Cricket

Latest ICC Rankings: ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్ విడుద‌ల‌, నెంబ‌ర్ ఆల్ రౌండ‌ర్ గా స్టోయినిస్‌, టీమిండియా ఆట‌గాళ్లు ఏ ర్యాంకుల్లో ఉన్నారో చూడండి

VNS

టీ20 ప్రపంచకప్‌ కొనసాగుతుండగా.. ఐసీసీ తాజాగా టీ20 ర్యాకింగ్స్‌ను (ICC Rankings) బుధవారం విడుదల చేసింది. ఆఫ్ఘన్‌ ఆటగాడు మహ్మద్‌ నబీని (Nabi) అధిగమించి ఆస్ట్రేలియాకు చెందిన స్టోయినిస్‌ (Marcus Stoinis) నెంబర్‌ వన్‌ ఆల్‌ రౌండ్‌గా నిలిచాడు.

Kane Williamson: టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో ఘోరపరాభవం, వన్డేల్లో, టీ20ల్లో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్

Vikas M

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో జ‌ట్టు ఘోర ప్ర‌ద‌ర్శ‌న‌తో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే టెస్టు పగ్గాలను వదిలేసిన కేన్ మామ ఇప్పుడు వైట్ బాల్ ఫార్మాట్ కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పాడు. ఇకపై వన్డేల్లో, టీ20ల్లోనూ సారథిగా ఉండనని ప్రకటించాడు.

Haris Rauf Loses Cool: వీడియో ఇదిగో, ఓడిపోయారని కామెంట్ చేసిన అభిమానితో గొడవ పడ్డ పాక్‌ పేసర్‌ హరీస్‌ రౌఫ్‌

Hazarath Reddy

భార్యతో కలిసి అమెరికా వీధుల్లో షికారుకు వెళ్లిన రౌఫ్‌పై ఓ అభిమాని మాటల దాడికి దిగాడు. ఇందుకు ప్రతిగా రౌఫ్‌ సైతం గట్టిగానే స్పందించాడు. తాను ఓ ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ అన్న విషయాన్ని మరిచి అభిమానిపై దాడికి యత్నించాడు. కూడా ఉన్న భార్య వారించినా రౌఫ్‌ వినలేదు. ఆ అభిమానిపైకి ఒంటికాలితో దూసుకెళ్లాడు.

Lockie Ferguson Record: 4 ఓవర్లు వేస్తే ఒక్క రన్ కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు, టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు నెలకొల్పిన న్యూజిలాండ్ బౌల‌ర్ లూకీ ఫెర్గూస‌న్

Vikas M

న్యూజిలాండ్ బౌల‌ర్ లూకీ ఫెర్గూస‌న్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు నెల‌కొల్పాడు. 4 ఓవ‌ర్లు వేసి ఒక్క ర‌న్ కూడా ఇవ్వ‌కుండా మూడు వికెట్లు తీశాడు. వేసిన 4 ఓవర్లు మెయిడిన్ గా సత్తా చాటాడు. అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్యుత్త‌మ గ‌ణాంకాలు ఇవేనని చెప్పాలి.

Advertisement

36 Runs in an Over Video: వీడియో ఇదిగో, ఒకే ఓవర్‌లో 36 పరుగులు పిండుకున్న వెస్టిండీస్ నికోలస్ పూరన్, బలైన ఆప్ఘన్ బౌలర్ అజ్మతుల్లా

Vikas M

టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ రికార్డుల మోత మోగిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌తో గత రాత్రి జరిగిన గ్రూప్-సి చివరి మ్యాచ్‌లో 104 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విండీస్ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. పవర్ ప్లేలో అత్యధిక పరుగులు సాధించిన రికార్డుతో పాటు ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును సమం చేసింది.

36 Runs in an Over: యువరాజ్ తర్వాత మళ్లీ ఒకే ఓవర్‌లో 36 పరుగులు, ఆప్ఘన్ బౌలర్ అజ్మతుల్లాను ఊచకోత కోసిన వెస్టిండీస్ నికోలస్ పూరన్

Vikas M

టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ రికార్డుల మోత మోగిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌తో గత రాత్రి జరిగిన గ్రూప్-సి చివరి మ్యాచ్‌లో 104 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విండీస్ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. పవర్ ప్లేలో అత్యధిక పరుగులు సాధించిన రికార్డుతో పాటు ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును సమం చేసింది.

T20 World Cup 2024 Super 8 Schedule: టీ20 ప్ర‌పంచ‌కప్ 2024 సూపర్-8 పూర్తి షెడ్యూల్ ఇదిగో, భారత్ ఎన్ని మ్యాచ్ లు ఆడాలంటే..

