క్రీడలు
Yashasvi Jaiswal: సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును బ్రేక్ చేసిన యశస్వీ జైస్వాల్‌, ఇంగ్లండ్‌పై అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా రికార్డు
Hazarath Reddyతొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌.. బషీర్‌ వేసిన ఓ ఓవర్లో మూడు సిక్సర్లు బాదాడు. దీంతో ఒక జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న రికార్డును బ్రేక్‌ చేశాడు. సచిన్‌.. ఇంగ్లండ్‌ పై 74 ఇన్నింగ్స్‌లలో 25 టెస్టులు కొట్టగా తాజాగా యశస్వీ.. అదే ఇంగ్లీష్‌ టీమ్‌పై 26 సిక్సర్లు బాదాడు. సౌతాఫ్రికాపై రోహిత్‌ శర్మకు 20 ఇన్నింగ్స్‌లలో 22 సిక్సర్లున్నాయి.
Yashasvi Jaiswal: టెస్టుల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన రెండో భారత క్రికెటర్‌గా యశస్వీ జైస్వాల్‌ రికార్డు, 16 ఇన్నింగ్స్‌లలో ఘనత..
Hazarath Reddyటెస్టులలో భారత్‌ తరఫున అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన వారిలో జైస్వాల్‌ రెండోవాడిగా రికార్డు నెలకొల్పాడు. 9వ టెస్టు ఆడుతున్న జైస్వాల్‌.. 16 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత అందుకోగా వినోద్‌ కాంబ్లీ.. 12 టెస్టులలో 14 ఇన్నింగ్స్‌లలోనే వెయ్యి పరుగులు పూర్తిచేశాడు.
Shubman Gill Six Video: బంతిని చూడకుండానే భారీ సిక్సర్‌ బాదిన శుబ్‌మన్‌ గిల్‌, బిత్తరపోయిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, వీడియో ఇదిగో..
Hazarath Reddyటీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ అద్బుతమైన షాట్‌తో మెరిశాడు.బంతిని చూడకుండానే భారీ సిక్సర్‌ బాదాడు. భారత ఇన్నింగ్స్‌ 33 ఓవర్‌ వేసిన జేమ్స్‌ ఆండర్సన్‌ రెండో బంతిని గుడ్‌ లెంగ్త్‌ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో స్ట్రైక్‌లో ఉన్న గిల్‌ ఫ్రంట్‌ ఫుట్‌కు వచ్చి బంతిని చూడకుండానే స్ట్రైట్‌గా భారీ సిక్సర్‌గా మలిచాడు.
Steve Smith Dismissal Video: వీడియో ఇదిగో, బెన్ సియర్స్ అద్భుతమైన బంతికి బిత్తరపోయిన స్టీవ్ స్మిత్, LBWగా పెవిలియన్‌కి..
Hazarath ReddyNZ vs AUS 2వ టెస్ట్ 2024: న్యూజిలాండ్ vs ఆస్ట్రేలియా 2వ టెస్టులో స్టీవ్ స్మిత్ LBW అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెన్ సియర్స్ అధ్భుతమైన బంతికి స్టీవ్ స్మిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూకి వెళ్ళినప్పటికీ లాభం లేకపోయింది.
Rohit Sharma Dismissal Video: బెన్ స్టోక్స్ మ్యాజిక్ బంతికి క్లీన్ బౌల్డ్ అయిన రోహిత్ శర్మ, టీమిండియా కెప్టెన్ ఎక్స్‌ప్రెషన్స్ వీడియో ఇదిగో..
Hazarath Reddyరోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మధ్య 171 పరుగుల భాగస్వామ్యానికి ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తెరదించాడు. 162 బంతుల్లో 103 పరుగుల వద్ద రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా కాలంగా బౌలింగ్ చేయని స్టోక్స్ అద్భుతమైన డెలివరీ సంధించాడు.
Devdutt Padikkal Test Fifty Video: సిక్స్ కొట్టి హాప్ సెంచరీ పూర్తి చేసుకున్న దేవదత్ పడిక్కల్, ఆడిన తొలి మ్యాచ్‌లోనే అర్థ సెంచరీతో కదం తొక్కిన భారత్ యువ ఆటగాడు, వీడియో ఇదిగో..
