Delhi, January 8: అత్యాచారం కేసులో జీవత ఖైదు అనుభవిస్తున్న ఆశారం బాపుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. అయితే పలు షరతులు విధించింది. తన అనుచరులను కలవకూడదని తెలిపింది.
2013లో జోధ్‌పూర్‌లోని తన ఆశ్రమంలో ఒక యువతి పై అత్యాచారం చేసిన కేసులో ఆశారం బాపును దోషిగా తేల్చింది న్యాయస్థానం. అయితే మరొక అత్యాచార కేసులో ఆయనకు బెయిల్ రాకపోవడంతో జైలులోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం... హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు.. పీఎస్ ఎక్కడంటే?
2013లో జోధ్‌పూర్‌లోని తన ఆశ్రమంలో 16 ఏండ్ల యువతిపై అత్యాచారం చేసినందుకు 2018లో జోధ్‌పూర్ కోర్టు ఆసరామ్‌కు జీవిత ఖైదు విధించింది. గుజరాత్ హైకోర్టు 2023లో ఆసరామ్ దాఖలు చేసిన జీవితశిక్ష సస్పెండ్ చేయాలని చేసిన పిటిషన్‌ను అంగీకరించలేదు.