రాష్ట్రీయం

Andhra Pradesh Shocker: చిన్నారిని చిధిమేసిన మూఢనమ్మకం, 40 రోజులుగా ఉపవాసం ఉంటూ చర్చిలో ప్రార్థనలు..చివరకు చర్చిలోనే ప్రాణం విడిచిన చిన్నారి

Arun Charagonda

మూఢనమ్మకం చిన్నారిని చిదిమేసింది. నెల్లూరుకు చెందిన లక్ష్మయ్య, లక్ష్మిల కూతురు భవ్యశ్రీ(8)కి బ్రెయిన్ ట్యూమర్.. వైద్యులు సర్జరీ చేయాలని చెప్పారు.సర్జరీ చేస్తే చిన్నారి బతకదని తల్లిదండ్రులు భయపడ్డారు. దానికి తోడు సర్జరీ చేసేంత డబ్బులు లేవు. ఆదూరిపల్లి చర్చిలో ప్రార్థనలు చేస్తే నయం అవుతుందని కొందరు చెప్పడంతో 40 రోజులుగా ఉపవాసం ఉంటూ ప్రార్థనలు చేశారు. చివరికి చిన్నారి భవ్యశ్రీ చర్చిలోనే ప్రాణాలు విడిచింది.

Kakani vs Somireddy: నేను, విజయసాయి రెడ్డి వస్తాం, నీవు చెప్పేవి నిజాలే అయితే కాణిపాకంలో ప్రమాణం చేసే దమ్ముందా, సోమిరెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడిన కాకాణి గోవర్థన్ రెడ్డి

Hazarath Reddy

వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇంకా బయట తిరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. దీనిపై వైసీపీ నేత కాకాణి గోవర్థన్ రెడ్డి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Telangana: రైల్వే పట్టాలపై పులి సంచారం, వీడియో తీసిన రైల్వే అధికారులు...కొమురం భీం జిల్లాలో ఘటన, వీడియో ఇదిగో

Arun Charagonda

కొమురం భీం జిల్లాలో పులి సంచారం కలకలం రేపింది. వేంపల్లి రైల్వే క్యాబిన్ సమీపంలో ఇవాళ మధ్యాహ్నం రైల్వే సిబ్బందికి పులి కంట పడింది. పులి రైల్వే ట్రాక్ దాటుతుండగా సెల్ ఫోన్‌లో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. పులి సంచారంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Telangana: నల్గొండలో దారుణం, భూ వివాదం..గొడ్డలితో దాడి చేసుకున్న అన్నదమ్ముల పిల్లలు...వీడియో ఇదిగో

Arun Charagonda

భూవివాదం నేపథ్యంలో గొడ్డలితో దాడి చేసుకున్నారు సొంత అన్నదమ్ముల పిల్లలు. ఈ ఘటనలో నలుగురికి గాయాలుకాగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో ఘటన చోటు చేసుకోగా గజ్జి లింగయ్య కుటుంబ సభ్యులు తమపై దాడి చేశారని గజ్జి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు తిప్పర్తి పోలీసులు.

Advertisement

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో దారుణం, రొయ్యల చెరువు ఫోటోలు తీస్తున్నారని యువకుడిని స్తంబానికి కట్టేసి కొట్టిన రైతులు..వీడియో ఇదిగో

Arun Charagonda

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లిలో కొంతకాలంగా ఆక్వా సాగుకు వ్యతిరేకంగా కొందరు యువకుల ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. హైకోర్టును ఆశ్రయించి రొయ్యల చెరువులు మూసివేయించారు. అయితే సోమవారం సాయంత్రం రొయ్యల సాగు తిరిగి ప్రారంభిస్తున్నారని తెలుసుకున్న చిక్కం వీరదుర్గాప్రసాద్‌ ఆ ప్రాంతానికి వెళ్లి ఫొటోలు తీసే ప్రయత్నం చేయగా ఆగ్రహించిన రైతులు యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టారు. ప్రస్తుతం బాధితుడికి అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధితుడు.

CM Revanth Reddy: ఢీల్లీ, జైపూర్‌కు సీఎం రేవంత్ రెడ్డి, మూడు రోజుల పర్యటన, ఈసారైనా నామినేటెడ్ పదవుల భర్తీపై క్లారిటీ వచ్చేనా?

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. 11,12,13 మూడు రోజుల పాటు ఢిల్లీతో పాటు జైపూర్‌లో పర్యటించనున్నారు రేవంత్. ఇవాళ సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్న రేవంత్... అక్కడి నుండి ఢిల్లీ తర్వాత జైపూర్‌కు చేరుకుంటారు

Mudragada Padmanabha Reddy: వీడియో ఇదిగో, ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వెంటే ఉంటా, ముద్రగడ పద్మనాభ రెడ్డి కీలక వ్యాఖ్యలు, ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని వెల్లడి

Hazarath Reddy

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వెంటే నడుస్తానని తెలిపారు. చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వైసీపీ పార్టీ బలోపేతం చేసి మళ్లీ జగన్ ని సీఎం గా చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం, లక్కీ భాస్కర్ సినిమా చూసి డబ్బు సంపాదించాలంటూ హాస్టల్ గోడ దూకి పరార్..

Hazarath Reddy

విశాఖ నగరంలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపింది. హాస్టల్ నుంచి నలుగురు విద్యార్థులు వెళ్లిపోయారు. మహారాణి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.లక్కీ భాస్కర్ సినిమా చూసి డబ్బు సంపాదించాలని విద్యార్థులు నలుగురు పరారయ్యారు.

