Bengal Tiger (File Photo) (Image Credits: Google)

Newdelhi, April 18: ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) పౌరి (Pauri) జిల్లాలో అడవిని (Forest) వీడి బయటకు వచ్చిన ఓ పెద్ద పులి (Tiger) 25 గ్రామాల ప్రజలను (Villagers) భయభ్రాంతులకు గురిచేస్తోంది. మూడు రోజుల వ్యవధిలో ఇద్దరిపై దాడిచేసి చంపేసింది. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు 25 గ్రామాల్లో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. నేటి వరకు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు.

TruthGPT: చాట్ జీపీటీకి పోటీగా ‘ట్రూత్ జీపీటీ’.. ఎలాన్ మస్క్ యోచన

వేటాడే జంతువుగా ప్రకటించాలని..

పులిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన అటవీ అధికారులు గ్రామంలో బోను ఏర్పాటు చేశారు. పశువుల మేత కోసం గ్రామస్థులు అడవిలోకి వెళ్లొద్దని కోరారు. కాగా, ఈ పులిని మనుషుల్నివేటాడే జంతువుగా ప్రకటించాలని కోట్‌ద్వార్ ఎమ్మెల్యే దిలీప్ సింగ్ కున్వార్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీని కోరారు. కాగా, పులుల దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు అటవీ అధికారులు తెలిపారు.

Layoffs in 2023: నియామకాలు తగ్గినప్పటికీ, 50 శాతం మంది దేశీయ ఉద్యోగులు జాబ్ మారడానికి సిద్ధంగా లేరు