క్రికెట్

IPL 2023: చేతికి గాయమైన డ్యాన్స్ ఆపని చీర్లీడర్, సోషల్ మీడియాలో ఫోటో వైరల్, వివిధ రకాల కామెంట్లతో స్పందిస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

మే 15, సోమవారం నాడు IPL 2023లో గుజరాత్ టైటాన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా, ఒక ఛీర్‌లీడర్ తన చేతిని స్లింగ్‌లో ఉంచినప్పటికీ ప్రదర్శన ఇవ్వడం కనిపించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఛీర్‌లీడర్ తన కుడి చేతిని స్లింగ్‌లో ఉంచి ఉన్న చిత్రం వైరల్‌గా మారింది

World Cup 2023: ప్రపంచకప్‌ నుంచి పాకిస్థాన్ వైదొలిగే అవకాశం, సంచలన వ్యాఖ్యలు చేసిన పీసీబీ చైర్మన్

Hazarath Reddy

ఈ ఏడాది భారత్‌లో జరగనున్న ప్రపంచకప్‌ నుంచి పాకిస్థాన్ వైదొలిగే అవకాశం ఉందని పీసీబీ చైర్మన్ హెచ్చరించారు.

IPL 2023, GT vs SRH: సన్ రైజర్స్ పై 34 పరుగుల తేడాతో గుజరాత్ విజయం, ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా గుజరాత్ సంచలనం..

kanha

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించిన మొదటి జట్టును పొందింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై గుజరాత్ టైటాన్స్ జట్టు ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకుంది.

Helmets Mandatory for High-Risk Positions: క్రికెట్ మ్యాచ్‌లో హెల్మెట్‌లను తప్పనిసరి చేసిన ఐసీసీ, ఫీల్డర్లు బ్యాటర్‌కు దగ్గరగా ఉన్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవచ్చని సూచన

Hazarath Reddy

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 'హై-రిస్క్ పొజిషన్స్' కోసం హెల్మెట్‌లను తప్పనిసరి చేసింది. ఐసిసి ప్రకారం, బ్యాటర్లు ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొన్నప్పుడు, వికెట్ కీపర్లు స్టంప్స్ వరకు నిలబడి ఉన్నప్పుడు, ఫీల్డర్లు వికెట్ ముందు బ్యాటర్‌కు దగ్గరగా ఉన్నప్పుడు హెల్మెట్ తప్పనిసరి అని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

Advertisement

IPL 2023: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్, కెప్టెన్ నితీష్ రాణాకు రూ. 24 లక్షల జరిమానా, స్లో ఓవర్ రేటు కారణంగా ఫైన్

Hazarath Reddy

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీష్ రాణాకు రూ. 24 లక్షల జరిమానా విధించబడింది. మే 14న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ సమయంలో అతని జట్టు స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందున, ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌తో సహా ప్లేయింగ్ ఎలెవన్ సభ్యునికి రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించబడింది.

Viral Video: స్టేడియంలోనే ఉన్నా.. ఫోన్ లో మ్యాచ్ చూస్తున్నాడు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. మీరూ చూడండి.

Rudra

స్టేడియంలో తన ఎదురుగా జరుగుతున్న మ్యాచ్ ను వదిలేసి ఓ వ్యక్తి ఖాళీగా ఉన్న సీట్లను వెతుక్కుని, హాయిగా పడుకుని, ఫోన్ లో మ్యాచ్ చూస్తూ కనిపించాడు. మొన్నటి సీఎస్కే, ఢిల్లీ మ్యాచ్ లో జరిగిందీ ఘటన.

ICC to Remove 'Soft Signal' Forever: క్రికెట్ నుంచి ‘సాఫ్ట్ సిగ్నల్’ను శాశ్వతంగా తొలగించనున్న ఐసీసీ.. ఎప్పటి నుంచి అంటే??

Rudra

క్రికెట్ లో అంపైర్లు కీలక నిర్ణయాలను వెల్లడించడంలో ప్రముఖ పాత్ర పోషించే ‘సాఫ్ట్ సిగ్నల్’ను ఐసీసీ శాశ్వతంగా తొలగించనున్నట్టు సమాచారం. ఈ మేరకు క్రిక్ బజ్ ఓ నివేదికలో వెల్లడించింది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్టు తెలుస్తుంది.

