుతమైన యాభైని పూర్తి చేశాడు. అతను 63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 పరుగులు చేసి ఔటయ్యాడు
Chandrayaan 3 Update: స్లీప్ మోడ్‌లో నుంచి ఇంకా బయటకు రాని విక్రమ్‌, శనివారం మేల్కొలిపే ప్రక్రియ చేపడతామని తెలిపిన ఇస్రో
Hazarath Reddyభారత అంతరిక్ష సంస్థ ఇస్రో..చంద్రయాన్‌ 3 మిషన్‌ గురించి కీలక అప్‌డేట్‌ అందించింది. చంద్రుడిపై స్లీప్ మోడ్ లో ఉన్న విక్రమ్‌ ల్యాండర్‌, ప్రగ్యాన్‌ రోవర్ ను మేల్కొలిపే ప్రక్రియను రేపటికి వాయిదా వేసింది.
Ganesh Chaturthi 2023: వైరల్ వీడియో ఇదిగో, కూర్చుని ఉన్న వినాయకుడి పాదాలను భక్తులు తాకగానే లేచి నిలబడి ఆశీర్వదిస్తున్న గణేశుడు
Hazarath Reddyసోషల్ మీడియాలో వినాయక విగ్రహంకు సంబంధించి గతేడాది వీడియో తాజాగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో కూర్చుని ఉన్న వినాయకుడు భక్తులు వచ్చి పాదాలు తాకగానే వారిని ఆశీర్వదిస్తున్నట్లుగా లేచి నిలబడతాడు.
U19 World Cup 2024: క్రికెట్ అభిమానులకు మరో గుడ్ న్యూస్, అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ
Hazarath Reddyక్రికెట్ అభిమానులకు ఐసీసీ మరో గుడ్ న్యూస్ తెలిపింది. వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ముగిసిన నెల రోజుల్లోనే మ‌రో ప్ర‌పంచ క‌ప్ మొద‌లవ్వ‌నుంది.అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి(ICC) ఈరోజు అండ‌ర్ -19 పురుషుల‌ వ‌ర‌ల్డ్ క‌ప్ 2024(Under -19 World Cup 2024) షెడ్యూల్ విడుద‌ల చేసింది.
Steve Smith Dismissal Video: వీడియో ఇదిగో, షమీ ఇన్ స్వింగర్‌కు క్లీన్ బౌల్డ్ అయిన డేవిడ్ స్మిత్, అర్థం కాక అయోమయంగా చూసిన స్మిత్
Hazarath Reddyఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ సందర్భంగా టీమిండియా వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. మొహాలీ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు
Cameron Green Run-Out Video: కామెరాన్ గ్రీన్ రనౌట్ వీడియో ఇదిగో, బుమ్రా,సూర్యకుమార్‌ యాదవ్‌లు కలిసి చేసిన మ్యాజిక్ ఎలా ఉందో చూడండి
Hazarath Reddy186 పరుగుల వద్ద ఆసీస్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. కామెరాన్ గ్రీన్ (31) రనౌటయ్యాడు. బుమ్రా,సూర్యకుమార్‌ యాదవ్‌లు కలిసి గ్రీన్‌ను ఔట్‌ చేశారు. కెప్టెన్ వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ క్యాచ్ జారవిడవడమే కాకుండా స్టంప్ ఔట్ కూడా మిస్ చేశాడు. అయితే ఆస్ట్రేలియా బ్యాటర్లు రన్ తీయడంలో అయోమయానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే గ్రీన్ రనౌట్ అయ్యాడు
World Cup 2023 Prize Money: ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు రూ. 33 కోట్లు, ర‌న్న‌ర‌ప్ జ‌ట్టుకు రూ. 16.5 కోట్లు, విజేత‌ల‌కు ఇచ్చే ప్రైజ్ మ‌నీని ప్రకటించిన ఐసీసీ
Hazarath Reddyవ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్(ODI World Cup)కు సంబంధించి ప్రైజ్ మ‌నీ వివరాలను అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి(ICC) ప్రకటించింది. ఈసారి 10 ల‌క్ష‌ల డాల‌ర్ల‌ను కేటాయించిన‌ట్టు ఐసీసీ తెలిపింది.
