Cricket

IND vs SL 1st Test: 100వ టెస్టులో విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్, 45 ప‌రుగులు వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద ఎబుల్దెనియా బౌలింగ్‌లో ఔటయిన విరాట్

Hazarath Reddy

శ్రీలంక‌తో మొహాలీలో జ‌రుగుతున్న తొలి టెస్టులో విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 100వ టెస్టు ఆడుతున్న కోహ్లీ 45 ప‌రుగులు వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద అత‌ను ఎబుల్దెనియా బౌలింగ్‌లో ఔట‌య్యాడు.

Virat Kohli: టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయిని దాటిన విరాట్ కోహ్లి, టెస్ట్‌ కెరీర్‌లో 100వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడిన టీమిండియా స్టార్

Hazarath Reddy

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లి టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరగుతున్న తొలి టెస్ట్‌లో విరాట్‌ ఈ ఘనతను సాధించాడు. అదే విధంగా కోహ్లి తన టెస్ట్‌ కెరీర్‌లో 100వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే.

Rod Marsh Dies: క్రికెట్ ప్రపంచంలో మరో విషాదం, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రాడ్ మార్ష్ గుండెపోటుతో కన్నుమూత

Hazarath Reddy

క్రికెట్ ప్రపంచంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రాడ్ మార్ష్ ఈ ఉదయం కన్నుమూశారు. గుండెపోటుతో అడిలైడ్ లోని ఓ ఆసుపత్రిలో ఆయన మరణించినట్టు స్పోర్ట్స్ ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్ తెలిపింది. 74 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు.

IPL 2022: ఐపీఎల్ టీంలు ప్రాక్టీస్ చేసే గ్రౌండ్స్ లిస్ట్ ఇదే! ఈ నెల 15 నుంచే బయో బబుల్ లోకి ఐపీఎల్ ప్లేయర్స్, ఏర్పాట్లు పరిశీలించిన బీసీసీఐ

Naresh. VNS

IPL 2022 మార్చి 26 నుంచి ప్రారంభమవుతుండగా.. ముంబై క్రికెట్ అసోసియేషన్(MCA) బాంద్రా కుర్లా క్యాంపస్(Bandra Kurla Complex), థానే MCA స్టేడియం, Dr. DY పాటిల్ యూనివర్సిటీ గ్రౌండ్, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా గ్రౌండ్(Cricket Club of India), రిలయన్స్ కార్పొరేట్ పార్క్(Reliance Corporate Park ground) గ్రౌండ్‌ల పేర్లు ఉన్నాయి.

Advertisement

IPL 2022: మొదలవ్వకముందే ఐపీఎల్‌లో చెన్నైకి ఎదురుదెబ్బ, అంతడబ్బు పెట్టి కొన్న ఆటగాడికి గాయం, పలు మ్యాచ్ లకు దూరమయ్యే అవకాశం

Naresh. VNS

ఐపీఎల్ (IPL) ప్రారంభం కాకముందే...చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings ) జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 15వ సీజన్‌లో సీఎస్‌కే తరుపున ఆడనున్న దీపక్ చాహర్ (Deepak Chahar) ఆ టీంకు దూరమయ్యాడు. అద్భుతమైన ఫామ్‌ లో ఉన్న ఆల్ రౌండర్ దీపక్ చాహర్‌ మొదటి కొన్ని మ్యాచ్‌ల్లో పాల్గొనడం లేదు. వెస్టిండిస్‌ తో జరిగిన సిరీస్‌ లో గాయపడిన చాహర్...ఆరంభ మ్యాచ్‌ లకు దూరమవుతున్నారు.

Vinod Kambli Arrested: సచిన్ ఫ్రెండ్, టీమిండియా మాజీ క్రికెటర్ అరెస్ట్, మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించాడంటూ వినోద్ కాంబ్లీని అరెస్ట్ చేసిన పోలీసులు

Naresh. VNS

టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ (Vinod Kambli) అరెస్టయ్యారు. మద్యం మత్తులో ఓ కారును ఢీకొట్టారన్న(hitting a car ) ఆరోపణలపై ఆయన్ను అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. పోలీసులు కాంబ్లీకి (Vinod Kambli) వైద్య పరీక్షలు నిర్వహించి, బెయిల్‌పై విడుదల చేశారు. ఆదివారం మధ్యాహ్నం, కాంబ్లీని బాంద్రాలోని అతని ఇంటి నుంచి ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

IND vs SL 2nd T20I 2022: రెండో టీ20లో శ్రీలంకపై ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం, ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా

Hazarath Reddy

శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 184 పరుగుల భారీ లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 17. 1 ఓవర్లలోనే భారత్ చేధించింది. దీంతొ ఒక మ్యాచ్ మిగిలిఉండగానే సీరిస్ ను భారత్ సొంతం చేసుకుంది.

