రాష్ట్రీయం

Vijaysai Reddy On YS Sharmila: ఆస్తి తగాదా..అధికారం తగాదా?, జగన్‌కు లేఖ రాస్తే చంద్రబాబుకు ఎలా చేరిందో షర్మిల చెప్పాలన్న విజయసాయి రెడ్డి

Arun Charagonda

మీ అన్నకు వ్యక్తిగతంగా రాసిన లేఖ చంద్రబాబుకు ఎలా చేరిందో చెప్పాలని షర్మిలను ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన..జగన్ పై జరుగుతున్న కుట్రలో మీరు భాగస్వామ్యం కావడం శోచనీయం అన్నారు. ఇది ఆస్తి తగాదా కాదు.. అధికారం కోసం తగాదా చెప్పాలని..చంద్రబాబుతో కలిసి మీ అన్నకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చావ్ అని మండిపడ్డారు. షర్మిల నాటకాలు ఆపాలని...వైఎస్ చనిపోవడానికి కారణం ఎవరో తెలియదా అని ప్రశ్నించారు.

Janwada Farm House: డ్రగ్స్ ప్రస్తావనే లేకుండా పోలీసుల పంచనామా రిపోర్టు, విదేశీ లిక్కర్ మాత్రమే దొరికిందని తెలిపిన పోలీసుల వెల్లడి

Arun Charagonda

నిన్న రాత్రి రాజ్ పాకాల ఫాం హౌస్ లో జరిగిన పార్టీ పై పోలీసులు పంచనామా రిపోర్ట్ బయటకు వచ్చింది. పార్టీ జరుగుతుందన్న సమాచారం మేరకు తాము చెక్ చేయగా ఎక్సైజ్ శాఖ నుండి పర్మిట్ లేకుండా విందులో మద్యం సర్వ్ చేశారు అని పంచనామా రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు.అయితే ఎక్కడా డ్రగ్స్ గురించి ప్రస్తావన లేదు.

Telangana: ప్రాణం తీసిన ఈత సరదా, ఈతకు వెళ్లి ముగ్గురు యువకుల గల్లంతు, ఒకరి మృతి దేహం లభ్యం

Arun Charagonda

ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు అయిన ఘటన కొమురం భీం జిల్లా బెజ్జూర్‌ మండలం సోమిని ఎర్రబండ ప్రాంతంలో చోటు చేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. అందులో ఒకరు జాహీర్ మృత దేహం తలాయి ప్రాంతంలో లభ్యం కాగా మిగితా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Janwada Farmhouse Rave Party: రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని కఠినంగా శిక్షించాలి...కాంగ్రెస్ నేతల డిమాండ్, సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టాలి..డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చాల్సిందేనని వెల్లడి

Arun Charagonda

హైదరాబాద్ జన్వాడ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ కలకలం రేపింది. రాజ్ పాకాల అనే వ్యక్తి ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందగా రంగంలోకి దిగిన పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఈ పార్టీలో పాల్గొన్న విజయ్ మద్దూరి అనే వ్యక్తికి డ్రగ్స్ టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది. అలాగే ఈ పార్టీలో ప్రముఖులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Tirupati: తిరుపతి హోటల్స్‌కు ఆగని బాంబు బెదిరింపు మెయిల్స్, హోటల్స్‌లో తనిఖీలు చేస్తున్న పోలీసులు

Arun Charagonda

తిరుపతి హోటల్స్‌కు బాంబు బెదిరింపు మెయిల్స్ ఆగడం లేదు. వరుసగా మూడోసారి బాంబు బెదిరింపు మెయిల్స్ పంపారు ఉగ్రవాదులు. జాఫర్ సాదిక్ పేరుతో వచ్చిన మరో బాంబు బెదిరింపు మెయిల్ రాగా హోటల్లో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. అలాగే తిరుపతిలోని ఓ ఆలయానికి సైతం బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

Karimnagar: 3 వేల మంది శ్రీనివాస్‌ పేరున్న వారి సమ్మేళనం, ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ శ్రీనివాస్...రక్తదానం చేసిన వందమంది శ్రీనివాసులు

Arun Charagonda

కరీంనగర్ జిల్లాలో శ్రీనివాసుల సమ్మేళనం జరిగింది. శ్రీనివాస్ పేరున్నవారితో ఇప్పటికే 3 వేల మందితో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. గతంలోనూ ఓ ఆత్మీయ సమ్మేళనంలోనూ కలిశారు 150 మంది శ్రీనివాసులు.

