రాష్ట్రీయం

Diwali At Graveyard: స్మశానంలో దీపావళి, కరీంనగర్‌లో ఆరు దశాబ్దాలుగా వింత ఆచారం, సమాధుల దగ్గర టపాసులు కాల్చి దీపావళి పండుగ..వీడియో ఇదిగో

Arun Charagonda

సాధారణంగా దీపావళి పండుగ రోజు అందరూ ఇళ్ల ముందు దీపాలు వెలిగిస్తే.. వీళ్లు మాత్రం స్మశాన వాటికలకి వచ్చి సమాధుల ముందు దీపాలు వెలిగించి టపాసులు కాల్చి దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇలాంటి ఆచారాన్ని ఆరు దశాబ్దాలకు పైగా కోనసాగిస్తున్నారు కరీంనగర్ జిల్లాలోనే ఓ సామాజిక వర్గం. సమాధుల వద్ద పూజలు నిర్వహించి... చనిపోయిన తమ పూర్వికులను గుర్తుచేసుకుంటారు. అనంతరం పిల్లలతో కలిసి దీపావళి పండగను సెలబ్రేట్ చేసుకుంటారు.

Andhra Pradesh: ఏటీఎం సెంటర్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారా..?, తస్మాత్ జాగ్రత్త..డబ్బులు కాజేస్తున్న యువకుడిని పట్టుకుని చితకబాదిన స్ధానికులు

Arun Charagonda

కర్నూలులో బడా మోసం బయటపడింది. ఏటీఎం మెషిన్ లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన వారికి టోకరా వేస్తున్నాడు ఓ యువకుడు. మెషిన్ లో డిపాజిట్ కి బదులు.. ఫోన్ పే ద్వారా మనీ ట్రాన్సెక్షన్ చేస్తానంటూ భారీగా డబ్బులు కాజేస్తున్నాడు యువకుడు. దీంతో యువకుడిని పట్టుకుని చితకబాదారు స్థానికులు.

Mayonnaise Banned in Telangana: తెలంగాణలో మయోనైజ్‌ బ్యాన్, మోమోస్ తిని మహిళ మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం

Vikas M

రాష్ట్రంలో ఇటీవల మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. చాలా మంది రోగాలపాలయ్యారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీపై నిఘా పెంచింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, అన్నమయ్య జిల్లాలో 1000 లీటర్లకు సారా ఊటని ధ్వంసం చేసిన పోలీసులు, నాటు సారా తయారు చేసి అమ్మితే కేసులు తప్పవని హెచ్చరిక

Vikas M

అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని నారమాకులపల్లి తండాలో సీఐ కళా వెంకట్రావు, ఎస్సై చంద్రమోహన్ ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు చేసిన ఆకస్మిక దాడులలో 1000 లీటర్లకు సారా ఊట ధ్వంసం చేశారు. నాటు సారా తయారు చేయడం, అమ్మడం నేరమని, పోలీసు నియమాలు పాటించని వారిపై పోలీసు కేసులు తప్పవని హెచ్చరించారు.

Advertisement

B.R. Naidu as TTD chairman: టీటీడీ నూతన ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు, 24 మంది సభ్యులతో పాలక మండలి ఏర్పాటు,పూర్తి లిస్టు ఇదిగో..

Hazarath Reddy

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలి నూతన ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో TTD పాలకమండలి ఏర్పాటు కానుంది. ఈ మేరకు TTD అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Youtuber Harsha Sai: లైంగిక వేధింపుల కేసులో హర్షసాయికి ముందస్తు బెయిల్, తనపై పెట్టిన కేసు చెల్లదని హైకోర్టును ఆశ్రయించిన హర్షసాయి

Arun Charagonda

యూట్యూబర్‌ హర్షసాయికి ముందుస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. తనపై పెట్టిన కేసు చెల్లదని హైకోర్ట్‌ను ఆశ్రయించారు హర్షసాయి. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం లైంగిక వేధింపుల కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

Free Gas Cylinders Scheme: ఏపీలో రేపటి నుంచి ఉచిత సిలిండర్ పథకం అమల్లోకి, మూడు సిలిండర్లు ఎప్పుడెప్పుడు బుక్ చేసుకోవాలో తెలుసుకోండి