IND vs AUS 1st ODI 2023: 5 వికెట్లతో నిప్పులు చెరిగిన మహమ్మద్ షమీ, ఆస్ట్రేలియా 276 ప‌రుగుల‌కు ఆలౌట‌్
Hazarath Reddyటీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభమైంది. నేడు మొహాలీలో ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా ఏస్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ (5/51) ఐదు వికెట్లతో రెచ్చిపోవడంతో తొలి వన్డేలో ఆసీస్‌ 276 పరుగులకు ఆలౌటైంది
Andhra Pradesh: వినాయకుని నిమజ్జనం సందర్భంగా చీరాల బీచ్‌లో మునిగిపోతున్న నలుగురు మహిళలను కాపాడిన బాపట్ల పోలీసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyచీరాల వాడరేవు బీచ్‌కు వినాయకుని నిమజ్జనం నిమిత్తం వచ్చిన భక్తులలో నలుగురు మహిళలు సముద్రంలో స్నానం చేస్తూ ఉండగా ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి వారు సముద్రంలో మునిగిపోతుండగా గమనించిన మెరైన్ మరియు పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించి సముద్రంలోకి దూకి మునిగిపోతున్న నలుగురు మహిళలను రక్షించి ఒడ్డుకు చేర్చి వారి బంధువులకు అప్పగించారు.
Mitchell Marsh Dismissal Video: కొత్త బంతితో నిప్పులు చెరిగిన మహమ్మద్ షమీ, తొలి ఓవర్లోనే ఓపెనర్ మిచెల్ మార్ష్‌ను సాగనంపిన వీడియో ఇదిగో...
Hazarath Reddyటీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభమైంది. నేడు మొహాలీలో ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ జట్టు తొలి ఓవర్లోనే ఓపెనర్ మిచెల్ మార్ష్ (4) వికెట్ కోల్పోయింది. షమీ బంతిని ఆడబోయిన మార్ష్.. గిల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..
IMD Clarifies on Cyclone: అక్టోబరు మొదటి వారంలో బంగాళాఖాతంలో తుఫాను, IMD DG మృత్యుంజయ్ మహపాత్ర క్లారిటీ ఇదిగో..
Hazarath Reddyఅక్టోబరు మొదటి వారంలో బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందన్న నివేదికలపై IMD DG మృత్యుంజయ్ మహపాత్ర క్లారిటీ ఇచ్చారు.ఆయన మాట్లాడుతూ..'ఇంకా తుఫానుపై IMD నుంచి ఎటువంటి సూచన చేయలేదు.అయితే డిప్రెషన్‌గా వ్యవస్థ తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. మరిన్ని అప్ డేట్ల కోసం భారత వాతావరణ శాఖ బులిటెన్ ఫాలో కావాలని సూచించారు.
HC on Sexual Relations: భార్యాభర్తల లైంగిక సంబంధంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, భార్య సమ్మతితో భర్త ఎలాగైనా శృంగారం చేయవచ్చు, అత్యాచారంగా పరిగణించలేమని వెల్లడి
Hazarath Reddyఎంపీ ఎమ్మెల్యే భార్య చేసిన అసహజ లైంగిక ఆరోపణలను మధ్యప్రదేశ్ హైకోర్టు తోసిపుచ్చింది. సెక్షన్ 375 ఐపిసి (రేప్) దృష్ట్యా, సెక్షన్ 377 (అసహజ నేరాలు) కింద భర్తపై విచారణ జరపలేమని కోర్టు పేర్కొంది. భార్యాభర్తల మధ్య సహజమైన లైంగిక సంపర్కం తప్ప మరేదైనా జరిగితే దానిని 'అసహజమైనది'గా పేర్కొనలేమని కోర్టు పేర్కొంది.
Pakistan Squad For World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు పాకిస్తాన్ జట్టు ఇదిగో, స్టార్‌ పేసర్‌ నసీం షా గాయం కారణంగా దూరం, ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ రీ ఎంట్రీ
Hazarath Reddyభారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది.బాబర్‌ ఆజం సారథ్యంలో ప్రపంచ కప్ ఆడనుంది. వన్డేప్రపంచకప్‌కు ఆ జట్టు స్టార్‌ పేసర్‌ నసీం షా గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే ఆసియాకప్‌ మధ్యలో వైదొలిగిన స్టార్‌ పేసర్‌ హ్యారీస్‌ రవూఫ్‌ మాత్రం పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు.
