Newdelhi, Dec 6: మైనారిటీ (Minority) తీరని అమ్మాయి ఆమోదంతోనే లైంగిక ప్రక్రియ కొనసాగించినప్పటికీ, చట్ట ప్రకారం అది అత్యాచారం కిందికే వస్తుందని ఢిల్లీ హైకోర్టు (Delhi Highcourt) కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ 16 ఏండ్ల బాలిక కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ (Bail Petition) విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
మైనర్ కు కీలక నిర్ణయాలు తీసుకునే మానసిక పరిణతి ఉండదని, అందుకే మైనర్ ఇష్టప్రకారం, పూర్తి సమ్మతితో (Consent) లైంగికంగా కలిసినప్పటికీ, ఆ సమ్మతిని.. అసమ్మతిగానే పరిగణించి దానిని అత్యాచారం కిందనే పరిగణిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. నిందితుడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కొట్టేశారు.
The Delhi High Court recently stated that “consent of a minor is no consent in the eyes of law,” rejecting the bail request of a man who was detained for allegedly raping a young girl.https://t.co/rIvJYOQ6wa
— SheThePeople (@SheThePeople) December 6, 2022