క్రీడలు

Virat Kohli New Record: ఒకే వేదికపై 100 T20లు ఆడిన మొదటి భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు, అధికారికంగా తెలిపిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

Hazarath Reddy

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో లేదా ఏ ఒక్క వేదికలోనైనా 100 టీ20 మ్యాచ్‌లు ఆడిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. RCB vs LSG IPL 2024 మ్యాచ్‌లో ఈ రికార్డును విరాట్ నెలకొల్పాడు. RCB వారి అధికారిక 'X' హ్యాండిల్‌లో దీనిపై పోస్ట్‌ పెట్టి అభిమానులకు తెలియజేసింది ఆర్సీబీ.

IPL 2024 MI vs RR: ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ రాయల్స్ గెలుపు.. 6 వికెట్ల తేడాతో విజయం.. ముంబైకి వరుసగా మూడో ఓటమి.

sajaya

హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబయి 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పూర్తిగా విఫలం కావడంతో ఆ జట్టు తొలుత ఆడుతున్న సమయంలో 9 వికెట్లకు 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. 16వ ఓవర్లో రాజస్థాన్ మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

DC Win By 20 Runs: ఈ సీజ‌న్ లో బోణీ కొట్టిన ఢిల్లీ, పంత్, వార్న‌ర్ విజృంభ‌ణ‌తో చెన్నై సూప‌ర్ కింగ్స్ కు హ్యాట్రిక్ మిస్

VNS

ఐపీఎల్‌లో (IPL) బోణీ కొట్ట‌ని ఢిల్లీ (Delhi Win) హ్యాట్రిక్ ఓట‌మి త‌ప్పించుకుంది. కీల‌క పోరులో సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో చెన్నైకి (CSK) చెక్ పెట్టింది. భారీ ఛేద‌న‌లో చెన్నై చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను ఖ‌లీల్ అహ్మ‌ద్ ఆదిలోనే హ‌డలెత్తించాడు. వ‌రుస ఓవ‌ర్ల‌లో రుతురాజ్ గైక్వాడ్‌(1), ర‌చిన్ ర‌వీంద్ర‌(2)ల‌ను ఔట్ చేశాడు.

IPL 2024, SRH vs GT: అయ్యో హైదరాబాద్..గుజరాత్ దెబ్బకు మట్టికరిచిన సన్ రైజర్స్..7 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం..

sajaya

SRH vs GT: సన్ రైజర్స్పై గుజరాత్ పై చేయి సాధించింాది. 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసిన గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. వివరాల్లోకి వెళితే ఐపీఎల్ 2024 12వ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.

Advertisement

LSG Vs PBKS: హోం గ్రౌండ్ లో చిత‌క్కొట్టిన ల‌క్నో, 21 ప‌రుగుల తేడాతో పంజాబ్ పై విజ‌య‌దుందుబి

VNS

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో లఖ్‌నవూ (Lucknow) బోణీ కొట్టింది. సొంత గడ్డపై పంజాబ్‌తో (Punjab) జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు (Lsg Vs Pbks) దిగిన పంజాబ్‌ దంచికొట్టింది.

Moment of the Day: 11 ఏండ్ల త‌ర్వాత క‌లిసిపోయిన కోహ్లీ-గంబీర్, కేకేఆర్-ఆర్సీబీ మ్యాచ్ లో ఆసక్తిక‌ర‌మైన ఘ‌ట‌న‌, న‌వ్వుతూ మాట్లాడుకున్న ఇరువురు

VNS

కోహ్లి ఇద్ద‌రూ ఒకరినొకరు అప్యాయంగా ప‌లక‌రించుకుంటూ హగ్ చేసుకున్నారు. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య 11 ఏళ్ల‌గా కొనసాగుతున్న వైర్యానికి తెర‌ప‌డింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియా వైరల్ అవుతున్నాయి.

