రాష్ట్రీయం

Case Booked Against Jani Master: జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ పై రేప్ కేసు నమోదు.. ఎందుకంటే?

Rudra

తన డ్యాన్స్ స్టెప్స్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించి నేషనల్ అవార్డు కూడా అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాపై రేప్ కేసు నమోదయింది.

Three Senior IPS Suspended in AP: బాలీవుడ్ న‌టి కేసులో కీల‌క ప‌రిణామం, ఆ ముగ్గురు ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌పై వేటు వేసిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం, వైసీపీ నేత‌తో క‌లిసి వేధించార‌ని ఫిర్యాదు

VNS

ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు(PSR Anjaneyulu) , విజయవాడ మాజీ సీపీ కాంతారాణా టాటా (Kanthi rana Tata) , విశాల్‌ గున్ని (Vishal gunni) ని సస్పెండ్‌ చేస్తూ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణపై ఉన్నతాధికారులు వేటు వేశారు.

Cellulitis Cases Rising In Karimnagar: క‌రీంన‌గ‌ర్ ప్ర‌జ‌ల్ని వ‌ణికిస్తున్న కొత్త వ్యాధి, బ్యాక్టిరియ‌ల్ ఇన్ ఫెక్ష‌న్ తో ఆస్ప‌త్రుల పాల‌వుతున్న ప్ర‌జ‌లు

VNS

ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ఓ కొత్త వ్యాధి ప్రజలను భయపెడుతోంది. ఈ వ్యాధి మొదట దురదతో మొదలై క్రమంగా గాయంగా మారుతున్నది. ఇప్పటికే అక్కడ వందల కేసులు నమోదయ్యాయి

CM Revanth Reddy On Mahesh Kumar Goud: 38 నెలలు పీసీసీ అధ్యక్షుడిగా పోరాటం చేశానన్న సీఎం రేవంత్ రెడ్డి,హరీశ్‌ రావుకు దూడకు ఉన్న బుద్ది కూడా లేదని ఫైర్

Arun Charagonda

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు మహేశ్ కుమార్ గౌడ్. హైదరాబాద్ గాంధీ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడిగా 38 నెలలపాటు ప్రజల తరఫున పోరాడానని గుర్తు చేశారు.

Advertisement

Visakha Boat Fire Accident: చేపల వేటకు వెళ్లిన బోటు మంటలకు దగ్దం, బోటులోని 5 గురు సురక్షితం, రూ.40 లక్షల ఆస్తి నష్టం..వీడియో ఇదిగో

Arun Charagonda

విశాఖలో పెను ప్రమాదం తప్పింది. సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోటు మంటలకు దగ్ధం అయింది.ఇంజిన్ లో మంటలు ఏర్పడి పూర్తిగా బోటుకు వ్యాపించడంతో దగ్దమైందిబోటు.ఆ సమయంలో మరో ఫిషింగ్ బోటు దగ్గరలో ఉండటంతో 5 మంది క్షేమంగా బయటపడ్డారు. బోటులో వేటకు వెళ్లిన 5 మంది క్షేమంగా ఉన్నారు. సుమారు 40 లక్షలు వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు మత్స్యకారులు.

Jagan On Chandrababu: ప్రజారోగ్యంపై టీడీపీ ప్రభుత్వ విధానం ఇదేనా?, ఎంబీబీఎస్ సీట్లు వద్దంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడంపై జగన్ ఫైర్, ప్రజాగ్రహం తప్పదని హెచ్చరిక

Arun Charagonda

రాష్ట్రానికి ఎంబీబీఎస్‌ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి, అవసరం లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణం అని మండిపడ్డారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం, దుర్మార్గం. పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్‌ కాలేజీలు, ఎంబీబీఎస్‌ సీట్లకోసం ప్రదక్షిణాలు చేస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పిపంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం చంద్రబాబు అని ప్రశ్నించారు.