KTR Inspects Nacharam STP: నాచారం ఎస్టీపీని సందర్శించిన కేటీఆర్, మూసీ నదిలో మురికి నీరు రాకుండా ఎస్టీపీల నిర్మాణం చేపట్టాం..కూల్చివేతలను అడ్డుకుంటామని వెల్లడి

Arun Charagonda

ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారంలో పర్యటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాచారంలోని పెద్ద చెరువు ఎస్టీపీని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్...రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం నడపడం రాదు అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పోలీసులను పోలీసులు కొడుతున్నారు. ఈ అంశంలో రేవంత్ రెడ్డి రికార్డ్ సాధించారు...ఆరు గ్యారెంటీలను పక్కనబెట్టి మూసీకి లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతోందన్నారు.

Driverless Electric Vehicle: డ్రైవర్ లెస్ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను రూపొందించిన బోసన్ మోటార్స్, మంత్రి నారా లోకేష్ సమక్షంలో విజయవంతంగా డెమో ప్రదర్శన...వీడియో ఇదిగో

Arun Charagonda

ఫాల్కన్ ఎక్స్ అనుబంధ సంస్థ బోసన్ మోటార్స్ రూపొందించిన ఇంటిలిజెంట్ ఎలక్ట్రికల్ లైట్ యుటిలిటీ వెహికల్ డ్రైవర్ లెస్ క్యాబిన్ ట్రక్‌ను శాన్ ఫ్రాన్సిస్కోలోని సంస్థ కార్యాలయ ఆవరణలో శాన్ జోస్ మేయర్ మట్ మహన్, మిల్పిటాస్ మేయర్ కార్మెన్ మోంటనోలతో కలిసి ఆవిష్కరించారు మంత్రి నారా లోకేష్.

Advertisement

BJP MP Raghunandan Rao: జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీపై సిట్‌ వేయాలన్న బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు, సీసీటీవీ ఫుటేజ్‌ను బయటపెట్టాలని డిమాండ్

Arun Charagonda

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ బంధువు రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌ డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై సిట్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజ్ పాకాల ఫామ్ హౌస్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

Telangana: తిరుపతి వెళ్లొచ్చే లోపు అక్రమ నిర్మాణమని ఇంటిని కూల్చేశారు, మూసాపేటలో తాళం వేసిన ఇంటిని నేలమట్టం చేసిన అధికారులు, కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని బాధితుల ఆవేదన

Arun Charagonda

హైడ్రా అధికారుల అత్యుత్సాహం ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. బాలాజీ నగర్ కాలనీలో ఉండే కటిక నిరుపమ రాణి వారి కుటుంబ సభ్యులతో తిరుపతి దర్శనానికి వెళ్ళారు. తిరుపతికి వెళ్లొచ్చే లోపు ఇల్లు అక్రమ నిర్మాణమని కూల్చేశారు అధికారులు. కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం ఏంటని, ఇంట్లో సామాగ్రి మొత్తం ధ్వంసం అయ్యిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Telangana Tourism: తెలంగాణ పర్యాటకులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల 2 నుంచి నాగార్జునసాగర్‌ – శ్రీశైలం లాంచీ ప్రయాణం.. వివరాలు ఇవిగో..!

Rudra

తెలంగాణలోని టూరిజం అందాలను చూడాలనుకొనే పర్యాటకులకు గుడ్ న్యూస్. నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం ప్రారంభం కానున్నది.

Nalgonda: కొనసాగుతున్న కానిస్టేబుళ్ల ఆందోళన, ఏక్ పోలీస్ విధానాన్ని రద్దు చేయాలని నల్గొండ 12వ బెటాలియన్‌లో పోరుబాట...వీడియో ఇదిగో

Arun Charagonda

నల్గొండ 12వ బెటాలియన్లో కానిస్టేబుల్స్ ఆందోళన కొనసాగుతోంది. నిన్న శాంతియుతంగా ధర్నా చేస్తున్న కానిస్టేబుల్లని అకారణంగా సస్పెండ్ చేశారని తక్షణమే వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏక్ పోలీస్ విధానాన్ని రద్దుచేసి పోలీసులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బెటాలియన్ కానిస్టేబుల్స్.