Vikas M

టీ20 ప్ర‌పంచ‌కప్ 2024లో లీగ్ దశ ముగిసింది. సూపర్-8కు అర్హత సాధించిన జట్లు అధికారికంగా ఖరారయ్యాయి. గ్రూప్-ఏ నుంచి భారత్, అమెరికా బెర్తులు ఖరారు చేసుకోగా గ్రూప్-బీ నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ అర్హత సాధించాయి. ఇక గ్రూప్-సీ నుంచి ఆఫ్గ‌నిస్థాన్, వెస్టిండీస్ అలాగే గ్రూప్-డీ నుంచి దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సూప‌ర్‌-8కి క్వాలిఫై అయ్యాయి.

Smriti Mandhana Century: స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన టీమిండియా బ్యాట్స్ ఉమెన్ స్మృతి మంధాన‌, సౌతాఫ్రికాతో వ‌న్డేలో సెంచ‌రీ చేసి కొత్త రికార్డు

VNS

భార‌త మ‌హిళా జ‌ట్టు ఓపెన‌ర్ స్మృతి మంధాన (Smriti Mandhana) చ‌రిత్ర సృష్టించింది. వ‌న్డేల్లో ఆరో సెంచ‌రీతో 7 వేల ప‌రుగుల క్ల‌బ్‌లో చేరింది. దాంతో, ఈ ఫీట్ సాధించిన రెండో మ‌హిళా క్రికెట‌ర్‌గా మంధాన‌ రికార్డు నెల‌కొల్పింది. ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న వ‌న్డేలో 56 ప‌రుగుల వ‌ద్ద భార‌త వైస్ కెప్టెన్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 7,000 ప‌రుగుల మైలురాయికి చేరింది.

Advertisement

ICC T20 World Cup 2024: హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టిన వెస్టిండీస్‌, 13 పరుగుల తేడాతో కివీస్ చిత్తు, గ్రాండ్‌గా సూపర్ 8లోకి అడుగుపెట్టిన విండీస్ జట్టు

Vikas M

టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ అదరగొట్టింది. ఈ టోర్నీకి ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న ఆ జట్టు హ్యాట్రిక్‌ విజయాలతో సూపర్‌- 8లో చోటు దక్కించుకుంది. ట్రినిడాడ్‌ లోని బ్రియాన్‌ లారా స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్‌ను 13 పరుగుల తేడాతో విండీస్‌ ఓడించింది.

ICC T20 World Cup 2024: పోరాడకుండానే ప్రపంచకప్ నుంచి న్యూజీలాండ్ ఔట్, సూపర్ 8 బెర్తులోకి ప్రవేశించిన ఆఫ్ఘ‌నిస్తాన్, ఇప్పటికే వెస్టిండీస్ ఎంట్రీ

Vikas M

ఆఫ్ఘ‌నిస్తాన్ విక్ట‌రీతో గ్రూప్ సి నుంచి న్యూజిలాండ్ జ‌ట్టు నాకౌట్ అయ్యింది.ఈ గ్రూపు నుంచి ఇప్ప‌టికే వెస్టిండీస్ జ‌ట్టు సూప‌ర్ 8లోకి ప్ర‌వేశించగా తాజాగా ఆఫ్ఘ‌నిస్తాన్ కూడా ఆరు పాయింట్ల‌తో సూప‌ర్‌-8 బెర్తును క‌న్ఫ‌ర్మ్ చేసుకున్న‌ది.

ICC T20 World Cup 2024: ఒమ‌న్‌ విసిరిన టార్గెట్‌ని మూడు ఓవర్లలోనే ఫినిష్ చేసిన ఇంగ్లండ్, 8 వికెట్ల తేడాతో ఘన విజయం

Vikas M

ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌(T20 World Cup)లో గ్రూప్ బీలో భాగంగా జ‌రిగిన మ్యాచ్‌లో ఒమ‌న్‌పై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజ‌యం న‌మోదు చేసింది. ఇంగ్లండ్ బౌల‌ర్ అదిల్ ర‌షీద్ నాలుగు వికెట్లు తీయ‌డంతో.. ఒమ‌న్ కేవ‌లం 47 ప‌రుగులే చేసి ఆలౌట్ అయ్యింది

Virat Kohli Gloden Duck Video: ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయిన విరాట్ కోహ్లీ వీడియో ఇదిగో, టీ20లలో డకౌట్ కావడం కోహ్లీకి ఇది 6వసారి

Vikas M

అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో విరాట్ కోహ్లీ పతనాల పరంపర కొనసాగుతోంది. ఐర్లాండ్‌పై 1, పాకిస్థాన్‌పై 4 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ.. వరుసగా మూడవ మ్యాచ్‌లోనూ అమెరికాపై మ్యాచ్‌‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు.

Advertisement

Virat Kohli Ducks Record: టీ20ల్లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన విరాట్ కోహ్లీ, అత్యధిక సార్లు డకౌట్ అయిన రెండవ భారత క్రికెటర్‌గా కోహ్లీ

Vikas M

టీ20లలో కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటివరకు ఏకంగా 12 సార్లు డకౌట్ అవ్వగా.. ఈ జాబితాలో రెండో స్థానంలో విరాట్ కోహ్లీ నిలిచాడు. 5 డకౌట్‌లతో రెండో స్థానంలో ఉన్న కేఎల్ రాహుల్‌ని విరాట్ దాటేశాడు. మొత్తం 6 డకౌట్‌లతో రెండో స్థానంలో నిలిచాడు.

