ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఉచిత విద్యుత్ పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై అదనపు భారాన్ని మోపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపు కారణంగా ప్రజలపై రూ. 15,000 కోట్ల అదనపు భారం పడిందని వైసీపీ ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. మాజీ మంత్రి రోజా చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజలపై భారం మోపుతూ అంత ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్స్ లో తిరిగే హక్కు మీకు ఎవరు ఇచ్చారని విమర్శలు గుప్పించారు.

విద్యుత్‌ ఛార్జీల పెంపుపై వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్, వీడియోలు, ఫోటోలు ఇవిగో..

YSRCP Former Minister Roja Slams Chandrababu Govt 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)