CSK Vs KKR: చివరి లీగ్‌ మ్యాచ్‌లో చెన్నైకి ఓటమి, సొంత గ్రౌండ్‌లో సీఎస్‌కేకు పరాభవం, ఆరు వికెట్ల తేడాలో KKR ఘనవిజయం

VNS

చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో (Chennai Super Kings) జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (Kolkata Knight Riders) విజ‌యం సాధించింది. ల‌క్ష్యాన్ని కోల్‌క‌తా 18.3 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఆరు వికెట్ల తేడాతో కోల్‌క‌తా గెలుపొందింది.

Advertisement

Dhoni Entry Video: స్టేడియంలోకి ధోనీ ఎంట్రీ చూస్తే గూస్‌ బంప్స్ ఖాయం, తలా వస్తుంటే రీసౌండ్ చూసి మతిపోవాల్సిందే!

VNS

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎం.ఎస్. ధోనీ (M.S. Dhoni) అంటే ఇష్టపడని క్రికెట్ అభిమానులు ఉండరు. ఇక ఐపీఎల్‌ లో ఆయనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. సీఎస్‌కేను విజయతీరాలకు చేర్చుతున్న ధోనీకి తలా అంటూ నిక్ నేమ్ కూడా ఉంది. చెన్నై మ్యాచ్ ఎక్కడ జరిగినా స్టేడియమంతా ఆయన పేరు మార్మోగుతుంది.

Punjab Kings Vs Delhi Capitals: ఐపీఎల్ ఫైనల్‌ రేసు నుంచి ఢిల్లీ ఔట్, ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్ సెంచరీతో ప్లే ఆఫ్స్‌కు పంజాబ్‌, పాయింట్ల పట్టికలో ఎగబాకిన పంజాబ్‌

VNS

ఐపీఎల్(IPL) 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌(Delhi Capitals)తో జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) విజ‌యం సాధించింది. ల‌క్ష్య ఛేద‌న‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 136 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది. దీంతో 31 ప‌రుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘ‌న విజ‌యం సాధించింది.

Ravindra Jadeja: రవీంద్ర జడేజా, ధోనీ కుమార్తె జీవా మధ్య ఏం జరిగింది..? వైరల్ అవుతున్న వీడియో..

kanha

మ్యాచ్ ముగిసిన తర్వాత జడేజా, జివా చాలా సేపు మాట్లాడుకున్నారు. జడేజా కూడా సరదాగా కనిపించాడు. వీరిద్దరి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Sachin Tendulkar: తన పేరు వాడకంపై పోలీసులకు సచిన్ ఫిర్యాదు, తన ఇమేజ్ దెబ్బతినేలా నకిలీ ప్రకటనలలో వాడారని ముంబై క్రైమ్ బ్రాంచ్‌లో పోలీసులకు కంప్లయింట్

Hazarath Reddy

మహారాష్ట్ర | మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన పేరు, ఫోటో మరియు వాయిస్‌ని ఇంటర్నెట్‌లో ప్రజలను మోసం చేయడానికి "నకిలీ ప్రకటనలలో" ఉపయోగించారని ముంబై క్రైమ్ బ్రాంచ్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐపీసీ సెక్షన్ 426, 465 మరియు 500 కింద గుర్తు తెలియని వ్యక్తులపై ముంబై పోలీస్ సైబర్ సెల్ కేసు నమోదు చేసింది.

Advertisement

Suryakumar Yadav Century: చెలరేగిన సూర్యకుమార్ యాదవ్, 49 బంతుల్లో సెంచరీ, ఐపీఎల్‌లో తొలి శతకం చేసిన సూర్యకుమార్, గుజరాత్ ముందు భారీ లక్ష్యం

VNS

మిస్టర్ 360 ప్లేయ‌ర్‌ సూర్యకుమార్ యాద‌వ్ సెంచ‌రీ (103 నాటౌట్ :49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లు)తో చెల‌రేగాడు. సొంత గ్రౌండ్‌లో త‌న‌దైన షాట్లతో అల‌రించిన అత‌ను శ‌త‌కంతో ముంబైకి (Mumbai Indians) భారీ స్కోర్ అందించాడు. సూర్య మెరుపు ఇన్నింగ్స్ ఆడ‌డంతో ముంబై 5 వికెట్ల న‌ష్టానికి 218 ప‌రుగులు చేసింది. అల్జారీ జోసెఫ్ వేసిన 20వ ఓవ‌ర్లో సూర్యకుమార్ యాద‌వ్ నాలుగో బంతికి సిక్స్ బాదాడు.