IPL 2022 venues: మొత్తం 74 మ్యాచ్‌ల్లో 70 లీగ్‌ మ్యాచ్‌లు ముంబైలోనే.., వాంఖడే, బ్రబౌర్న్‌, డీవై పాటిల్‌, పుణెలోని గహుంజే స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు

Hazarath Reddy

మొత్తం 74 మ్యాచ్‌ల్లో.. 70 లీగ్‌ మ్యాచ్‌లను ముంబైలోని వాంఖడే, బ్రబౌర్న్‌, డీవై పాటిల్‌, పుణెలోని గహుంజే స్టేడియాల్లో నిర్వహించనున్నారు. ముంబైలో 55, పుణెలో 15 మ్యాచ్‌లు జరగనుండగా.. మొత్తం 12 డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లను ఖరారు చేశారు.

Advertisement

ICC Women's World Cup 2022: ఐసీసీ కీలక నిర్ణయం, 9 మంది ఆటగాళ్లతో క్రికెట్ ఆడవచ్చు, మెగా టోర్నీ స‌జావుగా సాగాల‌నే ఉద్దేశంతో నిబంధనల్లో మార్పు

Hazarath Reddy

మార్చి 4 నుంచి ప్రారంభంకానున్న మహిళల వ‌న్డే ప్రపంచ కప్ 2022కి సంబంధించి ఐసీసీ కీల‌క నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది. కరోనా నేప‌థ్యంలో మెగా టోర్నీ స‌జావుగా సాగాల‌నే ఉద్దేశంతో నిబంధనలు మార్చాల‌ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ నిర్ణ‌యించింది.

IND vs SL 1st T20I 2022: తొలి టీ20లో దుమ్మురేపిన భారత్, 62 ప‌రుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం, చ‌రిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ, అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆటగాడిగా రికార్డు

Hazarath Reddy

శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో ( IND vs SL 1st T20I 2022) భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్ధేశించిన‌ 200 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన లంకేయులు ఏమాత్రం ప్ర‌తిఘ‌టించ‌కుండానే చేతులెత్తేశారు

IPL 2022: మార్చి 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం, మార్చి 29న ఫైనల్ మ్యాచ్, అధికారికంగా ప్రకటించిన ఐపీఎల్ ఛైర్మెన్ బ్రజేష్ పటేల్

Hazarath Reddy

ఐపీఎల్ 2022 సమరానికి అంతా రెడీ అయింది. మార్చి 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. మార్చి 29 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఐపీఎల్ ఛైర్మెన్ బ్రజేష్ పటేల్ తెలిపారు.

KL Rahul Donates Rs 31 Lakh: కెఎల్ రాహుల్ గొప్ప మనసు, యువ క్రీడాకారుడిని రక్షించుకునేందుకు రూ. 31 లక్షల విరాళం

Hazarath Reddy

వరద్ గురించి తెలిసిన వెంటనే రాహుల్ బృందం ప్రచారానికి సంబంధించిన సంస్థతో సంప్రదింపులు జరిపింది. వెంటనే రాహుల్ 31 లక్షల రూపాయలను అందిస్తున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం బాలుడు ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో హెమటాలజిస్టుల సంరక్షణలో ఉన్నాడు. బాలుడు అరుదైన రక్త రుగ్మత అయిన అప్లాస్టిక్ అనీమియాతో బాధపడుతున్నాడు.

Advertisement

India vs West Indies: టీమిండియా హ్యట్రిక్ విన్, దుమ్మురేపిన సూర్యకుమార్-వెంకటేష్ అయ్యర్, విండీష్‌ తో టీ-20 వైట్ వాష్ చేసిన రోహిత్ సేన, చివరి మ్యాచ్‌ లో అద్భుతం చేసిన బౌలర్లు

Naresh. VNS

వెస్టిండిస్‌తో (West Indies) లాస్ట్ టీ-20లో కూడా టీమిండియా దుమ్మురేపింది. వరుసగా మూడో మ్యాచ్ లో కూడా విండీస్ ను చిత్తు చేసింది. 17 పరుగుల తేడాతో భారత్ హ్యాట్రిక్ విజయం సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్లు దుమ్మురేపగా.. బౌలర్లు అద్భుతం చేశారు. మిడిలార్డర్ బ్యాటర్లు దుమ్మురేపగా.. బౌలర్లు అద్భుతం చేశారు.

