Newdelhi, April 21: జమ్మూకశ్మీర్‌లోని (Jammu And Kashmir) పూంచ్ (Poonch) జిల్లాలో ఆర్మీ జవాన్లు (Jawans) ఉన్న వాహనంపై నిన్న జరిగిన ఉగ్రదాడి తమ పనేనని పాక్ (Pakistan) ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) ప్రకటించింది. దీంతో భారత్ అప్రమత్తమైంది. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులను వెదికేందుకు ఆ ప్రాంతాన్ని మిలిటరీ జల్లెడ పడుతున్నది. కాగా ఈ ఉగ్రదాడిలో ఐదుగురు భారత జవాన్లు అసువులు బాశారు. జిల్లాలోని భీంబెర్ గాలి నుంచి సంగియోట్ వెళ్తున్న ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులతో తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులు కాగా, ఓ అధికారి గాయపడ్డారు. వెంటనే ఆయనను రాజౌరీలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (జమ్ము) సహా సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Dr @Swamy39
Jaish claims attack on soldiers in J&K's Poonch, Army chief briefs Centre🍁🍁
The incident took place around 3 pm in Rajouri sector. The vehicle caught fire, likely due to the use of grenades, the Army's official statement said.https://t.co/uOdG7dun0G
— #JaiShriRam🇮🇳ArtiSharma_VHS. (@ArtiSharma001) April 21, 2023
White Knight Corps salutes the sacrifice of Hav Mandeep Singh, L/Nk Debashish Baswal, L/Nk Kulwant Singh, Sep Harkrishan Singh, Sep Sewak Singh, who laid down their lives in the line of duty in the Poonch Sector today. We stand in solidarity with the bereaved families: White… https://t.co/UG2QOjbzJk pic.twitter.com/1QhoxOhxjE
— ANI (@ANI) April 20, 2023
#BREAKING: 5 Indian Army soldiers killed in a terror attack in Rajouri Sector of Jammu & Kashmir when terrorists fired at it and truck caught fire due to grenade blast.
Today, at approximately 1500 hours, one Indian Army vehicle, moving between Bhimber Gali and Poonch in the… pic.twitter.com/vjp8CvkpXy
— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 20, 2023
అలా దాడి జరుగొచ్చు
పూంచ్ జిల్లాలోని రాజౌరి సెక్టార్‌లో నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ ఉగ్రదాడి జరిగింది. కాల్పులు జరిగిన వెంటనే వాహనంలో మంటలు చెలరేగాయి. గ్రనేడ్ దాడి కారణంగా మంటలు అంటుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.