క్రికెట్
Sreesanth: అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్, యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకు క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయం
Hazarath Reddyటీమిండియా ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా శ్రీశాంత్ స్పందిస్తూ... యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకు క్రికెట్ కు ముగింపు పలుకుతున్నానని చెప్పాడు.
Sreesanth Announces Retirement : రిటైర్మెంట్ ప్రకటించిన మరో క్రికెటర్, రానున్న తరాల కోసమే క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అనౌన్స్ మెంట్, భావోద్వేగానికి లోనైన శ్రీశాంత్
Naresh. VNSమిండియా వెటరన్ పేస్ బౌలర్ శ్రీశాంత్ (Sreesanth) అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. నెక్స్ట్ జనరేషన్ కోసం కెరీర్ ను (Retirement) ముగించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు. అన్ని రకాల పోటీల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటన చేశాడు. తర్వాతి తరం క్రికెటర్ల కోసం తాను ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ ను (Indian Domestic Cricket) ముగించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Joe Root: ఎలా బౌల్ట్ అయ్యాను..షాక్ తిన్న జో రూట్, బాల్ వేగాన్ని అంచ‌నా వేయ‌కుండా బ్యాట్‌ను పైకి లేపిన ఇంగ్లండ్ ఆటగాడు, వికెట్లను ముద్దాడిన బంతి
Hazarath Reddyవెస్టిండీస్‌-ఇంగ్లండ్ మ‌ధ్య తొలి టెస్టు మ్యాచు జ‌రుగుతోంది. ఈ మ్యాచులో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్ ఊహించ‌ని రీతిలో ఔట‌య్యాడు. బాల్ వేగాన్ని అంచ‌నా వేయ‌కుండా బ్యాట్‌ను ఆయ‌న‌ పైకి లేపగా, ఆ బాల్ బ్యాట్ కింది నుంచి వెళ్లి వికెట్ల‌కు త‌గిలింది.
BCCI Announces IPL 2022 Schedule: మార్చి 26 నుంచి క్రికెట్ ప్రేమికుల పండగ IPL 2022 సీజన్ ప్రారంభం, పూర్తి షెడ్యూల్ వివరాలు మీకోసం...
Krishnaఐపీఎల్ 2022 టోర్నీ పూర్తి షెడ్యూల్ ను ప్రకటించింది బీసీసీఐ పాలకమండలి. దాని ప్రకారం మార్చి 26వ తేదీన ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ సీజన్ 15లో ఫస్ట్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ - రన్నరప్ కోల్ కలతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది.
ICC Women’s World Cup India vs Pakistan: మహిళా క్రికెట్ ప్రపంచ కప్ లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయం, 107 పరుగుల తేడాతో భారత్ విజయం
Krishnaప్రపంచ కప్ వన్డే మహిళల క్రికెట్ లో భారత జట్టు పాకిస్థాన్ పై (India Vs Pakistan)అఖండ విజయం సాధించింది. 107 పరుగుల తేడాతో భారత్ విజయం సొంతం చేసుకుంది.
India vs Sri Lanka,1st Test, Day 3: జడేజా మాయాజాలం, భారీ ఆధిక్యంలో భారత్, ఫస్ట్ ఇన్నింగ్స్ లో శ్రీలంక 174 పరుగులకు ఆలౌట్, 400 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
Naresh. VNSరవీంద్ర జడేజా (Ravindra Jadeja ) అత్యద్భుత ప్రదర్శన చేశాడు. ఏకంగా ఐదు వికెట్లు నేలకూల్చి శ్రీలంక నడ్డి విరిచాడు. తొలి ఇన్నింగ్స్ లో 174 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నిశాంక 61 (Nishanka) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మిగతా బ్యాట్స్ మెన్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఓవర్ నైట్ బ్యాట్స్ మెన్ నిశాంక (26), అసలంక (1) ఆటను ఆరంభించారు. వీరిద్దరూ జాగ్రత్త పడుతూ ఆడారు.
Shane Warne No More: అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు, సూపర్‌ స్టార్‌ షేన్‌వార్న్‌ ఇకలేరనే విషయం బాధాకరం, వీరేంద్ర సెహ్వాగ్‌ ట్విటర్‌లో సంతాపం
Hazarath Reddyఅస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. కూల్‌ స్పిన్‌కు వార్న్‌ పెట్టింది పేరు.. సూపర్‌ స్టార్‌ షేన్‌వార్న్‌ ఇకలేరనే విషయం బాధాకరం. మనిషి జీవితంలో ఎప్పుడేమవుతుందో చెప్పలేం. జీవితాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వార్న్‌ కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి’ అని వీరేంద్ర సెహ్వాగ్‌ ట్విటర్‌లో సంతాపం తెలిపారు.
