క్రీడలు

Cricketer Dies of Heart Attack: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన క్రికెటర్, సూరత్‌లో విషాదకర ఘటన

Hazarath Reddy

సూరత్‌లో క్రికెట్ ఆడుతూ 32 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, నిమేష్ అహిర్ KNVSS ఏక్తా గ్రూప్ నిర్వహించిన ఎనిమిది జట్ల టోర్నమెంట్‌లో పాల్గొనగా మార్చి 5న సూరత్‌లోని నర్తన్ గ్రామంలో ఛాతీ నొప్పితో కుప్పకూలిపోయాడు.

Moustapha Sylla Dies of Heart Attack: వీడియో ఇదిగో, గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలిన పుట్ బాల్ ఆటగాడు

Hazarath Reddy

మౌస్తఫా సిల్లా అనే 21 ఏళ్ల ఫుట్‌బాల్ ఆటగాడు మైదానంలో ఆడుతూనే కుప్పకూలి మరణించాడు. యువ ఐవరీ కోస్ట్ ఆటగాడు సోల్ ఎఫ్‌సి డి'అబోడోకు వ్యతిరేకంగా రేసింగ్ క్లబ్ డి'అబిడ్జన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఈ నిరుత్సాహకర సంఘటన జరిగింది. వైరల్ వీడియోలో చూసినట్లుగా, ఆట సమయంలో సిల్లా జారిపడి అతని వీపుపై పడతాడు. ఒక నివేదిక ప్రకారం, అతన్ని ఆసుపత్రికి తరలించగా, అతను మరణించాడు

Mohammed Shami Delivery Video: వీడియో ఇదిగో, మహమ్మద్ షమీ స్టన్నింగ్ డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయిన ఆసీస్‌ బ్యాటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌

Hazarath Reddy

అహ్మదాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ నిప్పులు చెరిగే బంతితో ఆసీస్‌ బ్యాటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 71 ఓ‍వర్‌ వేసిన షమీ బౌలింగ్‌లో నాలుగో బంతిని హ్యాండ్స్‌కాంబ్‌ డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు.

India vs Australia, 4th Test, Day 1: మరికాసేపట్లో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య కీలక మ్యాచ్‌, అహ్మదాబాద్‌లో నిర్ణయాత్మక నాలుగో టెస్ట్ మ్యాచ్‌, స్టేడియానికి చేరుకున్న ఇరుదేశాల ప్రధానులు

VNS

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో (Border-Gavaskar Trophy) భాగంగా నిర్ణయాత్మక నాల్గో టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium in Ahmedabad) జరుగుతోంది.ఇండియా, ఆస్ట్రేలియా ప్రధానులు స్టేడియంకు చేరుకున్నారు. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ప్రధానులు రాక సందర్భంగా ఎస్పీజీ భద్రతను కట్టుదిట్టం చేసింది.

Advertisement

Australian Cricketers Holi Masti:హోలీ వేడుకల్లో రంగుల్లో మునిగితేలిన ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్, వైరల్‌గా మారిన ఫోటోలు, వీడియోలు మీకోసం

VNS

గవాస్కర్ ట్రోఫీ కోసం భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా (IND vs AUS) టీమ్..హోలీని ఫుల్‌గా సెలబ్రేట్ (Holi Celebrations) చేసుకుంది. ఆస్ట్రేలియన్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్ (Steve Smith), లబుషనే (Labushane)తో పాటూ పలువురు క్రికెటర్లు రంగుల్లో మునిగి తేలారు. భారత పండుగలను ఆస్ట్రేలియన్ క్రికెటర్లు సెలబ్రేట్ చేసుకోవడం ఇదేం తొలిసారి కాదు.

Umesh Yadav: రెండోసారి తండ్రి అయిన క్రికెటర్ ఉమేష్ యాదవ్, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన భార్య తాన్య వధ్వా

Hazarath Reddy

టీమిండియా వెటరన్‌ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ రెండోసారి తండ్రయ్యాడు. అతడి భార్య తాన్య వధ్వా బుధవారం(మార్చి8) పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఉమేశ్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. 2013 మే 29న పంజాబ్‌కు చెందిన తాన్యా‌ను ఉమేశ్‌ యాదవ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

Sania Mirza: సానియా ఫేర్‌వెల్‌ మ్యాచ్‌.. ముఖ్య అతిధిగా కేటీఆర్‌.. వీడియో వైరల్

Rudra

భారత టెన్నిస్‌ క్వీన్‌ సానియా మీర్జా ఆదివారం ఎల్బీ స్టేడియంలో జ‌రిగిన ఫేర్‌వెల్‌ మ్యాచ్‌తో సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు ప‌లికింది. ఈ చివరి మ్యాచ్‌ను చూసేందుకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌, సినీ న‌టుడు దుల్క‌ర్ స‌ల్మాన్, మాజీ క్రికెటర్లు యువరాజ్‌సింగ్‌, అజారుద్దీన్‌ ఎల్బీ స్టేడియంకు వచ్చి మ్యాచ్ తిలకించారు.

