క్రీడలు

Cristiano Ronaldo: 100 కోట్ల ఫాలోవర్లతో క్రిస్టియానో ​​రొనాల్డో వరల్డ్ రికార్డు, అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో దుమ్మురేపుతున్న ఫుట్‌బాల్ దిగ్గజం

Hazarath Reddy

అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో సహా 1 బిలియన్ కంటే ఎక్కువ మంది అనుచరులను కలిగి ఉన్న ఏకైక వ్యక్తి క్రిస్టియానో ​​రొనాల్డో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. పోర్చగల్‌కు చెందిన స్టార్‌ ఫుట్‌బాల్ ప్లేయర్‌ CR7 ఇటీవలే తన యూట్యూబ్ ఛానెల్ "UR క్రిస్టియానో"ని ప్రారంభించారు.

CPL 2024: దంచికొట్టిన డికాక్, వీడియో చూస్తే షాకవడం పక్కా!

Arun Charagonda

కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో క్వింటర్ డికాక్ అదరగొట్టాడు. బార్బడోస్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డికాక్ 48 పరుగులతో రాణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Ganesh Chaturthi: సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ థీమ్‌తో వినాయక మండపం, ప్రతీ క్షణాన్ని రీక్రియేట్‌ చేసినట్టుగా మండపం, ఫోటో సోషల్ మీడియాలో వైరల్

Vikas M

ఈ మూమెంట్‌కు సంబంధించిన థీమ్‌తో వాపిలో రూపొందించిన వినాయక మండపం భక్తులను విశేషంగా అలరిస్తోంది. ఫ్లడ్‌లైట్ల వెలుతురు, భారత ఫీల్డర్లు ఆసక్తిగా చూస్తుండటం, స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకుల కేరింతలు… ఇలా ప్రతీ క్షణాన్ని రీక్రియేట్‌ చేసినట్టుగా మండపాన్ని మలచడం విశేషం. దీన్నంతటినీ పై నుంచి వినాయకుడు కుర్చీలో కూర్చుని చూస్తున్నట్టుగా రూపొందించారు.

Yuzvendra Chahal Five-Wickets Video: యుజ్వేంద్ర చాహల్ 5 వికెట్ల వీడియో ఇదిగో, కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ టూలో అదరగొట్టిన భారత స్పిన్నర్

Vikas M

కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ టూలో యుజ్వేంద్ర చాహల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు, అతను డెర్బీషైర్‌పై నార్తాంప్టన్‌షైర్‌కు ఐదు వికెట్లు పడగొట్టాడు. చాహల్ బాధితుల్లో వేన్ మాడ్‌సెన్, అన్యూరిన్ డొనాల్డ్, జాక్ చాపెల్, అలెక్స్ థాంప్సన్ మరియు జాక్ మోర్లే ఉన్నారు.

Advertisement

Moeen Ali Retires: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మొయిన్‌ అలీ, ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ రికార్డు ఇదే..

Vikas M

ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. త్వరలో ఆస్ట్రేలియాతో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు గాను సెలక్టర్లు అలీని పక్కనబెట్టిన కొద్దిరోజులకే అతడు ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం.

AFG vs NZ Test: న్యూజిలాండ్-అఫ్గ‌నిస్థాన్ మధ్య టెస్ట్, ఒక్క బంతి కూడా ప‌డకుండానే తొలి రోజు ఆట ర‌ద్ద‌ు

Vikas M

న్యూజిలాండ్(Newzealand), అఫ్గ‌నిస్థాన్(Afghanistan) జ‌ట్ల‌ మధ్య టెస్ట్ ఒక్క బంతి కూడా ప‌డకుండానే తొలి రోజు ఆట ర‌ద్ద‌య్యింది. భారీ వర్షాల కార‌ణంగా గ్రేట‌ర్ నోయిడాలోని స్టేడియం త‌డిసిముద్దైంది. ఔట్ ఫీల్డ్ పూర్తిగా త‌డిగా ఉండ‌డంతో అంపైర్లు టాస్ వేయ‌కుండానే తొఒలి రోజు ఆట‌ను ర‌ద్దు చేశారు

Sourav Ganguly on Rishabh Pant: భారత అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌ రిషబ్‌ పంత్‌, మాజీ దిగ్గజం సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు

Vikas M

టీమిండియా వికెట్ కీపర్, స్టార్ బ్యాట్స్ మెన్ రిషబ్‌ పంత్‌ ను భారత అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా పరిగణిస్తున్నట్టు మాజీ దిగ్గజం సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. పంత్ తిరిగి జట్టులో చోటు దక్కించుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని, అతడు టెస్టుల్లో భారత్‌కు ఆడుతూనే ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. టెస్ట్‌ క్రికెట్‌లో ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా రిషబ్ పంత్ ఎదగాలని గంగూలి అన్నాడు.

