వైరల్

Clashes at Football Match: వీడియో ఇదిగో, ఫుట్‌బాల్‌ మ్యాచ్‌‌లో ఘోరంగా తన్నుకున్న అభిమానులు, 100 మందికి పైగా మృతి, రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదం అవడమే కారణం

Hazarath Reddy

పశ్చిమాఫ్రికా దేశం గినియాలో ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పరస్పరం దాడి చేసుకోవడంతో దాదాపు 100 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థం దేశంలోని రెండో అతిపెద్ద నగరం జెరెకొరె నగరంలో ఓ టోర్నమెంట్‌ నిర్వహించారు.

Choreographer Kanha Mohanty Arrested in Drugs Party: మాదాపూర్‌ ఓయో రూమ్‌ లో డ్రగ్స్‌ పార్టీ.. కొరియోగ్రాఫర్‌ కన్హా మహంతి అరెస్ట్‌

Rudra

హైదరాబాద్ లో మరో డ్రగ్స్‌ పార్టీ కలకలం రేపింది. మాదాపూర్‌ లోని ఓయో రూమ్‌ లో ఓ డ్రగ్స్‌ పార్టీ జరిగింది. ఈ పార్టీలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌ కన్హా మహింతి పట్టుబడ్డారు.

Lady Constable Murder in Hyderabad: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్‌ దారుణ హత్య

Rudra

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్‌ నాగమణి దారుణ హత్యకు గురయ్యారు. రాయపోలు-ఎండ్లగూడ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. హయత్‌ నగర్‌ పీఎస్‌ లో నాగమణి విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Minister Sridhar babu: ట్యాంక్ బండ్ పై కారు భీభత్సం.. భారీగా ట్రాఫిక్ జామ్.. స్వయంగా చక్కదిద్దిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ మీద ఓ కారు భీభత్సం సృష్టించింది. ట్యాంక్ బండ్ వైపు నుంచి వస్తున్న ఓ కారు అంబేద్కర్ కూడలి వద్ద అదుపు తప్పి ఫుట్ పాత్ పైకి దూసుకురావడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

Advertisement

Pushpa-2 Pre-release Event: పుష్ప-2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే.. హైదరాబాద్‏ లో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు

Rudra

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ఈ నెల 5న గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్స్ వేగంగా నిర్వహిస్తున్నారు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పుష్ప-2 ఈవెంట్స్ నిర్వహించారు.

Monkey with Mace: హనుమాన్ ఆలయంలో గద పట్టుకుని భక్తులకు దర్శనమిచ్చిన వానరం (వీడియో)

Rudra

ఆంజనేయ స్వామి ఆలయంలో గద పట్టుకుని ఓ వానరం భక్తులకు దర్శనమిచ్చింది. ఇది చూసిన భక్తులు హనుమంతుడే తమను దీవించడానికి వచ్చారని భావిస్తూ.. పులకించిపోయారు.

Kanthi Dutt: కీర్తీ సురేశ్, కాజల్ అగర్వాల్, పరిణితి చోప్రా వంటి టాప్ హీరోయిన్లను మోసం చేసిన తృతీయ జ్యూవెలరీ అధినేత కాంతి దత్‌ అరెస్ట్.. హిట్ అండ్ రన్, మోసం వంటి కేసులోనూ నిందితుడు

Rudra

కీర్తీ సురేశ్, కాజల్ అగర్వాల్, పరిణితి చోప్రా వంటి టాప్ హీరోయిన్లు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న జ్యూవెలరీ వ్యాపారవేత్త తృతీయ జ్యూవెలర్స్ అధినేత కాంతి దత్‌ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.

Viral Video: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్..ఇండిగో విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం..వైరల్ వీడియో ఇదిగో

Arun Charagonda

ఫెంగల్ తుఫాన్ కారణంగా చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ మధ్యలో చెన్నై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యేందుకు ట్రై చేసిన ఇండిగో విమానం త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకుంది. గాలుల తీవ్రతకు కుదుపునకు గురవుతున్నట్లు కనిపించిన ఫ్లైట్, ల్యాండింగ్ సాధ్యం కాక గాల్లోకి లేచింది. వెనుక భాగం రన్‌వేకు తాకేలా కనిపించినా లక్కీగా ప్రమాదం కాలేదు. తుఫాన్ దృష్ట్యా రేపటి వరకు చెన్నై ఎయిర్ పోర్టుకు రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

Advertisement

AEE Nikhesh Kumar: అక్రమాస్తుల కేసులో ఏఈఈ నిఖేశ్‌ కుమార్‌ అరెస్ట్‌.. 14 రోజులు రిమాండ్‌

Rudra

అక్రమాస్తుల కేసులో నీటి పారుదల శాఖ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ నిఖేశ్ కుమార్‌ ను ఏసీబీ అరెస్టు చేసింది. అనంతరం జడ్జి ముందు హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

Black Magic in Stream: మేకపోతును బలిచ్చి, కొబ్బరికాయలు, అన్నం, బట్టలను వదిలేసి వాగులో క్షుద్ర పూజల కలకలం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోరం (వీడియో)

Rudra

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కుదురుపల్లి వాగులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఆదివారం ఉదయం కుదురుపల్లి గ్రామానికి చెందిన యువకులు వాకింగ్ కు వెళ్లగా వాగులో క్షుద్ర పూజలు చూసి భయాందోళనలకు గురయ్యారు.