RCB vs DC, WPL 2023: బెంగళూరుకు చుక్కలు చూపించిన తారా నోరిస్, మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన షఫాలీ వర్మ, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీపై ఢిల్లీ ఘనవిజయం

VNS

WPL రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సూప‌ర్ విక్టరీ సాధించింది. ముంబైలోని బ్రబౌర్నే స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో 60 ప‌రుగుల తేడాతో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరును ఓడించింది. ఆర్సీబీ నిర్ణీత ఓవ‌ర్లలో 8 వికెట్ల న‌ష్టానికి 163 ర‌న్స్ చేసింది. 224 ల‌క్ష్య ఛేద‌న‌లో ఆ జ‌ట్టు ఆది నుంచి త‌డ‌బడింది. ఢిల్లీ బౌల‌ర్ తారా నోరిస్ ఐదు వికెట్లు తీసి ఆర్సీబీని దెబ్బకొట్టింది.

Advertisement

WPL 2023, MI vs GG: ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్ తొలిమ్యాచ్‌లో ముంబై గ్రాండ్‌ విక్టరీ, చెలరేగి ఆడిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, ఫస్ట్ మ్యాచ్‌లోనే మెరుపులతో ప్రత్యర్ధికి ముచ్చెముటలు

VNS

ముంబై బౌల‌ర‌ల్లో సాయిక ఇష‌క్ నాలుగు, అమేలియా, నాట్ సీవ‌ర్ బ్రంట్ త‌లా రెండు వికెట్లు తీశారు. ఇసీ వాంగ్‌కు ఒక వికెట్ ద‌క్కింది. తొలి ఓవ‌ర్‌లోనే గుజ‌రాత్ జెయింట్స్‌కు షాక్ త‌గిలింది. ఓపెన‌ర్‌గా వ‌చ్చిన బేత్ మూనీ మొద‌టి ఓవ‌ర్‌లోనే కెప్టెన్ మూనీ రిటౌర్డ్ హ‌ర్ట్‌గా మైదానం వీడింది.

Mohammed Siraj: మహ్మద్ సిరాజ్ ఆ పనితో ఫ్యాన్స్ ఫిదా! హైదరాబాదీ బౌలర్‌ను ఆకాశానికెత్తుతున్న ఫ్యాన్స్, ఇంతకీ సిరాజ్ చేసిన పనేంటో ఈ వీడియోలో చూడండి

VNS

ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆడుతున్న సందర్భంగా మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) బౌండరీ లైన్‌ దగ్గర ఫీల్డింగ్‌ చేస్తున్నాడు. ఆ సమయంలో తన వెనుక గ్యాలరీలో ఉన్న అభిమానులు కేరింతలు కొడుతున్నాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని తనకు డ్రింక్స్‌ కావాలని అడగడంతో సిరాజ్‌.. తన ఎనర్జీ డ్రింక్స్‌లోంచి ఒక బాటిల్‌ను అభిమానికి ఇచ్చేశాడు.

Danielle Wyatt's Engagement: అప్పుడు కోహ్లీకి ప్రపోజ్, ఇప్పుడు మరో యువతితో ఎంగేజ్‌మెంట్, ఇంగ్లాండ్ స్టార్‌ బ్యాట్స్‌ఉమెన్ డేనియల్ సంచలన నిర్ణయం

VNS

ఈ సారి ఆమె తన జీవిత భాగస్వామిని (Life Partner) పరిచయం చేసింది. ఫుట్‌బాల్‌ ఏజెంట్‌ (womens football at CAA Base and an FA-licensed agent ) జార్జి హోడ్జే (Georgie Hodge) తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని డేనియల్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. జార్జిని ముద్దు పెట్టుకుంటున్న ఫొటోను షేర్‌ చేసింది.

IND vs AUS 3rd Test 2023: రెండో ఇన్నింగ్స్‌లో చెత్తగా ఆడిన బ్యాటర్లు, ఆస్ట్రేలియాకు 76 పరుగుల లక్ష్యాన్ని విధించిన భారత్, 8 వికెట్లతో నాథన్ లయన్ ఇండియాపై సరికొత్త రికార్డు

Hazarath Reddy

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన మూడో టెస్టులో భారత్ చతికిల పడింది. తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో163 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఆస్ట్రేలియాకు 76 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.

