Delhi Metro Viral Video: మరోసారి వార్తల్లోకెక్కిన ఢిల్లీ మెట్రో, ఈ సారి పోల్ డ్యాన్స్ వీడియో వైరల్, ఎన్నిసార్లు చెప్పినా వినరా? అంటూ నెటిజన్ల ఫైర్
ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువతులు ‘పోల్ డ్యాన్స్’ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వారంతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడమే కాకుండా మెట్రో సేవల్ని కించపరుస్తున్నారంటూ మండిపడుతున్నారు.
New Delhi, July 08: ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువతులు ‘పోల్ డ్యాన్స్’ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వారంతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడమే కాకుండా మెట్రో సేవల్ని కించపరుస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఢిల్లీ మెట్రోలో వీడియోలు రికార్డ్ చేయడం నిషేధమని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) పదే పదే హెచ్చరికలు జారీ చేసినా కొందరు ప్రయాణికులు వాటిని ఖాతరు చేయట్లేదు. ఇప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తూ అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా పర్వీన్ బాబీ, శశి కపూర్ నటించిన ‘సుహాగ్’ సినిమాలోని ‘మెయిన్ తో బేఘర్ హూన్’ పాటకు ఇద్దరు యువతులు కోచ్ లోపల ఉన్న స్తంభాలు పట్టుకుని డ్యాన్స్ చేశారు. @HasnaZarooriHai అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు.
After porn, kissing and fighting in Delhi Metro,
The latest is Pole Dancing.....
🤣🤣🤣🤣🤣 pic.twitter.com/RpvKJ9jLny
— Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) July 6, 2023
‘ఢిల్లీ మెట్రోలో పోర్న్, ముద్దులు, గొడవల తర్వాత..తాజాగా ‘పోల్ డ్యాన్స్’….అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఢిల్లీ మెట్రోలో అధికారుల పర్యవేక్షణ అవసరం, రీల్ చేసేవారికి ఇది కొత్త లొకేషన్‌లా ఉంది’ అని ఒకరు.. ‘DMRC అధికారులు ఇలాంటి వారిపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? వీరు ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించడమే కాకుండా మెట్రో సేవలను కించపరిచారు’ అని మరొకరు వరుసగా కామెంట్లు పెట్టారు. ఈ వీడియో చూసి.. నెటిజన్ల కామెంట్లు చూసి DMRC ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
(The above story first appeared on LatestLY on Jul 08, 2023 08:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

