Vjy, Nov 7: గత ఎన్నికల సమయంలో కూటమి... వాలంటీర్ల వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని, తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు రూ.10 వేల వేతనం ఇస్తామని కూడా హామీ ఇచ్చింది. అదే సమయంలో... పెద్ద సంఖ్యలో వాలంటీర్లు రాజీనామాలు చేశారు. వైసీపీ నేతల ఒత్తిళ్ల కారణంగానే వారు రాజీనామాలు చేసినట్టు కథనాలు వచ్చాయి.

తాజాగా వాలంటీర్లపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని కూటమి చెప్పినప్పటికీ, సాంకేతిక అంశాలు ఆటంకంగా మారాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెబుతున్నారు. ఇవాళ సర్పంచ్ సంఘాల సమావేశానికి పవన్ హాజరయ్యారు.

అధికారంలోకి వచ్చాక ఏ పోలీసును వదలం, సప్త సముద్రాల అవతల ఉన్నా వెతికి మరీ పట్టుకుంటాం, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాలంటీర్లను వైసీపీ దారుణంగా మోసం చేసి నియమించుకుందని ఆరోపించారు. వాలంటీర్లకు ఇచ్చిన మాట నెరవేర్చుదామని భావిస్తుంటే, గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ఎక్కడా వాలంటీర్ల ప్రస్తావనే లేదని పవన్ స్పష్టం చేశారు. అసలు, దాంట్లో వాలంటీరు ఉద్యోగాలే లేవని అన్నారు. ఇదొక సాంకేతిక సమస్యగా మారిందని విచారం వ్యక్తం చేశారు.

"గ్రామ వాలంటీర్లు, సచివాలయాలు పంచాయతీలకు సమాంతర వ్యవస్థలా తయారయ్యాయన్న అభిప్రాయం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ వేరు. సచివాలయ వ్యవస్థ వేరు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. జీతాలు పెంచుదామంటే జీవోలో ఎక్కడా కనబడడం లేదు. గత ప్రభుత్వం వారిని మోసం చేసింది. వాళ్లు ఉద్యోగంలో ఉన్నట్లు రికార్డులు ఉంటే ఆ వ్యవస్థను రద్దు చేయవచ్చు. కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు. ఇదో సాంకేతిక సమస్య" అని వివరించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)