RCB vs KKR: వ‌రుస‌గా రెండో మ్యాచ్ లోనూ కోల్ క‌తా గ్రాండ్ విక్ట‌రీ, ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో విజ‌యం, వృధాగా మారిన కోహ్లీ వ‌న్ మ్యాన్ షో

VNS

ఐపీఎల్‌ 2024లో భాగంగా కోల్‌కతా వరుసగా (RCB vs KKR) రెండో విజయం సాధించింది. బెంగళూరుతో జరిగిన పోరులో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో నెగ్గింది. 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెంకటేశ్‌ అయ్యర్‌ (50) అర్ధశతకం చేయగా, సునీల్‌ నరైన్‌ (47), ఫిలప్‌ సాల్ట్‌(30), శ్రేయస్‌ అయ్యర్‌(39*) (Shreyas Iyer) రాణించారు.

Riyan Parag Dance Videos: రాత్రికిరాత్రే స్టార్ అయిపోయిన రియాన్ పరాగ్, పాత డ్యాన్స్ వీడియోలు వైరల్, ఒంటిచేత్తో స్కోరుబోర్డును పరుగులు పెట్టించి రాజస్థాన్ కు విజయం అందించిన రియాన్

Hazarath Reddy

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో మాజీ చాంపియన్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ సొంతగడ్డపై వరుసగా రెండో విజయాన్ని సాధించింది. టాపార్డర్‌ చేతులెత్తేసిన వేళ రియాన్‌ పరాగ్‌ (45 బంతుల్లో 84 నాటౌట్‌; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లందరినీ ఉతికి ఆరేయడంతో రాజస్తాన్‌ రాయల్స్‌ 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది.

Advertisement

Rishabh Pant Frustration Video: రిషబ్ పంత్ ప్రస్టేషన్ వీడియో ఇదిగో, అసహనంతో బ్యాట్‌ను కర్టెయిన్‌కేసి బాదిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్

Hazarath Reddy

మార్చి 28 రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 186 పరుగుల లక్ష్య ఛేదనలో కీలకమైన దశలో ఔట్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. 26 బంతులు ఎదుర్కొన్న పంత్ కేవలం 28 పరుగులే చేశాడు.

IPL 2024, SRH vs MI : ఉత్కంఠ పోరులో ముంబైపై హైదరాబాద్‌ ఘన విజయం, 31 పరుగుల తేడాతో గెలుపు..రికార్డు టార్గెట్ ఛేదనలో పోరాడి ఓడిన ముంబై..

sajaya

IPL 2024 8వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. దీంతో ముంబై జట్టు 20 ఓవర్లలో 246/5 ​​పరుగులు మాత్రమే చేయగలిగింది.

IPL CSK vs GT: చెపాక్‌ స్టేడియంలో చెన్నైకి భారీ విజయం..చిత్తుగా ఓడిన గుజరాత్ టైటాన్స్..

sajaya

ఐపీఎల్ 2024 ఏడో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను 63 పరుగుల తేడాతో ఓడించింది. ఈ సీజన్‌లో ఆ జట్టుకు ఇది వరుసగా రెండో విజయం.

Fan Touches Virat Kohli's Feet: వీడియో ఇదిగో, ఫ్యాన్స్‌పై విరాట్ కోహ్లీ మంచి మనసు, గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి కాళ్లు మొక్కిన అభిమానిపై కోహ్లీ రియాక్షన్ ఇదే..

Hazarath Reddy

ఐపీఎల్‌-2024లో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, పంజాబ్ కింగ్స్ జ‌ట్లు తలపడిన సంగతి విదితమే. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటింగ్ సంద‌ర్భంగా ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది, పోలీసుల కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు.విరాట్ కోహ్లి వ‌ద్ద‌కు వెళ్లి కాళ్లకు మొక్కి తన అభిమానాన్ని ప్రదర్శించాడు

Advertisement

Virat Kohli Viral Video: గెలిచిన ఆనందంలో భార్యా పిల్లలకు ముద్దులు ఇస్తూ కెమెరాకు చిక్కిన విరాట్ కోహ్లీ, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

విరాట్‌ తన మెరుపు ఇన్నింగ్స్‌కు ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న అనంతరం విరాట్‌ లండన్‌లో ఉంటున్న తన కుటుంబంతో వీడియో కాల్‌ మాట్లాడాడు.తన కుటుంబంపై ముద్దుల వర్షం కురిపిస్తూ కనిపించాడు.