IPL 2023: యశస్వీ జైశ్వాల్‌, రింకూ సింగ్‌ వచ్చే ప్రపంచకప్ ఆడాల్సిందే, వారిద్దరూ అద్బుతమైన ప్లేయర్లు అని కొనియాడిన భారత మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనా

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌, కేకేఆర్‌ ఫినిషిర్‌ రింకూ సింగ్‌ జట్టును ముందుండి నడిపిస్తూ దూసుకుపోతున్న సంగతి విదితమే. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో యశస్వీ జైశ్వాల్‌ కేవలం 13 బంతుల్లోనే తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

Yashasvi Jaiswal Fastest 50: ఫస్ట్ టైం చూస్తున్నా.. ఇదేమి బ్యాటింగ్ బాబోయ్, యశస్వీ జైశ్వాల్‌‌ను ఆకాశానికి ఎత్తేసిన విరాట్ కోహ్లీ, 13 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసిన జైశ్వాల్

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ 13 బంతుల్లోనే జైశ్వాల్‌ తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను పూర్తి చేసుకున్న సంగతి విదితమే.

IPL 2023: గెలుపు ఊపు మీదున్న రాజస్తాన్‌ రాయల్స్‌కు భారీ షాక్, ఐపీఎల్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు బట్లర్‌కు భారీ జరిమానా

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో భాగంగా ఈడెన్‌ గార్డన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ అద్భుత విజయం సాధించింది. 150 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.1 ఓవర్లలోనే రాజస్తాన్‌ చేధించింది.

Advertisement

Shimron Hetmyer Catch Video: బౌండరీ లైన్ వద్ద షిమ్రాన్ హెట్మేయర్ స్టన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో, సిక్స్ అనుకుని అలా చూస్తూ ఉండిపోయిన జాసన్ రాయ్

Hazarath Reddy

షిమ్రాన్ హెట్మేయర్ ఫీల్డింగ్‌లో కొన్ని అద్భుతమైన క్యాచ్‌లను తీసుకుంటాడు, ఎందుకంటే అతను ఫీల్డింగ్ సమయంలో లైవ్‌వైర్‌గా ఉంటాడు. ప్రత్యేకంగా బౌండరీ లైన్ దగ్గర కొన్ని చిరస్మరణీయ క్యాచ్‌లను తీసుకుంటాడు. ఈసారి RR స్టార్ జంప్ చేసి, పవర్‌ప్లేలో ప్రమాదకరమైన ఇంగ్లీష్ బ్యాటర్‌ను వెనక్కి పంపాడు.

IPL 2023: అప్పుడు జట్టుకు దరిద్రం అంటూ వెక్కిరింతలు, ఇప్పుడు బౌలర్లకు చుక్కలు చూపిస్తూ దడపుట్టిస్తున్నాడు, సీఎస్‌కేకు కీలక ఆటగాడిగా మారిన శివమ్‌ దుబే

Hazarath Reddy

ఐపీఎల్‌-2023 సీజన్‌ ఆరంభంలో ఆకట్టుకోకపోయినా సీఎస్‌కే ఆటగాడు శివమ్‌ దుబే.. ఇప్పడు బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. సీఎస్‌కే ప్రతీ విజయంలోనూ దుబే తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా చెపాక్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దుబే కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

IPL 2023: ఆర్సీబీకి పట్టిన దరిద్రం ఆ బౌలర్, ఇంత చెత్త ఆటగాడిని ఎక్కడా చూడలేదు, హర్షల్‌ పటేల్‌ ఆట తీరుపై మండిపడుతున్న RCB అభిమానులు

Hazarath Reddy

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు పేసర్‌ హర్షల్‌ పటేల్‌ ఆట తీరుపై RCB అభిమానులు మండిపడుతున్నారు. అతడు ఆర్సీబీకి పట్టిన దరిద్రం అని.. జట్టు నుంచి అతడిని వెంటనే తీసివేస్తేనే బాగుపడతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు

Delhi High Court: OFS ప్లాట్‌ఫారమ్‌లు తమ పేర్లు, చిత్రాలు ఉపయోగించకుండా ఆపండి, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన క్రికెటర్లు మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్

Hazarath Reddy

ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్‌లు (OFS) తమ పేర్లు, చిత్రాలతో NFT (Non-fungible Tokens)లను ఉపయోగించకుండా ఆపాలని క్రికెటర్లు మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.సిరాజ్, పటేల్, రారియో, ఇతరులు ఏప్రిల్ 26 నాటి సింగిల్ జడ్జి ఆదేశాలకు వ్యతిరేకంగా డివిజన్ బెంచ్ ముందు అప్పీలు దాఖలు చేశారు.

Advertisement
Advertisement