వైరల్

Skill-Lync Layoffs: ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న మరో కంపెనీ, దూసుకొస్తున్న ఆర్థిక మాంధ్య భయాలతో ఉద్యోగులను తీసేస్తున్న ఎడ్‌టెక్ స్టార్టప్ స్కిల్-లింక్

Hazarath Reddy

ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితుల మధ్య చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో కార్యకలాపాలను ఏకీకృతం చేసే పనిలో భాగంగా చెన్నైకి చెందిన ఎడ్‌టెక్ స్టార్టప్ స్కిల్-లింక్ ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుతం కంపెనీలో 400 మంది దాకా ఉద్యోగులు ఉన్నారు.

Chandrababu Praises PM Modi: బీజేపీతో పొత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, మోదీ విజన్ సూపర్ అంటూ ప్రశంసలు, రిపబ్లిక్ చర్చలో టీడీపీ అధినేత ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

జాతీయ మీడియా న్యూస్ ఛానల్స్‌ రిపబ్లిక్ టీవీ నిర్వహించిన చర్చా వేదికలో (Republic Summit) పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandra Babu) మోదీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఎన్ చంద్రబాబు నాయుడు బహిరంగంగానే గట్టిగా సమర్థించారు.

Aadhaar For Resident Foreigners: విదేశాల్లో ఉన్న భారతీయులు ఆధార్ కార్డుకు అర్హులే, సంవత్సరంలో 182 రోజులు ఇండియాలో ఉంటే చాలు

Hazarath Reddy

ఇండియా నివాసి అయి ఉన్న విదేశీయులు ఇప్పుడు ఆధార్ కార్డు పొందవచ్చు. దరఖాస్తు చేసిన తేదీ నుండి గత 12 నెలల్లో 182 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం భారతదేశంలో గడిపితే వీరు ఆధార్‌ కార్డుకు అర్హులు అని కేంద్రం ప్రకటించింది.

WhatsApp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్, ఒకే ఫోన్‌ నంబర్‌తో నాలుగు ఫోన్లలో వాట్సాప్‌ ఖాతాలు ఓపెన్ చేసుకోవచ్చు

Hazarath Reddy

వాట్సాప్‌ సరికొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఇకపై ఒకే ఫోన్‌ నంబర్‌తో నాలుగు ఫోన్లలో వాట్సాప్‌ ఖాతాను వినియోగించుకోవచ్చని వెల్లడించింది. ఇప్పటివరకు వాట్సాప్‌ అకౌంట్‌ను ఒక ఫోన్‌లో మాత్రమే యూజ్‌ చేసుకొనేందుకు అవకాశం ఉన్నది.

Advertisement

3M Layoffs: ఉద్యోగులకు షాకిచ్చిన మరో టాప్ కంపెనీ, ఆరు వేల మంది ఉద్యోగులను తీసేస్తున్న అమెరికన్ తయారీ దిగ్గజం 3M

Hazarath Reddy

టాప్ అప్పెరల్ రిటైలర్ గ్యాప్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ దిగ్గజం 3M.. ఆరు వేల మంది ఉద్యోగులను దెబ్బతీసే లేఆఫ్‌లను ప్రకటించింది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా గ్యాప్ ఆరు వేల మందిని ఇంటికి సాగనంపుతోంది. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణంగా తెలుస్తోంది.

Weather Forecast in AP: ఏపీ ప్రజలకు చల్లని కబురు, మరో వారం పాటు వడగాడ్పులు ఉండవని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

ఏపీ వాసులకు వాతావరణశాఖ చల్లని కబురును చెప్పింది. మరో వారం పాటు వడగాడ్పులు ఉండవని వాతావరణ­శాఖ ప్రకటించింది. ఇటీవలి వరకు రాష్ట్రంలో అనేక ప్రాం­తాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 7 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి.