Fake Websites On Srisailam Temple Name: శ్రీశైలం ఆలయం పేరుతో ఫేక్ వెబ్‌సైట్లు, 27 ఫేక్ సైట్లను గుర్తించిన ఆలయ అధికారులు, అప్రమత్తంగా ఉండాలని సూచన

Arun Charagonda

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయం పేరుతో ఫేక్ వెబ్‌సైట్‌లను గుర్తించారు ఆలయ అధికారులు. ఇప్పటివరకు 27 ఫేక్ వెబ్‌సైట్‌లను గుర్తించామని తెలిపిన ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. రాజస్థాన్, జైపూర్ నుంచి నకిలీ సైట్లను ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.

CM Revanth Reddy House:  సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద బ్యాగ్ కలకలం, అనుమానాస్పద బ్యాగ్‌ను తనిఖీ చేసిన పోలీసులు, బందోబస్తు మరింత పెంపు

Arun Charagonda

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇంటి స‌మీపంలో బ్యాగ్ క‌ల‌క‌లం రేపింది. వెంటనే అప్ర‌మ‌త్త‌మై బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేయగా ఆ ప‌రిస‌ర ప్రాంతాల‌ను త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు.

Advertisement

Minister Sridhar Babu on MLA Gandhi: ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ బీఆర్ఎస్‌ పార్టీనే, ఆ పార్టీ అంతర్గత సమస్యను కాంగ్రెస్‌ పార్టీపై నెట్టడం సరికాదన్న మంత్రి శ్రీధర్ బాబు

Arun Charagonda

అరికెపూడి గాంధీ నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పాడు, నేను చెప్పింది కూడా అదే అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విభేదాలను పరిష్కరించుకోకుండా కాంగ్రెస్‌పై నెపం నెట్టేయడం సరికాదన్నారు.

Whiskey In Ice Cream Case: లంచం ఇవ్వలేదని.. ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపిన ఎక్సైజ్ పోలీసులు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన ఓనర్!

Arun Charagonda

కొద్ది రోజుల క్రితం ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపి అమ్ముతున్నారని ఓ షాపుపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బిగ్ ట్విస్ట్. లంచం ఇవ్వలేదని.. ఐస్‌క్రీమ్‌లో విస్కీని ఎక్సైజ్ పోలీసులే కలిపారని ఉన్నతాధికారులకు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు కేఫ్ ఓనర్ శరత్ చంద్రారెడ్డి.

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణనాథుడి దర్శనానికి ఇదే చివరి రోజు..నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి, భారీగా తరలివచ్చిన భక్తులు

Arun Charagonda

వినాయక నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 17న మంగళవారం గణేశ్ నిమజ్జనం జరగనుండగా పోలీసు బందోబస్తు మధ్య నిమజ్జన కార్యక్రమం జరగనుంది. ఇక ఖైరతాబాద్ మహాగణనాథుడిని దర్శించుకునేందుకు ఇవాళే చివరి రోజు.

Road Accident At Rayadurgam: హైదరాబాద్‌ రాయదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్‌ను తప్పించబోయి కారును ఢీ కొట్టిన ఆటో, మహిళ మృతి...వీడియో

Arun Charagonda

హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను తప్పించబోయి పక్కనే ఉన్న కార్ కు ఢీకొట్టింది ఆటో. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒక మహిళ మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి దృశ్యాలు.

Advertisement

Warangal: వరంగల్‌లో రెచ్చిపోతున్న రౌడీలు, ఓ వ్యక్తిని చితకబాదిన వైనం, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన బాధితుడు..వీడియో

Arun Charagonda

వరంగల్ నగరంలో రెచ్చిపోయారు రౌడీలు. బీఆర్ నగర్‌లో కూలీ పనులు చేసుకొని వెళ్తున్న సంతోష్ అనే వ్యక్తిపైవ్యక్తిపై ఉమ్మేశారు మల్లికార్జున్. ఇదేంటి అని ప్రశ్నించగా స్నేహితునితో కలిసి చితకబాదారు మల్లికార్జున్. తీవ్ర గాయాలతో ఎంజీఎం లో చికిత్స పొందుతుండగా దాడికి పాల్పడ్డ ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Minister Ponnam Prabhakar: గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి, ఫేక్ న్యూస్‌ని నమ్మోద్దు..అందరం కలిసి గణేశ్ నిమజ్జనం విజయవంతం చేద్దామని పిలుపు

