రాష్ట్రీయం
Jani Master Emotion With Family: జైలు నుంచి ఇంటికొచ్చిన జానీ మాస్టర్ కు ఆయన పిల్లలు ఎలా స్వాగతం పలికారో చూడండి! ఫ్యామిలీ గురించి జానీ మాస్టర్ ఎమోషనల్ ట్వీట్ ఇదే!
VNSశనివారం భావోద్వేగంతో కూడిన ఓ పోస్టును తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ 37 రోజుల్లో ఎంతో కోల్పోయానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల ప్రార్థనలు నన్ను ఇక్కడకు తీసుకొచ్చాయని జానీ మాస్టర్ (Jani Master Release) పేర్కొన్నారు.
Telangana DGP: పోలీస్ కానిస్టేబుళ్ల ఆందోళనలపై స్పందించిన తెలంగాణ డీజీపీ, క్రమశిక్షణ గల ఫోర్స్‌లో ఉండి ఆందోళనలు చేయడం సరికాదన్న జితేందర్
Arun Charagondaస్పెషల్ పోలీసుల ఆందోళనలపై స్పందించారు తెలంగాణ డీజీపీ జితేందర్. క్రమశిక్షణ గల ఫోర్స్‌లో ఉండి ఆందోళనలు చేయడం సరికాదు అన్నారు. ఎంతో కాలం నుంచి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ సజావుగా సాగుతోందని...మన దగ్గర ఉన్న రిక్రూట్‌మెంట్ వ్యవస్థనే అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు.
Sharmila: జగనన్న చెప్తే సూర్యుని వరకు వెళ్లేదాన్ని..అన్నగా ఏం చేశాడో చెప్పాలన్న వైఎస్ షర్మిల
Arun Charagondaజగనన్న చెప్తే సూర్యుని వరకు వెళ్లేదాన్ని అన్నారు టీపీసీసీ చీఫ్ షర్మిల. నేనేం తక్కువ చేసా.. నేనేం తప్పు చేసా.. ఒక్కటైనా చెప్పండి అని సవాల్ విసిరారు. ఇన్ని చేసిన నాకు జగన్ ఒక్క మేలు అయినా చేశారా అన్నారు.
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ నటి ఐశ్వర్య, తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయ అధికారులు
Arun Charagondaప్రముఖ సినీ నటి ఐశ్వర్య రాజేష్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ముందుగా టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఐశ్వర్య రాజేష్ కుటుంబ సభ్యులకు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
KTR: కర్షక ద్రోహి కాంగ్రెస్..రైతు డిక్లరేషన్ బోగస్ అని మండిపడ్డ కేటీఆర్, రైతులు ఆగమైతుంటే పట్టించుకోవాల్సిన బాధ్యత లేదా అని మండిపాటు
Arun Charagondaఎక్స్ వేదికగా కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని రైతు డిక్లరేషన్‌లో చెప్పి..ఇప్పుడు ఉలుకూ పలుకూ లేకుండా కూర్చుంది కాంగ్రెస్ సర్కారు అని మండిపడ్డారు. తెల్ల బంగారం తెల్లబోతుంది...బోనస్ దేవుడెరుగు..మద్దతు ధరకే దిక్కులేదు అన్నారు.
Telangana: రైతును చితకబాదిన మునుగోడు ఏఎస్‌ఐ, భూ వివాదం నేపథ్యంలో అందరి ముందు కొట్టిన పోలీస్...ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు
Arun Charagondaమునుగోడులో రైతును చితకబాదాడు ఓ ఏఎస్ఐ. ఇద్దరు రైతుల మధ్య కొంతకాలంగా భూవివాదం నడుస్తుండగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లే క్రమంలో పొలం పనులు ముగించుకుని వస్తానని ప్రాధేయపడ్డారు రైతు ముత్యాలు. అందరి ముందు రైతును చితకబాదిన మునుగోడు ఏఎస్ఐ కోఠిసింగ్.