Bomb Threat To Delhi Public School: ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌కు బాంబు బెదిరింపు కాల్, అప్రమత్తమైన పోలీసులు, ఫేక్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్న పాఠశాల యాజమాన్యం

Hazarath Reddy

ఢిల్లీ (Delhi)లోని ఓ ప్రముఖ ఫాఠశాల(Delhi School)కు బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది.మథురా రోడ్‌లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌కు ఈ- మెయిల్ వచ్చింది. పాఠశాల ఆవరణలో బాంబులున్నాయంటూ అందులో పేర్కొనడంతో వెంటనే పాఠశాల యాజమాన్యం అప్రమత్తమైంది

Astrology Horoscope Today, April 26: బుధవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం, మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..

kanha

నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏంటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? మీ రాశి ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Advertisement

PIB fact check: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశంలోని మహిళలకు ఉచితంగా సోలార్ గ్యాస్ స్టౌలను అందిస్తోందా..?

kanha

తాజాగా సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. దానిపై ప్రభుత్వం మహిళలకు ఉచితంగా సోలార్ గ్యాస్ పొయ్యిలు ఇస్తోందని రాసి ఉంది. స్టవ్‌పై 10 సంవత్సరాల గ్యారెంటీ కూడా ఉంది. ప్రభుత్వం ఉచిత పథకం కింద ఈ గ్యాస్ పొయ్యిలను పంపిణీ చేస్తోంది.

Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు హెచ్చరిక, మరో మూడు రోజుల పాటు గాలివానలు, ఎవరూ బయటకు రావొద్దని ఐఎండీ ఆదేశాలు

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి పలుచోట్ల ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈదురుగాలులతో వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.ట్యాంక్‌ బండ్‌ పరిసర ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులు వీచాయి.హుస్సేన్‌సాగర్‌లోని భాగమతి బోటు కొట్టుకుపోయింది.

Girls Fight For Boyfriend: వీడియో ఇదిగో, ప్రియుడు కోసం నడిరోడ్డు మీద తలలు పగిలేలా కొట్టుకున్న అమ్మాయిలు, పోలీసులు రావడంతో అక్కడి నుంచి పరార్

Hazarath Reddy

ముజఫర్‌పూర్‌లో సోమవారం బాలికల మధ్య రోడ్డుపై గొడవ జరిగింది. ఇందులో ఓ బాలిక తల పగిలింది. ఈ ఘటన కాజీమహమ్మద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్పీకర్ చౌక్ సమీపంలో ఉంది. ప్రియుడి కోసమే ఈ గొడవ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. బాలికల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వీడియోలో, అమ్మాయిలు ఒకరితో ఒకరు కొట్లాడుకోవటం కూడా చూడవచ్చు.

Saint Von Colucci Dies: ఆ నటుడులా కనిపించాలని 12 సర్జరీలు, చికిత్స వికటించడంతో ఇన్ఫెక్షన్ కు గురై కెనడా నటుడు మృతి

Hazarath Reddy

కెనడా నటుడు 22 ఏళ్ల సెయింట్ వాన్ కొలూస్సీ బీటీఎస్ సంగీత బృందంలోని జిమిన్ లా కనిపించేందుకు సర్జరీలు చేయించుకుని ప్రాణాల కోల్పోయాడు. అచ్చం జిమిన్ లా కనిపించాలని కొలూస్సీ ఏకంగా 12 శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. అయితే చివరి ఆపరేషన్ వికటించడంతో ఆ కెనడా నటుడు ప్రాణాలు విడిచాడు.

Advertisement

Pakistan Army vs Indian Army: భారత ఆర్మీ ముందు పాకిస్తాన్ సైన్యం నిలబడలేదు, అంత శక్తి కూడా దానికి లేదు, సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ ఆర్మీ చీఫ్

Hazarath Reddy

భారత్‌తో పోరాడే మందుగుండు సామాగ్రి, ఆర్థిక శక్తి పాకిస్థాన్‌కు లేదని ఆ దేశ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా ఇద్దరు సీనియర్ జర్నలిస్టులతో చెప్పినట్లు UK ఆధారిత పాకిస్థాన్ మీడియా 'UK44' తెలిపింది.

