క్రికెట్

Devdutt Padikkal Test Fifty Video: సిక్స్ కొట్టి హాప్ సెంచరీ పూర్తి చేసుకున్న దేవదత్ పడిక్కల్, ఆడిన తొలి మ్యాచ్‌లోనే అర్థ సెంచరీతో కదం తొక్కిన భారత్ యువ ఆటగాడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న 5వ టెస్టులో యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ అరంగేట్రం చేశాడు.అతను తన తొలి మ్యాచ్ లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పడిక్కల్ బంతిని సిక్సర్ బాది యాభైకి చేరుకున్నాడు. భారత్‌కు రెండు వికెట్లు త్వరితగతిన పడిన తర్వాత అతను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు మంచి టచ్‌లో కనిపించాడు

Ravi Ashwin 100 Tests: అశ్విన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు, 100వ టెస్ట్ ఆడుతున్న 14వ ఇండియన్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పిన టీమిండియా స్పిన్నర్

Hazarath Reddy

టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఖాతాలోకి మరో రికార్డు వచ్చి చేరింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఇంగ్లండ్‌తో నేడు ప్రారంభమైన చివరిదైన ఐదో టెస్టు అశ్విన్‌కి కెరియర్‌లో వందో టెస్టు మ్యాచ్. ఈ రికార్డు నెలకొల్సిన 14వ ఇండియన్‌గా చరిత్రలోకి అశ్విన్ ఎక్కాడు

Shubman Gill Super Catch Video: వెనకకు 20 గజాల దూరం పరిగెత్తుతూ శుబ్‌మన్‌ గిల్‌ కళ్లు చెదిరే క్యాచ్‌, ఇంగ్లండ్ బ్యాటర్ డకెట్‌ను పెవిలియన్‌కి పంపిన సూపర్‌ క్యాచ్‌ వీడియో ఇదిగో..

Hazarath Reddy

ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌- భారత్‌ మధ్య ఆఖరి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. మొదటి రోజు ఆటలో భారత యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు. ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌లో కుల్దీప్‌ యాదవ్‌ ఆరో డెలివరీని బెన్‌ డకెట్‌కు గుగ్లీగా సంధించాడు.

WPL 2024: మహిళా క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతి ఇదిగో, 132.1 కిమీ వేగంతో బంతిని సంధించిన ముంబై ఇండియన్స్ బౌలర్ షబ్నిమ్‌ ఇస్మాయిల్‌

Hazarath Reddy

మహిళల ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (మార్చి 5) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బౌలర్‌ షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ (సౌతాఫ్రికా) మహిళల క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగవంతమై బంతిని విసిరిన క్రికెటర్ గా రికార్డు నెలికొల్పింది.

Advertisement

ISPL 2024 Opening Ceremony: సెలబ్రిటీలతో అదరహో అనిపిస్తున్న ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ టీ10 లీగ్‌, వీడియోలు, చిత్రాలు ఇవిగో..

Hazarath Reddy

లోకల్‌ టాలెంట్‌ను వెలికి తీయడమే లక్ష్యంగా పురుడుపోసుకున్న ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ టీ10 లీగ్‌ (ISPL) నేడు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ లీగ్‌లో (Indian Street Premier League) మొత్తం ఆరు జట్లు పోటీపడనుండగా.. ఈ జట్లను టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ తారలు కొనుగోలు చేశారు

Sachin Dance to Naatu Naatu Song: నాటు నాటు పాటకు చిందేసిన సచిన్ టెండూల్కర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

ఐఎస్‌పీఎల్‌ ప్రారంభానికి ముందు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌, సూర్య, అక్షయ్‌ కుమార్‌లతో కలిసి హైదరాబాద్‌ జట్టు ఓనర్‌ రామ్‌చరణ్‌ సందడి చేశారు.చెర్రీ వీరందరితో ట్రిపుల్‌ ఆర్‌ ఫేమ్‌ నాటు నాటు పాటకు స్టెప్పులేయించాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

Sachin Tendulkar Six Video: సచిన్ టెండూల్కర్‌ భారీ సిక్సర్ బాదిన వీడియో ఇదిగో, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ బౌలింగ్‌ని ఉతికి ఆరేసిన లిటిల్ మాస్టర్

Hazarath Reddy

మ్యాచ్ ప్రారంభానికి ముందు, గొప్ప ప్రారంభ వేడుక జరిగింది. లెజెండరీ ఇండియన్ క్రికెటర్, సచిన్ టెండూల్కర్ యొక్క మాస్టర్స్ 11 మరియు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ యొక్క ఖిలాడీ XI మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది.