Advertisement

Nara Lokesh: శాన్‌ఫ్రాన్సిస్కోలో ఏపీ మంత్రి నారా లోకేష్, ఈక్వెనెక్స్ డేటా సెంటర్ కేంద్ర కార్యాలయం సందర్శన, పారిశ్రామిక వేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన సాగుతోంది. శాన్ ఫ్రాన్సిస్కో లోని ప్రపంచ ప్రఖ్యాత ఈక్వెనెక్స్ డాటా సెంటర్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు లోకేష్. ఈ సందర్భంగా తమ కంపెనీ అందిస్తున్న డాటా సేవలు, కార్యకలాపాలను సంస్థ గ్లోబల్ ఎండి కౌషిక్ జోషి, సీనియర్ స్ట్రాటజిక్ సేల్స్ ఇంజనీర్ రాబర్ట్ ఎలెన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లోకేష్‌కు వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో డాటాసెంటర్ ఏర్పాటుకు గల అనుకూలతలను వివరించి ఈక్వెనెక్స్ ఏపీకి రావాలని ఆహ్వానించారు లోకేష్‌.

TDP Vs YSRCP: పలాస పోలీస్ స్టేషన్‌లో కొట్టుకున్న టీడీపీ- వైసీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ మంత్రి అప్పలరాజు అనుచరుల పరస్పర దాడులు..ఇరువర్గాలపై కేసు నమోదు

Arun Charagonda

పోలీస్ స్టేషన్ లోనే రెచ్చిపోయి కొట్టుకున్నారు వైసీపీ, టీడీపీ కార్యకర్తలు. పోలీసుల ముందే పిడిగుద్దులు కురిపించుకున్నారు నేతలు. పలాస కాశీబుగ్గ పీఎస్ లో ఘటన జరుగగా ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ మంత్రి అప్పలరాజు అనుచరుల పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో టీడీపీ నేతకు గాయాలు కాగా ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Rave Party at Janwada Farmhouse: జన్వాడ ఫామ్‌ హౌస్‌ లో వీఐపీల రేవ్‌ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు.. వీడియో వైరల్

Rudra

హైదరాబాద్ శివారుల్లోని జన్వాడలో రిజర్వ్ కాలనీలో రాజ్‌ పాకాల ఫామ్‌ హౌస్‌ లో రేవ్‌ పార్టీ జరిగింది. విషయం తెలుసుకొన్న సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు దాన్ని భగ్నం చేశారు.

Constable Dance: 57 ఏళ్ల లేటు వయసులో ‘ముక్కాల..’ పాటకు డాన్స్ ఇరగదీసిన కానిస్టేబుల్ రాజేందర్ (వైరల్ వీడియో)

Rudra

పోలీసుల జీవితం అంటే ఉరుకులు, పరుగులే. అయితే, వారికీ ఆటవిడుపు ఉండాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అధికారులు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Advertisement

Fire Accident at Jangaon: జనగామలోని విజయ షాపింగ్ మాల్ లో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు.. టెన్షన్ టెన్షన్ (వీడియో)

Rudra

జనగామలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణంలోని విజయ షాపింగ్ మాల్ లో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో పెద్దయెత్తున మంటలు చెలరేగాయి.

Hyderabad Horror: హైదరాబాద్‌ లో భర్తను హత్య చేసి ఊటీ ఎస్టేట్‌ లో తగులబెట్టిన భార్య.. ప్రియుడితో కలిసి దారుణం

Rudra

హైదరాబాద్‌ కు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యాడు. ప్రియుడి సాయంతో అతని భార్యే ఈ ఘాతుకానికి తెగిపడింది.

Video Viral: హైదరాబాద్ - నాచారం పీఎస్ పరిధిలో మల్లాపూర్‌లో పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోస్తుండగా నిప్పు పెట్టిన ఆకతాయిలు.. వీడియో వైరల్

sajaya

గంజాయి మత్తులో ఉన్న యువకులు కొందరు హైదరాబాద్ - నాచారం పీఎస్ పరిధిలో మల్లాపూర్‌లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోస్తుండగా నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు వెంటనే మంటలను సిబ్బంది ఆర్పేశారు. పెట్రోల్ బంక్ సిబ్బంది యువకులను అదుపులోకి తీసుకున్న నాచారం పోలీసులు.

Telangana Cabinet Decisions: తెలంగాణ కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు, వ‌రంగ‌ల్, హ‌న్మ‌కొండ జిల్లాల ప‌రిధి పెంపు, ధ‌ర‌ణి స్థానంలో భూమాత స‌హా అనేక అంశాల‌కు ప‌చ్చ‌జెండా

VNS

తెలంగాణ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హన్మకొండ, వరంగల్ జిల్లాల పరిధిని పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు నిర్ణయించారు. మున్సిపాలిటీగా మద్దూర్ మండల కేంద్రాన్ని అప్ గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది క్యాబినెట్. సన్న బియ్యానికి రూ.500 బోనస్ నిర్ణయానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ (Cabinet Decisions) ఇచ్చింది.

Advertisement
Advertisement