Andhra Cricket Association: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేశినేని చిన్ని ఏకగ్రీవం, వరద బాధితులకు రూ. కోటి విరాళం

Arun Charagonda

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవ ఎన్నికయ్యారు. తొలి నిర్ణయంగా వరద బాధితుల కోసం రూ.కోటి విరాళం ప్రకటించారు. అన్ని ప్రాంతాల్లోని నైపుణ్యం గల ఆటగాళ్లను ప్రోత్సహిస్తాం అని తెలిపారు చిన్ని.

Advertisement

Deepthi Jeevanji: పారాలంపియ‌న్ దీప్తికి రేవంత్ రెడ్డి బంపర్ ఆఫ‌ర్, కోటి రూపాయ‌ల న‌గ‌దు, గ్రూప్-2 ఉద్యోగం ప్ర‌క‌ట‌న‌

VNS

పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజిని (Deepthi Jeevanji) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి నగదు బహుమతి, వరంగల్‌లో 500 గజాల స్థలం, కోచ్‌కు రూ.10లక్షలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు.

Paralympic Games 2024: భారత్ ఖాతాలో మరో స్వర్ణం, పురుషుల హైజంప్ ఈవెంట్లో పసిడి పతకం సాధించిన ప్రవీణ్ కుమార్, 6 గోల్డ్ మెడల్స్‌తో టోక్యో రికార్డును దాటిన భారత్

Hazarath Reddy

ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల హైజంప్ ఈవెంట్లో భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పసిడి పతకం సాధించాడు. నోయిడాకు చెందిన 21 ఏళ్ల ప్రవీణ్ కుమార్ హైజంప్ ఫైనల్లో 2.08 మీటర్లతో ప్రథమస్థానంలో నిలిచాడు.

Vinesh Phogat Resigns: రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసిన వినేశ్‌ ఫోగట్‌, నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ (Vinesh Phogat ) కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వినేశ్‌ ఫోగట్‌ తాజాగా కీలక ప్రకటన చేశారు. రైల్వేస్‌లో తన ఉద్యోగానికి రాజీనామా (resigns from her post in Indian Railways) చేసినట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు .

Kapil Parmar Wins Historic Bronze: పారాలంపిక్స్ లో చారిత్ర‌క ప‌త‌కం తెచ్చిన అథ్లెట్, భార‌త్ ఖాతాలో 25వ ప‌త‌కం, జూడోలో క‌పిల్ ప‌ర్మార్ కు కాంస్యం

VNS

పారాలింపిక్స్‌లో(Paralympics) భార‌త క్రీడాకారులు రికార్డు స్థాయిలో ప‌త‌కాలు సాధిస్తున్నారు. విశ్వ‌క్రీడ‌ల చ‌రిత్ర‌లో అథ్లెటిక్స్, బ్యాడ్మింట‌న్‌లో దేశానికి తొలిసారి ప‌త‌కాలు రాగా.. తాజాగా జూడోలోనూ క‌పిల్ ప‌ర్మార్(Kapil Parmar) మెడ‌ల్ కొల్ల‌గొట్టాడు. పురుషుల 60 కిలోలు జే1 విభాగంలో క‌పిల్ కాంస్యంతో మెరిశాడు

Advertisement

Paralympics 2024: భారత్ ఖాతాలో మరో పసిడి పతకం,ఆర్చరీ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి క్రీడాకారుడిగా హర్విందర్ సింగ్ రికార్డ్, 24కి చేరిన భారత్ పతకాల సంఖ్య

Arun Charagonda

పారాలంపిక్స్ లో భారత్ ఆటగాళ్లు గతంలో ఎన్నడూ లేని విధంగా సత్తాచాటుతున్నారు. తాజాగా పారా ఆర్చరీ మెన్స్ రికర్వ్ ఓపెన్ ఫైనల్స్ లో సత్తా చాటారు హర్విందర్ సింగ్. పోలాండ్ కు చెందిన లుకాస్జ్ సిజెక్ ను 6-0 తేడాతో ఓడించి స్వర్ణం కైవసం చేసుకున్నారు.

IPL 2025: మళ్లీ ఐపీఎల్‌లోకి రాహుల్ ద్రావిడ్, రాజస్థాన్ రాయల్స్‌ హెడ్‌ కోచ్‌గా ద్రావిడ్

Arun Charagonda

మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ మళ్లీ కోచ్ అవతారం ఎత్తారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా నియమితులయ్యారు. ఇటీవలె ద్రావిడ్ భారత హెడ్ కోచ్ పదవి కాలం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ ప్రాంఛైజీతో ఒప్పందం చేసుకున్నారు ద్రావిడ్.

