Cricket

IPL 2023: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్, ధావన్ కొట్టిన షాట్‌ దెబ్బకు విధ్వంసక ఆటగాడు రాజపక్స ఐపీఎల్ నుంచి దూరమయ్యే అవకాశాలు

Hazarath Reddy

రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ విధ్వంసకర ఆటగాడు బానుక రాజపక్స రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ కొట్టిన స్ట్రెయిట్‌ షాట్‌ రాజపక్స మోచేతికి బలంగా తాకింది. దీంతో బానుక నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌ తొలి బంతికి ఇది చోటుచేసుకుంది.

IPL 2023 RR vs PBKS: రాజస్థాన్ పై 5 పరుగుల తేడాతో విజయం సాధించిన పంజాబ్, బోణీ కొట్టిన శిఖర్ ధావన్ సేన..

kanha

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎనిమిదో మ్యాచ్ బుధవారం గౌహతిలో పంజాబ్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది.

IPL 2023: తన స్వంత రెస్టారెంట్‌కు ఆర్సీబీ ఆటగాళ్లను తీసుకెళ్లిన కోహ్లీ, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

Hazarath Reddy

IPL 2023: చెత్తగా ఆడుతున్నావు, షాట్ సెలక్షన్ దరిద్రంగా ఉంది, వాళ్లని చూసి నేర్చుకో, పృథ్వీ షాపై తీవ్ర విమర్శలు చేసిన టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్

Hazarath Reddy

ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా (Prithvi Shaw) ఆటతీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఐపీఎల్‌‌ 2023లో (IPL 2023) లక్నోతో (LSG) జరిగిన తొలి మ్యాచ్‌లో పృథ్వీ 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు

Advertisement

IPL 2023: ఆర్సీబీని వెంటాడుతున్న కష్టాలు, ముగ్గురు స్టార్ ప్లేయర్లకు గాయాలు, మడమ గాయంతో ఐపీఎల్ నుంచి తప్పుకున్న కీలక ఆటగాడు రజత్‌ పటిదార్‌

Hazarath Reddy

రజత్‌ పటిదార్‌ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.మడమ గాయంతో బాధపడుతున్న పాటిదార్‌.. పూర్తిగా కోలుకోవడానికి దాదాపు రెండు నెలలసమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు.

IPL 2023: రాహుల్ కళ్లు చెదిరే క్యాచ్ వీడియో ఇదిగో, పాయింట్‌లో డైవ్ చేస్తూ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న గుజరాత్ టైటాన్స్ ఆటగాడు, గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన రోసో

Hazarath Reddy

ఢిల్లీ క్యాపిటల్స్‌తో (DC) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) ఆటగాడు రాహుల్ తెవాటియా (Rahul Tewatia) డైవ్ చేస్తూ మంచి క్యాచ్ అందుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.జోసెఫ్ వేసిన షార్ట్ పిచ్ బంతి రోసో బ్యాట్‌కు తగిలి గాల్లోకి లేచింది.

IPL 2023: అత్యంత తక్కువ ధరకు కొన్నారు, అయినా ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు, వరుసగా రెండు హాఫ్ సెంచరీలతో ఐపీఎల్‌లో కొత్త రికార్డు నెలకొల్పిన లక్నో స్టార్ కైల్‌ మైర్స్‌

Hazarath Reddy

ఐపీఎల్‌లో వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓపెనర్‌ కైల్‌ మైర్స్‌ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ అరంగేట్రంలో వరుసగా రెండు హాఫ్‌ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా మైర్స్‌ చరిత్ర సృష్టించాడు.

