పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. కాసేపటి క్రితం ఆయన కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. అల్లు అర్జున్ రాకముందే అక్కడకు సినీ నిర్మాత దిల్ రాజు చేరుకున్నారు.
అల్లు అర్జున్ రాక నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి మృతి చెందిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబానికి పలువురు సినీ ప్రముఖులు ఆర్థిక సాయం అందించారు. అల్లు అర్జున్ కూడా తన వంతు సాయం అందించారు.
శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్
కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్.
అర్జున్ వెంట దిల్ రాజు కూడా ఉన్నారు. పోలీసులు అనుమతి ఇవ్వడంతో చాలా రోజులకు శ్రీతేజ్‌ను అర్జున్ పరామర్శించగలిగారు. #AlluArjun pic.twitter.com/Pb6PDDFQj2
— Telugu360 (@Telugu360) January 7, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)