Sachin Tendulkar Dismissal Video: సచిన్ టెండూల్కర్‌‌ని పెవిలియన్‌కి పంపిన బిగ్ బాస్ 7 విన్నర్ మునవర్ ఫరూఖీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌.. మునవర్ ఫరూఖీ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. సచిన్ 17 బంతుల్లో 30 పరుగులు చేసి Big Boss 17 Winner Munawar Faruqui బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

Advertisement

BCCI Annual Contracts: గ్రేడ్ ఏ ప్లస్ కేటగిరీలో 4 గురికి మాత్రమే చోటు, గ్రేడ్ B నుండి గ్రేడ్ Aకి ప్రమోషన్ పొందిన భారత క్రికెటర్ల లిస్టు ఇదే..

Hazarath Reddy

బిసిసిఐ నిర్ణయించిన కాంట్రాక్ట్ స్ట్రక్చర్ ప్రకారం , గ్రేడ్ ఎ-ప్లస్ కింద వర్గీకరించబడిన ఆటగాళ్లకు రూ. 7 కోట్లు, గ్రేడ్ ఎలో ఉన్నవారికి రూ. 5 కోట్లు అందజేస్తారు. ఇంకా, గ్రేడ్ B మరియు గ్రేడ్ C కేటగిరీలలో ఉంచబడిన వ్యక్తులు వరుసగా రూ. 3 కోట్లు మరియు రూ. 1 కోటి వార్షిక వేతనం పొందుతారు

Yuzvendra Chahal Viral Video: భయమేస్తుంది నన్ను వదిలేయ్ తల్లీ రెజ్లర్ ను వేడుకున్న టీమిండియా క్రికెటర్, వైరల్ గా మారిన వీడియో ఇదుగోండి!

VNS

ఫోగట్ చాహల్ ను భుజాలపైకి ఎత్తుకొని గిరగిరా తిప్పింది. చాహల్ బక్కపలచగా ఉండటంతో సంగీత ఫోగట్ తేలిగ్గా తన భుజాలపైకి ఎత్తికుంది. గిరగిరా రెండురౌండ్లు తిప్పింది. ఆందోళనతో చాహల్ ‘నన్ను వదిలేయ్ తల్లీ.. నేను దిగిపోతా’ అన్నట్లుగా ఫోగట్ ను వేడుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ యింది.

UPW-W vs GG-W WPL 2024: మూడో మ్యాచ్ లోనూ రాణించ‌లేక‌పోయిన గుజ‌రాత్, ఐదు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించిన యూపీ వారియ‌ర్స్

VNS

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL -2024) లో శుక్రవారం జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) జట్టుపై యూపీ వారియర్స్ (UP Warriors) జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఆష్ లైగ్ గార్డనర్ 30, ఫోబే లిచ్ ఫీల్డ్ 35, లారా వోల్వార్డ్ 28 పరుగులు చేశారు.

PSL -9: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కు ఫుడ్ పాయిజ‌న్, ముగ్గురి ప‌రిస్థితి విష‌మం, ఆహారం తిని 13 మంది ప్లేయ‌ర్ల‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌

VNS

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL) 09వ సీజన్‌లో ఫుడ్‌ పాయిజన్‌ కలకలం రేపింది. కరాచీ కింగ్స్‌కు (Karachi Kings) చెందిన 13 మంది క్రికెటర్లు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. వీరిలో సుమారు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది

Advertisement

Andhra Cricket Controversy: రాజకీయ రంగు పులుముకున్న హనుమ విహారి-ఆంధ్రా క్రికెట్ వివాదం, అతనికి అండగా ఉంటామని తెలిపిన చంద్రబాబు, వైఎస్ షర్మిల

Hazarath Reddy

వైసీపీ రాజకీయ కక్షలకు, ప్రతీకార రాజకీయాలకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లొంగిపోవడం సిగ్గుచేటని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండించారు.హనుమ విహారిని వేధించారని అతడికి తాము అండగా ఉండి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు

Mohammed Shami Reacts PM Modi Tweet: ధన్యవాదాలు సర్ అంటూ ప్రధాని మోదీకి రిప్లయి ఇచ్చిన మహ్మద్ షమీ, మడమ శస్త్రచికిత్స నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన భారత ప్రధాని

