Newdelhi, Mar 12: రోడ్డు ప్రమాద బాధితులకు (Road Accident Victims) భారీ ఉపశమనం లభించనున్నది. బాధితులకు సకాలంలో చికిత్స అందించే ఉద్దేశంతో ‘గోల్డెన్ అవర్’ (Golden Hour) పేరుతో కేంద్రం కొత్త పథకం తీసుకొస్తున్నది. దీని ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత ఉచిత చికిత్స అందించనున్నది. హర్యానా, చంఢీగఢ్ లో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనుంది. అనంతరం దీనిని దేశ వ్యాప్తంగా అమలు చేయనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ పథకం కింద రూ.1.5 లక్షలు లేదా 7 రోజుల దవాఖానలో చికిత్సలో ఏది తక్కువ ఖర్చయితే దాన్ని ఉచితంగా దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు కల్పించాలని కేంద్రం యోచిస్తున్నది.
ET NOW Exclusive | Big relief for road accident victims
Govt to announce "Golden Hour" Scheme in states of Haryana and Chandigarh and later on it will be rolled out to pan India, sources tell @anuragshah_ pic.twitter.com/RLCSF6fdR6
— ET NOW (@ETNOWlive) March 11, 2024
ఏమిటీ ‘గోల్డెన్ అవర్’?
ప్రమాదం జరిగిన మొదటి గంట సమయాన్ని ‘గోల్డెన్ అవర్’గా పిలుస్తారు. ఈ టైమ్ లోగా బాధితుడికి సరైన చికిత్స అందితే ప్రాణాలు దక్కే అవకాశం ఎక్కువగా ఉంటుంది.