Hyderabad, Jan 8: హైదరాబాద్ (Hyderabad) సనత్ నగర్ లోని ఎవర్ గ్రీన్ బార్ అండ్ రెస్టారెంట్ పై ఎస్‌ఓటీ పోలీసులు (Police) దాడి చేశారు. కస్టమర్లను ఆకర్షించేందుకు అందమైన అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో మంగళవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పబ్ లో ఏడాదిగా అమ్మాయిలతో డ్యాన్సులు చేయిస్తున్నట్లు గుర్తించారు. బార్ అండ్ రెస్టారెంట్ లో డ్యాన్స్ చేసే 11 మంది యువతులు, ఇద్దరు డీజే నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు.
Here's Video:
మహిళాలతో డాన్సులు ... కస్టమర్స్ ఆకర్షణ ...
👉ఎవర్ గ్రీన్ బార్ అండ్ రెస్టారెంట్ దాడులు చేసిన ఎస్ఓటి పోలీసులు
👉డాన్సులు చేస్తున్న 11 మంది మహిళాలను అదుపులో తీసుకున్న పోలీసులు
👉 పరారిలో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహకులు
For More Updates Download The App Now -… pic.twitter.com/wvyHYU7loV
— ChotaNews App (@ChotaNewsApp) January 8, 2025
బాధ్యులు ఎక్కడ?
అయితే పోలీసుల తనిఖీల సమయంలో రెస్టారెంట్ నిర్వాహకులు పరారయినట్టు తెలుస్తున్నది. కాగా, ఎవర్ గ్రీన్ బార్ యజమాని కృష్ణంరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే ఆయన్ని పట్టుకుంటామని తెలిపారు.