Srikanth Goud: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడికి జైలు శిక్ష, శ్రీకాంత్ గౌడ్ కు 14 రోజులు జైలు శిక్ష...మహబూబ్ నగర్ జిల్లా జైలుకు తరలింపు
Arun Charagondaమాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్‌కి జైలు శిక్ష పడింది. మహబూబ్ నగర్ లో సర్వే నెంబర్ 523 అక్రమాల్లో ఏ4 నిందితుడిగా ఉన్నారు శ్రీకాంత్ గౌడ్. సాక్ష్యాలను పరిశీలించి శ్రీకాంత్ గౌడ్ కు 14 రోజులు జైలు శిక్ష విధిస్తూ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో మహబూబ్ నగర్ జిల్లా జైలుకు శ్రీకాంత్ గౌడ్‌ను తరలించారు.
Andhra Pradesh:మారమ్మ ఆలయంలో కత్తితో వ్యక్తి హల్‌చల్, రైల్వే పోలీసుల నుండి తప్పించుకుని ఆలయంలోకి చొరబాటు, పోలీసులకు అప్పగించిన స్థానికులు...వీడియో ఇదిగో
Arun Charagondaఅన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో రైల్వే పోలీసుల నుంచి తప్పించుకుని ఆరవపల్లి ముత్తు మారమ్మ గుడిలోకి వెళ్లి కత్తితో హల్ చల్ చేశాడు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజేష్. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు నందలూరు పోలీసులు.
Madhu Yashki: ఆస్తులు కాపాడుకోవడానికే పార్టీ మారుతున్నారు, కాంగ్రెస్ పార్టీపై ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రేమ లేదన్న మధుయాష్కి గౌడ్..కాంగ్రెస్ నాయకుల హత్య బాధాకరం అని మండిపాటు
Arun Charagondaపార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సంచలన కామెంట్స్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌పై ప్రేమతో పార్టీ మారడం లేదని దుయ్యబట్టారు. అక్రమాస్తులు కాపాడుకునేందుకు, రాజకీయ భవిష్యత్ కాపాడుకునేందుకు మాత్రమే కాంగ్రెస్‌లో చేరారని విమర్శించారు.
Telangana: నాగార్జునసాగర్ హైవేపై పోలీసులకు - బెటాలియన్ పోలీసు కుటుంబాలకు మధ్య తోపులాట..భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్, బ్రిటిష్ కాలం నాటి విధానాలను మార్చాలని డిమాండ్
Arun Charagondaరంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నాగార్జునసాగర్ హైవేపై బెటాలియన్ పోలీసు కుటుంబాలకు, పోలీసులకు స్థానిక మధ్య తోపులాట జరిగింది. మహేశ్వరం డీసీపీ ఆగ్రహం వ్యక్తం చేయడం తో ఒక్క సరిగా ఉదృతంగా మారింది బాధితుల ఆందోళన. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల తరహాలో మన రాష్ట్రంలోనూ ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Nara Lokesh: శాన్‌ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్ సమావేశం, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వినతి, పరిపాలనలో ఏఐ వినియోగం ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని వెల్లడి
Arun Charagondaఅమెరికా పర్యటనలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు ఏపీ మంత్రి నారా లోకేశ్. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు గల అనుకూలతలు, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను పారిశ్రామిక వేత్తలకు వివరించారు.
TDP Membership Drive: రూ.100తో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం..5లక్షల ప్రమాద బీమా, రూ. లక్షతో టీడీపీ జీవితకాల సభ్యత్వం...వివరాలివే
Arun Charagondaటీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటి నుండి ప్రారంభంకానుంది. సీఎం చంద్రబాబు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా మెంబర్ షిప్ డ్రైవ్ కార్యక్రమం జరగనుంది.