Shane Warne No More: మాటలు రావడం లేదు, ఇంత త్వరగా కాలం చేయడం విషాదకరం, షేన్‌ వార్న్‌ మృతిపై వీవీఎస్‌ లక్ష్మణ్‌ సంతాపం
Hazarath Reddyషేన్‌ వార్న్‌ మృతి విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా. మాటలు రావడం లేదు. క్రికెట్‌ ప్రపంచంలో లెజెండ్‌. ఆటలో ఎంతో ఎత్తుకు ఎదిగిన వ్యక్తి. ఇంత త్వరగా కాలం చేయడం విషాదకరం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి’ అని వీవీఎస్‌ లక్ష్మణ్‌ సంతాపం తెలిపారు.
Shane Warne No More: స్పిన్ రారాజు షేన్ వార్న్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, ఇకలేడన్న వార్త తమను కలచివేసిందని తెలిపిన కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, నితిన్ గడ్కరీ
Hazarath Reddyఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ ఆకస్మిక మరణం క్రికెట్ ప్రపంచాన్ని తీవ్రంగా కుదిపేసింది. ఈ ఉదయం ఆసీస్ దిగ్గజం రాడ్ మార్ష్ మృతితో విషాదంలో ఉన్న క్రికెట్ వర్గాలను తాజాగా వార్న్ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వార్న్ గురించిన వార్తలే కనిపిస్తున్నాయి.
Shane Warne No More: వార్న్ మృతి షాక్‌కు గురి చేసింది, అసలు సిసలైన క్రికెట్ మేధావిని కోల్పోయామంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ ట్వీట్
Hazarath Reddyఆస్ట్రేలియా లెగ్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ హఠాన్మరణం పట్ల తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం వార్న్ మరణం పట్ల షాకయ్యారు. నమ్మలేకపోతున్నానంటూ ట్వీట్ చేశారు. చాలా త్వరగా ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారని, ఆయన మరణం తమను నిశ్చేష్టకు గురిచేసిందని స్టాలిన్ పేర్కొన్నారు.
Shane Warne No More: వార్న్ మరణవార్తతో షాకయిన సచిన్, నువ్విక మాతో ఉండవని తెలిసి నిర్ఘాంతపోయామంటూ ట్వీట్
Hazarath Reddyఆస్ట్రేలియా లెగ్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ హఠాన్మరణం పట్ల భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. వార్న్ మరణవార్తతో నిశ్చేష్టకు గురయ్యానని, తీవ్ర విషాదం ముంచెత్తిందని పేర్కొన్నాడు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించాడు.
Shane Warne No More: ఈ శతాబ్దపు అత్యుత్తమ బంతి షేర్న్ వార్న్‌దే, బాల్‌ ఆఫ్‌ ది సెంచరీగా నిలిచిపోయిన డెలివరీ వీడియో మీకోసం
Hazarath Reddyవార్న్‌ కెరీర్‌లో ఒక బంతి బాల్‌ ఆఫ్‌ ది సెంచరీగా నిలిచిపోయింది. 1993లో యాషెస్‌ సిరీస్‌లో భాగంగా మైక్‌ గాటింగ్‌ను వార్న్‌ ఔట్‌ చేసిన తీరు చరిత్రలో నిలిచిపోయింది. ఈ శతాబ్దపు అత్యుత్తమ బంతిగా ఆ డెలివరీ గురించి చెప్పుకుంటారు. వార్న్‌ మృతికి సంతాపంగా ఆ వీడియోను అందరూ షేర్ చేస్తున్నారు.
Shane Warne Dies: ఇద్దరు లెజెండ్లను కోల్పోయాం, షాకింగ్ అంటూ మహేష్ బాబు ట్వీట్, మార్ష్ & షేన్ వార్న్ హఠాన్మరణంపై దిగ్భ్రాంతి చెందిన సూపర్ స్టార్
Hazarath Reddyఆస్ట్రేలియన్‌ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. థాయిలాండ్‌లోని తన విల్లాలో తీవ్ర గుండెనొప్పితో బాధపడుతూ మరణించినట్లు తెలుస్తోంది. షేన్ తన విల్లాలో అచేతనంగా (Suspected Heart Attack) పడి ఉండటం గుర్తించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రి తరలించారు.