Hazarath Reddy

దీపం-2 కింద నమోదు చేసుకున్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందుతాయి, నాలుగు నెలల వ్యవధిలో ఇవి అందించబడతాయి. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ల కోసం ముందస్తుగా చెల్లించాలని భావిస్తున్నారు. రాష్ట్రం వాటిని 48 గంటల్లో తిరిగి చెల్లిస్తుంది. ఈ రీయింబర్స్‌మెంట్‌లో రూ. 876 ఉంటుంది, మిగిలిన రూ. 25 కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా కవర్ చేస్తుంది

TSPSC Group 3 Exam Date 2024: వచ్చేనెల 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు, తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌

Hazarath Reddy

తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చేనెల 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వచ్చేనెల 17న రెండు సెషన్లలో రెండు పేపర్లకు పరీక్ష జరగనుంది.

Advertisement

Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం వీడియో ఇదిగో, బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగు పడి ఇద్దరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

Telangana: లోక కళ్యాణం కోసం ఆత్మార్పణం చేసుకుంటా, సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద ఏం జరగబోతుందో మీరే చూస్తారని మహిళా అఘోరీ సంచలన కామెంట్

Arun Charagonda

లోక కళ్యాణం కోసం ఆత్మార్పణ చేసుకుంటానని తెలిపింది మహిళా అఘోరీ. వేములవాడ రాజన్నకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మాట్లాడిన మహిళా అఘోరీ..వేములవాడ ఆలయంలో చాలా ఏళ్లుగా ఉన్న దర్గాని కూలగొట్టాలని కామెంట్ చేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద ఏం జరగబోతుందో మీరే చూస్తారని ప్రకటించారు.

Minister Komatireddy: మనసున్న మారాజు మంత్రి కోమటిరెడ్డి, పేద విద్యార్థిని చదువుకు అండగా నిలిచిన వెంకట్‌రెడ్డి, ఎంబీబీఎస్ చదువుకు చేయూత

Arun Charagonda

పేదింటి విద్యార్థిని చదువుకు అండగా నిలిచారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సలాబత్ పూర్ కి చెందిన కాట్రాజ్ సుమలత ఇటీవల MBBS సీటు సాధించింది. కాలేజీ ఫీజు కట్టేందుకు సుమలత కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలుసుకున్నారు. సుమలత చదువు పూర్తయ్యే వరకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కోమటిరెడ్డి హామీనిచ్చారు

Andhra Pradesh: అన్నమయ్య జిల్లాలో పలు మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు, కరవు మండలాల జాబితాను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, మొత్తం 5 జిల్లాల్లో 54 కరువు మండలాలు

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం 2024 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన కరవు మండలాల జాబితాను తాజాగా ప్రకటించింది. ఐదు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 54 మండలాలు కరవు వల్ల ప్రభావితం అయినట్లు అధికారులు గుర్తించారు.

Advertisement

Weather Forecast: సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం, తెలుగు రాష్ట్రాలకు మూడు రోజుల పాటు వర్ష సూచన, ఈ జిల్లాలకు అలర్ట్

Hazarath Reddy

నిన్న దక్షిణ ఒడిస్సా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు దక్షిణ చత్తీస్ ఘడ్, ఒడిస్సా ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ, ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణ దిశగా వంగి ఉంటుంది. దీని ప్రభావంతో ఏపీలో మరోసారి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.

Telangana Caste Census: నవంబర్‌ 6 నుంచి తెలంగాణలో కులగణన, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించే యోచనలో హస్తం నేతలు!