India Vs USA, T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో అమెరికాను ఓడించి టీమిండియా హ్యాట్రిక్ విజయాల నమోదు...7 వికెట్ల తేడాతో USAను ఓడించి సూపర్ 8కి అర్హత సాధించిన టీమిండియా

sajaya

టీ20 ప్రపంచకప్ 2024లో అమెరికాను ఓడించి భారత క్రికెట్ జట్టు హ్యాట్రిక్ విజయాలను పూర్తి చేసింది. దీంతో ఆతిథ్య జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా సూపర్ 8కి అర్హత సాధించింది. సూర్యకుమార్ యాదవ్ మరియు శివమ్ దూబేతో పాటు, అర్ష్‌దీప్ సింగ్ కూడా ఈ విజయాన్ని భారత్ గెలవడంలో ముఖ్యమైన సహకారం అందించారు.

Shardul Thakur: ఆస్ప‌త్రి బెడ్ పై టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్! కాలికి స‌ర్జరీ చేయించుకున్న క్రికెట‌ర్, త్వ‌ర‌లోనే మైదానంలో క‌లుద్దామంటూ పోస్ట్

VNS

టీమ్ఇండియా ప్ర‌స్తుతం టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో బిజీగా ఉంది. అయితే.. భార‌త స్టార్ ఆల్‌రౌండ‌ర్ శార్దూల్ ఠాకూర్(Shardul Thakur) మాత్రం ఆస్ప‌త్రి బెడ్ పై ఉన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీంతో అభిమానులు కంగారు ప‌డుతున్నారు. అత‌డి ఏమైంద‌ని కామెంట్లు పెడుతున్నారు.

PAK YouTuber Shot Dead: వీడియో ఇదిగో, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అభిప్రాయం అడిగినందుకు యూట్యూబర్‌ని కాల్చి చంపిన గార్డు

Vikas M

జియో న్యూస్ నివేదిక ప్రకారం, సాద్ అహ్మద్ అనే యూట్యూబర్ కరాచీలోని మొబైల్ మార్కెట్‌కి వెళ్లాడు, అక్కడ అతను మ్యాచ్ గురించి వారి అభిప్రాయాలను పలువురు దుకాణదారులను అడిగాడు.ఈ నేపథ్యంలో ఓ సెక్యూరిటీ గార్డుని కూడా అభిప్రాయం అడగగా అతను సహనం కోల్పోయి అహ్మద్‌ను కాల్చాడు.దీంతో యూట్యూబర్ కుప్పకూలి పడిపోయాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

Advertisement

ICC T20 World Cup 2024: పోరాడి ఓడిన బంగ్లాదేశ్, ఉత్కంఠ పోరులో 4 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి..

Vikas M

న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నాలుగు పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై ఉత్కంఠభరితమైన విజయం సాధించింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా సూపర్‌ ఎయిట్‌ ర్యాంక్‌ కోసం డ్రైవర్‌ సీటులో దృఢంగా కూర్చుంది.

Naseem Shah Crying Video: వీడియో ఇదిగో, మ్యాచ్ ఓడిపోగానే వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ వెళ్ళిన పాక్ పేసర్ న‌సీమ్ షా, ఓదార్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ

Vikas M

పాకిస్థాన్‌తో జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివ‌రి ఓవ‌ర్‌లో 18 ప‌రుగులు అవ‌స‌రం కాగా, న‌సీమ్ షా(Naseem Shah) రెండు బౌండ‌రీలు కొట్టినా టార్గెట్‌ను అందుకోలేక‌పోయారు. 4 బంతుల్లో 10 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచిన న‌సీమ్ షా మ్యాచ్ ఓడిపోగానే ఒక్కసారిగా ఏడ్చేశాడు

Amol Kale Dies: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ తర్వాత గుండెపోటుతో MCA అధ్యక్షుడు అమోల్ కాలే మృతి, ముంబై క్రికెట్లో విషాదకర ఛాయలు

Hazarath Reddy

షాకింగ్ ఘటనలో, ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అధ్యక్షుడు అమోల్ కాలే అమెరికాలో గుండెపోటుతో మరణించారు. జూన్ 9న న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు MCA ఆఫీస్ బేరర్‌లతో కలిసి కాలే హాజరయ్యాడు.

IND vs PAK, ICC T20 World Cup 2024: అమెరికా చేతిలో పాకిస్తాన్ ప్లే అప్ అవకాశాలు, భారత్‌తో ఓడిన తరువాత మారిన సూపర్-8 సమీకరణలు, ఉత్కంఠ పోరులో టీమిడింయా ఘన విజయం

Hazarath Reddy

అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2024లో ఆదివారం జరిగిన అత్యంత ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో భారత్ చేతిలో పాక్ 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఆ జట్టుకు టోర్నీలో వరుసగా రెండవ ఓటమి ఎదురైంది

Advertisement
Advertisement