Shamirpet Road Accident: శామీర్‌పేటలో షాకింగ్ రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయి డివైడర్‌ను ఢీకొట్టి ఓ వ్యక్తి మృతి...వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ శామీర్‌పేటలో షాకింగ్ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయి డివైడర్‌ను ఢీకొట్టి వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి గాయాలు అయ్యాయి. బాధితులు కరీంనగర్ జిల్లా కార్ఖానా గడ్డకు చెందిన షేక్ సక్లిన్, అతని స్నేహితుడు మహమ్మద్ పుర్కన్. ద్విచక్ర వాహనంపై కరీంనగర్ నుంచి మెహిదీపట్నంకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Andhra Pradesh: నకిలీ బంగారం దందా గుట్టు రట్టు,రెండు ముఠాలను పట్టుకున్న పోలీసులు.. 10 మంది అరెస్టు
Arun Charagondaరెండు ముఠాల మధ్య తుపాకీ కాల్పుల మిస్టరీని చేధించారు సత్యసాయి జిల్లా పోలీసులు. అనంతపురం జిల్లా కదిరి జాతీయ రహదారిపై రామాపురం కూడలి వద్ద రెండు ముఠాల మధ్య కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ధర్మవరం డీఎస్పి శ్రీనివాసులు నేతృత్వంలో రంగంలోకి దిగిన పోలీసు టీమ్‌లు.. 10 మందిని అరెస్టు చేశారు.
Vemulawada: రోడ్డు పక్కన కుప్పలుగా కోతుల కళేబరాలు, వేములవాడ పట్టణ శివారులో రోడ్డుపై మృతదేహాలు...దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Arun Charagondaవేములవాడలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్నాయి కోతుల కళేబరాలు. వేములవాడ పట్టణ శివారులో రోడ్డు పక్కన పదుల సంఖ్యలో కోతులు మృతిచెందగా గుర్తుతెలియని వ్యక్తులు చంపి పడేసినట్లుగా అనుమానిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Jagga Reddy On Sangareddy Collector: సంగారెడ్డి కలెక్టర్‌పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వివాదాస్పద కామెంట్స్, కలెక్టర్ ఏం చేస్తోంది...భర్త పక్కన పడుకుందా అంటూ వ్యాఖ్యలు..వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaకాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ కలెక్టర్‌కు తాను ఫోన్ చేస్తే ఎత్తలేదని..దీంతో తనకు కోసం వచ్చి తిట్టానంటూ బహిరంగంగానే చెప్పారు. కలెక్టర్ ఫోన్ ఎత్తకపోవడంతో చివరకు కలెక్టర్ పీఏకు ఫోన్ చేశానని, కలెక్టర్ ఆఫీసులో లేకుండా ఇంట్లో పడుకున్నారా అని అడిగానన్నారు.
Viral Video: పసి బిడ్డలతో సహా జేసీబీ కింద పడేందుకు మహిళల యత్నం.. చిత్తూరులో షాకింగ్ ఘటన (వీడియో)
Rudraచిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం తాతిరెడ్డి పల్లి గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పసి బిడ్డలతో సహా జేసీబీ కింద పడేందుకు మహిళలు యత్నించడం కలకలం సృష్టించింది.
Telangana Cabinet Meet: తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, మూసీ నది పునరుజ్జీవంపై ప్రధాన చర్చ ..మెట్రో రైలు ప్రాజెక్టు అంచనా వ్యయంపై రానున్న క్లారిటీ
Arun Charagondaతెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. మూసీ నది పునర్జీవనం ప్రాజెక్టుపై మంత్రివర్గంలో చర్చ, పునరావాసితులకు సంపూర్ణంగా ప్రభుత్వం సహకారం అందించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోనున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోనున్నారు.
Gussadi Kanakaraju Official last rites by TG Govt.: గుస్సాడీ కనకరాజు మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఆదేశం
Rudraగుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనకరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Copying In Group 1 Exam: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో కాపీయింగ్.. చీర కొంగులో చిట్టీలతో పాటు చేతి మీద కొన్ని జవాబులు రాసుకొనివచ్చిన మహిళా అభ్యర్థి.. మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు
Rudraగ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో కాపీయింగ్ జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్ పల్లి లోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో కాపీయింగ్ చేస్తూ మహిళా అభ్యర్థి ఇస్లవత్ లక్ష్మి పట్టుబడ్డారు.