Arun Charagonda

దేశంలో తొలిసారిగా నవంబర్‌ 6 నుంచి రాష్ట్రంలో కులగణన ప్రక్రియ చేపట్టనున్నారు. నవంబర్‌ 6న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది. ఈ మేరకు గాంధీ భవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

MLA Medipalli Satyam: కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు బెదిరింపు కాల్, రూ. 20 లక్షలు డిమాండ్ చేసిన ఓ వ్యక్తి, లండన్‌ నుండి ఫోన్..లుక్ ఔట్ నోటీసులు జారీ

Arun Charagonda

కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఫోన్ లో బెదిరించి, 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. గత సెప్టెంబర్ నెలలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి వాట్సప్ కాల్ అందుకున్నారు ఎమ్మెల్యే సత్యం. తనకు 20 లక్షలు ఇవ్వకపోతే అప్రతిష్ఠపాలు చేస్తానని, నిన్ను చంపి నీ పిల్లలను అనాధలను చేస్తానంటూ హెచ్చరించారు.

Harishrao: హైదరాబాద్‌లో సముద్రమా?, ప్రజలంతా నవ్వుకుంటున్నారు..రేవంత్ రెడ్డి సీఎం కాదు జోకర్ మండిపడ్డ మాజీ మంత్రి హరీశ్ రావు, కేసీఆర్ భిక్షతోనే సీఎంగా రేవంత్ రెడ్డి

Arun Charagonda

కేసీఆర్ భిక్షతోనే రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన హరీశ్‌ రావు...రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టాడని అంటాడు...దిల్ సుఖ్ నగర్ లో విమానాలు అమ్ముతారని రేవంత్ అనటం హాస్యాస్పదం అన్నారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే.. బీఆర్ఎస్ కు 100సీట్లు వస్తాయి అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి.. కేసీఆర్ పెట్టిన బిక్ష అన్నారు. కేసీఆర్ లేకుంటే.. తెలంగాణ వచ్చేది కాదు...తెలంగాణ లేకుంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడా? అని ప్రశ్నించారు.

Advertisement

Telangana Congress: బీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య డ్రగ్స్ టెస్ట్ యుద్ధం, డ్రగ్స్ టెస్టులకు శాంపిల్స్ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు...బీఆర్ఎస్ నేతలకు సవాల్

Arun Charagonda

తెలంగాణలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్ధాయికి చేరింది. హైదర్‌గూడలోని అపోలో హాస్పిటల్‌లో డ్రగ్స్ టెస్టుల కోసం శాంపిల్స్ ఇచ్చారు ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తమ సవాల్‌ని స్వీకరించి డ్రగ్స్ టెస్టులకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.

CM Revanth Reddy: డాక్టర్ కావాలన్న గిరిజన విద్యార్థిని కోరిక నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి, వైద్య విద్యకు కావాల్సిన సాయాన్ని అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి

Arun Charagonda

డాక్టర్ కావాలన్న ఆ గిరిజన విద్యార్థిని కల నెరవేరనుంది. ఎంబీబీఎస్‌లో సీటు సాధించినా కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న సాయి శ్రద్ధకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ధిక సాయం అందించారు.

Nara Lokesh Meets Satya Nadella: అమరావతిని ఏఐ రాజధానిగా చేయడమే మా లక్ష్యం, సత్య నాదెళ్లతో భేటి అయిన నారా లోకేష్, ఏపీలో పెట్టుబడులపై చర్చలు

Hazarath Reddy

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ యూఎస్ పర్యటనలో మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల, యాపిల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఆపరేషన్స్‌) ప్రియా బాలసుబ్రహ్మణ్యం, అడోబ్‌ సీఈఓ శంతను నారాయణ్‌లతో వేర్వేరుగా సమావేశమయ్యారు

Hyderabad: టపాసుల దుకాణంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఆగంతకుడు, యజమాని అప్రమత్తతో తప్పిన ప్రమాదం...పోలీసుల అదుపులోకి దాడికి పాల్పడ్డ వ్యక్తి..వీడియో ఇదిగో

Arun Charagonda

టపాసుల దుకాణంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు ఓ అగంతకుడు. హైదరాబాద్ - లాలాగూడలో రోడ్డుపై ఏర్పాటు చేసిన టపాసుల దుకాణంపై, 5 లీటర్ల పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు అగంతకుడు. షాపులో నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులు.. ఒకరికి స్వల్ప గాయాలు, ఆస్పత్రికి తరలించగా యజమానుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని దాడి చేసినట్లు సమాచారం.

Advertisement
Advertisement