Shane Warne Last Tweet: రిప్ అంటూ ట్వీట్..అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిన వార్న్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షేన్ వార్న్ చివరి ట్వీట్, విషాదంలో అభిమానులు
Hazarath Reddyరాడ్ మార్ష్ ని కోల్పవడం చాలా బాధగా ఉందని ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని తెలిపాడు. అయితే ఇంతలోనే ఘోరం జరిగింది. గుండెపోటుతో షేన్ వార్న్ తిరిగిరాని లోకాలు వెళ్లిపోయాడు.,
IND vs SL 1st Test: 100వ టెస్టులో విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్, 45 ప‌రుగులు వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద ఎబుల్దెనియా బౌలింగ్‌లో ఔటయిన విరాట్
Hazarath Reddyశ్రీలంక‌తో మొహాలీలో జ‌రుగుతున్న తొలి టెస్టులో విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 100వ టెస్టు ఆడుతున్న కోహ్లీ 45 ప‌రుగులు వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద అత‌ను ఎబుల్దెనియా బౌలింగ్‌లో ఔట‌య్యాడు.
Virat Kohli: టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయిని దాటిన విరాట్ కోహ్లి, టెస్ట్‌ కెరీర్‌లో 100వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడిన టీమిండియా స్టార్
Hazarath Reddyటీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లి టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరగుతున్న తొలి టెస్ట్‌లో విరాట్‌ ఈ ఘనతను సాధించాడు. అదే విధంగా కోహ్లి తన టెస్ట్‌ కెరీర్‌లో 100వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే.
Rod Marsh Dies: క్రికెట్ ప్రపంచంలో మరో విషాదం, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రాడ్ మార్ష్ గుండెపోటుతో కన్నుమూత
Hazarath Reddyక్రికెట్ ప్రపంచంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రాడ్ మార్ష్ ఈ ఉదయం కన్నుమూశారు. గుండెపోటుతో అడిలైడ్ లోని ఓ ఆసుపత్రిలో ఆయన మరణించినట్టు స్పోర్ట్స్ ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్ తెలిపింది. 74 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు.
IPL 2022: ఐపీఎల్ టీంలు ప్రాక్టీస్ చేసే గ్రౌండ్స్ లిస్ట్ ఇదే! ఈ నెల 15 నుంచే బయో బబుల్ లోకి ఐపీఎల్ ప్లేయర్స్, ఏర్పాట్లు పరిశీలించిన బీసీసీఐ
Naresh. VNSIPL 2022 మార్చి 26 నుంచి ప్రారంభమవుతుండగా.. ముంబై క్రికెట్ అసోసియేషన్(MCA) బాంద్రా కుర్లా క్యాంపస్(Bandra Kurla Complex), థానే MCA స్టేడియం, Dr. DY పాటిల్ యూనివర్సిటీ గ్రౌండ్, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా గ్రౌండ్(Cricket Club of India), రిలయన్స్ కార్పొరేట్ పార్క్(Reliance Corporate Park ground) గ్రౌండ్‌ల పేర్లు ఉన్నాయి.
IPL 2022: మొదలవ్వకముందే ఐపీఎల్‌లో చెన్నైకి ఎదురుదెబ్బ, అంతడబ్బు పెట్టి కొన్న ఆటగాడికి గాయం, పలు మ్యాచ్ లకు దూరమయ్యే అవకాశం
Naresh. VNSఐపీఎల్ (IPL) ప్రారంభం కాకముందే...చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings ) జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 15వ సీజన్‌లో సీఎస్‌కే తరుపున ఆడనున్న దీపక్ చాహర్ (Deepak Chahar) ఆ టీంకు దూరమయ్యాడు. అద్భుతమైన ఫామ్‌ లో ఉన్న ఆల్ రౌండర్ దీపక్ చాహర్‌ మొదటి కొన్ని మ్యాచ్‌ల్లో పాల్గొనడం లేదు. వెస్టిండిస్‌ తో జరిగిన సిరీస్‌ లో గాయపడిన చాహర్...ఆరంభ మ్యాచ్‌ లకు దూరమవుతున్నారు.