Rohit Sharma is New Test Captain: టెస్ట్ కెప్టెన్ గా రోహిత్ శర్మ, ఇక అన్ని ఫార్మాట్లకు అతనే సారథి, శ్రీలంకతో సిరీస్ కు టీమ్ ప్రకటించిన బీసీసీఐ, బుమ్రాకు బంపర్ ఆఫర్, టెస్ట్ టీమ్ నుంచి రహానే, పూజారా ఔట్

Naresh. VNS

టీమిండియా టెస్ట్ కెప్టెన్‌ గా (Test captain) రోహిత్ శర్మ (Rohit Sharma) ఫిక్సయ్యాడు. ఇప్పటివరకు వన్డే, టీ-20 కెప్టెన్ గా కొనసాగిన రోహిత్ ను శ్రీలంక సిరీస్ కోసం (Sri Lanka series) టెస్ట్ కెప్టెన్ గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

IPL 2022: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ షాక్‌, పదవికి రాజీనామా చేసిన అసిస్టెంట్‌ కోచ్‌ సైమన్‌ కటిచ్‌, కథనాన్ని వెలువరించిన ది ఆస్ట్రేలియన్‌ పత్రిక

Hazarath Reddy

ఐపీఎల్‌-2022 సీజన్‌ ఆరంభానికి ముందే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ సైమన్‌ కటిచ్‌ తన పదవికి రాజీనామా (Simon Katich quits Sunrisers Hyderabad) చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Ravi Bishnoi: భారత్‌కు మరో అద్భుత స్పిన్నర్ దొరికాడు, దుమ్మురేపుతున్న రవి బిష్ణోయ్‌, 24 బంతులు వేస్తే 17 బాల్స్ డాట్‌ బాల్స్‌, 17 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్న యువబౌలర్

Hazarath Reddy

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో భోణీ కొట్టింది. ఈ మ్యాచ్‌ ద్వారా లెగ్‌స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. టి20 క్రికెట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 95వ ఆటగాడిగా అతను నిలిచాడు. బిష్ణోయ్‌ అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే సూపర్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

Advertisement

Ind vs WI, 1st T20I 2022: టీమిండియా జోరు, రోహిత్‌ శర్మ దూకుడుతో వెస్టీండీస్ చిత్తు, తొలి టీ20లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం

Hazarath Reddy

వెస్టిండీస్‌తో స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌లో భారత జట్టు దూకుడు ప్రదర్శిస్తోంది. అహ్మదాబాద్‌లో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేన.. కోల్‌కతాలోని ప్రతిష్ఠాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టీ20లోనూ జయకేతనం ఎగురవేసింది.

Glenn Maxwell Tamil Wedding Card: తమిళ అమ్మాయితో ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ పెళ్లి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్

Hazarath Reddy

ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ భారతీయ తమిళ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు! కస్తూరి శంకర్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ వార్తను ధృవీకరించారు. విని రామన్‌తో మ్యాక్స్‌వెల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు రాసి ఉన్న ఆహ్వాన కార్డు చిత్రాన్ని కూడా అతను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

IPL 2022 Auction:ఐపీఎల్‌ 2022 జట్ల వివరాలివే! ఏ టీం లో ఎవరున్నారు? ఎంతకు కొన్నారో తెలుసా? 10 ఫ్రాంచైజీలు ఖర్చు చేసింది ఎంతో తెలుసా?

Naresh. VNS

ఐపీఎల్‌-2022 మెగా వేలం (IPL 2022 auction) విజయవంతంగా ముగిసింది. ఈ మెగా వేలంలో మొత్తం 204 మంది ఆట‌గాళ్లు అమ్ముడుపోయారు. ఫ్రాంచైజీలు (franchises) రూ.550 కోట్లు పైగా ఖర్చు చేశాయి. ఐపీఎల్‌-2022 మెగా వేలంలో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఆట‌గాడిగా ఇషాన్ కిష‌న్ (Ishan kishan) రికార్డు సృష్టించాడు. రూ. 15.25 కోట్ల‌కు కిష‌న్‌ను ముంబై ఇండియ‌న్స్ (Mumbai Indians) కొనుగోలు చేసింది.

IPL 2022 Auction: జాక్ పాట్ కొట్టేసిన శ్రీలంక క్రికెట‌ర్ వ‌నిందు హ‌స‌రంగ, రూ. 10.75 కోట్ల‌కు సొంతం చేసుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగుళూరు

Hazarath Reddy

ఐపీఎల్ 2022 వేలంలో శ్రీలంక క్రికెట‌ర్ వ‌నిందు హ‌స‌రంగ జాక్ పాట్ కొట్టేశాడు. ఆల్‌రౌండ‌ర్ హ‌స‌రంగ‌ను రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగుళూరు జ‌ట్టు సొంతం చేసుకున్న‌ది. అత‌న్నిరూ. 10.75 కోట్ల‌కు ఆ టీమ్ ఖ‌రీదు చేసింది. కోటి రూపాయ‌ల క‌నీస ధ‌ర‌తో హ‌స‌రంగ బిడ్డింగ్ జ‌రిగింది.

Advertisement
Advertisement