Advertisement

Umesh Yadav Bowls Video: వీడియో ఇదే.. నిప్పులు చెరిగే బంతులతో స్టార్క్‌ను క్లీన్‌బౌల్డ్‌ ఉమేష్ యాదవ్, గాల్లో పల్టీలు కొడుతూ నాట్యం చేసిన వికెట్లు, స్వదేశంలో 100 వికెట్ల క్లబ్‌లోకి యాదవ్

Hazarath Reddy

ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఉమేశ్‌ యాదవ్‌ నిప్పులు చెరిగాడు. స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేయడంతో కీలకంగా వ్యవహరించాడు.

IND vs AUS: చేతి వేలుకి రక్తం కారుతున్న బౌలింగ్ కొనసాగించిన మిచెల్‌ స్టార్క్‌, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్, రెండో రోజు బ్యాటింగ్ కొనసాగిస్తున్న భారత్

Hazarath Reddy

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా ఇండోర్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో తొలి రోజు భారత్‌ 109 పరుగులకే ఆలౌట్‌ కాగా.. 156/4 స్కోర్‌ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 197 పరుగులకే అలౌట్ అయింది. 88 పరుగుల వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ 18 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది.

IND vs AUS 3rd Test 2023 Day 1: 109 పరుగులకే కుప్పకూలిన ఇండియా, ఆస్ట్రేలియాతో మూడవ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైన బ్యాటర్లు

Hazarath Reddy

ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆసీస్‌ స్పిన్నర్ల విజృంభణతో 33.2 ఓవర్లలో ఈ మేరకు స్కోరు చేసి తొలి ఇన్నింగ్స్‌ ముగించింది. తొలి రోజు నుంచే బంతి స్పిన్‌కు టర్న్‌ అవుతున్న నేపథ్యంలో రోహిత్‌ సేన తక్కువ స్కోరుకే పరిమితమైంది

Ravichandran Ashwin: టెస్టుల్లో నంబర్ వన్ బౌలర్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ను వెనక్కి నెట్టేసిన భారత స్పిన్నర్

Hazarath Reddy

టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 1 బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ను వెనక్కినెట్టి మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు

Advertisement

Jasprit Bumrah to Miss IPL 2023: ఐపీఎల్ నుంచి బుమ్రా అవుట్, ముంబై ఇండియన్స్‌కి పెద్ద ఎదురుదెబ్బ, వెన్ను నొప్పితో బాధపడుతున్న భారత్ పేసర్

Hazarath Reddy

ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్, పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఐపీఎల్-2023కి దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఒక స్పోర్ట్స్ మీడియా సంస్థ వెల్లడించింది. బుమ్రా కొంత కాలంగా వెన్ను నొప్పి (బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్)తో బాధపడుతున్నాడు.

T-20 Worst Record: టీ20లో అత్యంత చెత్త రికార్డు ఇదే.. 10 పరుగులకే టీమ్ ఆలౌట్..

Rudra

టీ-20 క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డు నమోదైంది. ‘ఐల్ ఆఫ్ మ్యాన్’-‘స్పెయిన్’ జట్ల మధ్య కార్గజెనాలోని లా మంగా క్లబ్ బోటమ్ గ్రౌండ్‌లో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లో ఈ చెత్త రికార్డు నమోదైంది.

PSL 2023: వీడియో ఇదిగో.. షాహిన్ అఫ్రిది సంధించిన వేగానికి విరిగిన బ్యాట్, రెండో బంతికి స్టంప్ గాల్లోకి, సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న క్లిప్

Hazarath Reddy

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2023 సీజన్‌లో ఖలందర్ తరపున ఆడుతున్న షాహీన్‌ అఫ్రిది నిప్పులు చెరిగే బంతులతో చెలరేగాడు. ఖలందర్స్ నిర్ధేశించిన 242 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పెషావర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు.

IPL 2023: ముంబై ఇండియన్స్‌కు షాక్, ఐపీఎల్ నుంచి బుమ్రా పూర్తిగా అవుట్, గాయం కారణంగా గత ఆరు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న టీమిండియా పేసర్

Hazarath Reddy

గాయం కారణంగా గత ఆరు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న టీమిండియా పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా ఐపీఎల్‌-2023 సీజన్‌తో పాటు జూన్‌లో జరుగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా అందుబాటులో ఉండటం లేదని వార్తలు వస్తున్నాయి.

Advertisement
Advertisement