IPL 2023 DC vs GT : గుజరాత్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చిత్తు, గుజరాత్ టైటాన్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయిన ఢిల్లీ..

kanha

ఐపీఎల్ 16వ సీజన్‌లో ఏడో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి చవిచూసింది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

Advertisement

IPL 2023: ఈ మాత్రం దానికి రూ. 16.25 కోట్ల దండగ, బెన్ స్టోక్స్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న సీఎస్‌కే అభిమానులు, రెండోసారి కూడా విఫలమైన స్టార్ ఆల్ రౌండర్

Hazarath Reddy

చెన్నై భారీ మొత్తం ఖర్చు పెట్టి సొంతం చేసుకున్న ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ మళ్లీ నిరాశపరిచాడు. ఐపీఎల్‌-2023లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ని దాదాపు రూ. 16.25 కోట్ల భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

IPL 2023: ధోనికి చిరాకు తెప్పించిన ఫాస్ట్ బౌలర్లు, ఇలానే ఆడితే నేను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని వార్నింగ్, కొత్త కెప్టెన్ నేతృత్వంలో ఆడాల్సి ఉంటుందని హెచ్చరిక

Hazarath Reddy

MA చిదంబరం స్టేడియంలో Kl రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్‌ను 12 పరుగుల తేడాతో ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023లో మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో చివరికి చెన్నైదే పైచేయి అయింది

CSK vs LSG, IPL 2023: ఐపీఎల్ లో సంచలన విజయంతో చెన్నై బోణీ, ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్‌ ఓటమిపాలైంది

kanha

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రితురాజ్ గైక్వాడ్ అర్ధశతకంతో ఆ జట్టు 7 వికెట్లకు 217 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించిన లక్నో జట్టు 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు మాత్రమే చేయగలిగింది.

IPL 2023: గుజ‌రాత్ టైట‌న్స్‌కు బిగ్ షాక్, స్వదేశానికి పయనమైన కేన్ విలియ‌మ్స‌న్, కుడి మోకాలికి ప‌ట్టీతో, రెండు క‌ర్ర‌ల సాయంతో నిల్చొని ఉన్న ఫోటో షేర్..

Hazarath Reddy

ఢిఫెండింగ్ చాంపియ‌న్ గుజ‌రాత్ టైట‌న్స్‌(Gujarat Titans)కు బిగ్ షాక్ త‌గిలింది. కేన్ విలియ‌మ్స‌న్(Kane Williamson) టోర్నీ మొత్తానికి దూరం అయ్యాడు. 16వ సీజ‌న్ ఆరంభ పోరులో గాయ‌ప‌డిన అత‌ను స్వ‌దేశానికి ప‌య‌న‌మ‌య్యాడు. కుడి మోకాలికి ప‌ట్టీతో, రెండు క‌ర్ర‌ల సాయంతో నిల్చొని ఉన్న త‌న‌ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

Advertisement

IPL 2023: వీడియో ఇదిగో, ధోని గురించి డైలాగులతో దుమ్మురేపిన బాలయ్య, 15 ఏళ్ల కిందట ఓ సూర్యుడు అంటూ.. ప్రత్యేక ప్రోమో విడుదల చేసిన స్టార్ స్పోర్ట్స్ తెలుగు

Hazarath Reddy

స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఈ రోజు ప్రత్యేక ప్రోమో విడుదల చేసింది. టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ విశిష్టతలను వివరించడం ఈ వీడియోలో చూడొచ్చు. వీడియోలో..15 ఏళ్ల కిందట ఓ సూర్యుడు పసుపు రంగు జెర్సీ ధరించి మనందరి జీవితాల్లో ఉదయించాడు

Jason Holder Catch Video: ఐపీఎల్‌‌లో స్టన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో, బౌల్డ్‌ వేసిన ఔట్‌ స్వింగర్‌ను గెలుక్కున్న రాహుల్‌ త్రిపాఠి, ఎడమవైపుకు డైవ్‌ చేస్తూ ఒంటిచేత్తో అందుకున్న జేసన్‌ హోల్డర్‌

Hazarath Reddy

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్‌, రాజస్తాన్‌ మ్యాచ్‌లో స్టన్నింగ్‌ క్యాచ్‌ నమోదైంది. ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లో బౌల్డ్‌ వేసిన ఔట్‌ స్వింగర్‌ను అవనసరంగా గెలుక్కున్న రాహుల్‌ త్రిపాఠి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ తాకింది.

