Bhopal, October 30: నిండు గర్భిణిని ఆసుపత్రికి (Hospital) తీసుకెళుతున్న ఓ అంబులెన్స్ డీజిల్ కొరతతో (Fuel Shortage) మధ్యలోనే ఆగిపోయింది. ఆస్పత్రిని చేరే మార్గం లేక రోడ్డు మీదే (On the roadside) గర్భిణీ ప్రసవించింది. అంబులెన్స్ సిబ్బందితో పాటు దగ్గర్లోని మహిళలు ఆమెకు పురుడు పోసి మానవత్వాన్ని (Humanity) చూపారు. మధ్యప్రదేశ్ లో శుక్రవారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పన్నా జిల్లా బనౌలీలోని షానగర్ కు చెందిన రేష్మా నిండు గర్భిణీ.. శుక్రవారం రాత్రి నొప్పులు మొదలవడంతో ఇంట్లో వాళ్లు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. ఫోన్ చేసిన కొద్దిసేపటికి అంబులెన్స్ వచ్చింది. అందులో వచ్చిన ఆరోగ్య కార్యకర్తలు రేష్మను పరీక్షించి కాన్పు జరగొచ్చని తెలిపారు. దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించేందుకు అంబులెన్స్ లో బయల్దేరారు.
అయితే, డీజిల్ అయిపోవడంతో అంబులెన్స్ మార్గమధ్యంలోనే ఆగిపోయింది. రేష్మ ఏ క్షణంలోనైనా ప్రసవించే పరిస్థితిలో ఉండడంతో మరో మార్గంలేక నడిరోడ్డు మీద, చీకట్లోనే ఆరోగ్య కార్యకర్తలు ప్రసవం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
A woman had to deliver her baby on the roadside after the ambulance taking her to the nearest town hospital ran out of diesel, in Panna! @manishndtv @GargiRawat @alok_pandey @umasudhir pic.twitter.com/alWbRr5mEu
— Anurag Dwary (@Anurag_Dwary) October 29, 2022