World Test Championship 2025: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులోకి బంగ్లాదేశ్, ఆ మూడు టీంలకు సవాల్ విసిరేందుకు రెడీ అయిన డార్క్ హార్స్

Vikas M

పాకిస్థాన్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో నెగ్గి చరిత్ర సృష్టించిన ‘డార్క్ హార్స్’ బంగ్లాదేశ్ అనూహ్యంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లోకి దూసుకొచ్చింది. వచ్చే ఏడాది జూన్ 11న ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్న సంగతి విదితమే. ఈ రేసులో ఇండియా, ఆస్ట్రేలియాకు సవాలు విసిరేందుకు బంగ్లా సిద్దమైంది.

Paris Paralympics 2024: పారాలింపిక్స్‌, భారత్ ఖాతాలో మరో రజత పతకం, పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌46లో పతకం గెలిచిన సచిన్ సర్జేరావు ఖిలారీ

Vikas M

పారాలింపిక్స్‌లో భారత్‌ మరో రజత పతకం సాధించింది. పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌46లో ప్రపంచ ఛాంపియన్‌ సచిన్ సర్జేరావు ఖిలారీ (16.32 మీ) రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నాడు. ఈ పారాలింపిక్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో భారత్‌కిది 11వ పతకం.ఇప్పటిరవకు పారిస్ గేమ్స్ లో భారత్ కు 21 పతకాలు లభించాయి.

Advertisement

Paralympics 2024: పారాలింపిక్స్‌లో భారత్ హవా, 20కి చేరిన పతకాల సంఖ్య, ఒక్కరోజే ఐదు పతకాలు,పారాలింపిక్స్ చరిత్రలో ఇదే తొలిసారి

Arun Charagonda

పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 20 పతకాలు చేరగా ఒక్కరోజే 5 పతకాలు వచ్చాయి. స్ప్రింట్ దీప్తి జీవన్‌జీ కి కాంస్యం, మెన్స్ హై జంప్‌ టీ63లో శరద్‌కు సిల్వర్, మరియప్పన్ తంగవేలు కాంస్యం గెలుచుకున్నారు.

Ajay Ratra: బీసీసీఐ కొత్త సెలెక్ట‌ర్‌గా అజ‌య్ రాత్రా, స‌లీల్ అంకోలా స్థానాన్ని భర్తీ చేయనున్న అజయ్, కీలక విషయాన్ని వెల్లడించిన బీసీసీఐ

Vikas M

భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండలి కొత్త సెలెక్ట‌ర్‌గా అజ‌య్ రాత్రా(Ajay Ratra) ఎంపిక‌య్యాడు. ప్ర‌స్తుతం సెలెక్ట‌న్ ప్యానెల్ స‌భ్యుల్లో ఒక‌రైన‌ స‌లీల్ అంకోలా(Salil Ankola) స్థానాన్ని అజ‌య్ భ‌ర్తీ చేయ‌నున్నాడు. ఈ విష‌యాన్ని మంగ‌ళ‌వారం బీసీసీఐ (BCCI) వెల్ల‌డించింది.

Pakistan vs Bangladesh: బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం, టెస్టు సిరీస్‌ క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా, దాయాది దేశంపై టెస్టు సిరీస్‌ గెలవడం ఇదే మొదటిసారి

Vikas M

టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టులో ఆరు వికెట్ల తేడాతో బంగ్లా విజ‌యం నమోదు చేసింది. అయిదో రోజు టీ బ్రేక్‌కు ముందే.. బంగ్లా మ్యాచ్‌ను ముగించేసింది. స్వంత గ‌డ్డ‌పై దాయాది దేశానికి ఘోర ప‌రాభ‌వం ఎదురైంది.పాక్‌పై బంగ్లాదేశ్‌ టెస్టు సిరీస్‌ గెలవడం ఇదే మొదటిసారి.

ICC World Test Championship 2025 Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ తేదీ వచ్చేసింది, తొలిసారి వేదిక కానున్న లార్డ్స్ మైదానం, పూర్తి వివరాలు ఇవే..

Vikas M

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ తేదీని, వేదికను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్ వచ్చే ఏడాది జూన్ 11 నుంచి 15వ తేదీ వరకు లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతుందని ఐసీసీ తెలిపింది. జూన్ 16ను రిజర్వ్ డేగా ప్రకటించింది.

Advertisement
Advertisement