Tamilnadu Rains: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్..రోడ్డపై చేపలు పడుతున్న యువకులు, తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు..చెరువులను తలపిస్తున్న రోడ్డు..వీడియో ఇదిగో

Arun Charagonda

ఫెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు, కాలనీలు చెరువులను తలపిస్తుండగా తిరువణ్ణామలై తిండివనం రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో కొందరు యువకులు వాన నీటిలో చేపలు పడుతుండగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Road Accident: ఏపీలోని అనంతపురం జిల్లా విడపనకల్లులో ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురు దుర్మరణం (వీడియో)

Rudra

ఏపీలోని అనంతపురం జిల్లా విడపనకల్లు 42వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ చెట్టును వేగంగా వస్తున్న ఓ కారు బలంగా ఢీకొట్టింది.

Advertisement

Horrific Accident in Hyderabad: హైదరాబాద్ రోడ్డుపై డీజిల్ లీక్.. జారి పడిపోయిన 70 మంది వాహనదారులు.. ఒకరి మృతి (వీడియో)

Rudra

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుషాయిగూడ డీమార్ట్ నుంచి నాగారం వరకూ రోడ్డుపై డీజిల్ లీక్ అయ్యింది. ఇది గమనించకపోవడంతో బైక్స్ పై అటుగా వెళ్లిన దాదాపు 60 నుంచి 70 మంది వాహనదారులు రోడ్డు మీద జారిపడ్డారు.

Encounter in Telangana: తెలంగాణ దండకారణ్యంలో అలజడి.. ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీలో భారీ ఎన్ కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి

Rudra

తెలంగాణలోని దండకారణ్యం కాల్పులతో దద్దరిల్లింది. ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. చల్పాక సమీప అడవుల్లో మావోయిస్టు – గ్రేహౌండ్స్ బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

Arvind Kejriwal: ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై దాడి.. లిక్విడ్ పోసిన దుండగుడు...ఇది బీజేపీ పనేనని సీఎం అతిషి ఫైర్

Arun Charagonda

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై దాడి జరిగింది. కేజ్రీవాల్ పై లిక్విడ్ పోశాడు ఓ దుండగుడు. పాదయాత్రలో భాగంగా ప్రజల మధ్య నుంచి అభివాదం చేస్తూ కేజ్రీవాల్​ నడుస్తుండగా ఘటన జరిగింది. ఇది ముమ్మాటికీ బీజేపీ పనే అని ఎక్స్ లో స్పందించారు ఢిల్లీ సీఎం అతిషి. ఇలాంటి చౌకబారు చర్యలకు ఢిల్లీ ప్రజలు ప్రతీకారం తీర్చుకుంటారని వ్యాఖ్యానించారు.

Uttar Pradesh: వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం, మంటల్లో కాలిపోయిన 200 బైకులు..వీడియో ఇదిగో

Arun Charagonda

ఉత్తరప్రదేశ్-వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌తో పార్కింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగగా మంటల్లో 200లకు పైగా బైకులు కాలిపోయాయి. ఆరు ఫైరింజన్లతో మంటలార్పారు ఫైర్ సిబ్బంది.

Advertisement

Telugu Student Dies in US: అమెరికాలోని చికాగోలో కాల్పులు.. ఖమ్మం విద్యార్థి మృతి

Rudra

అమెరికాలోని చికాగోలో కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లాలోని రామన్నపేటకు చెందిన నూకరపు సాయితేజ (26) మృతి చెందారు.

Acid Attack on Bus: విశాఖలో ఆర్టీసీ బస్సుపై యాసిడ్ ఎటాక్.. ముగ్గురు మహిళలకు గాయాలు (వీడియో)

Rudra

విశాఖలోని ఐటీఐ జంక్షన్‌ వద్ద శుక్రవారం రాత్రి బీఆర్టీఎస్‌ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ ఆర్టీసీ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్‌ దాడి చేశాడు. దీంతో బస్సులో కిటికీ పక్కన కూర్చున్న ముగ్గురు మహిళలపై ఆ యాసిడ్ పడింది. దీంతో వారు కండ్లు మండి కేకలు వేశారు.

Complaint Against Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు.. ఆర్మీ పేరును అభిమాన సంఘానికి పెట్టుకోవడం ఏంటని ఫిర్యాదుదారు మండిపాటు

Rudra

టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలని కోరుతూ హైదరాబాద్ లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో గ్రీన్ పీస్ ఎన్విరాన్ మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు భైరి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు.

Fire Accident in Bus: నర్సింగ్ కళాశాల విద్యార్ధులకు తప్పిన పెను ప్రమాదం.. కళాశాల బస్సు దగ్ధం.. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద ఘటన (వీడియో)

Rudra

ఏపీలోని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద జాతీయ రహదారిపై బస్సులో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన నుంచి నర్సింగ్ కళాశాల విద్యార్థినులు తృటిలో తప్పించుకున్నారు.

Advertisement
Advertisement