Maharashtra Politics: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్, సీఎం పదవి నుంచి తప్పుకోవాలని షిండేకు హుకుం జారీ చేసిన బీజేపీ, కలకలం రేపుతున్న ఎన్సీపీ క్లైడ్ క్యాస్ట్రో ట్వీట్

Hazarath Reddy

మహారాష్ట్రకు త్వరలో కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారని ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడ్ క్యాస్ట్రో చేసిన వ్యాఖ్యలు మహా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. సీఎం పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ షిండేకు హుకుం జారీ చేసిందని, దీంతో ఆయన మనస్తాపంతో మూడు రోజులు సెలవులు పెట్టి వెళ్లారని క్యాస్ట్రో ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

Twitter Down: ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ సర్వీసులు డౌన్, స్క్రీన్ షాట్లు షేర్ చేస్తున్న నెటిజన్లు, ఇంకా అధికారికంగా స్పందించిన ట్విట్టర్

Hazarath Reddy

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ కొన్ని సెకన్ల పాటు చాలా మంది వినియోగదారుల కోసం పని చేయలేదు. చాలా మంది వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను నివేదించడంతో మైక్రోబ్లాగింగ్ సైట్ నిజంగా డౌన్ అయిందో లేదో నిర్ధారించడానికి నెటిజన్లు సోషల్ మీడియాకు వెళ్లారు. కొంతమంది వినియోగదారులు ట్వీట్లు తమకు లోడ్ కావడం లేదని చెప్పారు.

CM Yogi Adityanath on Mafia: ప్రాణాలు కాపాడమని మాఫియా ఇప్పుడు అడుక్కుంటోంది, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓ సమావేశంలో ప్రసంగిస్తూ యూపీలో మాఫియా, అవినీతిపై పెద్దఎత్తున విరుచుకుపడ్డారు.2017లో స్వేచ్చ పొందిన మాఫియా ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారని అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి నేరాలకు, అవినీతికి చోటు లేదని తెలిపారు

Advertisement

Hyderabad Rains: వీడియోలు ఇవిగో, అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి తడిసి ముద్దయిన హైదరాబాద్, పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్

Hazarath Reddy

హైదరాబాద్ లో భారీ వర్షం దంచి కొడుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు వడగళ్ల వాన కురుస్తోంది. ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, దిల్‌షుక్‌ నగర్, మలక్ పేట, చార్మినార్ తదితర ప్రాంతాల్లో వడగండ్లు పడ్డాయి.హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఉప్పల్ వైపు వెళ్లే రోడ్లన్నీ జలమయం అయ్యాయి. తార్నకలోని పలు చోట్ల రాళ్ల వర్షం కురుస్తోంది.

Bengaluru Shocker: ర్యాపిడో డ్రైవర్ లైంగిక వేధింపులు, శీలం కాపాడుకునేందుకు బైక్ మీద నుంచి దూకేసిన మహిళ, నిందితుడిపై కేసు నమోదు చేసిన బెంగుళూరు పోలీసులు

Hazarath Reddy

కర్ణాటకలో జరిగిన షాకింగ్ సంఘటనలో, తనను లైంగికంగా వేధించిన టాక్సీ డ్రైవర్ నుండి రక్షించుకోవడానికి బెంగళూరులో 30 ఏళ్ల మహిళ కదులుతున్న రాపిడో బైక్‌పై నుండి దూకింది. నివేదికల ప్రకారం, రాపిడో బైక్ డ్రైవర్ ఆమెను తప్పు గమ్యస్థానానికి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడని ఆరోపించారు.

Redya Naik on Revanth Reddy: భూమికి మూరెడు ఉంటడు ఆ బోసి.. కే, రేవంత్ రెడ్డిపై బూతులతో విరుచుకుపడిన డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్

Hazarath Reddy

మాజీ మంత్రి, బీఆర్ఎస్ డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ నోరు జారారు. ప్రతిపక్షాలను అసభ్య పదజాలంతో దూషించారు. మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం చిలక్కొయలపాడులో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రెడ్యానాయక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.

EPF Withdrawal Through UMANG: ఉమాంగ్ యాప్‌ ద్వారా PF ఖాతా డబ్బులు విత్‌‌డ్రా చాలా సింపుల్, ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు, పూర్తి వివరాలు మీకోసం..

Hazarath Reddy

PF ఖాతాదారులు EPFOలో డిపాజిట్ చేసిన మొత్తంలో తమ పదవీ విరమణ తర్వాత 100శాతం విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అంతకంటే ముందే డబ్బు కోసం అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగ భవిష్య నిధి ఖాతా నుంచి కొంత డబ్బును విత్‌డ్రా తీసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

Advertisement
Advertisement