Hazarath Reddyభారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న 5వ టెస్టులో యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ అరంగేట్రం చేశాడు.అతను తన తొలి మ్యాచ్ లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పడిక్కల్ బంతిని సిక్సర్ బాది యాభైకి చేరుకున్నాడు. భారత్‌కు రెండు వికెట్లు త్వరితగతిన పడిన తర్వాత అతను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు మంచి టచ్‌లో కనిపించాడు
Ravi Ashwin 100 Tests: అశ్విన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు, 100వ టెస్ట్ ఆడుతున్న 14వ ఇండియన్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పిన టీమిండియా స్పిన్నర్
Hazarath Reddyటీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఖాతాలోకి మరో రికార్డు వచ్చి చేరింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఇంగ్లండ్‌తో నేడు ప్రారంభమైన చివరిదైన ఐదో టెస్టు అశ్విన్‌కి కెరియర్‌లో వందో టెస్టు మ్యాచ్. ఈ రికార్డు నెలకొల్సిన 14వ ఇండియన్‌గా చరిత్రలోకి అశ్విన్ ఎక్కాడు
Shubman Gill Super Catch Video: వెనకకు 20 గజాల దూరం పరిగెత్తుతూ శుబ్‌మన్‌ గిల్‌ కళ్లు చెదిరే క్యాచ్‌, ఇంగ్లండ్ బ్యాటర్ డకెట్‌ను పెవిలియన్‌కి పంపిన సూపర్‌ క్యాచ్‌ వీడియో ఇదిగో..
Hazarath Reddyధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌- భారత్‌ మధ్య ఆఖరి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. మొదటి రోజు ఆటలో భారత యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు. ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌లో కుల్దీప్‌ యాదవ్‌ ఆరో డెలివరీని బెన్‌ డకెట్‌కు గుగ్లీగా సంధించాడు.
Shraddha & Shreyas Spark Dating Rumours: టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ ప్రేమ‌లో బాలీవుడ్ టాప్ హీరోయిన్, సోష‌ల్ మీడియాలో ఒక‌రినొక‌రు ఫాలో అవుతున్న శ్ర‌ద్ధ క‌పూర్, శ్రేయాస్ అయ్య‌ర్
VNSఓ బాలీవుడ్ హీరోయిన్‌తో మొద‌లైన స్నేహం ప్రేమ‌గా మారింద‌ని స‌ద‌రు వార్త‌ల సారాంశం. ఆమె మ‌రెవ‌రో కాద‌ని బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ (Shraddha Kapoor) అని అంటున్నారు. శ్ర‌ద్ధా క‌పూర్ (Shraddha Kapoor) టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు సైతం సుప‌రిచిత‌మే.
WPL 2024: మహిళా క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతి ఇదిగో, 132.1 కిమీ వేగంతో బంతిని సంధించిన ముంబై ఇండియన్స్ బౌలర్ షబ్నిమ్‌ ఇస్మాయిల్‌
Hazarath Reddyమహిళల ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (మార్చి 5) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బౌలర్‌ షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ (సౌతాఫ్రికా) మహిళల క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగవంతమై బంతిని విసిరిన క్రికెటర్ గా రికార్డు నెలికొల్పింది.
ISPL 2024 Opening Ceremony: సెలబ్రిటీలతో అదరహో అనిపిస్తున్న ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ టీ10 లీగ్‌, వీడియోలు, చిత్రాలు ఇవిగో..
Hazarath Reddyలోకల్‌ టాలెంట్‌ను వెలికి తీయడమే లక్ష్యంగా పురుడుపోసుకున్న ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ టీ10 లీగ్‌ (ISPL) నేడు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ లీగ్‌లో (Indian Street Premier League) మొత్తం ఆరు జట్లు పోటీపడనుండగా.. ఈ జట్లను టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ తారలు కొనుగోలు చేశారు
Sachin Dance to Naatu Naatu Song: నాటు నాటు పాటకు చిందేసిన సచిన్ టెండూల్కర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyఐఎస్‌పీఎల్‌ ప్రారంభానికి ముందు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌, సూర్య, అక్షయ్‌ కుమార్‌లతో కలిసి హైదరాబాద్‌ జట్టు ఓనర్‌ రామ్‌చరణ్‌ సందడి చేశారు.చెర్రీ వీరందరితో ట్రిపుల్‌ ఆర్‌ ఫేమ్‌ నాటు నాటు పాటకు స్టెప్పులేయించాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
Sachin Tendulkar Six Video: సచిన్ టెండూల్కర్‌ భారీ సిక్సర్ బాదిన వీడియో ఇదిగో, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ బౌలింగ్‌ని ఉతికి ఆరేసిన లిటిల్ మాస్టర్
Hazarath Reddyమ్యాచ్ ప్రారంభానికి ముందు, గొప్ప ప్రారంభ వేడుక జరిగింది. లెజెండరీ ఇండియన్ క్రికెటర్, సచిన్ టెండూల్కర్ యొక్క మాస్టర్స్ 11 మరియు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ యొక్క ఖిలాడీ XI మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది.