Hazarath Reddy

భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ చీల మండకు గాయం కావడంతో దానికి శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి విదితమే. మడమ శస్త్రచికిత్స విజయవంతమయినట్లు, శస్త్రచికిత్స తర్వాత ఫోటోలను పంచుకున్నాడు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షించారు

Andhra Cricket Controversy: ఆంధ్రా క్రికెట్ వివాదంలో దూరిన రవిచంద్రన్ అశ్విన్, కుట్టి కథలకు మీరు రెడీనా అంటూ ట్వీట్, నేను రెడీ అంటూ బదులిచ్చిన హనుమ విహారీ

Hazarath Reddy

ఇటీవలి ఆంధ్రా క్రికెట్ వివాదంలో 'కుట్టి కథలు'లో తనతో చేరాలని రవిచంద్రన్ అశ్విన్ చేసిన అభ్యర్థనపై భారత క్రికెటర్ హనుమ విహారి స్పందించారు. అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో చాట్ కోసం అతన్ని ఆహ్వానించడంతో, 30 ఏళ్ల అతను దానికి అంగీకరించాడు.

James Anderson Stunning Catch Video: ఫుల్‌ లెంగ్త్‌ డైవ్‌ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ అందుకున్న జేమ్స్‌ ఆండర్సన్‌, యశస్వీ జైశ్వాల్‌ను పెవిలియన్‌కు పంపిన వీడియో ఇదిగో..

Hazarath Reddy

రాంచీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్‌ స్టార్ జేమ్స్‌ ఆండర్సన్‌ కళ్లు చెదిరే క్యాచ్ తో మెరిసాడు. యశస్వీ జైశ్వాల్‌ను స్టన్నింగ్‌ క్యాచ్‌తో ఆండర్సన్‌ పెవిలియన్‌కు పంపాడు.

Advertisement

Rohit Sharma Dismissal Video: బంతిని అంచనా వేయకుండా ఫ్రంట్‌ ఫుట్‌కు వచ్చి వికెట్ సమర్పించుకున్న రోహిత్ శర్మ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈజీగా తన వికెట్‌ను సమర్పించుకున్న వీడియో వైరల్ అవుతోంది. బంతిని అంచనా వేయకుండా ఫ్రంట్‌ ఫుట్‌కు వచ్చి ఆడిన హిట్ మ్యాన్ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

Yashasvi Jaiswal Dismissal Video: జో రూట్‌ స్పిన్‌ ట్రాప్‌లో చిక్కుకున్న యశస్వీ జైశ్వాల్‌, చెప్పేది వినవా అంటూ రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

భారత సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 17 ఓవర్‌లో జో రూట్‌ స్పిన్‌ ట్రాప్‌లో చిక్కుకున్నాడు. జో రూట్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన జైశ్వాల్‌.. బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఆండర్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీనిపై నాన్‌ స్ట్రైక్‌లో ఉన్న భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు.

IND vs ENG 4th Test: అన్ని విభాగాల్లో ర‌ఫ్ఫాడించిన టీమిండియా, ఇంగ్లండ్‌పై హ్యాట్రిక్ విజ‌యంతో సిరీస్ కైవ‌సం, నాలుగో టెస్టులో ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం

Hazarath Reddy

రాంచీలో జ‌రిగిన నాలుగో టెస్టులో భార‌త జ‌ట్టు(Team India) అద్భుత విజ‌యం సాధించింది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నాలుగో టెస్టు మ్యాచులో ఐదు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.

CCL 2024: హైద‌రాబాద్ లో సెల‌బ్రిటీ క్రికెట్ మ్యాచ్ కు ఫ్రీ ఎంట్రీ! ప్ర‌తిరోజు 10వేల మందిని ఉచితంగా అనుమ‌తిస్తామ‌ని అసోసియేష‌న్ ప్ర‌క‌ట‌న‌

VNS

సీసీఎల్ లీగ్‌లో బాలీవుడ్‌ (Bollywood), టాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటు దేశంలోని ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, తారలు ఆడుతున్నారు. వారంతా హైద‌రాబాద్ వస్తారని జగన్ మోహన్ రావు తెలిపారు. తెలంగాణలోని కాలేజీ విద్యార్థుల‌కు ఉచితంగా సీసీఎల్ చూసే అవకాశం ఉంది.

Advertisement
Advertisement