Gujarat: వీడియో ఇదిగో, రైలులో గుండెపోటుతో కుప్పకూలిన ప్రయాణికుడు, CPR ఇచ్చి ప్రాణాలు కాపాడిన పక్కనే ఉన్న పోలీస్
Hazarath Reddyగుజరాత్‌లోని వడోదరలో, సకాలంలో సీపీఆర్ ఇచ్చి రైలులోపల ఉన్న ప్రయాణికుడి ప్రాణాలను ఒక పోలీసు రక్షించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. వడోదరలో రైలులోపల ఒక ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది.ఆ సమయంలో అక్కడ ఉన్న పోలీసు సకాలంలో CPR (కార్డియోపల్మనరీ రిససిటేషన్) అందించి ప్రయాణికుడి ప్రాణాలను కాపాడాడు
Uttar Pradesh Shocker: యూపీలో దారుణం, లవర్స్‌ని చెట్టుకు కట్టేసి తాలిబన్ తరహాలో శిక్ష విధించిన గ్రామస్థులు, వీడియో వైరల్ కావడంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
Hazarath Reddyయూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమికుడిని, అతని ప్రియురాలిని చెట్టుకు కట్టేసి కొట్టిన ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో వెలుగు చూసింది. సరేని పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొహారు మజ్రా రాల్‌పూర్‌ గ్రామానికి చెందిన ప్రియురాలి కుటుంబ సభ్యులు పని నిమిత్తం నగరం నుంచి వెళ్లారు
Ganesh Chaturthi 2023: వీడియో ఇదిగో, గణేశుడి ఆశీర్వాదం కోసం వచ్చిన సన్నిలియోన్, లాల్‌బాగ్చా గణేశుడిని దర్శించుకున్న దంపతులు
Hazarath Reddyముంబైలోని లాల్‌బాగ్చా రాజా సర్వజనిక్ గణేశోత్సవ్ మండల్‌లో గణపతిని ఆశీర్వదించమని కోరిన నటి సన్నీ లియోన్ మరియు ఆమె భర్త.దంపతులిద్దరూ వినాయకుడిని దర్శించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Hyderabad: వీడియో ఇదిగో, హిజ్రాలతో ముజ్రా డాన్స్ వేయించిన రౌడీ షీటర్లు, స్టేషన్‌కు తీసుకువెళ్లి తమ స్టైల్లో ట్రీట్‌మెంట్ ఇచ్చిన పోలీసులు
Hazarath Reddyహిజ్రాలతో ముజ్రా డాన్స్ చేయించిన రౌడీ షీటర్లకి తమ స్టైల్లో ట్రీట్‌మెంట్ పోలీసులు. హైదరాబాద్ లోని హబీబ్ నగర్లో అక్బర్ అనే రౌడీ షీటర్ గాంగ్ ద రింగ్ పార్టీలో హిజ్రాలతో ముజ్రా డాన్స్ చేయించగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు తమ తమ స్టైల్లో ట్రీట్‌మెంట్ ఇచ్చారు. వీడియోలు ఇవిగో..
Video: వీడియో ఇదిగో, గణేష్ మండపం దగ్గర డాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే మృతి
Hazarath Reddyశ్రీ సత్యసాయి జిల్లా - ధర్మవరంలో ప్రసాద్ (26) అనే యువకుడు బుధవారం రాత్రి గణేష్ మండపం వద్ద డాన్స్ చేస్తూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు.
Video: వీడియో ఇదిగో, వినాయకుడి మండపంలో నిద్రిస్తున్న వారి సెల్ ఫోన్ దొంగిలించేందుకు ప్రయత్నించిన దొంగ
Hazarath Reddyగణేష్ మండపాలను సైతం దొంగలు వదలడం లేదు. రెండు రోజుల క్రితం మియాపూర్‌లోని ఓ గణేష్ మండపంలో లడ్డూ దొంగతనం జరగగా ఈరోజు ఉదయం 1:50 గంటలకు మేడ్చల్ పరిధిలోని రాఘవేంద్రనగర్ కాలనీలో ఓ దొంగ సెల్ ఫోన్ చోరీకి యత్నించాడు. మండపంలో నిద్రిస్తున్న వారు లేవగా అక్కడి నుంచి పారిపోయాడు