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, రోడ్డు సౌకర్యం లేక 7 కిలోమీటర్లు చనిపోయిన శవాన్ని మోసుకెళ్ళిన ఆదివాసి గిరిజనులు, అల్లూరి జిల్లాలో ఘటన

Hazarath Reddy

రోడ్డు సౌకర్యం లేక 7 కిలోమీటర్లు చనిపోయిన శవాన్ని మోసుకెళ్తున్న ఆదివాసి గిరిజనులు వీడియో వెలుగులోకి వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ మడ్రేబు గ్రామానికి చెందిన సిలకమ్మ మరణించింది.

Vikarabad Food Poisoning: తాండూరు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 30 మంద విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

Hazarath Reddy

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పరిధిలోని సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు హాస్టల్‌లో వండిన ఆహారం తిని 30మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Telangana:వీడియో ఇదిగో, అప్పుల భాదతో కుటుంబం ఆత్మహత్యాయత్నం, ఆన్ లైన్ షేర్ బిజినెస్‌లో పెట్టుబడులు పెట్టి లాస్

Hazarath Reddy

మంచిర్యాల జిల్లాలో అప్పుల భాదతో కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. తాండూరు మండలం కాసిపేట్‌లో కిరణాషాపు, పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న సముద్రాల మొండయ్య, శ్రీదేవి దంపతులు.కుమార్తె చైతన్య వికలాంగురాలు

YS Jagan: జగన్ రూ. 100 కోట్ల పరువు నష్టం దావా, ఆ రెండు పత్రికలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు, ఇకపై ఎటువంటి కథనాలు ప్రచురించరాదని న్యాయస్థానం ఆదేశాలు

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) నుంచి సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో తనకు ముడుపులు అందాయంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ప్రచురించిన తప్పుడు, దురుద్దేశపూ­ర్వక కథనాలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ హైకోర్టులో రూ.100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారు

Advertisement

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు అన్నీ కేసుల్లో షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు, పోలీసుల విచారణకు సహకరించాలని సూచన

Hazarath Reddy

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆర్జీవీకి అన్నీ కేసుల్లో షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. సోషల్‌ మీడియా పోస్టుల వ్యవహారంలో ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తుళ్లూరు, అనకాపల్లి జిల్లా రావికమతం స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి.

Weather Forecast: బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగు­తున్న అల్ప­పీడనం, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప­పీడనం స్థిరంగా కొనసాగు­తున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే దీని ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, పుష్ప- 2 సినిమా చూస్తూ రాయదుర్గంలో వ్యక్తి మృతి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

Hazarath Reddy

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప 2' బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర సృష్టిస్తోంది. తాజాగా ఏపీలో ఈ సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. అనంతపురం జిల్లా రాయదుర్గ్‌లోని కేబీ ప్యాలెస్ థియేటర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది.

Manchu Family Issue Row: చిన్నపాటి వివాదాలే.. మా ఫ్యామిలీ వ్యవహారాన్ని పెద్దది చేసి చూపించడం తగదు.. తమ కుటుంబ వివాదంపై మంచు విష్ణు స్పందన (వీడియో)

Rudra

తమ కుటుంబంలో చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు మంచు విష్ణు తెలిపారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌ కు వచ్చిన ఆయన ఈ మేరకు మాట్లాడారు.

Advertisement

Accident in AP: విషాదంగా మారిన విహార యాత్ర.. పంట కాలువలోకి దూసుకువెళ్లిన కారు.. తల్లి, ఇద్దరు కుమారుల మృతి.. అంబేద్కర్ జిల్లా కోనసీమలో ఘటన (వీడియో)

Rudra

ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పి గన్నవరం మండలం ఊడిమూడి శివారు చింతావారిపేట సమీపంలో పంటకాలువలోకి ఓ కారు దూసుకువెళ్లింది.

Police Cases Against Manchu Family: వేడెక్కిన ‘మంచు’ వివాదం.. మోహ‌న్‌ బాబు, మ‌నోజ్ ఫిర్యాదుల మేరకు రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు

Rudra

మంచు ఫ్యామిలీ వివాదం సెగలు పుట్టిస్తుంది. తండ్రీకొడుకులు మోహ‌న్‌బాబు, మ‌నోజ్ ఒక‌రిక‌పై ఒక‌రు పోలీసుల‌కు ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇరువురి నుంచి ఫిర్యాదులు స్వీక‌రించిన ప‌హాడిష‌రీఫ్ పోలీసులు మంగ‌ళ‌వారం రెండు కేసులు న‌మోదు చేసిన‌ట్లు తెలుస్తోంది.

Rajendra Prasad Shocking Comments on Allu Arjun: ‘వాడెవడో చందనం దొంగ.. వాడు ఇప్పుడు హీరో అట..!’.. అల్లు అర్జున్, పుష్పపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (వీడియో)

Rudra

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తాజాగా `హరికథ` అనే వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్ర పోషించారు. రాజేంద్రప్రసాద్‌ తో పాటు శ్రీరామ్‌, మౌనిక రెడ్డి, అర్జున్‌ అంబటి, రుచిర సాధినేని తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Student Dies by Suicide: వీడియో ఇదిగో, రైలు కిందపడి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య, తల్లిదండ్రులు మందలించడంతో కఠిన నిర్ణయం

Hazarath Reddy

రైలు కిందపడి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం నగరంలో స్థానికంగా గల హార్వెస్ట్ పాఠశాలలో లక్ష్మీ నక్షత్ర (13) అనే విద్యార్థిని పదో తరగతి చదువుతుంది. లక్ష్మీ నక్షత్ర వయస్సు సోమవారం రోజు ఖమ్మం లో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది.

Advertisement
Advertisement