Virat Kohli: ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుల్లో ధోనీ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ, టాప్‌లో కొనసాగుతున్న ముంబై ఇండియన్స్‌ మాజీ సారధి రోహిత్‌ శర్మ

Hazarath Reddy

ఈ మ్యాచ్‌లో "ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌"గా నిలిచిన ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి.. ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉండిన సీఎస్‌కే మాజీ కెప్టెన్‌ ఎం​ఎస్‌ ధోని రికార్డును కోహ్లి సమం చేశాడు.

Virat Kohli Most Catches Record: సురేష్ రైనా రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ, టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న భార‌త క్రికెట‌ర్‌గా రికార్డు

Hazarath Reddy

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో బెయిర్ స్టో క్యాచ్‌ను అందుకున్న కోహ్లి.. టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న భార‌త క్రికెట‌ర్‌గా అరుదైన ఘ‌న‌తను త‌న పేరిట లిఖించుకున్నాడు.కోహ్లి ఇప్పటివ‌ర‌కు టీ20ల్లో 173 క్యాచ్‌లు అందుకున్నాడు.

Virat Kohli New Record: టీ20ల్లో 100 సార్లు 50 ప్ల‌స్ ర‌న్స్, తొలి భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు, తొలి స్ధానంలో కొనసాగుతున్న క్రిస్ గేల్‌

Hazarath Reddy

చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన ఉత్కంఠ పోరులో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించి ఐపీఎల్‌-2024లో బోణీ కొట్టింది. 177 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది.ఈ మ్యాచ్‌లో విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌ను ఆడిన కోహ్లి.. ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు.

Advertisement

Jasprit Bumrah Yorker Video: జస్ప్రీత్ బుమ్రా స్టన్నింగ్ యార్కర్ వీడియో ఇదిగో, బిత్తరపోయిన అలాగే చూస్తుండి పోయిన వృద్ధిమాన్ సాహా

Hazarath Reddy

ఐపీఎల్‌-2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా అద్బుతమైన యార్కర్‌ వీడియో వైరల్ అవుతోంది. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహాను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. తొలుత గుజరాత్ టైటాన్స్‌ను బ్యాటింగ్‌కు​ అహ్హనించాడు.

IPL 2024: గుజరాత్-ముంబై మ్యాచులో తన్నుకున్న అభిమానులు, ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్న వీడియో వైరల్

Hazarath Reddy

నిన్న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్-ముంబై మ్యాచులో ఘర్షణ జరిగింది. గ్యాలరీలో ఉన్న ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.ముంబై, గుజరాత్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగినట్లుగా సమాచారం.

Rohit Sharma Vs Hardik: ముంబై తో మ్యాచ్ లో పాండ్యాకు చుక్కలు చూపించిన రోహిత్ ఫాన్స్, మ్యాచ్ జరుగుతున్నంతసేపూ రోహిత్ నామస్మరణే

VNS

మైదానంలో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య మధ్య ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తొలుత రోహిత్ శర్మ స్లిప్ లో ఫీల్డింగ్ కు వెళ్లాడు. కానీ, హార్దిక్ ఫీల్డింగ్ పొజిషన్ ను మార్చాలని సూచించడంతో.. రోహిత్ మరో స్థానానికి వెళ్లాడు

IPL 2024, KKR vs SRH: అయ్యో హైదరాబాద్..క్లాసెన్ కష్టం మొత్తం బూడిదపాలు..ఉత్కంఠభరిత మ్యాచులో సన్ రైజర్స్ పై 4 పరుగుల తేడాతో విజయం సాధించిన కోల్ కత నైట్ రైడర్స్

sajaya

IPL 2024 మూడో మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ పై 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Advertisement
Advertisement