Sachin Tendulkar Dismissal Video: సచిన్ టెండూల్కర్‌‌ని పెవిలియన్‌కి పంపిన బిగ్ బాస్ 7 విన్నర్ మునవర్ ఫరూఖీ, వీడియో ఇదిగో..
Hazarath Reddyభారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌.. మునవర్ ఫరూఖీ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. సచిన్ 17 బంతుల్లో 30 పరుగులు చేసి Big Boss 17 Winner Munawar Faruqui బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
BCCI Annual Contracts: గ్రేడ్ ఏ ప్లస్ కేటగిరీలో 4 గురికి మాత్రమే చోటు, గ్రేడ్ B నుండి గ్రేడ్ Aకి ప్రమోషన్ పొందిన భారత క్రికెటర్ల లిస్టు ఇదే..
Hazarath Reddyబిసిసిఐ నిర్ణయించిన కాంట్రాక్ట్ స్ట్రక్చర్ ప్రకారం , గ్రేడ్ ఎ-ప్లస్ కింద వర్గీకరించబడిన ఆటగాళ్లకు రూ. 7 కోట్లు, గ్రేడ్ ఎలో ఉన్నవారికి రూ. 5 కోట్లు అందజేస్తారు. ఇంకా, గ్రేడ్ B మరియు గ్రేడ్ C కేటగిరీలలో ఉంచబడిన వ్యక్తులు వరుసగా రూ. 3 కోట్లు మరియు రూ. 1 కోటి వార్షిక వేతనం పొందుతారు
Yuzvendra Chahal Viral Video: భయమేస్తుంది నన్ను వదిలేయ్ తల్లీ రెజ్లర్ ను వేడుకున్న టీమిండియా క్రికెటర్, వైరల్ గా మారిన వీడియో ఇదుగోండి!
VNSఫోగట్ చాహల్ ను భుజాలపైకి ఎత్తుకొని గిరగిరా తిప్పింది. చాహల్ బక్కపలచగా ఉండటంతో సంగీత ఫోగట్ తేలిగ్గా తన భుజాలపైకి ఎత్తికుంది. గిరగిరా రెండురౌండ్లు తిప్పింది. ఆందోళనతో చాహల్ ‘నన్ను వదిలేయ్ తల్లీ.. నేను దిగిపోతా’ అన్నట్లుగా ఫోగట్ ను వేడుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ యింది.
UPW-W vs GG-W WPL 2024: మూడో మ్యాచ్ లోనూ రాణించ‌లేక‌పోయిన గుజ‌రాత్, ఐదు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించిన యూపీ వారియ‌ర్స్
VNSమహిళల ప్రీమియర్ లీగ్ (WPL -2024) లో శుక్రవారం జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) జట్టుపై యూపీ వారియర్స్ (UP Warriors) జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఆష్ లైగ్ గార్డనర్ 30, ఫోబే లిచ్ ఫీల్డ్ 35, లారా వోల్వార్డ్ 28 పరుగులు చేశారు.
PSL -9: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కు ఫుడ్ పాయిజ‌న్, ముగ్గురి ప‌రిస్థితి విష‌మం, ఆహారం తిని 13 మంది ప్లేయ‌ర్ల‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌
VNSపాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL) 09వ సీజన్‌లో ఫుడ్‌ పాయిజన్‌ కలకలం రేపింది. కరాచీ కింగ్స్‌కు (Karachi Kings) చెందిన 13 మంది క్రికెటర్లు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. వీరిలో సుమారు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది
Andhra Cricket Controversy: రాజకీయ రంగు పులుముకున్న హనుమ విహారి-ఆంధ్రా క్రికెట్ వివాదం, అతనికి అండగా ఉంటామని తెలిపిన చంద్రబాబు, వైఎస్ షర్మిల
Hazarath Reddyవైసీపీ రాజకీయ కక్షలకు, ప్రతీకార రాజకీయాలకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లొంగిపోవడం సిగ్గుచేటని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండించారు.హనుమ విహారిని వేధించారని అతడికి తాము అండగా ఉండి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు
Mohammed Shami Reacts PM Modi Tweet: ధన్యవాదాలు సర్ అంటూ ప్రధాని మోదీకి రిప్లయి ఇచ్చిన మహ్మద్ షమీ, మడమ శస్త్రచికిత్స నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన భారత ప్రధాని
Hazarath Reddyభారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ చీల మండకు గాయం కావడంతో దానికి శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి విదితమే. మడమ శస్త్రచికిత్స విజయవంతమయినట్లు, శస్త్రచికిత్స తర్వాత ఫోటోలను పంచుకున్నాడు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షించారు