Arun Charagonda

17వ తేదీ మంగళవారం హైదరాబాద్ లో జరిగే గణేష్ నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చామన్నారు. నిమజ్జనంపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Ganesh Immersion At Tank Bund: ట్యాంక్‌ బండ్‌పై వినాయక నిమజ్జనం లేదంటూ పోలీసుల ఫ్లెక్సీలు, భారీ కేడ్ల ఏర్పాటు..వాటిని తొలగించిన భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు..టెన్షన్ వాతావరణం

Arun Charagonda

ట్యాంక్ బండ్‌పై వినాయక నిమజ్జానానికి సంబంధించిన టెన్షన్ కొనసాగుతోంది. ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం లేదంటూ ఫ్లెక్సీలను, బారీ కేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. దీంతో అక్కడికి చేరుకున్న భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు...ఫ్లెక్సీలు, బారీకేడ్లను తొలగించారు.

Andhra Pradesh Shocker: ప్రేమ వ్యవహారం, థియేటర్‌లో విద్యార్థిపై కత్తితో దాడి, తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరిక...వీడియో

Arun Charagonda

తిరుపతి - పీజీఆర్ థియేటర్‌లో లోకేష్‌ అనే యువకుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు కార్తీక్ అనే యువకుడు. కావ్య అనే యువతితో సినిమాకు వచ్చారు లోకేష్‌. అయితే దాడి తర్వాత కార్తీక్‌తో వెళ్లిపోయింది యువతి కావ్య. ఇక బాధితుడు లోకేష్‌కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

Andhra Pradesh Shocker: అధికారుల వేధింపులు, సెల్ఫీ వీడియో తీసుకొని.. ఆత్మహత్యాయత్నం, హిందుపూర్‌లో 104 ఆపరేటర్ ఆత్మహత్యయత్నం..వీడియో

Arun Charagonda

హిందూపురం 104 ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ రామకృష్ణ వేధింపులు తాళలేక సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు సోమందేపల్లి డేటా ఎంట్రీ ఆపరేటర్ రామిరెడ్డి. వీడియోని కుటుంబ సభ్యులకు పంపగా.. విషయాన్ని 104 డాక్టర్ దృష్టికి తీసుకెళ్లింది కుటుంబం.

Water in Petrol: పెట్రోల్ లో నీళ్లు పోసి విక్రయం.. రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలోని హెచ్ పీ పెట్రోల్ బంకులో మోసం (వీడియో)

Rudra

రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలోని హెచ్ పీ పెట్రోల్ బంకు నిర్వాహకులు మోసానికి తెగబడ్డారు. పెట్రోల్‌ లో నీళ్లు కలిపి విక్రయాలు చేస్తున్నారు.

CM Revanth Reddy: మతం ఏదైనా విద్వేషం వదిలి శాంతియుతంగా జీవించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, మహమ్మద్ ప్రవక్త బోధనలు యావత్ మానవాళికి దిక్సూచి అని వెల్లడి

Arun Charagonda

శాంతి, కరుణ, సోదరభావాన్ని చాటి చెప్పే ముహమ్మద్ ప్రవక్త బోధనలు యావత్ మానవాళికి దిక్సూచి లాంటివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రవక్త బోధనలైనా, భగవద్గీత, బైబిల్ సారాంశాలైనా మనకు చెప్పేది మంచి విషయాలే అని, విద్వేషాలు వదిలి శాంతియుతంగా జీవించడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు.

Khairatabad Big Ganesh Darshan: ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి నేడే ఆఖరి రోజు.. రేపు గంగమ్మ ఒడికి చేరనున్న భారీ గణపయ్య

Rudra

ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి నేడే ఆఖరి రోజు అని అధికారులు తెలిపారు. మంగళవారం ఈ భారీ గణనాథుడిని నిమజ్జనం చేయనున్నట్టు వెల్లడించారు.

Advertisement
Advertisement