IPL 2023: టీ20ల్లో 300 వికెట్లు, తొలి భారత క్రికెటర్‌గా య‌జువేంద్ర చాహ‌ల్‌ అరుదైన రికార్డు, తరువాతి స్థానంలో రవిచంద్రన్ అశ్విన్

Hazarath Reddy

స్పిన్ బౌల‌ర్ య‌జువేంద్ర చాహ‌ల్‌(Yuzvendra Chahal).. టీ20ల్లో అరుదైన రికార్డు సాధించాడు. టీ20ల్లో 300 వికెట్లు తీసుకున్న తొలి ఇండియ‌న్ బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో హైద‌రాబాద్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో ఆ ఘ‌న‌త‌ను అత‌ను అందుకున్నాడు.

IPL 2023: విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు, ఐపీఎల్‌లో 50 ప్ల‌స్ స్కోర్ 50 సార్లు చేసిన ఫస్ట్ ఇండియన్ క్రికెటర్, అత్య‌ధికంగా ఫిఫ్టీస్ కొట్టిన బ్యాట‌ర్ల‌లో అగ్రస్థానంలో డేవిడ్ వార్న‌ర్

Hazarath Reddy

ఐపీఎల్‌లో 50 ప్ల‌స్ స్కోర్ 50 సార్లు చేసిన ఇండియ‌న్ క్రికెట‌ర్‌గా కోహ్లీ రికార్డు క్రియేట్ చేశారు. అయితే ఐపీఎల్‌లో అత్య‌ధికంగా ఫిఫ్టీస్ కొట్టిన బ్యాట‌ర్ల‌లో డేవిడ్ వార్న‌ర్ ఫ‌స్ట్ ఉన్నాడు. ఇక కోహ్లీ త‌ర్వాత ఇండియ‌న్ల‌లో రెండ‌వ స్థానంలో ధావ‌న్ ఉన్నాడు. అత‌ను 49 సార్లు ఫిఫ్టీలు కొట్టాడు

Advertisement

IPL 2023: చెత్త చెత్తగా ఆడుతున్నారు, ఒకరి ఖరీదు రూ. 17 కోట్లు, మరొకరు రూ. 16 కోట్లు, ఇంకొకరు రూ. 13 కోట్లు, ఘోరంగా విఫలవుతున్న విదేశీ ఖరీదైన ఆటగాళ్లు

Hazarath Reddy

ఐపీఎల్ (IPL 2023)లో తమ తొలి మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబై ఇండియన్స్ (MI) ఓటములు మూటకట్టున్నాయి. ఆయా జట్లు కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు.

Umran Malik 150kph Delivery Video: వీడియో ఇదిగో, ఉమ్రాన్ 150 కి.మీ. స్పీడ్‌కి ఎగిరి అవతల పడిన వికెట్, బిత్తరపోయిన దేవదూత్ పడిక్కల్‌

Hazarath Reddy

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) గతేడాది రన్నరప్ రాజస్థాన్ రాయల్స్‌పై 72 పరుగుల తేడాతో ఓడిపోయింది.ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ దాదాపు 150 కి.మీ. వేగంతో బంతులు విసిరాడు

RCB vs MI: విరాట్ విశ్వరూపం, ముంబైను మట్టి కరిపించిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్, ఆడుతూ పాడుతూ టార్గెట్ దంచేశారు..

kanha

ఆర్‌సిబి ఎనిమిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ను ఓడించి ఈ సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించింది. మ్యాచ్ సమయంలో, RCB కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో కనిపించారు. డు ప్లెసిస్ 43 బంతుల్లో 73 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు. అదే సమయంలో, కోహ్లి 49 బంతుల్లో అజేయంగా 82 పరుగులు చేశాడు.

RR Vs SRH: ఉప్పల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పరువు గోవిందా..తొలి మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఘోర పరాజయం..

kanha

ఐపీఎల్ 2023 నాలుగో మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య హైదరాబాద్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు 72 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

Advertisement
Advertisement